Anubrata Mondal
-
టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబసభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వకపోతే తన కుటుంబసభ్యులందరిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(NDPS) కింద కేసు పెడతామని బప్ప చటర్జీ అనే వ్యక్తిపేరుతో లేఖవచ్చిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు పుర్వ వర్ధమాన్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హెడ్ క్లర్క్ అని, టీఎంసీ లీడర్నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: మా నాయకుడికి బెయిల్ ఇవ్వు లేకపోతే.. సీబీఐ జడ్జికి బెదిరింపులు -
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు -
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం -
అనుబ్రతా మోండల్‌కు అవమానం!.. ‘షూ’ చూపిస్తూ ‘చోర్’ అంటూ నినాదాలు!
కోల్‌కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్‌ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. #WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE — ANI (@ANI) August 11, 2022 ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత -
బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. టీఎంసీ నేతలు వరుసగా అరెస్టవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మోండల్ సీబీఐ వలలో చిక్కుకోవడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరీ అనుబ్రతా మోండల్? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రతా మోండల్ ఉన్నారు. 61 ఏళ్ల మోండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే ఈ జిల్లాలో ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మోండల్ టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీలోనూ స్థానం దక్కించుకున్నారు. పోటీకి దూరంగా.. వివాదాలకు దగ్గరగా.. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనుబ్రతా మోండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాదాలు ఆయనకు కొత్త కాదు. చాలా సందర్భాల్లో రెచ్చగొట్ట ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలని టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. చాలా మంది రౌడీషీటర్లకు ఆయన ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రాళ్ల తవ్వకాలు, పశువుల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతిపక్ష నేతలను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే.. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో మోండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు పంపింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అంగీకరించింది. హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళుతుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో మోండల్‌ను సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది. (క్లిక్: సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత) -
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పార్థ చటర్జీ ఈడీ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లగా.. తాజాగా మరో అగ్రనేత సీబీఐకి చిక్కారు. మమతకు అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. బీర్భూమ్ జిల్లాలోని తన నివాసంలో అనుబ్రతా మోండల్‌ను గురువారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదరగొట్టి మోండల్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరుకావాలని 10 పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో రెండు సార్లు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. (క్లిక్: ఐటీ దాడులు.. డబ్బులు లెక్కించడానికి 13 గంటలు)