పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్‌ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది.
ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో సుజీత్‌కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్‌ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.
అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.
‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.
ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు.
BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."
He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024
Comments
Please login to add a commentAdd a comment