Vedanta Share Price: గతంలో కొంత కాలం ఇన్వెస్టర్లను దంచి కొట్టిన దలాల్ స్ట్రీట్ ఇటీవల అదరగొడుతూ మంచి ఊపుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే షేర్లతో లాభాలు ఆర్జిస్తున్న ఇన్వెస్టర్లకు మెటల్స్, మైనింగ్ కంపెనీ వేదాంత మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 19.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఆ సంస్థలోని పెట్టుబడిదారులు డబుల్ బొనాంజా పొందారనే చెప్పాలి.
వేదాంత ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజ్
వేదాంత షేర్లు భారీ స్థాయిలో ప్రారంభమై ఆ తర్వాత వాటి షేరు ధర పెరుగుతూ రూ.253.25కి చేరింది. జూలై 1 తర్వాత ఈ స్థాయిలో స్టాక్ పెరగడం ఇదే తొలిసారి. ఇటీవల షేర్లు లాభాలతో పాటు వాల్యూమ్స్ కూడా మద్దతుగా ఉన్నాయి. అంటే వాల్యూమ్స్ కూడా పెరిగాయి. ప్రస్తుత వాల్యూమ్‌లు కూడా 20 రోజుల సగటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. టెక్నికల్‌గా వీటిని పరిశీలిస్తే.. స్టాక్ ధర 20-రోజుల మూవీంగ్ యావరేజ్ కంటే పైన ట్రేడవుతోంది. స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ పైన షేర్ ధర 250 వద్ద పటిష్టంగా కొనసాగుతుంది. కాగా వేదాంత షేర్ ఆల్‌టైం హై ధర రూ. 259.95గా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment