నవీన్‌ పట్నాయక్‌ పొలిటికల్‌ ప్లాన్‌.. ‘షాడో కేబినెట్‌’ సభ్యులు వీరే.. | Odisha Naveen Patnaik Formed Shadow Cabinet In Politics | Sakshi
Sakshi News home page

ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ కొత్త ప్లాన్‌.. ‘షాడో కేబినెట్‌’ సభ్యులు వీరే..

Published Fri, Jul 19 2024 8:06 PM | Last Updated on Fri, Jul 19 2024 8:21 PM

Odisha Naveen Patnaik Formed Shadow Cabinet In Politics

భువనేశ్వర్‌: దేశంలో ఒడిశా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒడిశాలో తొలిసారి ఏర్పాటైన బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ సరికొత్తగా ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలోనే 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలతో ‘షాడో కేబినెట్‌’ను ఏర్పాటు చేశారు. దీంతో ఒడిశా రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

కాగా, ఒడిశాలో సీఎం మోహన్ మాంఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్‌ పెట్టేందుకు నవీన్‌ పట్నాయక్‌ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు తాజాగా పలు శాఖలను కేటాయించారు. షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును బీజేడీ జారీ చేసింది. దీంతో, మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్,  మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు.

 

 

ఇక, ఒడిశాలో జూలై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. వారిని ప్రశ్నలు అడగడానికి, వారి అడిగే ప్రశ్నలకు సమాధానాలను కూడా షాడో కేబినెట్‌ ఇస్తుంది. అయితే, నవీన్‌ పట్నాయక్‌ ఏర్పాటు చేసిన ఈ షాడో కేబినెట్‌ ప్రభుత్వ అధికారిక సంస్థ. కేవలం బీజేడీకి చెందిన తాత్కాలిక వ్యవస్థ వంటిది.

ఇదిలా ఉండగా.. మన దేశంలో ఇలా షాడో కేబినెట్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అయితే.. బ్రిటన్‌, కెనడా, న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రతిపక్ష పార్టీలకు షాడో​ కేబినెట్‌ మాదిరిగానే కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.  ఇక, కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ‘ప్రతిపక్ష విమర్శకుడు’గా వ్యవహరిస్తారు. మరోవైపు.. బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్‌లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement