shoe throw
-
అనుబ్రతా మోండల్‌కు అవమానం!.. ‘షూ’ చూపిస్తూ ‘చోర్’ అంటూ నినాదాలు!
కోల్‌కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్‌ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. #WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE — ANI (@ANI) August 11, 2022 ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత -
ఎంపీ జీవీఎల్‌పైకి బూటు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఆయనపైకి రెండు బూట్లు విసిరాడు. మొదటి బూటు జీవీఎల్‌కు దూరంగా వెళ్లగా.. రెండోది ఆయనకు అతి సమీపం నుంచి వెళ్లింది. ఈ ఘటనతో జీవీఎల్ షాకయ్యారు. అప్రమత్తమైన పార్టీ కార్యాలయ సిబ్బంది బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి యూపీలోని కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవగా గుర్తించారు. అతను ఒక ఆస్పత్రి నడుపుతున్నట్టు విజిటింగ్ కార్డు లభ్యమైంది. దాడికి కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.దీనిపై స్పందించిన జీవీఎల్ ఇలాం టి దాడులకు తాను భయపడబోనని అన్నారు. -
జీవీఎల్‌పై బూట్లతో దాడి
-
జీవీఎల్‌పై బూటు విసిరిన విలేఖరి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అనూహ్యంగా ఆయనపైకి బూటు విసిరాడు. వేగంగా దూసుకొచ్చిన బూటు జీవీఎల్ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షూ విసిరిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ్‌గా గుర్తించారు. అయితే, అతను ఎందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. శక్తిభార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శక్తి భార్గవ్ ఓ పాత్రికేయుడని, నరేంద్ర మోదీపై అసంతృప్తితోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. -
సీఎంపైకి చెప్పు విసిరిన యువకుని అరెస్ట్
పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా పోలీసలు గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాను అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో తన అసంతృప్తిని ఇలా వెల్లగక్కినట్లు చందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. చందన్ నితీష్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి చందన్‌ను విడిపించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. సీఎం నితీష్ కుమార్‌పైకి చెప్పు విసరడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌పైకి చెప్పు విసిరాడు. -
ముఖ్యమంత్రిపై చెప్పుల దాడి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వారం రోజుల క్రితం మహిళలు కోడిగుడ్లతో దాడిచేసిన సంగతి మర్చిపోక ముందే ఆయనపై మరో సారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి పట్నాయక్‌పై చెప్పలతో దాడి చేశాడు. బేజీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం బార్ఘడ్ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కుంభారీ గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈసందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేశారు. అయతే సభలో ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. పట్నాయక్ మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసిరాడు. వాటి నుంచి సీఎం తప్పించుకున్నారు. దీంతో అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. దాడిన చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. -
సీఎంపై చెప్పుల దాడి
-
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై బూటు విసిరాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి జరిగింది. శనివారం మీడియా సమావేశంలో కేజ్రీవాల్ సరి-బేసి ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆయనపై బూటు, సీడీలను విసిరాడు. ఇవి సీఎం పక్కనపడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. కేజ్రీవాల్‌పై బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వేద్ ప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు నిందితుడిని ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశాన్ని కొనసాగించారు. కేజ్రీవాల్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఖండించారు. కాగా కేజ్రీవాల్‌పై గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. 2014లో ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో రోడ్డు షో సందర్భంగా ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప కొట్టాడు. అదే ఏడాది హరియాణాలో మరో వ్యక్తి కేజ్రీవాల్ పై దాడికి ప్రయత్నించాడు. ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ కేజ్రీవాల్‌పై ఇంకు చెల్లేందుకు ప్రయత్నించింది.