న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్.. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న థర్మల్ విద్యుత్ తయారీ సంస్థ ‘మీనాక్షి ఎనర్జీ’ని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. బిడ్డింగ్‌లో అత్యధికంగా కోట్ చేసి వేదాంత మొదటి స్థానంలో నిలిచింది. ‘‘కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద మీనాక్షి ఎనర్జీకి వేదాంత సమర్పించిన బిడ్ విజయం సాధించింది.
దీంతో వేదాంత లిమిటెడ్ బోర్డు మీనాక్షి ఎనర్జీని కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది’’అని వేదాంత లిమిటెడ్ వెల్లడించింది. ఈ కొనుగోలు వ చ్చే ఆర్థిక సంవత్స రంలో పూర్తవుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూ రు జిల్లాలో ఉన్న మీనాక్షీ ఎనర్జీకి 1,000 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. రూ.1,440 కోట్లలో ముందుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. మిగిలిన రూ.1128 కోట్లను ఐదు వాయిదాలుగా ఐదేళ్ల కాలంలో చెల్లించాల్సి ఉంటుంది.
చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
Comments
Please login to add a commentAdd a comment