భువనేశ్వర్: తన పుట్టిన రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ నియామకాల పద్ధతిని పూర్తిగా తొలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 57వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
‘కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాల వ్యవస్థను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడానికి ఈరోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఈరోజుకు కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ నియామకాలు జరగటం లేదు. వారు ఇప్పటికీ కాంట్రాక్ట్ నియామకాల వ్యవస్థపైనే కొనసాగుతున్నారు. కానీ, ఒడిశాలో ఈ కాంట్రాక్ట్ నియామక శకం ముగిసింది. నేను ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా. నోటిఫికేషన్ రేపు వస్తుంది. 57వేలకుపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రతిఏటా ప్రభుత్వంపై రూ.1300 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ముందుగానే దీపావళిని తీసుకొస్తుంది.’ అని తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్.
ఇదీ చదవండి: వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్ కుమార్ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment