ముఖ్యమంత్రిపై చెప్పుల దాడి | Shoes Attack on Odisha CM Naveen Patnaik | Sakshi
Sakshi News home page

సీఎంపై చెప్పుల దాడి

Published Wed, Feb 21 2018 6:10 PM | Last Updated on Wed, Feb 21 2018 6:15 PM

Shoes Attack on Odisha CM Naveen Patnaik - Sakshi

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వారం రోజుల క్రితం మహిళలు కోడిగుడ్లతో దాడిచేసిన సంగతి మర్చిపోక ముందే ఆయనపై మరో సారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి పట్నాయక్‌పై చెప్పలతో దాడి చేశాడు. బేజీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం బార్‌ఘడ్‌ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కుంభారీ గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈసందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేశారు.

అయతే సభలో ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. పట్నాయక్‌ మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసిరాడు. వాటి నుంచి సీఎం తప్పించుకున్నారు. దీంతో  అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. దాడిన చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement