చేతిలో చిల్లిగవ్వ లేదు ఒక్కముక్క ఇంగ్లీష్ రాక పోయినా భవిష్యత్తుపై నమ్మకంతో బీహార్ నుంచి ముంబైకి చేరుకున్నాడు అనిల్‌అగర్వాల్. ఆ తర్వాత స్వశక్తితో ముప్పై వేల కోట్లకు పైగా విలువ కలిగిన ‘వేదాంత‘ పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. తన ఎదుగుదలకు తోడ్పడిన విషయాలను ఇటీవల ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో పైకి రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలి, వారిని ఎలా సంతృప్తి పరచాలనే అంశాలను వెల్లడించారు.
జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్, మిషనరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కనీసం బస చేయడానికి తగిన చోటు కూడా లేదు. అయినా అక్కడే ఉంటూ పట్టువదలకుండా ప్రయత్నించాను. ఆఖరికి కోటి ఆశలతో ఇండియాకు చేరుకున్నాను. స్వదేశానికి వచ్చి రాగానే చేయాల్సింది ఎంతో ఉందని గుర్తించాను.
నీకంటూ ఓ జట్టు
టెలిఫోన్ కేబుల్ తయారీలో ఎక్స్‌పర్ట్ అయిన అమెరికన్ జెల్లీ ఫిల్ల్‌డ్ కంపెనీ తోడుగా ఉంది. వీళ్లకు తోడుగా ఫిన్‌ల్యాండ్‌కి చెందని నోకియా కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. నా లక్ష్యాన్ని చేరుకునేందుకు మంచి టీమ్‌ని ఎంచుకోవడమే నా పని. ఈ ప్రయత్నంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకున్నాను. ఐఐటీల చుట్టూ తిరిగాను. చివరకు నా టీమ్‌లోకి ఆనంద్ అగర్‌వాల్ (ఐఐటీ), ముకేశ్ అరోరా (ఎంట్రప్యూనర్), అహ్మద్ (ప్రభుత్వ ఉద్యోగి), ఆలి అన్సారీ (సివిల్ ఇంజనీర్)లు నాతో జత కట్టారు. కేవలం ఐదేళ్లలోనే ఇండియాలోనే టెలిఫోన్ వైర్లు తయారు చేసే అతి పెద్ద కంపెనీగా నిలిచాం.
టీం వర్క్ ముఖ్యం
ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కటకటలాడే స్థితి నుంచి ఐదేళ్లలోనే దేశంలోనే అతి పెద్ద కేబుళ్ల తయారీ సంస్థ ఎదగడం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్లలో ఒకటి ఉద్యోగుల నైపుణ్యాలను వెలికి తీయడం. నువ్వు సీఈవో అయినా సరే గ్రౌండ్ లెవల్‌లో పని చేసే ఉద్యోగిని కూడా నీ జట్టులో భాగం చేసుకో. వాళ్లలోని శక్తిని వెలికి తీయి. జట్టు కోసం నువ్వు.. నీ కోసం జట్టు అన్నట్టుగా పరిస్థితి మారిపోవాలి. హిందూస్థాన్ కేబుల్స్‌లో పని మానేసి మా కంపెనీలో చేరిన అహ్మద్ రిటైర్ అయ్యే వరకు నాతోనే ఉన్నాడు. అలా టీం వర్క్ చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. ఓ మ్యాజిక్ జరిగిపోతుంది.
రిస్క్ తీసుకోవాల్సిందే
గొప్ప విజయం సాధించమని అక్కడే ఆగిపోతే మరిన్ని విషయాలను తెలుసుకోలేం. అందుకే ఎప్పుడూ రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. కేబుళ్లు తయారు చేసేందుకు రా మెటీరియల్ ఎక్కడి నుంచో ఎందుకు దిగుమతి చేసుకోవాలి. వాటిని మేము తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టింది. అలా చేయడం వల్ల కేబుళ్ల తయారీ ఖర్చు తగ్గడంతో పాటు స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుంది.
వాట్ నెక్ట్స్
రా మెటీరియల్ ఆలోచనకు మరింత పదును పెట్టి కాపర్, అల్యుమినియంలను స్వంతంగా తయారు చేయాలని నిర్ణయించాం. అప్పటి వరకు కేబుళ్ల తయారీతో ప్రభుత్వ వర్గాలు, ముంబై వరకే పరిచయమైన నా పేరు ఈ మెటల్ మేకింగ్‌తో మీ అందరికీ తెలిసినవాడిని అయ్యాను.
My dear dreamers, I believe that the biggest roadblock in life is to never take a risk at all. When I landed in America, I had no place to stay but that didn’t matter. I came back to India with dreams bigger than my reality...(1/9) pic.twitter.com/ewthGO9MAo
— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 2, 2022
చదవండి: వేదాంత డైరీస్ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం
చదవండి: వేదాంత డైరీస్ 1: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి
చదవండి: వేదాంత డైరీస్ 2 : ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది
Comments
Please login to add a commentAdd a comment