westbengal
-
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చు.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్
ఢిల్లీ : కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి జూనియర్ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.జూనియర్ వైద్యురాలిది సామూహిక అత్యాచారం కాకపోవచ్చు అని సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు సుప్రీంకు సీబీఐ ఇచ్చిన నివేదికలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అని సీబీఐ కోర్టుకు తెలిపింది. హాస్పిటల్లో సంజయ్ రాయ్ కదలికలు సీసీటీల్లో రికార్డ్ అయ్యాయన్న సీబీఐ.. కేసును అన్నీ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో వెల్లడించింది. అయితే ఈ దారుణ ఘటనలో ఒక్కరి ప్రమేయం మాత్రమే ఉందా.. లేక సామూహిక అత్యాచారమా అనే కోణంలో సీబీఐ తన దర్యాప్తును ఇంకా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను స్వతంత్ర నిపుణులకు పంపిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలోఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన 31 జూనియర్ డాక్టర్‌పై నిందితుడు సంజయ్ రాయ్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే బాధితురాలిపై నిందితుడు సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడినా..ఆస్పత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేయడం, ఘటన జరిగిన స్థలాన్ని భద్రపరచుకుండా మరమ్మత్తులు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసు తప్పుదోవ పట్టించేందుకు సాక్ష్యాల్ని నాశనం చేస్తున్నారని ఆందోళనలు మొదలయ్యాయి. దీనికితోడు అదే ఆస్పత్రి ఎదుట వేలాది మంది ఆందోళన కారులు గుమిగూడడం భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి.అయితే ఆర్జీకార్ ఆస్పత్రి కేసులో ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తమయ్యాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆస్పత్రిలో ఘోరం జరుగుతున్నా ఎవరికి తెలియకపోవడం, అప్పటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ రెండ్రోజుల తర్వాత రాజీనామా చేసి.. మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఛార్జ్ తీసుకోవడం వంటి అంశాలను కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కేసును సీబీఐకి అప్పగించింది. సందీష్ ఘోష్‌ను విచారించాలని సూచించింది. దీంతో సందీష్ ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారించగా.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది నుంచి సందీష్ ఘోష్ అక్రమార్జనకు పాల్పడేవారని, ఆస్పత్రి మార్చురి వార్డ్‌లో శవాలతో వ్యాపారం చేసేవారని, నిబంధనల్ని ఉల్లంఘించి ఆస్పత్రి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేవారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.ఆర్జీకార్ దారుణంపై సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుండగానే వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆగస్ట్ 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించింది.విచారణ సందర్భంగా ఆగస్ట్ 22లోపు కోల్‌కతా హత్యాచార ఘటనకు సంబంధించిన ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు స్టేటస్‌ను అందించాలని సీబీఐకి,ఆర్జీకార్ ఆస్పత్రి విధ్వంసానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తమ స్టేటస్ రిపోర్ట్‌లను కోర్టుకు అందించాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు వైద్యుల భద్రతపై ఆసుపత్రులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేలా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. -
ట్రైనీ డాక్టర్ హత్య కేసు.. మరొకరి ప్రమేయం ఉందా?
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకేసులో పలు అనుమానాలు, అటాప్సీ రిపోర్ట్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం (ఆగస్ట్13) ట్రైనీ డాక్టర్ ఆటాప్సీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అటాప్సీ రిపోర్ట్ ఆధారంగా..నిందితుడు సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రాణాలు తీసినట్లు తేలింది. అమానుషంగా లైంగిక దాడి కారణంగా బాధితురాలి అంతర్గత శరీర భాగాల్లో ఏర్పాడిన గాయాల కారణంగా రక్త స్త్రావమైంది. ఆగస్టు 9 తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.నిందితుడి సంజయ్ రాయ్ నుంచి తప్పించుకునేందుకు ట్రైనీ డాక్టర్ ప్రతిఘటించడంతో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై గాయాలయ్యాయని, నిందితుడు నుంచి చెరనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిలువరించేందుకు ఆమె తలను గోడకు బాదాడు. దారుణానికి ఒడిగట్టే సమయంలో అరుపులు వినపడకుండా ఉండేందుకు నోరు, గొంతు బిగించాడు. దీంతో ఆమె మెడ ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. అయితే, ఆమె కంటికి గాయం కావడానికి గల కారణాల్ని ఇంకా గుర్తించలేదు.ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్ కాల్మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ చేసింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు చెబుతున్నాయి. సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?దీంతో ఇదే అంశంపై సూపరింటెండెంట్‌ను విచారించేందుకు పోలీసులు ఇవాళ లాల్‌బజార్ పీఎస్‌కు పిలిపించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్ రాయ్‌తో పాటు ఇంకెవరైనా ఉన్న అన్న కోణంలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. -
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
అధిర్ రంజన్ చౌదరి రాజీనామా
కోల్‌కతా: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధిర్ రంజన్ ఛౌదరి తన పదవికి శుక్రవారం(జూన్21) రాజీనామా చేశారు.పార్టీ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై పీసీసీ భేటీలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధిర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. బహరంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 5సార్లు గెలుపొందిన అధిర్ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన బెంగాల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. అధీర్ తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్-కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమైందనే వాదన ఉంది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అదీర్ రాజీనామాతో మాల్దా-దక్షిణ్ నుంచి గెలుపొందిన ఇషాఖాన్ చౌధరికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రామ్‌నవమి వేడుకలపై ‘తృణమూల్’ కుట్ర: ప్రధాని
కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్ 16) పశ్చిమబెంగాల్లోని బలూర్‌ఘాట్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్‌నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్‌నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్‌నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు. ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్‌కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
Loksabha Elections 2024: ‘మహువా’ మళ్లీ గెలిచేనా !
కలకత్తా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువామొయిత్రా రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుస్తారా అంటే కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని మహువా నియోజకవర్గం కృష్ణానగర్ నుంచి బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇక్కడి నుంచి మహువా అభ్యర్థిత్వాన్ని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఆదివారం(మార్చ్ 24) ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాలో కృష్ణానగర్ సీటును స్థానిక రాజవంశానికి చెందిన రాజమాత అమ్రితా రాయ్‌కి కేటాయించింది. ఈమె గత వారమే బీజేపీలో చేరడం గమనార్హం. 18వ శతాబ్దంలో బెంగాల్‌ను పరపాలించిన మహారాజ కృష్ణ చంద్ర రాయ్ చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకు కూడా గుర్తు చేసుకుంటారు. కృష్ణా నగర్ బీజేపీ టికెట్ దక్కించుకున్న రాజమాత అమ్రితా రాయ్ కృష్ణచంద్రరాయ్ వంశానికి చెందినవారే. నడియా జిల్లా బీజేపీ నాయకత్వం ఏరికోరి రాజమాత అమ్రితా రాయ్‌కి కృష్ణానగర్ టికెట్ ఇప్పించారని, పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌చౌబే స్వల్పంగా 63,218 ఓట్ల తేడాతో మహువా విజయం సాధించారు. మహువా గెలుపులో టీఎంసీకి అప్పట్లో గట్టి పట్టున్న కాలీగంజ్, చోప్రా, పలాషిపర అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. అయితే వీటిలో కాలీగంజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత కొన్ని నెలల్లో బీజేపీ బలపడినట్లు చెబుతున్నారు. దీనికి తోడు నడియా జిల్లా వ్యాప్తంగా టీఎంసీ గతంతో పోలిస్తే బలహీనపడినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో డబ్బుకు ప్రశ్నలడిగిన కేసులో ఇప్పటికే ఈ టర్ములో ఎంపీ సభ్యత్వం కోల్పోయి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మహువా కృష్ణానగర్ నుంచి పార్లమెంటులో మళ్లీ అడుగుపెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. కంగనకు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్ -
స్కార్పియో-ఎన్ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్ వీడియో
కోలకతా: కొట్టేసిన సొమ్మును అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియో-ఎన్లో అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు. నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి స్టెఫినీ టైర్లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్‌పోస్టు తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్‌తో పాటు ఎస్‌యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్ కలర్ స్కార్పియో-ఎన్ వాహనంలోని స్టెఫినీ టైర్లో దాచిన నగదు అంటూ ఒక యూ ట్యూబ్ (Raftaar 7811) వైరల్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
అనుబ్రతా మోండల్‌కు అవమానం!.. ‘షూ’ చూపిస్తూ ‘చోర్’ అంటూ నినాదాలు!
కోల్‌కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్‌ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. #WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE — ANI (@ANI) August 11, 2022 ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత -
పార్థా ఛటర్జీ ఇంట్లో చోరీ.. ‘ఈడీ రైడ్’గా భావించి వదిలేశారటా!
కోల్‌కతా: టీచర్ నియామక కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసి విచారిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే ఆయనకు సంబంధించి నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రెండు సార్లు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. మంత్రికి సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఈడీ దాడుల వేళ మంత్రి ఫార్థా ఛటర్జీకి సంబంధించిన సౌత్ 24 పరగానాల ప్రాంతంలోని నివాసంలో చోరీ జరిగింది. జులై 27న బుధవారం రాత్రి ఓ దొంగ ఇంట్లోకి దూరి అందినకాడికి దోచుకెళ్లాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లాడు దొంగ. పెద్ద పెద్ద బ్యాగుల్లో పార్థా ఛటర్జీ ఇంట్లోంచి చాలా వస్తువులు తీసుకెళ్లాడు. అయితే.. ఆ దొంగను గమనించిన స్థానికులు అది మరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేడ్ రైడ్‌గా భావించారటా. అలా వారు అనుకోవటమే ఆ దొంగకు అదృష్టంగా మారింది. అందినకాడికి దోచుకెళ్లాడు. ఛటర్జీకి సన్నిహితురాలైన నటి అర్పిత ముఖర్జీ రెండో అపార్ట్మెంట్లో బుధవారం దాడులు చేసిన ఈడీ రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా నగలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ముఖర్జీకి చెందిన మరో ఇంటిలో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే -
ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే
20 ఏళ్లు కూడా లేని కోయెల్ని ఆ ఊళ్లో అంతా విలన్‌గా చూస్తారు. చంపుతాం అన్నారు. అత్యాచారం చేస్తాం అని బెదిరించారు. కాని కోయల్ వినదు. భయపడదు. కోవిడ్ కాలంలో అనేక కారణాల వల్ల బాల్య వివాహాలు పెరిగిపోయాయి. ఆడపిల్లలు విలపిస్తున్నారు. సిలిగురి ప్రాంతంలో కోయెల్ తనలాంటి అమ్మాయిలతో కలిసి గస్తీ కాస్తోంది. బాల్యవివాహం జరిగే మంటపంలో ప్రత్యక్షమై ‘ఆపరా’ అని అంటోంది.ఆమె వస్తే పెళ్లి ఆగాల్సిందే. ‘తల్లిదండ్రుల ఆలోచన, నిస్సహాయత ఏదైనా కావచ్చు. కాని అది ఆడపిల్ల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఉండకూడదు’ అంటుంది 19 ఏళ్ల కోయెల్ సర్కార్. ఈ అమ్మాయి సిలిగురి (పశ్చిమ బెంగాల్) సమీపంలో ఉండే ఒక గ్రామంలో ‘వరల్డ్ విజన్ ఇండియా’ అనే ఎన్.జి.ఓతో కలిసి పని చేస్తుంది. ఆమె చేసే ప్రధానమైన పని బాల్య వివాహాలను నిరోధించడం. ఇందుకు ఆమెతో పాటు పని చేసే, ఆమె వయసు ఉండే మరో 25 మంది అమ్మాయిల దళం ఉంది. అందరూ రహస్య పోలీసుల కంటే సమర్థంగా తమ ఊళ్లో చుట్టుపక్కల పల్లెల్లో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతాయా అని చూస్తూ ఉంటారు. ‘ఈ రెండేళ్లలో నేను 8 బాల్య వివాహాలను ఆపించాను’ అంటుంది కోయెల్. కాని పెద్దవాళ్లు ఊరికే ఉంటారా? పెద్దవాళ్లు అంటే ఎవరు? వధువు తల్లిదండ్రులు... వరుడి తల్లిదండ్రులు. మాకు లేని నొప్పి నీకెందుకు అని కోయెల్‌తో తగాదాకు వస్తారు. ‘ఇప్పటికి