కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు.
భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్‌లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.
ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి
Comments
Please login to add a commentAdd a comment