న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురును ఏ భారతీయ రిఫైనరీకైనా విక్రయించుకునేలా ఓఎన్‌జీసీ, వేదాంత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నియంత్రణలను ఎత్తివేసే ప్రతిపాదనకు బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
అక్టోబర్ 1నుంచి కంపెనీలకు క్రూడాయిల్‌ను దేశీ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ముడిచమురు ఎగుమతులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.
1999 తర్వాత కేటాయించిన క్షేత్రాల ఉత్పత్తిదారులకు విక్రయాల్లో స్వేచ్ఛ ఉన్నప్పటికీ అంతకన్నా ముందు కేటాయించిన క్షేత్రాలకు (ముంబై హై– ఓఎన్‌జీసీ, రవ్వ – వేదాంత) మాత్రం కొనుగోలుదారులను ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment