Anil Agarwal
-
ఒడిశా సీఎంను కలిసిన వేదాంత గ్రూప్ ఛైర్మన్
వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు. వీరిద్దరూ సమావేశమై రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్.. వేదాంత గ్రూప్ తిరుగులేని నిబద్ధతను గురించి ప్రశంసించారు.ఒడిశా పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయగల కొత్త సహకార రంగాలను గుర్తించడంపై వీరిరువురు చర్చించుకున్నారు. కొత్త ప్రభుత్వ దార్శనికత, నాయకత్వంపై అగర్వాల్ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా అద్భుతమైన అభివృద్ధి ప్రజల సంపూర్ణ కృషి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.వేదాంత విజయానికి రాష్ట్రం కీలకం, దాని స్థిరమైన అభివృద్ధికి మేము అంకితభావంతో ఉన్నాము అని అగర్వాల్ అన్నారు. వేదాంత గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని సమాచారం. దీంతో రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే.. రాష్ట్ర అభివృద్ధి మరింత పెరుగుతుందని తెలుస్తోంది. -
కోవర్టు లాబీయింగ్ చేశాయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్లపై ఆరోపణలు గుప్పించిన ఓసీసీఆర్పీ తాజాగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన కంపెనీలు వేదాంత, కెయిర్న్ ఇండియాను టార్గెట్ చేసింది. పర్యావరణ చట్టాలను అనుకూలంగా మార్చుకునేందుకు వేదాంత కోవర్టు లాబీయింగ్ నడిపినట్లు కొత్తగా మరో నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం కూడా ప్రజలను సంప్రదించకుండా నిబంధనల మార్పులను ఆమోదించి, ‘అక్రమ పద్ధతుల్లో’ అమలు చేసినట్లు పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు.. ► కొత్తగా పర్యావరణ అనుమతుల అవసరం లేకుండా దేశీయంగా ఉత్పత్తిని 50% వరకు పెంచుకునేందుకు మైనింగ్ కంపెనీలకు అనుమతినిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కాగలదని 2021 జనవరిలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. ► ‘‘2022 తొలినాళ్లలో పలు దఫాల సమావేశాల అనంతరం పర్యావరణ శాఖ నిబంధనలను సడలించింది. ప్రజాభిప్రాయాల సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకునేందుకు అనుమతించింది’’ అని ఓసీసీఆర్పీ తెలిపింది. ► వేదాంత తరహాలోనే దాని అనుబంధ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వ్యవహరించింది. చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను ఎత్తివేసేందుకు లాబీయింగ్ చేసింది. ► అధికార బీజేపీకి వేదాంత గణనీయంగా విరాళాలు కూడా ఇచి్చనట్లు (2016–2020 మధ్య కాలంలో రూ.43.5 కోటు)్ల ఆధారాలు ఉన్నాయని ఓసీసీఆర్పీ తెలిపింది. వేదాంత స్పందన ఇదీ.. ఓసీసీఆర్పీ ఆరోపణలను నిర్దుష్టంగా ఖండించకుండా వేదాంత స్పందించింది. ‘దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సహజ వనరుల విషయంలో భారత్ స్వావలంబన సాధించడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పరిశీలన కోసం పలు విజ్ఞప్తులు చేశాము‘ అని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
OCCRP సంచలన ఆరోపణలు: వేదాంతకు భారీ ఎదురుదెబ్బ
మైనింగ్ దిగ్గజం వేదాంతకు భారీ షాక్ తగిలింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. గ్రీన్ నిబంధనలను బలహీనపరిచేందుకు లాబీయింగ్ ప్రచారాన్ని నడిపింది. అంతేకాదు వేదాందకు చెందిన చమురు సంస్థ కెయిర్న్ ఇండియా కూడా అక్రమాలను పాల్పడిందని జార్జ్ సొరోస్‌కు చెందిన ఓసీసీఆర్పీ పేర్కొంది. ప్రభుత్వ వేలంలో గెలిచిన చమురు బ్లాకులలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం పబ్లిక్ హియరింగ్‌లను రద్దు చేయడానికి విజయవంతంగా లాబీయింగ్ చేసిందని తెలిపింది.(మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర) అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత కొవిడ్ -19 మహమ్మారి సమయంలో కీలకమైన పర్యావరణ నిబంధనలను బలహీనపరిచే "కోవర్ట్" లాబీయింగ్ నడిపించినట్టు తెలిపింది. మైనింగ్ కంపెనీలు 50శాతం వరకు ఉత్పత్తిని పెంచడానికి అనుమతించడం ద్వారా భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుందంటూ ప్రభుత్వానికి చెప్పిన వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తద్వారా కొన్ని నిబంధనలను ప్రభావితం చేసినట్టు ఆరోపించింది. అటు ఉత్పత్తి ,ఇటు ఆర్థిక వృద్ధిని తక్షణమే పెంచడమే కాకుండా, ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని, భారీ ఉద్యోగాలను సృష్టిస్తుందని అగర్వాల్ మంత్రికి చెప్పారని తెలిపింది. అలాగే దీన్ని 'ఒక సాధారణ నోటిఫికేషన్'తో మార్పు చేయవచ్చని సిఫార్సు చేశారని కూడా OCCRP వెల్లడించింది. అలాగే మోదీ సర్కార్ దీనిపై ప్రజల సంప్రదింపులు లేకుండానే..నిపుణులు చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించి మార్పులను ఆమోదించిందని తన కథనంలో పేర్కొంది ఈ మేరకు కొత్త పర్యావరణ అనుమతులు పొందుకు జనవరి 2021లో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాజీ పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో మాట్లాడారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే స్థానిక వ్యతిరేకత ఉన్నప్పటికీ కెయిర్న్ రాజస్థాన్‌లో ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులకు ఆమోదం పొందిందని నివేదించింది. కాగా గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై కూడా ఏసీసీఆర్‌పీ అనేక ఆరోపణలు చేసింది. అయితే వీటిని అదానీ గ్రూపు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆరోపణలపై వేదాంత ఎలా స్పందింస్తుందో చూడాలి. -
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి కంపెనీలు పోటాపోటీ
గాంధీనగర్: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీపై దేశ, విదేశ కంపెనీలు పోటీపడుతున్నాయి. సెమీకాన్ సదస్సు వేదికగా తమ ప్రణాళికలను వెల్లడించాయి. తాము తలపెట్టిన చిప్ ఫ్యాక్టరీ తొలి దశ రెండున్నరేళ్లలో సిద్ధమవుతుందని వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే భాగస్వాములను ఎంపిక చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలి దశపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 2.5 ఏళ్లలో వేదాంత తయారు చేసిన మేడిన్ ఇండియా చిప్‌ను అందించబోతున్నాం‘ అని అగర్వాల్ చెప్పారు. 20 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ల ప్లాంటు కోసం వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అటు భారత్‌లో చిప్‌ల తయారీ వ్యవస్థలోకి ప్రవేశించాలంటే ’అత్యంత సాహసికులై’ ఉండాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు పేర్కొన్నారు. వేదాంత జాయింట్ వెంచర్ గురించి ప్రస్తావించకుండా, ఇక్కడ ఎదురయ్యే ప్రతి అనుభవం.. కంపెనీలను మరింత దృఢంగా మారుస్తాయని ఆయన చెప్పారు. ఏఎండీ డిజైన్ సెంటర్.. మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 400 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ తెలిపారు. బెంగళూరులో తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద డిజైన్ సెంటర్‌ను 5,00,000 చ.అ. విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరు నాటికి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అయిదేళ్ల వ్యవధిలో 3,000 పైచిలుకు ఇంజనీరింగ్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేపర్‌మాస్టర్ పేర్కొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో భారత్‌లో తమ కార్యకలాపాలు పది ప్రాంతాలకు విస్తరించినట్లవుతుందని చెప్పా రు. భారత్‌లో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్, ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడంలో ఏఎండీ ప్రణాళికలు కీలకపాత్ర పోషించగలవని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్లో ట్వీట్ చేశారు. చిప్ ప్లాంటుకు జోరుగా కసరత్తు: మైక్రాన్ గుజరాత్లో తమ చిప్ ప్లాంటు ఏర్పాటుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు అమెరికన్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సంజయ్ మెహరోత్రా తెలిపారు. దీనితో రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించగలదని ఆయన పేర్కొన్నారు. -
అనిల్ అగర్వాల్‌కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్‌కాన్ చర్చలు?
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్‌తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్‌కాన్ అన్వేషిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్‌కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్‌ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్‌గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్) -
విబేధాలే కారణమా? గుజరాత్లో 1.54 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌కు అడ్డంకి!
మైనింగ్ కంపెనీ వేదాంతా లిమిటెడ్‌కు భారీ షాక్ తిగిలింది.సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంతాతో కదుర్చుకున్న ఒప్పందం నుంచి తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్ తప్పుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం ఫాక్స్‌కాన్ భారత్‌లో సెమీ కండక్టర్ తయారీ విభాగంలో అడుగు పెట్టాలని అనుకుంది. ఇందుకోసం వేదాంతాతో చేతులు కలిపింది. 67శాతం షేరుతో వేదాంత - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచ్ర్లో గుజరాత్ దోలేరా ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో రూ.1.54 లక్షల కోట్లతో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. తాజాగా, ఫాక్స్కాన్క, వేదాంతా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు సంస్థల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెమీ కండక్టర్ల తయారీ కోసం వేదాంతాను వద్దనుకొని కొత్త భాగస్వామి కోసం ఫాక్స్‌కాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేదాంత గ్రూప్ ఆర్థిక ఇబ్బందులతో ఫాక్స్‌కాన్ వేరే భాగస్వామిని చూసుకోవాలని సూచించిందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో, ఫాక్స్‌కాన్ మరో భాగస్వామికోసం ఇప్పటికే అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. వాటిల్లో రెండు కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రెండు కంపెనీలు ఏంటీ? ఫాక్స్‌కాన్‌కు, వేదాంతాల మధ్య ఎందుకు విబేధాలు తలెత్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 భారత్‌లో ఆఫీస్‌ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని.. -
9 వ్యాపారాలు దెబ్బకొడితే.. నేడు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి అధినేత
ఆయనేం బడా వ్యాపార కుటుంబంలో పుట్టలేదు. తొమ్మిది వ్యాపారాలు దెబ్బకొట్టాయి. మానసికంగా కుంగదీశాయి. అయినా నిలబడ్డాడు. కసిగా శ్రమించి వ్యాపారంలో విజయవంతమయ్యారు. నేడాయన రూ. 1.5 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ఆయనే వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్. అనిల్ అగర్వాల్ ఇటీవల ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందింది. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కలలను ఎలా సాకారం చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు. 19 ఏళ్ల వయసులోనే పాట్నాలోని మార్వాడీ కుటుంబంలో ఒక చిన్న వ్యాపారికి అనిల్ అగర్వాల్ జన్మించారు. చాలా చిన్న వయసులోనే తన తండ్రి వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న ఆయన కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి 19 సంవత్సరాల వయసులోనే ముంబైకి వచ్చేశారు. 1970లో స్క్రాప్ డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేంబ్రిడ్జ్‌లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "నేను 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో చాలా కష్టాలు పడ్డాను. విజవంతమైన వ్యక్తులను చూస్తూ నేను కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి రావాలని కలలు కనేవాడిని. అలా ఎన్నో వ్యాపారాలు చేశారు. 9 వ్యాపారాలు దెబ్బకొట్టాయి. సంవత్సరాల నిరాశ తర్వాత విజయాన్ని అందుకున్నాను" అన్నారు. ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది! ఎప్పుడూ కాలేజీకి వెళ్లని తనను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వానించడం.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం అనేది ఒక కల కంటే తక్కువేమీ కాదు.. అని అనిల్ అగర్వాల్ ట్విటర్ తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. అనిల్ అగర్వాల్ నికర సంపద అనిల్ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో విస్తృతమైన ఫాలోవర్లు ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన అంశాలను ఆయన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం ఆయనకు ట్విటర్లో 1,63,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అనిల్ అగర్వాల్ నికర సంపద దాదాపు రూ.16,000 కోట్లు. ఇక ఆయన కుటుంబ నికర సంపద రూ.32000 కోట్లకుపైగా ఉంది. As someone who never went to college, being invited to cambridge university and speaking with the students was nothing short of a dream… I was surrounded by bright 20 year olds who firmly shook my hands and introduced themselves with a big smile…i remember when i was their… pic.twitter.com/GpeOqqnCWM — Anil Agarwal (@AnilAgarwal_Ved) June 23, 2023 -
వాటా విక్రయం వదంతే: వేదాంతా నిరాధారమని స్పష్టీకరణ
మైనింగ్ మొఘల్, ప్రమోటర్ అనిల్ అగర్వాల్ కంపెనీలో వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు వెలువడిన వార్తలు కేవలం వదంతులేనని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. చివరి అవకాశంగా వేదాంతాలో 5 శాతంవరకూ వాటా విక్రయించే యోచనలో అనిల్ అగర్వాల్ ఉన్నట్లు ఇటీవల మీడియా పేర్కొన్న నేపథ్యంలో కంపెనీ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. వేదాంతా లిమిటెడ్‌లో మెజారిటీ వాటాదారు అయిన వేదాంతా రిసోర్సెస్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు చూస్తోంది. ఇందుకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)కు జింక్ ఆస్తులను విక్రయించడం ద్వారా 298.1 కోట్ల డాలర్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కంపెనీలో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. అయితే హెచ్‌జెడ్‌ఎల్‌లో 29.54 శాతం వాటా కలిగిన ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. కాగా.. రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులకు అవసరమైన వనరులున్నట్లు ఇంతక్రితం వేదాంతా వెల్లడించింది. తద్వారా రుణ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేసింది. సిండికేట్ రుణం, బైలేటరల్ బ్యాంక్ సౌకర్యాల ద్వారా 1.75 బిలియన్ డాలర్లు పొందే ఒప్పందం తుది దశలో ఉన్నట్లు వేదాంతా తెలియజేసింది. 2023 మార్చివరకూ అన్ని రకాల రుణ చెల్లింపులనూ పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గత 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. జూన్‌కల్లా చేపట్టవలసిన చెల్లింపులకూ తగిన లిక్విడిటీని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. బార్క్లేస్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల నుంచి తీసుకున్న 25 కోట్ల డాలర్ల రుణాలను పూర్తిగా చెల్లించినట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది. -
వేదాంత 250 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్.. తాజాగా బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి తీసుకున్న 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించేసింది. బార్క్లేస్ బ్యాంకుకు 150 మిలియన్ డాలర్లు, స్టాండర్డ్ చార్టర్డ్‌కు 100 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లోనూ జరపాల్సిన చెల్లింపులకు తగినన్ని నిధులు తమ దగ్గర ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మార్చి నాటికి చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ముందుగానే చెల్లించేసినట్లు వివరించింది. 1.75 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. -
పురోగతికి నిధులు కావాల్సిందే
న్యూఢిల్లీ: వృద్ధికి, దేశ నిర్మాణానికి నిధులు తప్పనిసరి అని అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపుల సామర్థ్యం ఆధారంగానే కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. నిర్వహణ పరిమితుల్లోపే రుణాలను కట్టడి చేస్తామని, ఈ విషయంలో ఇన్వెస్టర్ల సమూహాన్ని ఒప్పించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రుణాలను సకాలంలో చెల్లించిన చరిత్రను ప్రస్తావించింది. పూర్తి చెల్లింపులకు తగిన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి తీర్చాల్సిన రుణాలకు ముందే చెల్లింపులు చేసినట్టు వేదాంత రీసోర్సెస్ తెలిపింది. గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకున్నట్టు వివరించింది. 2023 జూన్‌తో ముగిసే త్రైమాసికం వరకు నిధుల అవసరాలను చేరుకోగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సంస్థ చరిత్రలో ఇప్పటి వరకు 35 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా, వాటన్నింటికీ సకాలంలో చెల్లింపులు చేసినట్టు ప్రకటించింది. అధిక నగదు ప్రవాహాలను తెచ్చిపెట్టే బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయంటూ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చేస్తున్న విస్తరణతో సమీప భవిష్యత్తులో ఆదాయం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘వేదంతా కంపెనీలు అన్నీ కూడా టాప్ సీఈవోల ఆధ్వర్యంలో నిపుణులతో నిర్వహిస్తున్నవి. అధిక వృద్ధి అవకాశాలతో, తక్కువ నిర్వహణ వ్యయాలతో వేదాంతా గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. భారత్ ఆర్థిక పురోగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం’’అని లింక్డ్ఇన్ పోస్ట్‌లో వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వేదాంత లిమిటెడ్ ప్రమోటర్ సంస్థకు భారీ రుణాలు ఉండడంతో.. అదానీ తర్వాత వేదాంతా గ్రూపు రుణ సమస్యలు ఎదుర్కోనుందంటూ ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ విడుదల చేయడం గమనార్హం. -
వేదాంతా – హిందుస్తాన్ జింక్ డీల్‌కు బ్రేక్!
న్యూఢిల్లీ: రుణ భారాలను తగ్గించుకోవాలని భావిస్తున్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అగర్వాల్ నియంత్రణలోని వేదాంతా తన అంతర్జాతీయ జింక్ వ్యాపారాన్ని (అసెట్స్) హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)కు 2.98 బిలియన్ డాలర్లకు విక్రయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించింది. విలువలకు సంబంధించి తలెత్తిన ఆందోళనలే దీనికి కారణం కావడం గమనార్హం. ఈ డీల్ ద్వారా తన దాదాపు 10 బిలియన్ డాలర్ల రుణ భారంలో కొంత తగ్గించుకోవాలన్న వేదాంతా ప్రయత్నానికి తాజా పరిణామం విఘాతంగా నిలుస్తోంది. చట్టపరమైన చర్యలకూ ప్రభుత్వం సిద్ధం ఆఫ్రికా ఆధారిత వ్యాపారాన్ని హిందుస్తాన్ జింక్‌కు విక్రయించడాన్ని నిలువరించడానికి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌కు గనుల మంత్రిత్వశాఖ ఒక లేఖ రాస్తూ, ‘‘ఈ లావాదేవీకి సంబంధించి ప్రభుత్వం తన అసమ్మతిని పునరుద్ఘాటించాలనుకుంటోంది’’ అని పేర్కొంది. హిందుస్తాన్ జింక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఈ విషయాన్ని తెలిపింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. మాతృ సంస్థ వేదాంతా నుంచి టీహెచ్ఎల్ జింక్ లిమిటెడ్ మారిషస్‌ను 2.98 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని హిందుస్తాన్ జింక్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపాదన ప్రకారం 18 నెలల్లో దశలవారీగా ఈ కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉంది. జింక్, సీసం, వెండి సమీకృత ఉత్పత్తిదారు.. హిందుస్తాన్ జింక్‌లో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. కాగా.. మైనింగ్ శాఖ లేఖను బోర్డు ముందు ఉంచనున్నట్లు హిందుస్తాన్ జింక్ తాజాగా వెల్లడించింది. వేదాంతా గ్రూప్లోకెల్లా భారీ డివిడెండ్ల ద్వారా హెచ్‌జెడ్‌ఎల్ సంపన్న సంస్థగా నిలుస్తూ వస్తోంది. హిందుస్తాన్ జింక్ షేర్ ధర సోమవారం 1% తగ్గి, రూ.321 వద్ద స్థిరపడగా, వేదాంతా షేర్ ధర కూడా అంతే శాతం తగ్గి, రూ.311 వద్ద ముగిసింది. -
వేదాంత కెయిర్న్ ఆయిల్ సీఈవోగా నిక్ వాకర్
న్యూఢిల్లీ: వేదాంతకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ నూతన సీఈవోగా నిక్ వాకర్‌ను నియమించుకుంది. జనవరి 5 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటన విడుదల చేసింది. దీనికి ముందు వరకు నిక్ వాకర్ యూరప్‌కు చెందిన ప్రముఖ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీ అయిన లండిన్ ఎనర్జీకి సీఈవో, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. -
‘లక్ష రూపాయల ల్యాప్‌టాప్..రూ.40వేలకే ఇవ్వొచ్చు’!
వేదాంత రిసోర్సెస్..దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్ రఫి గొంతుతో..వో కోన్సీ ముష్కిల్ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థ చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది వేదాంతా, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్లతో గుజరాత్లో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ప్లాంటులో ఫాక్సాకాన్ వాటా 38శాతం ఉండగా.. మిగిలిన సింహభాగం వేదాంతాదే. ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఛైర్మన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ..చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ ప్రారంభమైతే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గుతాయి. ‘ప్రస్తుతం మనం ల్యాప్ ట్యాప్ తీసుకుంటే దాని ధర రూ.లక్ష ఉంటే..డిస్ప్లే, చిప్ సెట్లను దేశీయంగా తయారు చేస్తే అదే ల్యాప్ ట్యాప్ ధర రూ.40వేలు అంతకంటే తక్కువే ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. -
100 బిలియన్ డాలర్ల సంస్థగా వేదాంత
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ వచ్చే ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 18 బిలియన్ డాలర్ల (రూ. 1.3 లక్షల కోట్లు) సంస్థగా ఉంది. వృద్ధి ప్రణాళికలను దూకుడుగా అమలు చేయడంపైనా, వివిధ వ్యాపార విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపైనా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు బుధవారం వేదాంత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ విభాగాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొంది. భారత్ 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్నందున ఇది సమస్యగా మారింది. దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి‘ అని అగర్వాల్ వివరించారు. దేశీయంగా సమగ్ర సెమీకండక్టర్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వేదాంత ఇప్పటికే దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. దేశ వృద్ధిలో సహజ వనరుల కీలక పాత్ర.. భారతదేశ ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోందని అనిల్ అగర్వాల్ అన్నారు. ఒక చిన్న విధానపరమైన మార్పు ఈ రంగం ‘నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్ స్వావలంబన దిశలో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ వృద్ధి, ఉపాధి కల్పనలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న విధాన సంస్కరణలు కూడా సహజ వనరుల విభాగ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి’’ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా చైనాను మాత్రమే కాకుండా భారత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ► ‘చైనాతోపాటు మరొక దేశం వ్యూహాన్ని’ అవలంబిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ‘భారత్ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడుతుంది. తమ పెట్టుబడులకు కేవలం చైనానే కాకుండా, ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలవైపూ చూడటం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ► మహమ్మారి కోవిడ్–19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తోంది. ► భారత్ దాదాపు ఏడు శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, బ్రిటన్లు దాదాపు రెండంకెల స్థాయిల్లో ద్రవ్యోల్బణం సవాలును ఎదుర్కొంటుండగా, ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక మోస్తరు ద్రవ్యోల్బణమే కొనసాగుతోంది. -
ఖనిజాల అన్వేషణ: ఏఐ, ఆటోమేషన్‌ను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: దేశీయంగా వివిధ లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మన దగ్గర లోహాలు, ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై అంతగా ఉండదని, దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు.. గణనీయంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ చెప్పారు. దిగుమతి చేసుకునే ధరలో పావు వంతుకే భారత్‌లో ముడిచమురును ఉత్పత్తి చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు పెరగడం, రూపాయి మారకం విలువ పతనమవడం వంటి కారణాలతో క్రూడాయిల్ తదితర దిగుమతుల భారం పెరిగిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధనాలు, ఖనిజాల అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. -
బొమ్మల పరిశ్రమ సామర్థ్యం పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయ బొమ్మల పరిశ్రమ (టాయ్) విశాలంగా ఆలోచించాలని, సామర్థ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సూచించింది. తద్వారా తయారీని పెంచి, ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని కోరింది. దిగుమతులపై సుంకాలు పెంపు, నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం దిగుమతులు తగ్గేందుకు సాయపడతాయని, తయారీని ప్రోత్సహిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. పెద్దగా ఆలోచించడమే ఇప్పుడు పరిశ్రమ వంతుగా గుర్తు చేశారు. యూనికార్న్(బిలియన్ డాలర్ల విలువ)గాఅవతరించాలంటే మరో స్థాయికి చేరుకోవాలన్నారు. యాజమాన్యంలో వృత్తి నైపుణ్యాలు తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో టాయ్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వల్ల మూడేళ్ల విరామం తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 96 స్టాళ్లు కొలువుదీరాయి. కేంద్ర ప్రభుత్వం స్థానికంగానే బొమ్మల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బొమ్మలపై 20 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 60 శాతానికి పెంచింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుమతి అయ్యే బొమ్మల నాణ్యత ఉండాలని నిర్ధేశించింది. భారత్‌కు ఎగుమతి చేయాలనుకునే ఏ దేశ కంపెనీ ఉత్పత్తులకు అయినా ఇవే నిబంధనలు అమలవుతాయని నాటి ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. గణనీయంగా తగ్గిన దిగుమతులు దేశంలోకి బొమ్మల దిగుమతులు 2018-19లో 304 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2021-22 నాటికి 36 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో మన దేశం నుంచి బొమ్మల ఎగుమతులు 109 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్యలు పరిశ్రమకు సాయపడుతున్నట్టు ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. తయారీని ప్రోత్సహించడంతోపాటు, దిగుమతులు తగ్గేందుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కావాలి. అప్పుడే పరిశ్రమ తదుపరి స్థాయికి వెళుతుంది. ఉపాధి కల్పనతోపాటు, ఎగుమతులు పెరుగుతాయి’’అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 120 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారత్ వాటా చాలా తక్కువేనన్నారు. నేషనల్ టాయ్ పాలసీ, పీఎల్ఐ పథకాల వంటికి ఈ రంగం వృద్ధికి సాయపడతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంతొ దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని, గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని మంగళవారం నాటి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 13వ టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ అగర్వాల్ "రీబ్రాండింగ్ ది ఇండియన్ టాయ్ స్టోరీ" పేరుతో ప్రధాని ఇచ్చిన క్లారియన్ కాల్‌ను గుర్తు చేశారు. -
మహ్మద్ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా..
వేదాంత రిసోర్సెస్ దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. అయితే ఈ కంపెనీ స్థాపించాలనే ఆలోచనకు బీజం పడిన వైనం తెలిస్తే ఆశ్చర్యపోతారు. కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్ రఫి పాడిన ఓ పాట కారణం. ఆ పాట నింపిని స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది. బీహార్‌లోని పాట్నా శివారులో వేదాంత రిసోర్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కుటుంబం నివసిస్తుండేది. తండ్రి మెటల్ వ్యాపారంలో ఉండే వాడు. దీంతో వారణాసి సమీపంలో ఉన్న హిందాల్కో ఫ్యాక్టరీకి వెళ్లాల్సి వచ్చేది. అలా తండ్రితో కలిసి పాట్నా నుంచి వారణాసికి చిన్నతనంలో అనిల్ అగర్వా్ల్ వెళ్లేవాడు. ఈ ప్రయాణం అంత సుఖంగా ఏమీ ఉండేది కాదు. కిక్కిరిసిన ఆ ట్యాక్సీలో ఒకరి మీద ఒకరు పడిపోయేట్టుగా కూర్చుని వెళ్లాల్సి వచ్చేది. ఆ ప్రయాణం తలచుకుంటేనే అనిల్ అగర్వాల్‌కి ముచ్చెమటలు పట్టేవి. అయితే ఆ భయంకర ప్రయాణంలో నచ్చే ఒకే ఒక్క విషయం ట్యాక్సీలో డ్రైవర్ పెట్టే మహ్మద్ రఫీ పాటలు. వో కోన్సీ ముష్కిల్ హై ఓసారి పాట్నా నుంచి బనారస్‌కు చేస్తున్న ప్రయాణంలో పాటలు పెట్టాడు డ్రైవర్. కిక్కిరిసిన జనాలు ముక్కుపుటలు అదరగొట్టే చెమట కంపు మధ్యన చెవులకు ఇంపుగా తోచేలా మహ్మద్ రఫీ మాధుర్యమైన గొంతుతో.. వో కోన్సీ ముష్కిల్ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట వినిపించడం మొదలైంది. అప్పుడు అనిల్ అగర్వాల్ వయస్సు పద్నాలుగేళ్లు. ప్రయాణం పూర్తైనా ఆ పాట మాత్రం మదిలో నుంచి బయటకు వెళ్లలేదు. ట్యాక్సీ దిగి హిందాల్కో ఫ్యాక్టరీలోకి వెళ్లగానే అక్కడ తళతళ మెరుస్తున్న మిషన్లు, ఎత్తైన పొగ గొట్టాలు, క్రమ పద్దతిలో పని చేస్తున్న కార్మికులు.. అక్కడి వాతావరణం అంతా ఉత్సాహభరింతగా తోచింది అనిల్ అగర్వాల్‌కి. తాను చూస్తున్న దృశ్యానికి అప్పటి వరకు విన్న పాటను జోడించాడు. అంతే పెద్దయ్యాక ఇలాంటి ఓ ఫ్యాక్టరీ పెట్టాలనే కలకు అక్కడే బీజం పడింది. ఛలో ముంబై వ్యాపారం రంగంలో రాణించాలనే కసితో డిగ్రీ పట్టా పుచ్చుకుని పొట్ట కోస్తే అక్షరం ముక్క రాకపోయినా హవాయి చెప్పులు చేత సూట్ కేసుతో 1970వ దశకంలో ముంబై వచ్చేశాడు అనిల్ అగర్వాల్. అక్కడే స్క్రాప్ బిజినెస్‌లో బిజీ అయ్యాడు. ఈ సమయంలో మద్రాస్ అల్యూమినయం ఫ్యాక్టరీ తీవ్ర నష్టాలో కూరుకుపోయి మూసివేతకు సిద్ధంగా ఉంది. సరైన పద్దతిలో కనుక ఫ్యాక్టరీని నడిపిస్తే దానికి తిరుగుండదనే నమ్మకం అనిల్ అగర్వాల్‌కి కలిగింది. కానీ నడిపించే వాడు ఎవరు అన్నట్టుగా అక్కడ పరిస్థితి నెలకొంది. సాధ్యం కానిది ఏదీ లేదు చిన్నప్పుడు విన్న మహ్మద్ రఫీ పాట ‘సాధ్యం కానిదంటూ ఏదీ లేదు’ పాట స్ఫూర్తితో నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చాడు అనిల్ అగర్వాల్. ఫ్యాక్టరీతో భవిష్యత్తు ముడిపడి ఉన్న అందరినీ ఒప్పించాడు. వారిలో స్ఫూర్తి నింపాడు అనతి కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 10 వేల టన్నుల నుంచి 20 వేల టన్నులకు పెరిగింది. అదే స్ఫూర్తి మరోసారి ఇదే సమయంలో దేశంలో తొలి ప్రైవేటైజేషన్‌గా భారత్ అల్యుమీనియం కంపెనీ అమ్మకానికి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దాన్ని సొంతం చేసుకోవాలంటే భారీ పెట్టుబడులు అవసరం. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీని కొని సాధించేది ఏమీ ఉండదనే కారణంతో భారత్ అల్యుమీనియం కంపెనీ కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో మరోసారి ధైర్యం చేసి ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు అనిల్ అగర్వాల్ ముందుకు వచ్చాడు. భారీ పెట్టుబడుల కోసం బ్యాంకర్లను కలిశాడు. తన వద్ద ఉన్న ప్రణాళిక వివరించాడు. నమ్మకం కుదిరిన బ్యాంకర్లు అండగా నిలిచారు. అంతే భారత్ అల్యుమినియం కంపెనీ కూడా అనిల్ అగర్వాల్ ఖాతాలో చేరిపోయింది. అప్పులు.. ఆఫర్.. అల్యుమీనియం తయారీలో దూసుకుపోతున్న అనిల్ అగర్వాల్‌కి ఈ సారి ఊహించని వైపు నుంచి ఆహ్వానం అందింది. ఒడిషా ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ నుంచి పిలుపు వచ్చింది. ఒడిషాలో మారుమూల వెనకబడిన ప్రాంతమైన కలహాందీ ఏరియాలో అల్యుమీనియం పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఆఫర్ ఇచ్చారు. అప్పటికే అప్పులు తప్ప చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉన్నదల్లా గొప్పగా ఏదైనా సాధించాలనే కల, దాన్ని నెరవేర్చుకునేందుకు అవసరమైన పట్టుదల అంతే. My dear dreamers, As a kid, did you have a dream that wouldn’t let you sleep? ……tap the photos to read the full story. pic.twitter.com/VNGaA0zjXE — Anil Agarwal (@AnilAgarwal_Ved) June 22, 2022 పట్టుదలే పెట్టుబడిగా ప్రభుత్వం పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడంతో ఓడిషాలో పరిశ్రమ స్థాపించాలనే ఆశయం అనిల్ అగర్వాల్‌కి నిద్రని దూరం చేసింది. సాధ్యం కానిది ఏదీ ఉండదనే రఫీ పాట మరోసారి స్ఫూర్తి నింపింది. కునుకు పట్టనివ్వని కలలు తోడుగా పట్టుదలే పెట్టుబడిగా విడతల వారీగా ఇటు ప్రభుత్వంతో, అటు ఇన్వెస్టర్లతో వరుసగా చర్చలు జరిపాడు. ఫలితంగా ఈసారి వేదాంత కంపెనీకి ఒడిషాలో తొలి అడుగు పడింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఇండియాతో పాటు విదేశాల్లోనూ వేదాంత విస్తరించింది. వేలాది మంది ఆ కంపెనీలో పని చేస్తుండగా అనిల్ అగర్వాల్ ఆస్తుల విలువ ఏకంగా 30వేల కోట్ల రూపాయలను అధిగమించింది. చదవండి: వేదాంత డైరీస్ 6: ఛాయ్, పల్లిపట్టితోనే కడుపు నింపుకున్నాడు.. నేడు 30 వేల కోట్లకు అధిపతి -
30 వేల కోట్ల రూపాయల అధిపతికి నచ్చిన ‘గల్లీ’ సినిమా
వేదాంత గ్రూప్ ఫౌండర్ కమ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు. యువతలో స్ఫూర్తి నింపేందుకు తన జీవిత అనుభవాలను పంచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంగ్లీష్ ఒక్క ముక్క రాకుండా ముంబైలో తాను అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు ముప్పై వేల కోట్ల రూపాయల అధిపతిగా మారే వరకు జరిగిన ప్రస్థానాన్ని వివరిస్తున్నారు. తాను కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడంలో ఎదురైన సవాళ్లను, వాటిని తాను అధిగమించిన తీరును పూసగుచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో తన మససుకు నచ్చిన ఓ సినిమా గురించి ఆయన చెప్పారు. జోయా అక్తర్ దర్శకత్వంలో 2019లో రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా వచ్చిన గల్లీబాయ్ సినిమా క్లిప్‌ను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో గల్లీబాయ్ ర్యాపర్‌గా ఎదిగే క్రమాన్ని చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు. ధైర్యం ఉన్న వాళ్లే కలలు కంటారని వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని ఆఖరికి సొంత తండ్రి కూడా నమ్మని సమయంలోనూ మురాద్ (రణ్‌వీర్‌సింగ్) ధైర్యం కోల్పోకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడని వివరించారు. గల్లీబాయ్ నిజంగా స్ఫూర్తిని నింపే సినిమా అంటూ అనిల్ అగర్వాల్ ప్రశంసించారు. This was truly a moving scene. In a world that constantly tries to tie you down, dreaming big is an act of courage. Gully Boy was a reminder to anyone who has nursed a dream, any dream. Don't lose hope kyunki apna time aayega! https://t.co/1ZTaKeW17T — Anil Agarwal (@AnilAgarwal_Ved) June 14, 2022 చదవండి: ఆనంద్ మహీంద్రాకు ఆర్బీఐ బంపరాఫర్! -
వేదాంత డైరీస్ 6: ఛాయ్, పల్లిపట్టితోనే కడుపు నింపుకున్నాడు.. నేడు 30 వేల కోట్లకు అధిపతి
చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంగ్లీష్ ఒక్క ముక్క రాకుండా ముంబైకి చేరుకోవడం దగ్గరి నుంచి టెలిఫోన్ కేబుళ్ల తయారీకి అవసరమైన మిషనరీ సంపాదించిన వరకు విషయలు ఇప్పటి వరకు మనతో ఆయన పంచుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాలను ట్విటర్ ద్వారా మరోసారి మనతో పంచుకున్నారు. ఉదయం అంతా కేబుళ్ల అమ్మకాలకు సంబంధించి లావాదేవీలు రాత్రయితే చాలు కేబుళ్లకు అవసరమైన రాగి తీగ తయారీ యూనిట్ కార్మికులతో మంతనాలు. ఇలా కాలంతో పరిగెడుతూ 24 గంటలు పని చేశారు వేదాంత గ్రూప్ సీఈవో అనిల్ అగర్వాల్. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరి జీవితానికి పనికి వచ్చే ఎన్నో గొప్ప విషయాలను ఆయన స్వయంగా అనుభవించారు. కాలంతో పరుగులు దేశవ్యాప్తంగా టెలిఫోన్ కేబుళ్లను సరఫరా చేసేందుకు మెరైన్లైన్లో చిన్న ఆఫీస్‌ను అప్పటికే తెరిచారు అనిల్ అగర్వాల్. అమెరికా నుంచి తెప్పించిన మిషనరీతో దూరంగా లోనావాలో మొదటి కాపర్రాడ్స్ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మెరైనలైన్లో పని చేసిన అనంతరం లోకల్ ట్రైన్ పట్టుకుని లోనావాలాకు బయల్దేరి వెళ్లేవారు అనిల్ అగర్వాల్. నిద్రకు సమయం లేదు లోకల్ ట్రైన్లో లోనావాలా చేరుకున్న తర్వాత రాత్రంతా కార్మికులతో మాట్లాడుతూ ఉండేవారు. కాపర్ తయారీకి సంబంధించిన విషయలను స్వయంగా పరిశీలిస్తూ కార్మికులను ఉత్సాహపరుస్తూ రాత్రంతా అక్కడే తిగిరే వారు. తెల్లవారడం ఆలస్యం మళ్లీ లోకల్ ట్రైన్లో లోనావాల నుంచి మెరైన్లైన్కి చేరుకునేవాడు. ఈ క్రమంలో నిద్రపోవడానికి, తినడానికి సమయం దొరక్క రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై దొరికే కడక్ ఛాయ్, పల్లీ పట్టిలీతోనే కడుపు నింపుకునేవాడినంటున్నారు అనిల్ అగర్వాల్. పని మీద అమితమైన ఉత్సాహం ఉండటం వల్ల నిద్ర లేకపోయినా తిండి తినకపోయినా ఎటువంటి అలసట కనిపించేది కాదంటున్నారు. ప్రతీరోజు విమానంలోనే కాపర్ వైర్ పరిశ్రమ నిలదొక్కుకోవడంతో ఆ తర్వాత కాపర్ స్మెల్టర్ పరిశ్రమ ఏర్పాటు వైపు అనిల్ అగర్వాల్ కన్ను పడింది. అంతే కాపర్ స్మెల్టర్ పరిశ్రమ స్థాపించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిధుల సమీకరణ కోసం ఏడాదిలో మూడు వందల రోజులు విమాన ప్రయాణాలే చేయాల్సి వచ్చింది అనిల్ అగర్వాల్. అంత బిజీ షెడ్యూల్లో కనీసం విమానంలో కూడా నిద్ర వచ్చేది కాదట అనిల్‌కి. తన దగ్గరున్న వనరులు, తాను కంటున్న కలలకు పొంతన లేకపోయినా ఏదో ఒక రోజు తాను అనుకున్నది సాధిస్తాననే ఊహ తనకు కుదురుగా నిద్ర పట్టనిచ్చేది కాదంటున్నాడీ బిజినెస్ మ్యాగ్నెట్. అక్కడే సంతృప్తి దొరికింది అలుపెరుగని శ్రమ, మొక్కవోని అంకుఠ దీక్ష ఫలించి బ్యాంకు రుణాలు, పబ్లిక్ ఆఫరింగ్‌ల ద్వారా కాపర్ మెల్టింగ్ పరిశ్రమ స్థాపనకు అవసరమైన రూ. 600 కోట్ల నిధులను సమీకరించగలిగాడు అనిల్ అగర్వాల్. అయితే చేతిలో చిల్లీగవ్వ లేని స్థాయి నుంచి రూ.600 కోట్ల నిధులు సమీకరించడం కంటే కాపర్ పరిశ్రమ స్థాపన ద్వారా ఏకంగా 24,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలగడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతున్నాడు అనిల్ అగర్వాల్. అంతేకాదు ఫ్యాక్టరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 వేల టన్నుల నుంచి నాలుగు లక్షల టన్నులకు చేరుకుందంటూ గర్వంగా చెప్పారు అనిల్. రూపురేఖలు మారిపోతాయ్ గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు చాలా బాగా ఉన్నాయంటున్నాడు అనిల్ అగర్వాల్, స్టార్టప్ కల్చర్ విస్తరించింది. కొత్త కొత్త ఎంట్రప్యూనర్లు పుట్టుకొస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారాయన. మీరంతా మీ లక్ష్యాల దిశగా పట్టుదలతో శ్రమిస్తే పెట్టుబడులు అవే వస్తాయంటూ యంగ్ ఎంట్రప్యూనర్లకు ఆయన సూచించారు. ఆ పెట్టుబడులు సద్వినియోగం అయితే దేశ రూపురేఖలే మారిపోతాయంటూ భవిష్యత్ బంగారు భారత్‌ని దర్శిస్తున్నారయన. అందుకే మీరు ఎంత ఎత్తుకు వెళ్లాలని అనుకుంటే అంత ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించండి అంటూ యంగ్ ఎంట్రప్యూనర్లకు సూచిస్తున్నారు. My dear dreamers, always remember that with the two wings of Karma and Dharma, you can fly towards your dreams as high as you want. This is what helped me in my journey...(1/9) pic.twitter.com/pAyQZWO93q — Anil Agarwal (@AnilAgarwal_Ved) May 31, 2022 చదవండి: వేదాంత డైరీస్ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం చదవండి: వేదాంత డైరీస్ 5: ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ -
త్వరలో హైదరాబాద్ వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం..
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ త్వరలో హైదరాబాద్‌కు వస్తానని, తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై అప్పుడు మాట్లాడుకుందామంటూ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ దావోస్‌కి వెళ్లే ముందు ఇంగ్లండ్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేదాంత గ్రూపు చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. వీటిపై చర్చించుకునేందుకు హైదరాబాద్ రావాలంటూ అనిల్ అగర్వాల్‌ను ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానంపై వేదాంత గ్రూపు చైర్మన్ స్పందిస్తూ.. ఇండియా గురించి.. ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాల గురించి నీతో చర్చించడం ఎంతో బాగుందంటూ మంత్రి కేటీఆర్‌ను కొనిడాయారు. అంతేకాకుండా త్వరలోనే హైదరాబాద్ వస్తానంటూ ట్విటర్లో హామీ ఇచ్చారు. Great to discuss India and it’s unlimited potential with you @KTRTRS. Hope to visit Hyderabad soon 🙏🏽 https://t.co/2g2hZdy7Ua — Anil Agarwal (@AnilAgarwal_Ved) May 23, 2022 చదవండి: దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి -
వాళ్లు నీ వెంట ఉండేలా చూసుకో.. విజయం అదే వస్తుంది..
చేతిలో చిల్లిగవ్వ లేదు ఒక్కముక్క ఇంగ్లీష్ రాక పోయినా భవిష్యత్తుపై నమ్మకంతో బీహార్ నుంచి ముంబైకి చేరుకున్నాడు అనిల్‌అగర్వాల్. ఆ తర్వాత స్వశక్తితో ముప్పై వేల కోట్లకు పైగా విలువ కలిగిన ‘వేదాంత‘ పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. తన ఎదుగుదలకు తోడ్పడిన విషయాలను ఇటీవల ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో పైకి రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలి, వారిని ఎలా సంతృప్తి పరచాలనే అంశాలను వెల్లడించారు. జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్, మిషనరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కనీసం బస చేయడానికి తగిన చోటు కూడా లేదు. అయినా అక్కడే ఉంటూ పట్టువదలకుండా ప్రయత్నించాను. ఆఖరికి కోటి ఆశలతో ఇండియాకు చేరుకున్నాను. స్వదేశానికి వచ్చి రాగానే చేయాల్సింది ఎంతో ఉందని గుర్తించాను. నీకంటూ ఓ జట్టు టెలిఫోన్ కేబుల్ తయారీలో ఎక్స్పర్ట్ అయిన అమెరికన్ జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ తోడుగా ఉంది. వీళ్లకు తోడుగా ఫిన్‌ల్యాండ్‌కి చెందని నోకియా కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. నా లక్ష్యాన్ని చేరుకునేందుకు మంచి టీమ్‌ని ఎంచుకోవడమే నా పని. ఈ ప్రయత్నంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకున్నాను. ఐఐటీల చుట్టూ తిరిగాను. చివరకు నా టీమ్‌లోకి ఆనంద్ అగర్వాల్ (ఐఐటీ), ముకేశ్ అరోరా (ఎంట్రప్యూనర్), అహ్మద్ (ప్రభుత్వ ఉద్యోగి), ఆలి అన్సారీ (సివిల్ ఇంజనీర్)లు నాతో జత కట్టారు. కేవలం ఐదేళ్లలోనే ఇండియాలోనే టెలిఫోన్ వైర్లు తయారు చేసే అతి పెద్ద కంపెనీగా నిలిచాం. టీం వర్క్ ముఖ్యం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కటకటలాడే స్థితి నుంచి ఐదేళ్లలోనే దేశంలోనే అతి పెద్ద కేబుళ్ల తయారీ సంస్థ ఎదగడం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్లలో ఒకటి ఉద్యోగుల నైపుణ్యాలను వెలికి తీయడం. నువ్వు సీఈవో అయినా సరే గ్రౌండ్ లెవల్లో పని చేసే ఉద్యోగిని కూడా నీ జట్టులో భాగం చేసుకో. వాళ్లలోని శక్తిని వెలికి తీయి. జట్టు కోసం నువ్వు.. నీ కోసం జట్టు అన్నట్టుగా పరిస్థితి మారిపోవాలి. హిందూస్థాన్ కేబుల్స్‌లో పని మానేసి మా కంపెనీలో చేరిన అహ్మద్ రిటైర్ అయ్యే వరకు నాతోనే ఉన్నాడు. అలా టీం వర్క్ చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. ఓ మ్యాజిక్ జరిగిపోతుంది. రిస్క్ తీసుకోవాల్సిందే గొప్ప విజయం సాధించమని అక్కడే ఆగిపోతే మరిన్ని విషయాలను తెలుసుకోలేం. అందుకే ఎప్పుడూ రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. కేబుళ్లు తయారు చేసేందుకు రా మెటీరియల్ ఎక్కడి నుంచో ఎందుకు దిగుమతి చేసుకోవాలి. వాటిని మేము తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టింది. అలా చేయడం వల్ల కేబుళ్ల తయారీ ఖర్చు తగ్గడంతో పాటు స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుంది. వాట్ నెక్ట్స్ రా మెటీరియల్ ఆలోచనకు మరింత పదును పెట్టి కాపర్, అల్యుమినియంలను స్వంతంగా తయారు చేయాలని నిర్ణయించాం. అప్పటి వరకు కేబుళ్ల తయారీతో ప్రభుత్వ వర్గాలు, ముంబై వరకే పరిచయమైన నా పేరు ఈ మెటల్ మేకింగ్‌తో మీ అందరికీ తెలిసినవాడిని అయ్యాను. My dear dreamers, I believe that the biggest roadblock in life is to never take a risk at all. When I landed in America, I had no place to stay but that didn’t matter. I came back to India with dreams bigger than my reality...(1/9) pic.twitter.com/ewthGO9MAo — Anil Agarwal (@AnilAgarwal_Ved) May 2, 2022 చదవండి: వేదాంత డైరీస్ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం చదవండి: వేదాంత డైరీస్ 1: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి చదవండి: వేదాంత డైరీస్ 2 : ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది -
చిన్నారి పాలకు జేబులో డబ్బుల్లేవ్.. కలలేమో కోట్ల రూపాయల్లో.. చివరకు..
వ్యాపారంలో విజయం సాధించాలంటే విజన్ ఉండటం ఉండటం దానికి తగ్గ పెట్టుబడి సాధించడం. ఆ రెండు వచ్చిన తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కోవడం, అవకాశాలను ఒడిసిపట్టుకోవడం వంటి అంశాలను ఇప్పటి వరకు వివరించారు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. తాజాగా వ్యాపారానికి సంబంధించిన మరో మెళకువను ఆయన వివరించారు. అమెరికాలో ప్రయత్నాలు టెలిఫోన్ కేబుళ్ల తయారీకి ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నా షంషేర్ కేబుల్ తయారీ పరిశ్రమకు అవసరమైన మిషనరీ కోసం వెంటనే అమెరికాకు వెళ్లాను. అక్కడే ఉంటూ కేబుల్ తయారీ పరిశ్రమతో సంబంధం ఉన్నవారితో ప్రతీ రోజు 40 నుంచి 50 మందితో ఫోన్లో మాట్లాడుతుండే వాడిని. ఈ క్రమంలో ఎస్సెక్స్‌లో ఉన్న జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ గురించి తెలిసింది. ఆ కంపెనీకి అమెరికాలో అనేక ప్లాంట్లు ఉన్నాయి. ఇటీవల ఆ కంపెనీకి చెందిన ఎస్సెక్స్ ప్లాంటును మూసివేసినట్టు తెలిసింది. దీంతో ఈ కంపెనీ ప్రతినిధులను కలిసేందుకు విశ్వప్రయత్నం చేశాను. కానీ అపాయింట్మెంట్ దొరక్క పోవడంతో తిరిగి ఇండియా వచ్చేశాను. అవకాశం దొరికింది ఇక్కడ ఇండియాలో ఎక్విప్మెంట్ కొరత కారణంగా ఒక టెలిఫోన్ కనెక్షన్ పొందడానికి 8 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన రోజులవీ. ఒక్కసారి కేబుళ్లు తయారీ మొదలు పెడితే క్షణాల మీద అమ్ముడైపోతాయని తెలుసు. కానీ అందుకు తగ్గ మెషినరీ సమకూర్చుకోవడం కష్టమైపోతుంది. ఇండియాలో ఆ మెషినరీ లేదు. అమెరికా వాళ్లు మనకు దొరకరు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించడంతో రెండేళ్ల తర్వాత జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ సీఈవోల మాట్లాడే అవకాశం దొరికింది. ఎలాగైన డీల్ కుదరాలి నాకు బాగా పరిచయం ఉన్న ఛార్టెడ్ అకౌంటెంట్ నారాయణ స్వామిని వెంట తీసుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కాను. నారాయణ స్వామి కంపెనీ లావాదేవీలు నిర్వహించడంలో దిట్ట. మేమిద్దరం కలిసి ఆ కంపెనీ ప్రతినిధులను ఒప్పించగలమని నమ్మాం. వాళ్ల నుంచి పిలుపు కోసం అమెరికాలో ఎదురు చూస్తూ గడిపాం. ఈ సమయంలో డబ్బులు ఆదా చేసేందుకు ఇద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకునే వాళ్లం. రోడ్డు పక్కన శాండ్విచెస్ లాంటి స్ట్రీట్ఫుడ్తో కడుపు నింపుకునే వాళ్లం. కరిగిపోయిన కలలు మా నిరీక్షణ ఫలించి ఒక రోజున జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ సీఈవో ఫ్రెడ్ జింజర్, సీఎఫ్‌వో క్రిస్రాడ్లను కలుసుకున్నాం. మేము చెప్పినదంతా విన్న తర్వాత .. మూతపడిన ప్లాంట్‌కి సంబంధించి ఎక్విప్మెంట్ అమ్మే ఉద్దేశం తమకు లేదంటూ తాపీగా చెప్పారు వాళ్లిద్దరు. దీంతో అప్పటి కళ్ల ముందు కదలాడిన అందమైక కల కరిగిపోయింది. లెక్కలొక్కటే సరిపోవు అప్పటికే వ్యాపారంలో పదేళ్లపాటు తింటున్న డక్కామెక్కీలు నేర్పిన విలువైన పాఠం ఆ సమయంలో నాకు గుర్తుకు వచ్చింది. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధించాలంటే లెక్కలు ఒక్కటే సరిపోవని, ఎదుటివారి మనసు గెలుచుకోవాలని ఆ తర్వాతే డీల్ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అందుకే వెంటనే ఇండియాలో ఉన్న నా కుటుంబాన్ని కూడా అమెరికాకు రప్పించుకున్నాను. పట్టువదల్లేదు అమెరికాలో ఉండగానే నా కూతురు ప్రియ పుట్టింది. మిల్క్, డైపర్స్, వ్యాక్సినేషన్స్ ఇలా బేబీ మెయింటనెన్స్‌కి సరిపడా డబ్బులు కూడా లేని రోజులవి. నా భార్య, నా తల్లిదండ్రులు అందించిన సహాకారంతోనే ఈ బాధలన్నీ తీరిపోయాయి. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే. అందుకే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా అమెరికాలోనే ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా జెల్లీఫిల్ల్డ్ కంపెనీ ప్రతినిధులను కలుస్తుండే వాడిని. ఇలా కలిసినప్పుడు వ్యాపార విషయాలు కాకుండా.. ఫిలాసఫీ, పర్సనల్ విషయాలు, ఇండియాలో పారిశ్రామిక రంగం, వ్యాపారంలో నేను సాధించాలనుకుంటున్న లక్ష్యాలు, పదేళ్లుగా నేను పడుతున్న ఇబ్బందులు, పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ వారిలో ఒకడిలా మారిపోయాను. వ్యాపార విషయాలు పక్కన పెట్టి సాధారణ విషయాలు మాట్లాడుతూ వారికి దగ్గరయ్యేందుకు, వారి మనసు గెలిచేందుకు ప్రయత్నించాను. మేమున్నాం ఇలా కొంత కాలం మా మధ్య స్నేహం ముదిరి పాకన పడిన తర్వాత వాళ్లకు నా వ్యాపార లక్ష్యాలు పూర్తిగా అర్థమయ్యాయి. దీంతో మెషినరీ అమ్మకూడదనే వాళ్ల నిర్ణయం మార్చుకోవడమే కాదు. ఆ మెషినరీ నాకు తక్కువ ధరకే అందివ్వడంతో పాటు ఇండియాలో ఎస్టాబ్లిష్ జరిగేంత వరకు సహాకారం అందిస్తామంటూ ముందుకు వచ్చారు. మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధించాలనే కోరిక గట్టిగా ఉన్నప్పుడు.. అంకిత భావంతో మనసుపెట్టి పని చేస్తే ఎంత కఠిన లక్ష్యమైనా కరిగిపోయి చేతికి అందివస్తుందని ఈ అనుభవం నాకు తెలిపింది. లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రతికూల ఫలితాలు ఎదురైనా ఆశ కోల్పోకుండా మనసు పెట్టి పని చేస్తే కచ్చితంగా ఓ రోజు గమ్యాన్ని చేరుకుంటాం. అలా కేబుల్ పరిశ్రమ మెషినరీ కోసం 1986లో మొదలు పెట్టిన ప్రయత్నాలు 1989లో దారికొచ్చాయి. (ఐపోలేదింకా) I found out about the largest manufacturer of jelly-filled cables based in Essex, America. The company had many plants, one of which had recently shut down. At that time, getting a telephone line in India took at least 8 years of waiting. I saw a gap in the market and… (1/8) pic.twitter.com/HfbXUE6rkJ — Anil Agarwal (@AnilAgarwal_Ved) April 18, 2022 చదవండి: వేదాంత డైరీస్: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి చదవండి: వేదాంత డైరీస్ 2: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది చదవండి: వేదాంత డైరీస్ : న్యూయార్క్‌లో జేబుదొంగలు ! -
వేదాంత డైరీస్ : న్యూయార్క్‌లో జేబుదొంగలు !
జీరో నుంచి హీరో వరకు సాగిన తన జీవిత ప్రయాణంలో ముఖ్య ఘట్టాలన్ని క్రమం తప్పకుండా వివరిస్తున్నారు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముక్క ఇంగ్లీష్ రాకుండా ముంబై రావడం.. అక్కడ అప్పు చేసి షంషేర్ కేబుల్ కంపెనీ కొనడం.. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తాను పడిన పాట్లను ఆయన వివరించారు. తాజాగా మరో కీలక ఘట్టానికి సంబంధించిన అంశాలు వెల్లడించారు. 1986లో రూల్స్ మార్చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థలు షంషేర్ నుంచి కేబుళ్లు కొనడానికి భారీ ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టాయి. వస్తున్న ఆర్డర్లకు తయారీ సామర్థ్యానికి పొంతన లేకపోవడంతో షంషేర్ విస్తరణ అవసరమైంది అనిల్ అగర్వాల్‌కి. దీంతో సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం నాలుగు కోట్ల రూపాయల అప్పు కూడా చేశాడు. అమెరికా టూర్ ఆరోజుల్లో అమెరికాని కొత్త అవకాశాలకు స్వర్గధామంగా చెప్పుకునే వారు. దీంతో తన కలలు సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని అనిల్ అగర్వాల్ డిసైడ్ అయ్యారు. అంతంత మాత్రంగా వచ్చిన టూటీ ఫ్రూటీ ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం, ఇంట్లో వాళ్లు తయారు చేసిన ఘర్ కా ఖానాతో నిండిన సూట్‌కేస్‌లతో పాటు అజయ్ ఆనంద్ అనే బీహారీ ఫ్రెండ్‌ను తోడుగా పెట్టుకుని న్యూయార్క్‌కి పయణమయ్యాడు అనిల్ అగర్వాల్ దొంగల భయం న్యూయార్క్‌లో జేబుదొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసిన వాళ్లు చెప్పడంతో తమ దగ్గరున్న ఐదు వందల డాలర్లను జాగ్రత్తగా జేబు దొంగల కంట పడకుండా కోటు లోపలి వైపు జాకెట్లో పెట్టుకుని విమానం ఎక్కాడు. అమెరికా చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి, సెకండ్ హ్యాండ్ మిషనరీ కోసం ఎవరినీ సంప్రదించాలనే వివరాలేం తెలియకుండానే అడుగులు మందుకు వేశారు. మంచు చూసి న్యూయార్క్ సిటీలో దిగిదిగగానే పాల మీగడ లాంటి తెల్లటి మంచును చూసి ఆశ్చర్యపోయారు అనిల్ అగర్వాల్. అయితే ప్రయాణంలో అనిల్ అగర్వాల్ పక్కసీట్లో కూర్చున్న మిస్టర్ కోటావాలాతో పరిచయమైంది. రాజస్థాన్‌లో దూరపు చుట్టరికం కూడా ఉండటంతో నేరుగా వాళ్లింట్లో దిగిపోయారు అనిల్ అగర్వాల్. They say good things come only if you work towards it. To enjoy the fruit, you must sow enough in the roots. With the policy change in 1986, my fate changed as well. My first business started picking up pace and I managed to raise… (1/7) pic.twitter.com/AQaFCz8MfL — Anil Agarwal (@AnilAgarwal_Ved) April 4, 2022 ఆరా తీశాం తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిగా రోజువారి ఇంటి పనిలో సాయం చేయడం, వాళ్ల పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, టెన్సిస్ ఆటలో కంపెనీ ఇవ్వడం పనులు చేసేవారు అనిల్ అగర్వాల్. ఇక వచ్చి రానీ బ్రోకెన్ ఇంగ్లీష్‌లో సెకండరీ మిషనరీ కోసం రోజుకు కనీసం 40 నుంచి 50 వరకు కాల్స్ చేసి వివరాలు సేకరించేవారు. చదవండి: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి మంచి పండ్లు కావాలంటే మొక్కను లోతుగా నాటినప్పుడే దాని మంచి పండ్లను పొందగలుతాము. మంచి పనులు చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు కూడా వాటంతట అవే వస్తాయి. అలా శ్రమించడం వల్లే విజయాలు తనను వరించాయని చెబుతున్నారు అనిల్ అగర్వాల్ ( అయిపోలేదింకా...) చదవండి: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది -
9 వ్యాపారాల్లో నష్టం.. జీతాలు ఇవ్వలేని దుస్థితి.. ఆ వాస్తవం తట్టుకోలేక..
వేదాంత గ్రూపు చైర్మన్ అనిల్ అగర్వాల్ గత కొద్ది రోజులుగా తన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటనలు, మలుపు తిప్పిన రోజులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. కెరీర్ ఆరంభంలో తాను చేసిన రిస్క్‌లు వాటి వల్ల ఎదురైన అనుభవాలు, అక్కడ నేర్చుకున్న పాఠాలు తనకెలా ఉపయోగపడ్డాయో కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. గత వారం షంషేర్ కేబుల్ కంపెనీని ఎలా సొంతం చేసుకున్నది వివరించిన అనిల్ అగర్వాల్ ఈసారి ఆ కంపెనీ నిర్వాహాణలో తాను పడిన ఇబ్బందులను మనతో పంచుకున్నారు. బ్యాంకులు, బంధువుల నుంచి రూ. 16 లక్షలు అప్పు తెచ్చి 1970వ దశకంలో షంషేర్ కేబుల్ కంపెనీని అనిల్ అగర్వాల్ కొనుగోలు చేశారు. అప్పటి వరకు షంషేర్ కంపెనీలోని స్క్రాప్‌ని అమ్మేవారు అనిల్ అగర్వాల్. అలాంటిది ఒక్కసారిగా అదే కంపెనీకి యజమాని అయ్యారు. అయితే అక్కడి నుంచి వ్యాపార నిర్వాహణ పూలబాట కాలేదు.. ఎక్కువగా మాట్లాడితే ముళ్లబాటనే అయ్యింది. జీతం ఇవ్వలేక అందినకాడికల్లా అప్పులు చేసి షంషేర్ కంపెనీని కొనుగోలు చేశారు అనిల్ అగర్వాల్. కానీ ఆ సమయంలో కేబుళ్లకు మార్కెట్లో ఆశించిన స్థాయి డిమాండ్ లేదు. దీంతో నెల తిరిగే సరికి ముడి సరుకు కొనేందుకు డబ్బులు లేకపోగా కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. వ్యాపారం లేకపోయినా ప్రతీ నెల జీతాలు చెల్లించడం తలకు మించిన పనయ్యేది అనిల్ అగర్వాల్‌కి. పొద్దస్తమానం రుణాల కోసం బ్యాంకుల దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చేది. 9 రకాల వ్యాపారాలు కేవలం ఉద్యోగులకు జీతాలు సర్థుబాటు చేయడం కోసం కేబుళ్ల వ్యాపారంలో కొత్త పద్దతులు తెర తీశాడు అనిల్ అగర్వాల్. మాగ్నెటిక్ కేబుల్స్, అల్యూమినియం రాడ్స్, వివిధ రకాలైన వైర్లు ఇలా తొమ్మిది రకాలైన బిజినెస్‌లలో వేలు పెట్టాడు. ఎక్కడా లాభం రాకపోగా అప్పులు మరింతగా పెరిగాయి. దాదాపు మూడేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. యోగా, జిమ్‌లు పెరిగిన అప్పులు ఆర్థిక భారం కారణంగా విపరీతమైన ఒత్తిడి ఎప్పుడూ నాపై ఉండేది. కానీ స్ట్రెస్‌గా ఫీలవుతున్నానంటే ఒప్పుకోబుద్ది అయ్యేది కాదు అనిల్ అగర్వాల్‌కి. మానసికంగా తాను ఎంత ఒత్తిడికి లోనవుతున్నాననే విషయం బయటి ప్రపంచానికి తెలియనిచ్చేవాడు కాదు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ఎక్సర్సైజులు బాగా చేసేవాడినంటూ స్వయంగా ఆయనే వివరించారు. ఏ దేవున్ని వదల్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు వీడకపోవడంతో ఒక్కోసారి భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయేది. కానీ ఇది నాకో పరీక్షా సమయం అంటూ తనకు తానే సర్థిచెప్పుకునే వాడు. ఆ సమయంలో ధైర్యం కోసం ముంబైలో ఉన్న ముంబాదేవి ఆలయం నుంచి మొదలుపెడితే సిద్ధి వినాయకుడు, హాజి అలీ దర్గా, మహిమ్ చర్చ్ వరకు ప్రతీ చోటుకి వెళ్లి ప్రార్థనలు చేసే వాడినంటూ ఆనాటి గడ్డు రోజులను నెమరు వేసుకున్నారు అనిల్ అగర్వాల్. When all hope was lost, I did what every individual does in testing times - I prayed. From Mumbadevi to Siddhivinayak to Haji Ali to Mahim Church. To balance out the stress, I would go watch cinema which gave me an escape from reality… (5/8) — Anil Agarwal (@AnilAgarwal_Ved) March 28, 2022 వాస్తవం తట్టుకోలేక ఒక్కోసారి ఈ ఒత్తిడి తట్టుకోలేక... వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా ఎటైనా వెళ్లాలని అనిపించేదని.. అలాంటి సందర్భాల్లో రంగులకలైన సినిమాలకు వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చారు అనిల్ అగర్వాల్. ఇలా ఓసారి షోలే ప్రీమియం ప్రదర్శనకు వెళ్లగా... లోనికి రానివ్వలేదు. బయటే నిలబడి అమితాబ్ బచ్చన్, జయాబాధురి, ధర్మేంధ్రలు రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే చూసి.. ఈ జన్మకు ఇది చాలులే అనుకుని సరిపెట్టుకున్నాడు. దశ తిరిగింది టెలిఫోన్ రంగంలో ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన కేబుళ్లను కూడా వినియోగించవచ్చంటూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అంటే దాదాపు పదేళ్ల పాటు కేవలం కష్టాల కడలినే ఓపికగా ఈదినట్టు వెల్లడించారు అనిల్ అగర్వాల్. 1986 తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటున్నారు. Those ten years passed by and little did I know that my fate was about to change forever. In 1986, telephone cables were allowed, for the first time, to be manufactured by the private sector. That changed everything…(8/8) To be continued — Anil Agarwal (@AnilAgarwal_Ved) March 28, 2022 ఆ పాఠాల వల్లే ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఓ కలలా ఉంది. నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా చెప్పుకునే వేదాంత గ్రూపు స్థాపించడంలో షంషేర్ కేబుల్ నేర్పిన పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కచ్చితంగా చెప్పగలను. అందుకే గెలుపు కోరుకునే వారు ఓసారి ఓటమిని కూడా రుచి చూడాలి అని చెబుతున్నారు. చదవండి: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి