కోల్‌కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు.
ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్‌ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది.
#WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE
— ANI (@ANI) August 11, 2022
ఏంటీ కేసు?
2020లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత
Comments
Please login to add a commentAdd a comment