వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు. వీరిద్దరూ సమావేశమై రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్.. వేదాంత గ్రూప్ తిరుగులేని నిబద్ధతను గురించి ప్రశంసించారు.
ఒడిశా పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయగల కొత్త సహకార రంగాలను గుర్తించడంపై వీరిరువురు చర్చించుకున్నారు. కొత్త ప్రభుత్వ దార్శనికత, నాయకత్వంపై అగర్వాల్ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా అద్భుతమైన అభివృద్ధి ప్రజల సంపూర్ణ కృషి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
వేదాంత విజయానికి రాష్ట్రం కీలకం, దాని స్థిరమైన అభివృద్ధికి మేము అంకితభావంతో ఉన్నాము అని అగర్వాల్ అన్నారు. వేదాంత గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని సమాచారం. దీంతో రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే.. రాష్ట్ర అభివృద్ధి మరింత పెరుగుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment