Vedanta Ltd
-
మీనాక్షీ ఎనర్జీని కొనుగోలు చేయనున్న వేదాంత
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్.. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న థర్మల్ విద్యుత్ తయారీ సంస్థ ‘మీనాక్షి ఎనర్జీ’ని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. బిడ్డింగ్‌లో అత్యధికంగా కోట్ చేసి వేదాంత మొదటి స్థానంలో నిలిచింది. ‘‘కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద మీనాక్షి ఎనర్జీకి వేదాంత సమర్పించిన బిడ్ విజయం సాధించింది. దీంతో వేదాంత లిమిటెడ్ బోర్డు మీనాక్షి ఎనర్జీని కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది’’అని వేదాంత లిమిటెడ్ వెల్లడించింది. ఈ కొనుగోలు వ చ్చే ఆర్థిక సంవత్స రంలో పూర్తవుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూ రు జిల్లాలో ఉన్న మీనాక్షీ ఎనర్జీకి 1,000 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. రూ.1,440 కోట్లలో ముందుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. మిగిలిన రూ.1128 కోట్లను ఐదు వాయిదాలుగా ఐదేళ్ల కాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
తగ్గేదెలే అంటున్న వేదాంత: వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: మెటల్ ధరలు క్షీణిస్తున్నప్పటికీ ఈ ఏడాది పెట్టుబడి వ్యయాలకు కోత పెట్టబోమంటూ వేదాంతా లిమిటెడ్ స్పష్టం చేసింది. జింక్, ఆయిల్ అండ్ గ్యాస్, అల్యూమినియం వ్యాపారాల్లో భారీ ప్రణాళికల్లో ఉంది. 2022-23లో 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు) వెచ్చించ నున్నట్లు వేదాంత తెలియజేసింది. జింక్, చమురు-గ్యాస్, అల్యూమినియం వ్యాపారంలో నిధులను వినియోగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టులకు మధ్యలో ఫుల్స్టాప్ పెట్టబోమని కంపెనీ సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వీటితో పటిష్ట రిటర్నులు లభిస్తాయన్నారు. తద్వారా నిర్వహణా సామర్థ్యం మరింత మెరుగుపడటంతోపాటు, ఉత్పాదకత పుంజు కుంటుందన్నారు. దేశీ మినరల్స్ అండ్ మెటల్స్ పరిశ్రమపై ఎన్ఎండీసీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు రెండో రోజు దుగ్గల్ విలేకరులకు ఈ విషయాలు వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సుమారు 3 బిలియన్ల డాలర్లు మూలధనాన్ని వెచ్చించ నున్నట్టు వేదాంత 57వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) నుంచి మరో ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకటైన ఫాక్స్‌కాన్‌తో వేదాంత ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రెండులక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ వేదాంత లిమిటెడ్, దేశం అంతటా చమురు, గ్యాస్, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు,య అల్యూమినియం, పవర్ వ్యాపార నిర్వహణలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. -
100 బిలియన్ డాలర్ల సంస్థగా వేదాంత
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ వచ్చే ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 18 బిలియన్ డాలర్ల (రూ. 1.3 లక్షల కోట్లు) సంస్థగా ఉంది. వృద్ధి ప్రణాళికలను దూకుడుగా అమలు చేయడంపైనా, వివిధ వ్యాపార విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపైనా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు బుధవారం వేదాంత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ విభాగాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొంది. భారత్ 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్నందున ఇది సమస్యగా మారింది. దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి‘ అని అగర్వాల్ వివరించారు. దేశీయంగా సమగ్ర సెమీకండక్టర్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వేదాంత ఇప్పటికే దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. దేశ వృద్ధిలో సహజ వనరుల కీలక పాత్ర.. భారతదేశ ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోందని అనిల్ అగర్వాల్ అన్నారు. ఒక చిన్న విధానపరమైన మార్పు ఈ రంగం ‘నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్ స్వావలంబన దిశలో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ వృద్ధి, ఉపాధి కల్పనలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న విధాన సంస్కరణలు కూడా సహజ వనరుల విభాగ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి’’ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా చైనాను మాత్రమే కాకుండా భారత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ► ‘చైనాతోపాటు మరొక దేశం వ్యూహాన్ని’ అవలంబిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ‘భారత్ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడుతుంది. తమ పెట్టుబడులకు కేవలం చైనానే కాకుండా, ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలవైపూ చూడటం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ► మహమ్మారి కోవిడ్–19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తోంది. ► భారత్ దాదాపు ఏడు శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, బ్రిటన్లు దాదాపు రెండంకెల స్థాయిల్లో ద్రవ్యోల్బణం సవాలును ఎదుర్కొంటుండగా, ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక మోస్తరు ద్రవ్యోల్బణమే కొనసాగుతోంది. -
డబుల్ బొనాంజా.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్!
Vedanta Share Price: గతంలో కొంత కాలం ఇన్వెస్టర్లను దంచి కొట్టిన దలాల్ స్ట్రీట్ ఇటీవల అదరగొడుతూ మంచి ఊపుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే షేర్లతో లాభాలు ఆర్జిస్తున్న ఇన్వెస్టర్లకు మెటల్స్, మైనింగ్ కంపెనీ వేదాంత మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 19.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఆ సంస్థలోని పెట్టుబడిదారులు డబుల్ బొనాంజా పొందారనే చెప్పాలి. వేదాంత ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజ్ వేదాంత షేర్లు భారీ స్థాయిలో ప్రారంభమై ఆ తర్వాత వాటి షేరు ధర పెరుగుతూ రూ.253.25కి చేరింది. జూలై 1 తర్వాత ఈ స్థాయిలో స్టాక్ పెరగడం ఇదే తొలిసారి. ఇటీవల షేర్లు లాభాలతో పాటు వాల్యూమ్స్ కూడా మద్దతుగా ఉన్నాయి. అంటే వాల్యూమ్స్ కూడా పెరిగాయి. ప్రస్తుత వాల్యూమ్‌లు కూడా 20 రోజుల సగటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. టెక్నికల్‌గా వీటిని పరిశీలిస్తే.. స్టాక్ ధర 20-రోజుల మూవీంగ్ యావరేజ్ కంటే పైన ట్రేడవుతోంది. స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ పైన షేర్ ధర 250 వద్ద పటిష్టంగా కొనసాగుతుంది. కాగా వేదాంత షేర్ ఆల్‌టైం హై ధర రూ. 259.95గా ఉండడం గమనార్హం. చదవండి: ఆకాశ ఎయిర్: టికెట్ ధరలు, స్పెషల్ మీల్ -
క్రూడ్ విక్రయాల్లో ఓఎన్జీసీ, వేదాంతకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురును ఏ భారతీయ రిఫైనరీకైనా విక్రయించుకునేలా ఓఎన్జీసీ, వేదాంత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నియంత్రణలను ఎత్తివేసే ప్రతిపాదనకు బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి కంపెనీలకు క్రూడాయిల్‌ను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ముడిచమురు ఎగుమతులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. 1999 తర్వాత కేటాయించిన క్షేత్రాల ఉత్పత్తిదారులకు విక్రయాల్లో స్వేచ్ఛ ఉన్నప్పటికీ అంతకన్నా ముందు కేటాయించిన క్షేత్రాలకు (ముంబై హై– ఓఎన్జీసీ, రవ్వ – వేదాంత) మాత్రం కొనుగోలుదారులను ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
త్వరలో హైదరాబాద్ వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం..
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ త్వరలో హైదరాబాద్‌కు వస్తానని, తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై అప్పుడు మాట్లాడుకుందామంటూ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ దావోస్‌కి వెళ్లే ముందు ఇంగ్లండ్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేదాంత గ్రూపు చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. వీటిపై చర్చించుకునేందుకు హైదరాబాద్ రావాలంటూ అనిల్ అగర్వాల్‌ను ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానంపై వేదాంత గ్రూపు చైర్మన్ స్పందిస్తూ.. ఇండియా గురించి.. ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాల గురించి నీతో చర్చించడం ఎంతో బాగుందంటూ మంత్రి కేటీఆర్‌ను కొనిడాయారు. అంతేకాకుండా త్వరలోనే హైదరాబాద్ వస్తానంటూ ట్విటర్లో హామీ ఇచ్చారు. Great to discuss India and it’s unlimited potential with you @KTRTRS. Hope to visit Hyderabad soon 🙏🏽 https://t.co/2g2hZdy7Ua — Anil Agarwal (@AnilAgarwal_Ved) May 23, 2022 చదవండి: దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి -
వాళ్లు నీ వెంట ఉండేలా చూసుకో.. విజయం అదే వస్తుంది..
చేతిలో చిల్లిగవ్వ లేదు ఒక్కముక్క ఇంగ్లీష్ రాక పోయినా భవిష్యత్తుపై నమ్మకంతో బీహార్ నుంచి ముంబైకి చేరుకున్నాడు అనిల్‌అగర్వాల్. ఆ తర్వాత స్వశక్తితో ముప్పై వేల కోట్లకు పైగా విలువ కలిగిన ‘వేదాంత‘ పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. తన ఎదుగుదలకు తోడ్పడిన విషయాలను ఇటీవల ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో పైకి రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలి, వారిని ఎలా సంతృప్తి పరచాలనే అంశాలను వెల్లడించారు. జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్, మిషనరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కనీసం బస చేయడానికి తగిన చోటు కూడా లేదు. అయినా అక్కడే ఉంటూ పట్టువదలకుండా ప్రయత్నించాను. ఆఖరికి కోటి ఆశలతో ఇండియాకు చేరుకున్నాను. స్వదేశానికి వచ్చి రాగానే చేయాల్సింది ఎంతో ఉందని గుర్తించాను. నీకంటూ ఓ జట్టు టెలిఫోన్ కేబుల్ తయారీలో ఎక్స్పర్ట్ అయిన అమెరికన్ జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ తోడుగా ఉంది. వీళ్లకు తోడుగా ఫిన్‌ల్యాండ్‌కి చెందని నోకియా కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. నా లక్ష్యాన్ని చేరుకునేందుకు మంచి టీమ్‌ని ఎంచుకోవడమే నా పని. ఈ ప్రయత్నంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకున్నాను. ఐఐటీల చుట్టూ తిరిగాను. చివరకు నా టీమ్‌లోకి ఆనంద్ అగర్వాల్ (ఐఐటీ), ముకేశ్ అరోరా (ఎంట్రప్యూనర్), అహ్మద్ (ప్రభుత్వ ఉద్యోగి), ఆలి అన్సారీ (సివిల్ ఇంజనీర్)లు నాతో జత కట్టారు. కేవలం ఐదేళ్లలోనే ఇండియాలోనే టెలిఫోన్ వైర్లు తయారు చేసే అతి పెద్ద కంపెనీగా నిలిచాం. టీం వర్క్ ముఖ్యం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కటకటలాడే స్థితి నుంచి ఐదేళ్లలోనే దేశంలోనే అతి పెద్ద కేబుళ్ల తయారీ సంస్థ ఎదగడం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్లలో ఒకటి ఉద్యోగుల నైపుణ్యాలను వెలికి తీయడం. నువ్వు సీఈవో అయినా సరే గ్రౌండ్ లెవల్లో పని చేసే ఉద్యోగిని కూడా నీ జట్టులో భాగం చేసుకో. వాళ్లలోని శక్తిని వెలికి తీయి. జట్టు కోసం నువ్వు.. నీ కోసం జట్టు అన్నట్టుగా పరిస్థితి మారిపోవాలి. హిందూస్థాన్ కేబుల్స్‌లో పని మానేసి మా కంపెనీలో చేరిన అహ్మద్ రిటైర్ అయ్యే వరకు నాతోనే ఉన్నాడు. అలా టీం వర్క్ చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. ఓ మ్యాజిక్ జరిగిపోతుంది. రిస్క్ తీసుకోవాల్సిందే గొప్ప విజయం సాధించమని అక్కడే ఆగిపోతే మరిన్ని విషయాలను తెలుసుకోలేం. అందుకే ఎప్పుడూ రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. కేబుళ్లు తయారు చేసేందుకు రా మెటీరియల్ ఎక్కడి నుంచో ఎందుకు దిగుమతి చేసుకోవాలి. వాటిని మేము తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టింది. అలా చేయడం వల్ల కేబుళ్ల తయారీ ఖర్చు తగ్గడంతో పాటు స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుంది. వాట్ నెక్ట్స్ రా మెటీరియల్ ఆలోచనకు మరింత పదును పెట్టి కాపర్, అల్యుమినియంలను స్వంతంగా తయారు చేయాలని నిర్ణయించాం. అప్పటి వరకు కేబుళ్ల తయారీతో ప్రభుత్వ వర్గాలు, ముంబై వరకే పరిచయమైన నా పేరు ఈ మెటల్ మేకింగ్‌తో మీ అందరికీ తెలిసినవాడిని అయ్యాను. My dear dreamers, I believe that the biggest roadblock in life is to never take a risk at all. When I landed in America, I had no place to stay but that didn’t matter. I came back to India with dreams bigger than my reality...(1/9) pic.twitter.com/ewthGO9MAo — Anil Agarwal (@AnilAgarwal_Ved) May 2, 2022 చదవండి: వేదాంత డైరీస్ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం చదవండి: వేదాంత డైరీస్ 1: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి చదవండి: వేదాంత డైరీస్ 2 : ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది -
చిన్నారి పాలకు జేబులో డబ్బుల్లేవ్.. కలలేమో కోట్ల రూపాయల్లో.. చివరకు..
వ్యాపారంలో విజయం సాధించాలంటే విజన్ ఉండటం ఉండటం దానికి తగ్గ పెట్టుబడి సాధించడం. ఆ రెండు వచ్చిన తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కోవడం, అవకాశాలను ఒడిసిపట్టుకోవడం వంటి అంశాలను ఇప్పటి వరకు వివరించారు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. తాజాగా వ్యాపారానికి సంబంధించిన మరో మెళకువను ఆయన వివరించారు. అమెరికాలో ప్రయత్నాలు టెలిఫోన్ కేబుళ్ల తయారీకి ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నా షంషేర్ కేబుల్ తయారీ పరిశ్రమకు అవసరమైన మిషనరీ కోసం వెంటనే అమెరికాకు వెళ్లాను. అక్కడే ఉంటూ కేబుల్ తయారీ పరిశ్రమతో సంబంధం ఉన్నవారితో ప్రతీ రోజు 40 నుంచి 50 మందితో ఫోన్లో మాట్లాడుతుండే వాడిని. ఈ క్రమంలో ఎస్సెక్స్‌లో ఉన్న జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ గురించి తెలిసింది. ఆ కంపెనీకి అమెరికాలో అనేక ప్లాంట్లు ఉన్నాయి. ఇటీవల ఆ కంపెనీకి చెందిన ఎస్సెక్స్ ప్లాంటును మూసివేసినట్టు తెలిసింది. దీంతో ఈ కంపెనీ ప్రతినిధులను కలిసేందుకు విశ్వప్రయత్నం చేశాను. కానీ అపాయింట్మెంట్ దొరక్క పోవడంతో తిరిగి ఇండియా వచ్చేశాను. అవకాశం దొరికింది ఇక్కడ ఇండియాలో ఎక్విప్మెంట్ కొరత కారణంగా ఒక టెలిఫోన్ కనెక్షన్ పొందడానికి 8 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన రోజులవీ. ఒక్కసారి కేబుళ్లు తయారీ మొదలు పెడితే క్షణాల మీద అమ్ముడైపోతాయని తెలుసు. కానీ అందుకు తగ్గ మెషినరీ సమకూర్చుకోవడం కష్టమైపోతుంది. ఇండియాలో ఆ మెషినరీ లేదు. అమెరికా వాళ్లు మనకు దొరకరు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించడంతో రెండేళ్ల తర్వాత జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ సీఈవోల మాట్లాడే అవకాశం దొరికింది. ఎలాగైన డీల్ కుదరాలి నాకు బాగా పరిచయం ఉన్న ఛార్టెడ్ అకౌంటెంట్ నారాయణ స్వామిని వెంట తీసుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కాను. నారాయణ స్వామి కంపెనీ లావాదేవీలు నిర్వహించడంలో దిట్ట. మేమిద్దరం కలిసి ఆ కంపెనీ ప్రతినిధులను ఒప్పించగలమని నమ్మాం. వాళ్ల నుంచి పిలుపు కోసం అమెరికాలో ఎదురు చూస్తూ గడిపాం. ఈ సమయంలో డబ్బులు ఆదా చేసేందుకు ఇద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకునే వాళ్లం. రోడ్డు పక్కన శాండ్విచెస్ లాంటి స్ట్రీట్ఫుడ్తో కడుపు నింపుకునే వాళ్లం. కరిగిపోయిన కలలు మా నిరీక్షణ ఫలించి ఒక రోజున జెల్లీ ఫిల్ల్డ్ కంపెనీ సీఈవో ఫ్రెడ్ జింజర్, సీఎఫ్‌వో క్రిస్రాడ్లను కలుసుకున్నాం. మేము చెప్పినదంతా విన్న తర్వాత .. మూతపడిన ప్లాంట్‌కి సంబంధించి ఎక్విప్మెంట్ అమ్మే ఉద్దేశం తమకు లేదంటూ తాపీగా చెప్పారు వాళ్లిద్దరు. దీంతో అప్పటి కళ్ల ముందు కదలాడిన అందమైక కల కరిగిపోయింది. లెక్కలొక్కటే సరిపోవు అప్పటికే వ్యాపారంలో పదేళ్లపాటు తింటున్న డక్కామెక్కీలు నేర్పిన విలువైన పాఠం ఆ సమయంలో నాకు గుర్తుకు వచ్చింది. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధించాలంటే లెక్కలు ఒక్కటే సరిపోవని, ఎదుటివారి మనసు గెలుచుకోవాలని ఆ తర్వాతే డీల్ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అందుకే వెంటనే ఇండియాలో ఉన్న నా కుటుంబాన్ని కూడా అమెరికాకు రప్పించుకున్నాను. పట్టువదల్లేదు అమెరికాలో ఉండగానే నా కూతురు ప్రియ పుట్టింది. మిల్క్, డైపర్స్, వ్యాక్సినేషన్స్ ఇలా బేబీ మెయింటనెన్స్‌కి సరిపడా డబ్బులు కూడా లేని రోజులవి. నా భార్య, నా తల్లిదండ్రులు అందించిన సహాకారంతోనే ఈ బాధలన్నీ తీరిపోయాయి. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే. అందుకే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా అమెరికాలోనే ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా జెల్లీఫిల్ల్డ్ కంపెనీ ప్రతినిధులను కలుస్తుండే వాడిని. ఇలా కలిసినప్పుడు వ్యాపార విషయాలు కాకుండా.. ఫిలాసఫీ, పర్సనల్ విషయాలు, ఇండియాలో పారిశ్రామిక రంగం, వ్యాపారంలో నేను సాధించాలనుకుంటున్న లక్ష్యాలు, పదేళ్లుగా నేను పడుతున్న ఇబ్బందులు, పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ వారిలో ఒకడిలా మారిపోయాను. వ్యాపార విషయాలు పక్కన పెట్టి సాధారణ విషయాలు మాట్లాడుతూ వారికి దగ్గరయ్యేందుకు, వారి మనసు గెలిచేందుకు ప్రయత్నించాను. మేమున్నాం ఇలా కొంత కాలం మా మధ్య స్నేహం ముదిరి పాకన పడిన తర్వాత వాళ్లకు నా వ్యాపార లక్ష్యాలు పూర్తిగా అర్థమయ్యాయి. దీంతో మెషినరీ అమ్మకూడదనే వాళ్ల నిర్ణయం మార్చుకోవడమే కాదు. ఆ మెషినరీ నాకు తక్కువ ధరకే అందివ్వడంతో పాటు ఇండియాలో ఎస్టాబ్లిష్ జరిగేంత వరకు సహాకారం అందిస్తామంటూ ముందుకు వచ్చారు. మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధించాలనే కోరిక గట్టిగా ఉన్నప్పుడు.. అంకిత భావంతో మనసుపెట్టి పని చేస్తే ఎంత కఠిన లక్ష్యమైనా కరిగిపోయి చేతికి అందివస్తుందని ఈ అనుభవం నాకు తెలిపింది. లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రతికూల ఫలితాలు ఎదురైనా ఆశ కోల్పోకుండా మనసు పెట్టి పని చేస్తే కచ్చితంగా ఓ రోజు గమ్యాన్ని చేరుకుంటాం. అలా కేబుల్ పరిశ్రమ మెషినరీ కోసం 1986లో మొదలు పెట్టిన ప్రయత్నాలు 1989లో దారికొచ్చాయి. (ఐపోలేదింకా) I found out about the largest manufacturer of jelly-filled cables based in Essex, America. The company had many plants, one of which had recently shut down. At that time, getting a telephone line in India took at least 8 years of waiting. I saw a gap in the market and… (1/8) pic.twitter.com/HfbXUE6rkJ — Anil Agarwal (@AnilAgarwal_Ved) April 18, 2022 చదవండి: వేదాంత డైరీస్: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి చదవండి: వేదాంత డైరీస్ 2: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది చదవండి: వేదాంత డైరీస్ : న్యూయార్క్‌లో జేబుదొంగలు ! -
వేదాంత డైరీస్ : న్యూయార్క్‌లో జేబుదొంగలు !
జీరో నుంచి హీరో వరకు సాగిన తన జీవిత ప్రయాణంలో ముఖ్య ఘట్టాలన్ని క్రమం తప్పకుండా వివరిస్తున్నారు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముక్క ఇంగ్లీష్ రాకుండా ముంబై రావడం.. అక్కడ అప్పు చేసి షంషేర్ కేబుల్ కంపెనీ కొనడం.. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తాను పడిన పాట్లను ఆయన వివరించారు. తాజాగా మరో కీలక ఘట్టానికి సంబంధించిన అంశాలు వెల్లడించారు. 1986లో రూల్స్ మార్చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థలు షంషేర్ నుంచి కేబుళ్లు కొనడానికి భారీ ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టాయి. వస్తున్న ఆర్డర్లకు తయారీ సామర్థ్యానికి పొంతన లేకపోవడంతో షంషేర్ విస్తరణ అవసరమైంది అనిల్ అగర్వాల్‌కి. దీంతో సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం నాలుగు కోట్ల రూపాయల అప్పు కూడా చేశాడు. అమెరికా టూర్ ఆరోజుల్లో అమెరికాని కొత్త అవకాశాలకు స్వర్గధామంగా చెప్పుకునే వారు. దీంతో తన కలలు సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని అనిల్ అగర్వాల్ డిసైడ్ అయ్యారు. అంతంత మాత్రంగా వచ్చిన టూటీ ఫ్రూటీ ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం, ఇంట్లో వాళ్లు తయారు చేసిన ఘర్ కా ఖానాతో నిండిన సూట్‌కేస్‌లతో పాటు అజయ్ ఆనంద్ అనే బీహారీ ఫ్రెండ్‌ను తోడుగా పెట్టుకుని న్యూయార్క్‌కి పయణమయ్యాడు అనిల్ అగర్వాల్ దొంగల భయం న్యూయార్క్‌లో జేబుదొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసిన వాళ్లు చెప్పడంతో తమ దగ్గరున్న ఐదు వందల డాలర్లను జాగ్రత్తగా జేబు దొంగల కంట పడకుండా కోటు లోపలి వైపు జాకెట్లో పెట్టుకుని విమానం ఎక్కాడు. అమెరికా చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి, సెకండ్ హ్యాండ్ మిషనరీ కోసం ఎవరినీ సంప్రదించాలనే వివరాలేం తెలియకుండానే అడుగులు మందుకు వేశారు. మంచు చూసి న్యూయార్క్ సిటీలో దిగిదిగగానే పాల మీగడ లాంటి తెల్లటి మంచును చూసి ఆశ్చర్యపోయారు అనిల్ అగర్వాల్. అయితే ప్రయాణంలో అనిల్ అగర్వాల్ పక్కసీట్లో కూర్చున్న మిస్టర్ కోటావాలాతో పరిచయమైంది. రాజస్థాన్‌లో దూరపు చుట్టరికం కూడా ఉండటంతో నేరుగా వాళ్లింట్లో దిగిపోయారు అనిల్ అగర్వాల్. They say good things come only if you work towards it. To enjoy the fruit, you must sow enough in the roots. With the policy change in 1986, my fate changed as well. My first business started picking up pace and I managed to raise… (1/7) pic.twitter.com/AQaFCz8MfL — Anil Agarwal (@AnilAgarwal_Ved) April 4, 2022 ఆరా తీశాం తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిగా రోజువారి ఇంటి పనిలో సాయం చేయడం, వాళ్ల పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, టెన్సిస్ ఆటలో కంపెనీ ఇవ్వడం పనులు చేసేవారు అనిల్ అగర్వాల్. ఇక వచ్చి రానీ బ్రోకెన్ ఇంగ్లీష్‌లో సెకండరీ మిషనరీ కోసం రోజుకు కనీసం 40 నుంచి 50 వరకు కాల్స్ చేసి వివరాలు సేకరించేవారు. చదవండి: ఇంగ్లీష్ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి మంచి పండ్లు కావాలంటే మొక్కను లోతుగా నాటినప్పుడే దాని మంచి పండ్లను పొందగలుతాము. మంచి పనులు చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు కూడా వాటంతట అవే వస్తాయి. అలా శ్రమించడం వల్లే విజయాలు తనను వరించాయని చెబుతున్నారు అనిల్ అగర్వాల్ ( అయిపోలేదింకా...) చదవండి: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది -
రూ.11వేల పెట్టుబడులకు వేదాంతా సై, ఎందులో అంటే?
న్యూఢిల్లీ: వివిధ విభాగాలపై 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఆయిల్ అండ్ గ్యాస్, జింక్, స్టీల్ బిజినెస్‌లపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. శుక్రవారం(25న) జరిగిన బోర్డు సమావేశంలో ఇంధన విభాగం కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్‌పై 68.7 కోట్ల డాలర్లను వ్యయపరచనున్నట్లు తెలియజేసింది. వీటిలో 36 కోట్ల డాలర్లను మంగళ, భాగ్యమ్, ఐశ్వర్య బార్మెర్ హిల్, రవ్వ క్షేత్రాలపై వెచ్చించనున్నట్లు పేర్కొంది. కొత్త బావులలో తవ్వకాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. దక్షిణాఫ్రికాలోని గ్యామ్స్‌బర్గ్ జింక్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణ కోసం 46.6 కోట్ల డాలర్లు వినియోగించనున్నట్లు వెల్లడించింది. వార్షిక సామర్థ్యాన్ని రెట్టింపునకు అంటే 8 మిలియన్ టన్నులకు చేర్చనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా ఏడాదికి 2 లక్షల మిక్ జింక్‌ను అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు వివరించింది. ఈ బాటలో 34.8 కోట్ల డాలర్లను స్టీల్ బిజినెస్ విస్తరణకు కేటాయించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కోక్ ఒవెన్స్‌కు దన్నుగా అదనపు బ్లాస్ట్‌ఫర్నేస్ ఏర్పాటు, పెల్లెట్, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది. -
వీరి రూటు.. సపరేటు
-
నేడు బీపీసీఎల్ బిడ్ల పరిశీలన!
న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కంపెనీలో తనకున్న 52.98 శాతం వాటాను కేంద్రం విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా కొనుగోలు కోసం దరఖాస్తు చేసిన కంపెనీల బిడ్లను నేడు (మంగళవారం) అత్యున్నత సంఘం మదింపు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కొనుగోలు కోసం వేదాంతతో పాటు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ (థింక్ గ్యాస్ మాతృసంస్థ)లు బిడ్లు సమర్పించాయి. ఈ బిడ్లను తనిఖీ చేసి డెలాయిట్ సంస్థ రూపొందించిన నివేదికపై ఈ అత్యున్నత సంఘం చర్చిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లావాదేవీకి సలహాదారుగా డెలాయిట్ సంస్థ వ్యవహరిస్తోంది. కేంద్రానికి రూ.46,600 కోట్లు...! బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి గత ఏడాది నవంబర్లోనే ఆమోదం లభించింది. అప్పటి నుంచి చూస్తే, షేర్ ధర 20 శాతం మేర పడిపోయింది. బీఎస్ఈలో సోమవారం నాడు బీపీసీఎల్ షేర్ రూ.406 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం చూస్తే 52.98 శాతం వాటాకు కేంద్ర ప్రభుత్వానికి రూ.46,600 కోట్లు లభిస్తాయి. కాగా ఈ వాటాను కొనగోలు చేసిన ఏ కంపెనీ అయినా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ ఆఫర్‌కోసం మరో రూ.22,800 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. భారత్‌లో రెండో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇదే. భారత ముడి చమురు రిఫైనరీలో బీపీసీఎల్ వాటా 15.33 శాతంగా ఉంది. ఇంధనాల మార్కెటింగ్‌లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతం. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా నాలుగు రిఫైనరీలున్నాయి. ముంబై(మహారాష్ట్ర), కోచి(కేరళ), బినా(మధ్యప్రదేశ్), నుమాలిఘర్(అస్సాం)లోని నాలుగు రిఫైనరీల వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ మొత్తం 17,355 పెట్రోల్ పంపులు, 6,159 ఎల్పీజీ డీలర్లు, 61 విమానయాన ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది. -
బీహెచ్ఈఎల్కు స్వేచ్చ- చైనాకు చెక్
విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్)కు మరింత స్వేచ్చ(అటానమీ) ఇస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ పవర్ ప్లాంట్లను రూపొందించగలదని బిలియనీర్ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తాజాగా ట్వీట్ చేశారు. అటానమీ లేదా ప్రయివేటైజేషన్ చేపడితే.. బీహెచ్ఈఎల్ ఆత్మనిర్బర్ ఇండియాకు గొప్ప మద్దతునివ్వగలదని డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ చైర్మన్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్లాంట్లను అందించగల సత్తా కంపెనీకి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తద్వారా చైనా ప్రొడక్టులపై ఆధారపడటాన్ని మానుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టర్న్‌కీ పద్ధతిలో విదేశాలలో సైతం పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయగలదని తెలియజేశారు. చైనాతో లడఖ్ సమీపంలో సైనిక వివాదం తలెత్తిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. క్యూ4 వీక్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో బీహెచ్ఈఎల్ రూ. 1534 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 676 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. ప్రస్తుతం బీహెచ్ఈఎల్ షేరుకి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16 శాతం దూసుకెళ్లి రూ. 32 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ పరిమాణం సైతం నాలుగు రెట్లు ఎగసింది. బీఎస్ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం! -
వేదాంత లాభం రూ. 2,158 కోట్లు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు. ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ. 856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో వేదాంత షేర్ 3 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. -
వేదాంత లాభం 34 శాతం డౌన్
న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 34 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.2,045 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,343 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,509 కోట్ల నుంచి రూ.23,297 కోట్లకు పెరిగిందని వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసన్ చెప్పారు. అల్యూమినియమ్ అమ్మకాలు అధికంగా ఉండటం, తల్వాండి సాబో పవర్ ప్లాంట్ విద్యుదుత్పత్తి పెరగడం దీనికి కారణాలన్నారు. జింక్ ఇండియా, జింక్ ఇంటర్నేషనల్ సంస్థల అమ్మకాలు తక్కువగా ఉండటం, ట్యుటికోరన్ స్మెల్టర్ మూసివేత వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రోస్టీల్ స్టీల్ కంపెనీ కొనుగోలు, కరెన్సీ పతనం, కమోడిటీల ధరలు పెరగడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపించాయన్నారు. కాగా వ్యయాలు రూ.18,854 కోట్ల నుంచి రూ.20,999 కోట్లకు పెరిగాయి, ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.17 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనుంది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,320 కోట్లు. ఈ డివిడెండ్‌కు రికార్డ్ డేట్‌గా ఈ నెల 10ని కంపెనీ నిర్ణయించింది. -
వేదాంతా లాభాలు ఓకే
సాక్షి, ముంబై: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత క్యూ1 ఫలితాల్లో పరవాలేదనిపించింది. మొదటి త్రైమాసికంలో నికర లాభంలో స్వల్ప ( 0.7 శాతం) వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 2233 కోట్లతో పోలిస్తే తాజాగా రూ. 2248 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 21.4 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.22,206 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎబిటా 28.4 శాతం - రూ.6284 కోట్లగా ఉంది. తమిళనాడులో ప్లాంటును ఆందోళన కారణంగా మూసివేయాల్సి వచ్చిందని, దీన్ని తెరిపించేందుకు ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నట్టు వేదాంతా ఛైర్మన్ అనిల్‌అగర్వాల్ ప్రకటించారు. తద్వారా 100 మిలియన్ డాలర్లను నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. అయితే అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ జింక్ గణనీయమైన ఉత్పత్తితో ఈ లాభాలను సాధించినట్టు సీఈవో కుల్దీప్ కూరా ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించారు. ప్రాజెక్టులు పురోభివృద్ధితో రాబోయే క్వార్టర్లలో మరిన్ని మైలురాళ్లను అధిగమించనున్నామని చెప్పారు. కాగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎబిటా - రూ.852 కోట్లు, ఐరన్ అండ్ ఓర్ ఎబిటా రూ.163 కోట్లు, అల్యూమినియం ఎబిటా రూ.1259 కోట్లు, పవర్ ఎబిటా రూ.425 కోట్లుగా నమోదు చేసింది. -
ఎస్సార్ స్టీల్ ట్విస్ట్: రేసులో వేదాంత
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో పీకల్లోతున కూరుకుపోయి దివాలా దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్ బిడ్డింగ్ రేసులో తాజాగా మరోదిగ్గజం చేరింది.ఇప్పటికే అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఈ రేసులో ముందుండగా ఇపుడు వేదాంతా వచ్చి చేరింది. రెండవ రౌండ్ బిడ్డింగ్ ప్రక్రియలో ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బిడ్ల దాఖలుకు సోమవారమే తుది గడువు. ఫిబ్రవరి 12నాటి మొదటి దశలో బిడ్డింగ్‌లో ఆర్సెలార్ మిట్టల్, మారిషస్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యుమెతాల్తో కలిసి జెస్ డబ్ల్యూ రెండు సంస్థలు ప్రధానంగా నిలవగా ఇపుడు వేదాంతా దీనికోసం పోటీ పడుతున్న దిగ్గజాల సరసన చేరింది. అయితే మొదటి దశ బిడ్డింగ్‌లో ఐబిసి చట్టాల ప్రకారం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రెండు సంస్థల బిడ్లను తిరస్కరించాయి. కాగా దివాలా చట్టం కింద తొలి విడతలో చర్యలు చేపట్టేందుకు రిజర్వు బ్యాంకు గుర్తించిన 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి. గుజరాత్లో ప్రధాన ఉత్పత్తి కేంద్రం ఉన్న ఎస్సార్స్టీల్ సంవత్సరానికి 9.6 మిలియన్ టన్నుల నామమాత్రపు సామర్ధ్యం కలిగివుంది. అయితే భారీగా పెరిగిన ముడి ఇనుము ధరలు, ఉత్పత్తి వ్యయాలు కంపెనీకి ప్రతిబంధకం మారాయి. -
వేదాంతలో కెయిర్న్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియా... వేదాంత ఇండియాలో విలీనం కానుంది. విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి.