Odisha cm
-
ఒడిశా సీఎంను కలిసిన వేదాంత గ్రూప్ ఛైర్మన్
వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు. వీరిద్దరూ సమావేశమై రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్.. వేదాంత గ్రూప్ తిరుగులేని నిబద్ధతను గురించి ప్రశంసించారు.ఒడిశా పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయగల కొత్త సహకార రంగాలను గుర్తించడంపై వీరిరువురు చర్చించుకున్నారు. కొత్త ప్రభుత్వ దార్శనికత, నాయకత్వంపై అగర్వాల్ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా అద్భుతమైన అభివృద్ధి ప్రజల సంపూర్ణ కృషి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.వేదాంత విజయానికి రాష్ట్రం కీలకం, దాని స్థిరమైన అభివృద్ధికి మేము అంకితభావంతో ఉన్నాము అని అగర్వాల్ అన్నారు. వేదాంత గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని సమాచారం. దీంతో రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే.. రాష్ట్ర అభివృద్ధి మరింత పెరుగుతుందని తెలుస్తోంది. -
నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
భువనేశ్వర్: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. దీన్ని బట్టి పాండియన్ చేతిలో నవీన్ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. ఇంతలో నవీన్‌కు మైక్ పట్టుకున్న పాండియన్ వెంటనే నవీన్ పట్నాయక్ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha! BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024 -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జ్యోతి బసు రికార్డును తిరగరాసిన నవీన్
భువనేశ్వర్: దేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో, చామ్లింగ్ తర్వాతి స్థానంలోకి చేరారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా అయిదు పర్యాయాలు సీఎంగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మళ్లీ విజయం సాధించి, సీఎంగా పగ్గాలు చేపట్టిన పక్షంలో నవీన్ పటా్నయక్ దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నేతగా నిలుస్తారు. -
సంచలన నిర్ణయం.. 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
భువనేశ్వర్: తన పుట్టిన రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ నియామకాల పద్ధతిని పూర్తిగా తొలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 57వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ‘కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాల వ్యవస్థను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడానికి ఈరోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఈరోజుకు కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ నియామకాలు జరగటం లేదు. వారు ఇప్పటికీ కాంట్రాక్ట్ నియామకాల వ్యవస్థపైనే కొనసాగుతున్నారు. కానీ, ఒడిశాలో ఈ కాంట్రాక్ట్ నియామక శకం ముగిసింది. నేను ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా. నోటిఫికేషన్ రేపు వస్తుంది. 57వేలకుపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రతిఏటా ప్రభుత్వంపై రూ.1300 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ముందుగానే దీపావళిని తీసుకొస్తుంది.’ అని తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్. ఇదీ చదవండి: వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్ కుమార్ రాజీనామా -
ఒడిశా ముఖ్యమంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
-
Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
Odisha Tour: శ్రీకాకుళం బయలుదేరిన సీఎం జగన్
-
AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
Updates: సాయంత్రం... ► ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ►పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు. ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్ సభ్యులు కలిశారు. మధ్యాహ్నం.. ► ముందుగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఉదయం... ►విశాఖపట్నం: భువనేశ్వర్ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం -
Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. సరిహద్దు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించుకుని కలిసి అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం జగన్ పలు దఫాలు పేర్కొనటం తెలిసిందే. ఈ క్రమంలో చర్చలకు సమయమిస్తే తానే వస్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాసి చొరవ చూపారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. ఇద్దరు సీఎంల సమావేశంతో సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ముందడుగు పడుతోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనిపై సలహాపూర్వక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఒడిశా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్.. జంఝావతిపై రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతంగా కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం అంశాన్ని కూడా సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా 24,640 ఎకరాలకుగానూ కేవలం ఐదు వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించడం వల్ల ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, 6 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయన్నారు. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురి కానుండగా ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సహకరించాలని ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్ కోరనున్నారు. ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికారులు తాజాగా సీఎం జగన్‌కు తెలియచేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు పాతపట్నం చేరుకుని పెళ్లి రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా సీఎం జగన్ వెంట ఒడిశా పర్యటనలో పాల్గొంటారు. నేరడి బ్యారేజీతో ఒడిశాకూ ప్రయోజనం నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఉభయ రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను సీఎం జగన్ చర్చల సందర్భంగా ప్రస్తావించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 103 ఎకరాలు అవసరం కాగా ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పారు. -
చెట్టుకి పోస్టర్ అంటించిన మావోయిస్టులు.. క్షణం క్షణం భయంగా గడుపుతున్న జనం
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి, కుముడాబల్లి వంతెన దగ్గరి ఓ చెట్టుకి మావోయిస్టులు ఓ పోస్టరు అతికించారు. నాగావళి–గుముసుర డివిజన్ మావోయిస్ట్ పార్టీ పేరిట మంగళవారం కనిపించిన ఈ పోస్టరుని చూసి, అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టరు నకళ్లు సైతం గ్రామంలోని ఐదు ప్రాంతాల్లో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని మావోయిస్టులు ఆరోపించారు. కలహండి జిల్లా, గోలముండ పరిధి, మహాలింగ సన్‌షైన్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్యకు గురికావడం దారుణమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మమిత హత్య కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని, శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని మావోయిస్టులు పోస్టర్లలో కోరారు. ఇదే విషయంపై స్పందించిన పోలీస్ అధికారులు ఇటువంటి గాలి వార్తలకు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే భర్త పైశాచికత్వం.. కట్టుకున్న భార్యను ముసలోడికి.. -
ఒడిశా సీఎంను కలిసిన స్వామి స్వాత్మనందేంద్ర
-
ప్రధానిని ఫాలో అవుతున్న పట్నాయక్
భువనేశ్వర్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పాలక బీజేడీ చీఫ్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పావులు కదుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామని ఇప్పటికే ప్రకటించిన పట్నాయక్ ఆ దిశగా ప్రచార పర్వాన్ని పరుగులెత్తించేందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒడిషాలో ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాలన్నింటిలో భారీ బహిరంగసభలకు ఒడిషా సీఎం శ్రీకారం చుట్టారు. గత ఏడాడి డిసెంబర్ 24 నుంచి జనవరి 15 మధ్య ప్రధాని మోదీ ఒడిషాలోని ఖుర్ధా, బరిపడ, బొలన్‌గిర్‌లలో భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించగా, ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో భారీ సభలకు హాజరుకావాలని నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ పశ్చిమ ఒడిషాలోని జర్సుగుడలో బహిరంగ సభలో పాల్గొనగా గురువారం అదే ప్రాంతంలో నవీన్ పట్నాయక్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేడీ సీనియర్ నేత వెల్లడించారు. ఇక బొలన్‌గిరిలో ఈనెల 24న జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. మరోవైపు భువనేశ్వర్‌కు కొద్ది దూరంలోనే ఉన్నా ఖుర్ధాలోనూ త్వరలోనే సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఒడిషాలో మెరుగైన విజయాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకే సీఎం నవీన్ పట్నాయక్ ఈ తరహా వ్యూహంతో ముందుకెళుతున్నారని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. -
పట్నాయక్ ఒంటరి పోరాటం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోగానీ, కాంగ్రెస్ పార్టీతోగానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్ పార్టీ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జనవరి 9వ తేదీన స్పష్టం చేసిన విషయం తెల్సిందే. 2000 సంవత్సరం నుంచి వరసగా నాలుగు సార్లు విజయం సాధించి 19 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పట్ల ఈసారి ప్రజా వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉండడం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉండడం వల్ల పొత్తుల వల్ల నవీన్ పట్నాయక్ ప్రయోజనం లేదని భావించి ఉండవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వైఖరి అవలంబించడం వల్ల ఆయన ఆశించిన ఫలితాలనే పొందారు. అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలోని 147 సీట్లకుగాను 117 సీట్లలో 21 లోక్‌సభ సీట్లలో 20 సీట్లను బిజూ జనతా దళ్ కైవసం చేసుకొంది. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అలాగే తన మాజీ గురువు ప్యారీ మోహన్ మహపాత్ర నుంచి గట్టి పోటీ ఉన్నప్పుడు ఆయన పార్టీ ఘన విజయం సాధించడం విశేషం. అనేక ఎన్నికల్లో బిజూ జనతా దళ్ విజయానికి విశేష కృషి చేసిన మాజీ సివిల్ సర్వెంట్ మహపాత్ర నుంచి 2012లో నవీన్ పట్నాయక్ విడిపోయారు. ఆ తర్వాత 2017లో మహపాత్ర మరణించారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే బలహీన పడడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మహా కూటమి ఇంకా బలపడక పోవడం వల్ల ఇరు కూటములకు సమాన దూరంలో ఉండాలని నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు ప్రముఖ రాజకీయ పరిశీలకుడు సూర్య నారాయణ్ మిశ్రా తెలిపారు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాగా బలపడిన బీజేపీ మళ్లీ పతనమవుతూ వస్తోంది. 2012 పంచాయతీ ఎన్నికల్లో కేవలం 36 సీట్లకు పరిమితమైన బీజేపీ 2017 ఎన్నికల్లో 297 సీట్లను గెలుచుకోవడం విశేషం. బిజుపుర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై 42 వేల మెజారిటీతో బిజూ జనతాదళ్ అభ్యర్థి గెలవడం బీజేపీ పతనాన్ని సూచిస్తోంది. బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా ఉన్నప్పటికీ అంతర్గత కలహాల్లో కూరుకుపోయి ఉంది. పార్టీ మనుగడ సాగించడమే తమకు ఇప్పుడు ముఖ్యమని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ మాజీ వ్యాఖ్యానించడం ఆ పార్టీలోని నైరాశ్యాన్ని సూచిస్తోంది. -
మహాకూటమిలో చేరికపై ఒడిషా సీఎం వ్యాఖ్యలివే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరికపై తనకు మరికొంత సమయం కావాలని బీజేడీ నేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహాకూటమిలో చేరికకు సంబంధించి తాము ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధరను రూ 2930కు పెంచాలనే డిమాండ్‌తో బీజేడీ ఆధ్వర్యంలో మంగళవారం దేశ రాజధానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, దీని నుంచి కేంద్రం తప్పించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తాము పలుసార్లు మద్దతు ధరపై విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పటివరకూ సమదూరం పాటిస్తున్న బీజేడీ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడటం గమనార్హం. గత నాలుగున్నరేళ్లుగా ఒడిషా ప్రభుత్వం వ్యవసాయంపై రూ 30,000 కోట్లు వెచ్చించిందన్నారు. -
ముఖ్యమంత్రిపై చెప్పుల దాడి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వారం రోజుల క్రితం మహిళలు కోడిగుడ్లతో దాడిచేసిన సంగతి మర్చిపోక ముందే ఆయనపై మరో సారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి పట్నాయక్‌పై చెప్పలతో దాడి చేశాడు. బేజీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం బార్ఘడ్ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కుంభారీ గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈసందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేశారు. అయతే సభలో ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. పట్నాయక్ మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసిరాడు. వాటి నుంచి సీఎం తప్పించుకున్నారు. దీంతో అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. దాడిన చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. -
సీఎంపై చెప్పుల దాడి
-
ఒడిషా సీఎం రాజీనామాకు విపక్షాల పట్టు
భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామాకు విపక్షాలు పట్టుపట్టాయి. దీనిపై సోమవారుం ఒడిషా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. విపక్షాల ఆందోళనతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. తొలుత సభ ప్రారంభమైన వెంటనే ఈ ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నిరసనకు దిగారు. సీఎం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. నగరంలోని బొమికల్ ప్రాంతంలో ఆదివారం నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. బాధితులకు రూ 5 లక్షలు పరిహారం ప్రకటించినట్టు సీఎం పట్నాయక్ తెలిపారు.ఘటనకు సంబంధించి అయిదుగురిపై కేసు నమోదు చేయగా, సీనియర్ ఇంజనీర్ ఒకరిని అరెస్ట్ చేశారు. -
బీజేపీతో మాకు ముప్పులేదు
భువనేశ్వర్: బీజేపీ నుంచి ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉందని తాను భావించడం లేదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందని పేర్నొన్నారు. గురువారం భువనేశ్వర్ వచ్చిన మమత.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఒడిశాలో బిజూ జనదళ్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. భువనేశ్వర్‌లో ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు భేటీ కావడం ప్రాధాన్యం ఏర్పడింది. మమత, పట్నాయక్ ఇద్దరూ 15 నిమిషాలు సమావేశమయ్యారు. రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగా పట్నాయక్‌ను కలిశానని మమత చెప్పినా.. బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసే దిశగా మంతనాలు జరిపినట్టు భావిస్తున్నారు. ఈ సందర్బంగా మమత బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ.. ప్రతిఒక్కరిని, ప్రజలను, రాజకీయ పార్టీలను కూడా విభజిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను, మంత్రులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 2019లో ఒడిశా, 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. -
గాలిలో సీఎం హెలికాప్టర్.. తీవ్ర ఉత్కంఠ!
-
గాలిలో సీఎం హెలికాప్టర్.. తీవ్ర ఉత్కంఠ!
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు 45 నిమిషాలపాటు గాలిలో ఊగిసలాడటం తీవ్ర ఉత్కంఠ రేపింది. గురువారం కోరాపుట్ జిల్లాలోని కోట్‌పాద్ వద్ద ల్యాండింగ్ అయ్యే సమయంలో సమన్వయం లోపించడంతో ఈ అవాంఛనీయ ఘటన జరిగింది. పట్నాయక్ ప్రయాణిస్తున్న చాపర్ అనుకున్న సమయానికి కోట్‌పాద్ వద్దకు రాకపోయేసరికి ఆయన హెలికాప్టర్ గల్లంతయిందంటూ ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి. కోట్‌పాద్ మావోయిస్ట్ ప్రభావితం కావడంతో సీఎం హెలికాప్టర్ అదృశ్యమైనట్టు వచ్చిన వందతులు తీవ్ర ఉత్కంఠ రేపాయి. దీంతో అధికారులు, ప్రజలు ఉత్కంఠగా గడిపారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసేందుకు, పలు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందజేసేందుకు సీఎం పట్నాయక్ కోరాపుట్ జిల్లాకు వచ్చారు. మొదట జయ్‌పూర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం అనంతరం కోరాపాద్ బయలుదేరారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 1.30 గంటలకుగానీ సీఎం హెలికాప్టర్ రాలేదు. అధికారుల మధ్య తప్పుడు సమన్వయం వల్ల సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రదేశం కన్నా ముందుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత 45 నిమిషాలు గాలిలో ఊగిసలాడి.. చివరకు సురక్షితంగా కోరాపాద్ హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయింది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
70 వేల మంది జడ్జీలు అవసరం
♦ పెండింగ్ కేసుల పరిష్కారంపై సీజేఐ ఠాకూర్ వెల్లడి ♦ జడ్జీల కొరతపై మళ్లీ ఆందోళన కటక్: దేశంలో జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఓ సదస్సులో జస్టిస్ ఠాకూర్ ప్రధాని మోదీ సమక్షంలో ఇదే అంశాన్ని ప్రస్తావించి కంటతడి పెట్టుకోవడం తెలిసిందే. తాజాగా ఆదివారమిక్కడ జరిగిన ఒడిశా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ.. జడ్జీల కొరత అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. జనాభా పెరుగుదల రేటు ప్రకారం...పెండింగ్ కేసుల పరిష్కారానికి 70 వేల మందికిపైగా జడ్జీల అవసరముందన్నారు. ‘జడ్జీల నియామకాలను సత్వరం చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అయితే ఈ నియామకాలతో సంబంధమున్న యంత్రాంగం మాత్రం చాలా నిదానంగా కదులుతోంది’ అని తెలిపారు. హైకోర్టు జడ్జీలకు సంబంధించి 170 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.న్యాయం పొందడమనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని వారు పొందకుండా ప్రభుత్వాలు నిరాకరించలేవని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. జడ్జీల కొరత ప్రధాన సవాలు.. ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో జడ్జీల కొరత ఒకటని ఆయన అన్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో మంజూరైన జడ్జీల పోస్టులు 900 కాగా.. వాటిలో 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరాన్ని 1987లో భారత లా కమిషన్ అప్పట్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి 44 వేల మంది జడ్జీలు అవసరమని సూచించిందన్నారు. ప్రస్తుతం కేవలం 18 వేల మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఆర్థికసాయం చేస్తామన్నారు. -
సీఎం చాంబర్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాంబర్లో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అసెంబ్లీలోని నవీన్ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో చాంబర్ లో సీఎం లేరు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఇది చిన్న ప్రమాదమేనని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగినట్టు చెప్పారు. డాక్యుమెంట్లు ఏవీ కాలిపోలేదని.. ఓ టీవీ, కొంచెం ఫర్నీచర్ దెబ్బతిన్నట్టు బీజేడీ ఎమ్మెల్యే దేవాసిస్ నాయక్ చెప్పారు. డీజీపీ కేబీ సింగ్, పోలీస్ కమిషనర్ ఖురానియా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
సుప్రీంకోర్టులో సీఎంకు ఊరట
బొగ్గుక్షేత్రాల కేటాయింపు కేసులో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను విచారణకు పిలిపించాలంటూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతోపాటు.. పిటిషనర్‌కు జస్టిస్ వి.గోపాల్ గౌడ, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. పిటిషన్ దాఖలుచేయడానికి అతడికి అర్హత లేదని, అందుకే కోర్టు జరిమానా విధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ త్రిపాఠీ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్లను సీబీఐ విచారించింది గానీ, పట్నాయక్‌ను పిలిపించలేదని సాహు తన పిటిషన్లో తెలిపారు. ఆయన లేఖ రాయడం వల్లే కేంద్రం బిర్లాలకు చెందిన హిందాల్కో కంపెనీకి బొగ్గు క్షేత్రాలు కేటాయించిందని అన్నారు. ఈ వాదనను సుప్రీం కొట్టేసింది.