రెండుసార్లు మా ఇంటి మీదకు జనం దాడికి వచ్చారు. నన్ను, మా చెల్లెల్ని చంపుతాం అన్నారు. నన్ను రేప్ చేస్తాం అన్నారు. ట్యూషన్ నుంచి వస్తుంటే ఒకసారి నా మీద రాళ్ల దాడి జరిగితే సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లడమే మానేశాను. కాని బాల్య వివాహాలను ఆపడం మాత్రం మానలేదు’ అంటుంది కోయెల్. ఆమెకు ఈ పని ఇంత గట్టిగా చేయాలని ఎందుకు అనిపించింది? స్వీయ జీవితం నుంచే. ‘మా అమ్మకు 17 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మా నాన్నతో పెళ్లి జరిపించారు. నేను పుట్టిన మూడేళ్లకు నన్ను. అమ్మను, చెల్లిని వదిలి మా నాన్న వెళ్లిపోయాడు. మా అమ్మకు ఎన్నో ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలు ఉండేవి. అన్నీ నాశనం అయ్యాయి. మేము చాలా కష్టాలు పడ్డాం. అలా ఎవరూ పడకూడదనే నా తపన’ అంటుంది కోయెల్. వెస్ట్ బెంగాల్లో బహుశా దేశంలో చాలా చోట్ల ఈ రెండేళ్లలో పరిస్థితి చాలా మారింది. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయం గండి పడింది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా పిల్లను సాగనంపితే చాలు అనుకుంటున్నారు. కోవిడ్ కాలంలో పెళ్లిళ్లు జనం ఊసు లేకుండా జరిపించే వీలు ఉండటంతో అదీ ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు. స్కూళ్లు మూతబడి, చదువు మానేసి, ఫ్రెండ్స్‌కు దూరమయ్యి ఇరవై నాలుగ్గంటలు ఇంట్లో ఉంటున్న ఆడపిల్లలు తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నారు. అందుకని కూడా పెళ్లిళ్లకు తొందరపడుతున్నారు. ‘పెళ్లి తొందరలో అమ్మాయి తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి కట్టబెడుతున్నారు. ఆ వెళ్లినచోట ఆ ఆడపిల్లలు ఏ మాత్రం సురక్షితంగా ఉండటం లేదు. సుఖంగా కూడా’ అంటుంది కోయెల్. ‘ఆడపిల్లను క్షేమంగా ఉంచలేమని, ప్రేమలో పడి ఎవరితోనైనా వెళ్లిపోతారని కూడా ఈ పని చేస్తున్నారు’ అంటుంది కోయెల్. అయితే తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నా ఆడపిల్లలు నిజంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒక మేరకు స్థిరపడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం చూడగానే కోయెల్‌కు ఉప్పందిస్తున్నారు. కోయెల్ తన దళంతో వెళ్లి పెళ్లి ఆపు చేస్తోంది. ‘పెళ్లి ఆపించి ఊరుకోవడం లేదు. అలాంటి ఆడపిల్లల స్వయం ఉపాధికి లేదా తల్లిదండ్రుల ఉపాధికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నాం.’ అంటుంది కోయెల్. బాల్య వివాహాలు ఆపడమే కాదు నేపాల్ సరిహద్దుకు దగ్గర కాబట్టి చైల్డ్ ట్రాఫికింగ్ జరక్కుండా కూడా అడ్డుకునే పని కోయెల్ దళం చేస్తోంది. ‘అమ్మాయిలను ఏమార్చేవారు పెళ్లి కొడుకుల వేషంలో వస్తుంటారు’ అంటుందామె. ఆడపిల్లల గురించి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహక చర్యలు చేపట్టినా తల్లిదండ్రుల అండ లేకపోతే వాళ్లు ముందుకు పోరు. తల్లిదండ్రులు విఫలమైన చోట కోయెల్ వంటి సామాజిక కార్యకర్తలు కావాలి. తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కలిసి పని చేస్తే ఏ ఆడపిల్లకు కూడా పరిణిత వయసుకు ముందే అనవసర పెళ్లిళ్లు జరగవు. అక్కర్లేని సమస్యలు రావు. -
గెస్ట్ హౌజ్‌లో విద్యార్థినిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి..
కోల్కత్తా: పాఠాలు చెబుతానని విద్యార్ధినిని గెస్ట్ హౌస్‌కు పిలిపించి టీచర్.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కత్తాలో సెంగార్ అనే వ్యక్తి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో జాగ్రఫీ బోధిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో ఎక్స్ట్రా క్లాస్ పేరుతో విద్యార్ధినిని సాల్ట్‌లేక్ గెస్ట్ హౌస్‌కు పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు కూడా తీశాడు. ఇదిలా ఉండగా.. మరోసారి ఆమెను కలిసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్వాలియర్ రావాలని విద్యార్ధినిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్‌కు దిగాడు. అంతటితో ఆగకుండా గెస్ట్‌హౌస్‌లో తాను తీసిన వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో సదరు యువతి.. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోల్‌కతాకు తీసుకువచ్చి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి..ఆపై విందు భోజనం! ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీలులేదు. పైగా అధికారులు కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ కఠినమైన కరోనా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒక జంట విన్నూతనమైన ఆలోచనతో తమ పెళ్లిని జరుపుకోవాలనుకున్నారు. అంతేకాదు తమ పెళ్లిని తమవారంతా చూసేలా సరికొత్త ఆలోచన చేశారు. అసలు విషయంలోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట జనవరి 24న వివాహం చేసుకోనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పెళ్లికి అతిథులు హాజరయ్యేందుకు ‘గూగుల్ మీట్’ని, భోజనాల కోసం జొమాటో యాప్‌ను( ఫుడ్ ఆర్డర్లు) వినియోగించనున్నారు. పైగా ప్రత్యక్షంగా పెళ్లిని చూసేలా లైవ్ టెలికాస్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ విధించిన నిబంధనలకు లోబడి 120 మంది అతిధులు నేరుగా పెళ్లికి హాజరవుతారు. కాగా మిగతా 300 మంది డిజిటల్ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. ఆహ్వానితులందరికీ వేడుకకు ఒక రోజు ముందు పాస్‌వర్డ్‌లతో పాటు వివాహాన్ని చూడటానికి లింక్‌ను కూడా అందిస్తారు. ఈ క్రమంలో ఆ జంట మాట్లాడుతూ.. ‘మేము గతేడాది వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ కరోనా అడ్డంకిగా మారింది. అందుకే మా కుటుంబ భద్రత, అతిధుల భద్రత దృష్ట్యా డిజిటల్ వివాహాన్ని నిర్వహించాలనే ఆలోచన చేశాము’ అని తెలిపారు. ఈ మేరకు జొమాటో అధికారి మాట్లాడుతూ.. ‘ఈ ఆలోచన చాలా ప్రసంశించదగ్గది. పైగా మాకు ఈ కొత్త ఆలోచన బాగా నచ్చింది. ఈ వివాహాలను స్వాగతిస్తున్నాం. అంతేకాదు ఇలాంటి వివాహాలను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
"ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో
పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. (చదవండి: సార్ నా గర్ల్‌ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను) అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో దాస్పూర్ గ్రామంలోనే ఇస్మాయిల్ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు. పైగా ఇస్మాయిల్‌కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్" "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు. ఈ మేరకు ఇస్మాయిల్ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు. నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు. అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) -
అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!
పశ్చిమబెంగాల్: ఈ మధ్యకాలంలో అత్యంత భారీ చేపను పట్టుకుని ఒక్కరోజులోనే ధనవంతులుగా మారిన కథనాలు విన్నాం. అచ్చం అలానే పశ్చిమ బెంగాల్‌కి చెందిన మత్స్యకారుడు బార్మన్ భారీ తెలియా భోలా చేపను పట్టుకుని ధనవంతుడిగా మారిపోయాడు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) వివరాల్లోకెళ్లితే ఐదుగురు మత్స్యకారుల బృందం పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ నదులలో చేపలను వేటాడుతుండగా భారీ తెలియా భోలా చేపను పట్టుకున్నారు. అయితే ఆ చేప సుమారు 7 అడుగుల పొడవు, 75 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ మేరకు మత్స్యకారులందరూ సమిష్టిగా కష్టపడితేనే ఆ భారీ చేపను ఒడ్డుకు తీసుకురాగలరు. అంతేకాదు ఆ చేపను హోల్‌సేల్ మార్కెట్‌కి తీసుకువెళ్లితే అక్కడ అనుహ్యంగా అత్యధిక ధర పలికింది. దీంతో ఆ తేలియా భోలా చేప కిలో రూ.49,300 చొప్పున మొత్తం సుమారుగా రూ.36 లక్షలకు విక్రయించారు. పైగా ఈ చేప పొట్టలో అత్యంత విలువైన వనరులు ఉంటాయని వాటిని మందులు, ఇతర వస్తువుల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మత్య్సకారుడు బార్మన్ మాట్లాడుతూ......"ప్రతి ఏడాది నేను తెలియా భోలా చేపలు పట్టడానికి వెళ్తాను. కానీ ఇంత పెద్ద చేపను పట్టుకుంటానని ఊహించ లేదు" అని చెప్పాడు. గతేడాది పశ్చిమ బెంగాల్‌లోని ఈ నదిలోనే 52 కిలోల భోలా చేపను పట్టుకున్న ఒక వృద్ధ మహిళ రాత్రికి రాత్రే ధనవంతురాలైన సంగతి తెలిసిందే. (చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు) -
విద్యార్ధులకు క్రెడిట్ కార్డులు.. రూ.10 లక్షల వరకు పరిమితి
కోల్‌కతా: విద్యార్థులకు రుణసాదుపాయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రారంభించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదొక అద్భుత పథకమని ఈ సందర్భంగా మమత తెలిపారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా 4 శాతం వార్షిక సాధారణ వడ్డీతో 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చునని చెప్పారు. పదేళ్లుగా బెంగాల్ లో నివసించే విద్యార్థులు (గరిష్ఠ వయసు 40 ఏళ్లు) ఈ కార్డు పొందేందుకు అర్హులని మమత తెలిపారు. అండర్ గ్రాడ్యేయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వైద్య విద్య చదివేవారికి ఈ కార్డు ద్వారా రుణం లభిస్తుందని చెప్పారు. దేశ, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐఎఎస్, ఐపిఎస్, ఇతరు పోటీ పరీక్షలకు కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి ఈ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చన్నారు. తీసుకున్న రుణాన్ని 15 సంవత్సరాల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సకాలంలో వడ్డీని పూర్తిగా చెల్లిస్తే రుణగ్రహీతలకు ఒక శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ఆమె తెలిపారు. కాగా, దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. చదవండి: శశికళపై మరో కేసు నమోదు.. -
సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే?
కోల్‌కతా: ప్రేమకు హద్దులు, సరిహద్దులు అంటూ ఉండవు. ఎవరినైనా.. ఎక్కడివారినైనా ప్రేమించొచ్చు. ప్రేమ పుట్టడమే అలస్యం.. ప్రేమించిన అమ్మాయి కోసం దేశాలు దాటి వెళ్లడానికి కూడా సిద్దం అవుతున్నారు కొందరు యువకులు. కొన్ని కొన్ని సార్లు ప్రేమ కోసం అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారు. ఇటువంటి సంఘటనే భారత్-బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని బల్లావ్‌పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్రరాయ్ (24)కు ఫేస్బుక్లో బంగ్లాదేశ్‌కు చెందిన పరిణితి అనే అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8న సరిహద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. జూన్ 10వ తేదీన ప్రేయసి పరిణితిని వివాహమాడాడు. ఆ తర్వాత జూన్ 25వ తేదీ వరకు ఇద్దరూ కలిసి అక్కడే ఉన్నారు. జూన్ 26న చంద్రరాయ్ తన భార్యతో కలిసి సొంతూరుకి బయలుదేరాడు. అయితే, బోర్డర్ దాటించేందుకు ఈ సారి కూడా రాజు మండల్ అనే బ్రోకర్ సాయం తీసుకున్నాడు. బోర్డర్ దాటించినందుకు అతడికి 10వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ జంట అక్రమంగా సరిహద్దు దాటుతున్నట్టు బీఎస్ఎఫ్ బలగాలకు పక్కా సమాచారం అందింది. వెంటనే ఆప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు ఆ జంటను అదుపులోకి తీసుకున్నాయి. బీఎస్ఎఫ్ విచారణలో అబ్బాయిది పశ్చిమ బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తెలింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వీరికి సరిహద్దు దాటేందకు సాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా -
బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై మమత ఫొటో
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్లపై సీఎం మమతా బెనర్జీ ఫొటో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారు కోవిడ్ టీకాలు తీసుకుంటే వారికి సీఎం ఫొటో ఉన్న కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ను ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండగా, బెంగాల్లో మమత ఫొటో ఉండటంపై బీజేపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ అంశంపై బెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ వివరణ ఇచ్చారు. ‘ మా రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారికి ఇస్తున్న టీకాలు.. కేంద్ర ప్రభుత్వం సరఫరాచేసినవి కాదు. బెంగాల్ ప్రభుత్వం సొంత ఖర్చుతో టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రప్రభుత్వమేమీ 18–44 ఏళ్ల వయసు వారి టీకాలు ఇవ్వట్లేదు కదా? అయినా, మమత ప్రభుత్వం ఇస్తోందికాబట్టే ఆమె ఫొటోను టీకా సర్టిఫికెట్లపై ముద్రించాం. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలూ తమ సీఎంల ఫొటోలున్న సర్టిఫికెట్లనే జారీచేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
ప్రధాని బెంగాల్ పర్యటనలో రాజకీయ వివాదం
కోల్‌కతా: ‘యాస్’ తుపాను కారణంగా ఒడిశా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనిలో భాగంగా ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ.. పశ్చిమబెంగాల్లో తుఫాన్ పరిస్థితిపై అక్కడి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతాబెనర్జి కూడా హాజరు కావాల్సి ఉండగా ఆమె సుమారు అరగంట ఆలస్యంగా వచ్చారు. అనంతరం మమత రెండు పేజీల నివేదిక ఇచ్చి త్వరగానే వెనక్కి వెళ్లిపోయారు. శుక్రవారం బెంగాల్ ప్రాంతాలలో ‘యాస్’ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇరువురు నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. మమత ఈ అంశంపై స్పందిస్తూ.. ప్రధానమంత్రి సమావేశానికి పిలిచారు.. కానీ నా కార్యలయానికి ఆ సమాచారం చేరలేదు. ఈ కారణంగా నేడు దిఘాలో ఒక సమావేశనికి హాజరయ్యాను. కానీ నేను కలైకుండకు వెళ్లి తుపాను నష్టానికి సంబంధించిన నివేదిక అందజేసిన అనంతరం ప్రధాని అనుమతితో తిరిగి వెళ్ళినట్లు తెలిపింది. కాగా సీఎం తీరుపై బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. It would have served interests of state and its people for CM and officials @MamataOfficial to attend Review Meet by PM. Confrontational stance ill serves interests of State or democracy. Non participation by CM and officials not in sync with constitutionalism or rule of law.— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 28, 2021 చదవండి: ‘కరోనాకు గేట్లు తెరిచిన మోదీ: లెక్కలన్నీ అబద్ధం’ -
మోదీజీ.. దీదీ గెలిస్తే.. మీరు ఓడినట్లే: సంజయ్ రౌత్
ముంబై: మే 2 తర్వాత మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారతాయని వాదించిన వాళ్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు. ఆ ఇద్దరు ఉద్దండుల ప్రచారంతో బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందని రాజకీయ నిపుణులు భావించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎలా అయితే విజయం సాధించిందో.. బెంగాల్లో సైతం అదే తరహాలో దీదీని మట్టికరిపిస్తూ బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని సొంత పార్టీల నేతలు, అభ్యర్ధులు ఊహించారు. కానీ నేటి ఓట్ల లెక్కిపు ప్రక్రియలో బీజేపీ నాయకుల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్నికల ప్రచారంలో గాయ పడ్డ మమత ఒంటికాలితో ప్రచారం నిర్వహించి విజయం సాధిస్తానని ప్రత్యర్ధులకు విసిరిన సవాల్ నిజమయ్యింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ శివసేన అధికార మీడియా 'సామ్నా' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మే 2 తర్వాత మహారాష్ట్రలో రాజకీయ మార్పులు జరుగుతాయని ప్రచారం చేసిన వారు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో కూడా ప్రకంపనల సృష్టిస్తాయని గుర్తించుకోవాలన్నారు. ఓ వైపు దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్లు, బెడ్ల కొరత, ఆక్సిజన్ లేకపోవడం వల్ల 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు చనిపోతున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడిందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అంతేకాదు వెస్ట్ బెంగాల్లో దీదీ గెలిస్తే అక్కడ ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు సైతం ఓడినట్లేనని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు.