Thermal Plant
-
నేడు లారా థర్మల్ ప్లాంట్ జాతికి అంకితం!
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశ స్టేషన్‌ను దాదాపు రూ.15,800 కోట్లతో అభివృద్ధి చేశామని, రెండో దశ ప్రాజెక్టుకు రూ.15,530 కోట్ల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుండి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో రూ.600 కోట్ల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఇసిఎల్) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం(ఫిబ్రవరి 25) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా ఐదు ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లు ఉన్నాయి. -
మీనాక్షీ ఎనర్జీని కొనుగోలు చేయనున్న వేదాంత
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్.. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న థర్మల్ విద్యుత్ తయారీ సంస్థ ‘మీనాక్షి ఎనర్జీ’ని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. బిడ్డింగ్‌లో అత్యధికంగా కోట్ చేసి వేదాంత మొదటి స్థానంలో నిలిచింది. ‘‘కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద మీనాక్షి ఎనర్జీకి వేదాంత సమర్పించిన బిడ్ విజయం సాధించింది. దీంతో వేదాంత లిమిటెడ్ బోర్డు మీనాక్షి ఎనర్జీని కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది’’అని వేదాంత లిమిటెడ్ వెల్లడించింది. ఈ కొనుగోలు వ చ్చే ఆర్థిక సంవత్స రంలో పూర్తవుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూ రు జిల్లాలో ఉన్న మీనాక్షీ ఎనర్జీకి 1,000 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. రూ.1,440 కోట్లలో ముందుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. మిగిలిన రూ.1128 కోట్లను ఐదు వాయిదాలుగా ఐదేళ్ల కాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
యాదాద్రి పవర్ కీర్తి కాంతులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యావత్ దేశం కీర్తి ప్రతిçష్టలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే పవర్ ప్రాజెక్టును చేపట్టామని, రాష్ట్ర రైతులు, ప్రజా శ్రేయస్సును కాంక్షించి ఇలాంటివి ప్రభుత్వ రంగంలోనే చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో వేగం మరింత పెంచాలని, ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పవర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన.. మొదట పవర్ ప్లాంట్ ఫేజ్–1, యూనిట్–2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ అంతస్తులో ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం తీరుపై జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. అందులోని అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. నాలుగు గంటలకు పైగా సీఎం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ ప్రజలకు ఉపాధి కోసం.. ‘ప్లాంట్ ఆపరేషన్ నిమిత్తం కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలి. ఈ ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన నీటిని కృష్ణా నది నుంచి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేశాం. పవర్ ప్లాంట్‌లో పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలి. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలి. ఇదే ప్రాంతంలో భవిష్యత్‌లో సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారు. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు 50 ఎకరాలు కేటాయించాలి. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలి. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాఫ్‌కు అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలి. టౌన్షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలి..’ అని కేసీఆర్ సూచించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల సీసీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే డిసెంబర్ కల్లా రెండు యూనిట్లు పూర్తి ► 4 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో ఒక యూనిట్ 2023 సెప్టెంబర్ నాటికి, మరొకటి డిసెంబరు నాటికి పూర్తవుతాయని ముఖ్యమంత్రికి ప్రభాకర్‌రావు వివరించారు. 2024 మార్చిలో మూడో యూనిట్, 4, 5 యూనిట్లు అదే ఏడాది జూన్‌లో పూర్తవుతాయని తెలిపారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందన్నారు. కాగా ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై ప్రభాకర్‌రావును సీఎం అభినందించారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలి ► ‘యాదాద్రి పవర్ ప్లాంట్‌కు భూమి ఇచ్చిన రైతులతో పాటు, గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని సీఎం ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన ముఖ్యమంత్రి.. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్రనాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, వెలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సీఎం వచ్చారన్న సమాచారంతో మండలంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెంలోని భూనిర్వాసితులు పవర్‌ప్లాంట్ వద్దకు చేరుకుని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఇంటికోఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. -
సర్కారు తప్పిదాలతోనే విద్యుత్ మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏకంగా రూ.6,813 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదించాయని, చరిత్రలో ఎన్నడూ ఇంతగా చార్జీలు పెంచిన దాఖలాలు లేవని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు, లోపభూయిష్ట ప్రణాళికలు, లోపాయకారీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిం దని ఆరోపించారు. రాష్ట్రంలో ‘విద్యుత్ చార్జీ లు పెంచడమే మార్గమా?’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వెబినార్‌లో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. నిర్లక్ష్యం, వైఫల్యాలతోనే.. మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు తగ్గినా, పాత అధిక ధరలతోనే కొనుగోలు ఒప్పందాలు కొనసాగించారని.. ప్లాంట్ల నిర్మాణ గడువు పెంచి ప్రజలపై వందల కోట్ల అనవసర భారం వేశారని విద్యుత్‌రంగ విశ్లేషకుడు ఎం.వేణుగోపాల్‌రావు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ బిడ్ ద్వారా ఓ రాజకీయవేత్తకు చెందిన థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని, ఫలితంగా ప్రజలపై రూ.2,784 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి ప్లాంటు, వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం వంటివి రాష్ట్రానికి గుదిబండ మారాయన్నారు. 2018–22 మధ్య రూ.21,609 కోట్ల ఆదాయ లోటు ఉందని డిస్కంలు నివేదించాయని.. ఇంత భారం పేరుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈఆర్సీ, డిస్కంల వైఫల్యాలే కారణ మని విమర్శించారు. ప్రస్తుత ఒప్పందాల ద్వారానే రాష్ట్రానికి 16,603 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని.. 2022–23 నాటికి కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఇది 25,760 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. ఇలా భవిష్యత్ డిమాండ్‌ను అతిగా అంచనా వేసి ప్రాజెక్టులు కడుతున్నారని.. వాటి ఫిక్స్డ్ చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై భారం తగదు పేదలు, మధ్యతరగతిపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదని ‘ప్రయాస్ ఎనర్జీ’సంస్థ నిపుణుడు, ఐఐటీయన్ ఎన్.శ్రీకుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘రాష్ట్రంలోని 1. 15 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లలో 62 శాతం పేదలు, మధ్యతరగతి వారివే. చార్జీల పెం పుతో వారి విద్యుత్ బిల్లులు 75–80 శాతం వరకు పెరిగిపోతాయి. 100 యూని ట్లలోపు వినియోగంపై చార్జీల పెంపును 5 శాతానికే పరిమితం చేయాలి. 100–200 యూనిట్లు వాడేవారిపై 10 శాతం, 200 యూనిట్లు దా టి వాడితే 12–15శాతం చార్జీలు పెంచితే న్యా యంగా ఉంటుంది..’’అని సూచించారు. -
బొగ్గు సంక్షోభం తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీతంగా పెరగడం మన దేశంపైనా ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బొగ్గు కొరత మొదలైంది. పలు రాష్ట్రాల్లో థర్మల్ విద్యుదుత్పత్తి నిలిచిపోయి, అంధకారం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే థర్మల్ ప్లాంట్లలో కేవలం ఒక్క రోజుకు సరిపడానే బొగ్గు నిల్వలు ఉన్నాయని.. తక్షణమే బొగ్గు సరఫరా జరగకుంటే ఢిల్లీలో చీకట్లు అలముకుంటాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ శనివారం కేంద్రానికి లేఖ రాశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 110 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు లేకపోవడంతో శనివారం పలు రాష్ట్రాల్లోని 16 ప్లాంట్లలో (మొత్తం 16,880 మెగావాట్ల సామర్థ్యం) విద్యుదుత్పత్తి జరగలేదు. సింగరేణి నుంచి తరలింపు సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి.. ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును నిల్వ ఉంచడానికి బదులు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే స్థితిలో ఉన్న ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణికి తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని.. ఇక్కడి అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నామని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఉన్నా.. రాష్ట్రంలోని ప్లాంట్లకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో 4 రోజులకు సరిపడానే.. బొగ్గు కొరత ప్రభావం తెలంగాణపైనా పడింది. రాష్ట్రంలోని జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ప్రస్తుతం నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 4 రోజులకే సరిపోతాయని పేర్కొంటున్నాయి. పిట్‌హెడ్ (బొగ్గు గనులకు సమీపంలో ఉన్న) ప్లాంట్లలో 5 రోజులకన్నా తక్కువకు సరిపడా బొగ్గు నిల్వలే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి ప్లాంట్లలో సజావుగా విద్యుదుత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. అంటే 15 రోజుల అవసరాలకు కనీసం 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 5.92 లక్షల టన్నులే ఉన్నట్టు సీఈఏ తమ వెబ్సైట్లో పేర్కొంది. ‘పిట్‌హెడ్’ కాబట్టి ఇబ్బంది లేదు! బొగ్గు గనులకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ‘పిట్‌హెడ్’ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. ఈ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేసేందుకయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంటు తప్పిస్తే.. మిగతా థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్‌హెడ్’ ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు రవాణా తక్కువ సమయంలో జరుగుతుంది. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, అవసరమైతే తక్షణమే బొగ్గు సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు చెప్తున్నారు. కొరత ఎందుకంటే? కరోనా మహమ్మారి, లాక్డౌన్ల అనంతరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు పుంజుకోవడం, ఇతర రంగాలు కూడా సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనితో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగుదేశం చైనాలో వారం, పది రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రెట్టింపునకు పైగా పెరిగాయి. మన దేశంలోనూ విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు కొరత వచ్చింది. -
వద్దంటున్నా.. ఆగడం లేదు!
ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతంలో థర్మల్‌ప్లాంటును ఏర్పాటు చేసి జీవితాలను నాశనం చేయవద్దని వేడుకుంటున్న ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. తమదే పైచేయి కావాలన్నట్టు వ్యవహరిస్తూ ముందుకు పోతోంది. జపాన్‌కు చెందిన సుమితోమా సంస్థ ఆర్థిక సహకారంతో పోలాకి మండలంలో నిర్మించతలపెట్టిన 400 మెగావాట్ల ఆల్ట్రామెగా థర్మల్ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్లాంటు ప్రతిపాదిత ప్రాంతాల్లో శుక్రవారం భూ సర్వేకు పూనుకున్నారు. దీన్ని రైతులు, ప్రజాసంఘాలు అడ్డుకోవడంతో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టు చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు. * ఉద్యమంపై ఉక్కుపాదం * భారీ పోలీసు బందోబసు నడుమ ‘థర్మల్’ సర్వే * అడ్డుకున్న ప్రజాసంఘాల నాయకులు అరెస్టు, విడుదల * ఆటంకం కలిగిస్తే ఎంతమందినైనా అరెస్టు చేస్తామన్న పోలీసులు తోటాడ(పోలాకి): ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా థర్మల్‌ప్లాంట్ నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. పోలీసుల సాయంతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడడం లేదు. పోలాకి ప్రాంతంలో 38 వేల కోట్ల రూపాయలతో నిర్మించాలని భావిస్తున్న మెగాఆల్ట్రా థర్మల్ ప్లాంట్ కోసం భూసర్వేకు ఇటీవల అధికారులు పూనుకోవడంతో ప్రజలు అడ్డుకున్నారు. అయితే అప్పటికి వెనక్కి తగ్గిన అధికారులు శుక్రవారం మరోసారి సర్వేకు వచ్చారు. ఈసారి భారీగా పోలీసులను వెంటతీసుకొచ్చారు. అరుుతే థర్మల్ వ్యతిరేకులు కూడా వెనక్కి తగ్గలేదు. తోటాడ వద్ద జెన్కో, రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోలాకి, నరసన్నపేట, జలుమూరు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఎన్.లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేను అడ్డుకోవద్దని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు వినలేదు. సర్వే బృందాలను వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఈటీసీ యంత్రాలను పట్టుకుని సిబ్బంది వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జలుమూరు ఎస్ఐతోపాటు మరికొంతమంది సిబ్బంది అక్కడకు చేరుకుని సర్వే అడ్డుకోవద్దని, ప్రజలు సహకరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటివరకూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు సర్వే నిలుపుదల చేస్తామని ప్రకటించి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. వారితోపాటు ప్రజలు కూడా సర్వే తీరుపై తీవ్రంగా విరుసుకుపడ్డారు. దీంతో పోలీసులు ముందుగా ప్రజాసంఘాల నాయకులు కె.మోహనరావు, సురేష్‌బాబు, వారికి మద్దతిచ్చిన రైతు పైశాగి అప్పలస్వామిలను అరెస్టు చేసి.. పోలీసు వాహనంలో ఎక్కించి నరసన్నపేట స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టులను అడ్డుకున్న స్థానికులను కూడా పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేశారు. ఎంతమందినైనా అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మరికొన్ని వాహనాలను తెప్పించారు. దీంతో ప్రజలు భయంతో వెనక్కి తగ్గారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు కేవలం దౌర్జన్యంగా, అధికార బలంతో.. అడ్డగోలుగా చేస్తున్న సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అరుుతే పోలీసు బందోబస్తు మధ్య కొనసాగించటం దారుణమైన చర్య. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. గతంలో కూడా పోలాకి థర్మల్పవర్ప్లాంట్ విషయంలో అనేక అరెస్టులను చూశాం. ఇలాంటి వాటికి భయపడేదిలేదు. సర్వేను అడుగడుగునా అడ్డుకుని తీరుతాం. - కె.మోహనరావు, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిరసన వ్యక్తం చేసే పద్ధతి ఇదికాదు ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై అనుమానాలు, వ్యతిరేకత ఉంటే వేరే పద్ధతుల్లో నిరసన చేపట్టండి. అంతేగాని సర్వేచేస్తు న్న అధికారులును అడ్డుకుంటే సహిం చం. కొంతమంది కావాలనే స్థానికులను రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని నమ్మోద్దు. నేరుగా ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. - ఆర్.ఎస్.ఎస్.చంద్రశేఖరరావు, సీఐ, నరసన్నపేట -
సింగరేణి ప్లాంట్‌కు బొగ్గు రవాణా
► మొదటి యూనిట్ ప్లాంటులో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ► శ్రీరాంపూర్, మందమర్రి, ► భూపాల్పల్లి నుంచి బొగ్గు సరఫరా ► ప్లాంటులో 2.80లక్షల టన్నుల బొగ్గు నిల్వలు జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటుకు అసరమైన బొగ్గును రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న 1200 మెగా వాట్ల ప్లాంటు పనులు తుది దశకు చేరాయి. మార్చిలో బొగ్గు, ఆయిల్‌తో యూనిట్-1 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఈ నెలాఖరుకు యూనిట్-2 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, నీరు ప్రధానం కావడంతో ఇప్పటికే షెట్పల్లి నుంచి 1టీఎంసీ నీటిని తరలించారు. రిజర్వాయర్-1 సిద్ధం చేశారు. కాగా ప్లాంటుకు రైల్వేట్రాక్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించినా అది ఇప్పట్లో పూర్తి అయే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ జైపూర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వరకు ప్రసుత్తం ఉన్న 63నంబరు జాతీయ రహదారిని రూ.19కోట్లతో నాలుగు వరుసల రోడ్డు విస్తరించింది. అలాగే జాతీయ రహదారి నుండి కోల్-హ్యాడ్లింగ్ ప్లాంటు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. శ్రీరాంపూర్ ఓసీపీ, మందమర్రి వాచర్, భూపాల్పల్లి ఏరియాలోని గనుల నుంచి లారీల ద్వారా ప్లాంటుకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఒక యూనిట్ ప్లాంటుకు (600మెగావాట్లు) ఒక రోజుకు 6 వేల టన్నుల బొగ్గు అవసరం అంటే రెండు యూనిట్లకు ఒక్కరోజుకు 12 వేల టన్నుల బొగ్గు అవసరం. బొగ్గు నాణ్యతలోపిస్తే 12వేల నుంచి 15వేల టన్నుల వరకు అవసరం పడుతుంది. అయితే ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అరుుతే 12వేల నుంచి 15వేల టన్నుల బొగ్గు కావాల్సి వస్తుందని, కాని ప్రారంభ దశలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అరుునా ప్లాంటులో 2లక్షల 80వేల టన్నుల బొగ్గును నిల్వ చేశారు. మొదటి యూనిట్ ప్లాంటు నుంచి ఉత్పత్తి 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంటు ను మార్చి 13న సింక్రనైజేషన్ చేయగా శుక్రవారం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సింక్రనైజేషన్ చేసి బొగ్గు, ఆయిల్‌తో ప్రయోగాత్మకం గా ఒక్క రోజు విద్యుత్ ఉత్పత్తి చేసినా ఇక నుం చి యూనిట్-1 ప్లాంటు ద్వారా బొగ్గుతో ఉత్పత్తి చేయనున్నారు. మొదటి యూని ట్ ద్వారా వచ్చిన విద్యుత్‌ను 400కేవీ స్విచ్‌యార్డు ద్వారా గజ్వేల్ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. -
సింగరేణి ప్లాంట్‌కు బొగ్గు రవాణా
జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటుకు అసరమైన బొగ్గును రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న 1200 మెగా వాట్ల ప్లాంటు పనులు తుది దశకు చేరాయి. మార్చిలో బొగ్గు, ఆయిల్‌తో యూనిట్-1 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఈ నెలాఖరుకు యూనిట్-2 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, నీరు ప్రధానం కావడంతో ఇప్పటికే షెట్పల్లి నుంచి 1టీఎంసీ నీటిని తరలించారు. రిజర్వాయర్-1 సిద్ధం చేశారు. కాగా ప్లాంటుకు రైల్వేట్రాక్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించినా అది ఇప్పట్లో పూర్తి అయే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ జైపూర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వరకు ప్రసుత్తం ఉన్న 63నంబరు జాతీయ రహదారిని రూ.19కోట్లతో నాలుగు వరుసల రోడ్డు విస్తరించింది. అలాగే జాతీయ రహదారి నుండి కోల్-హ్యాడ్లింగ్ ప్లాంటు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. శ్రీరాంపూర్ ఓసీపీ, మందమర్రి వాచర్, భూపాల్పల్లి ఏరియాలోని గనుల నుంచి లారీల ద్వారా ప్లాంటుకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఒక యూనిట్ ప్లాంటుకు (600మెగావాట్లు) ఒక రోజుకు 6 వేల టన్నుల బొగ్గు అవసరం అంటే రెండు యూనిట్లకు ఒక్కరోజుకు 12 వేల టన్నుల బొగ్గు అవసరం. బొగ్గు నాణ్యతలోపిస్తే 12వేల నుంచి 15వేల టన్నుల వరకు అవసరం పడుతుంది. అయితే ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అరుుతే 12వేల నుంచి 15వేల టన్నుల బొగ్గు కావాల్సి వస్తుందని, కాని ప్రారంభ దశలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అరుునా ప్లాంటులో 2లక్షల 80వేల టన్నుల బొగ్గును నిల్వ చేశారు. మొదటి యూనిట్ ప్లాంటు నుంచి ఉత్పత్తి 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంటు ను మార్చి 13న సింక్రనైజేషన్ చేయగా శుక్రవారం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సింక్రనైజేషన్ చేసి బొగ్గు, ఆయిల్‌తో ప్రయోగాత్మకం గా ఒక్క రోజు విద్యుత్ ఉత్పత్తి చేసినా ఇక నుం చి యూనిట్-1 ప్లాంటు ద్వారా బొగ్గుతో ఉత్పత్తి చేయనున్నారు. మొదటి యూని ట్ ద్వారా వచ్చిన విద్యుత్‌ను 400కేవీ స్విచ్‌యార్డు ద్వారా గజ్వేల్ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. -
థర్మల్ ప్లాంటు రద్దు చేయండయ్యా...
అప్పిలేట్ అథారిటీకి మొరపెట్టుకున్న పోరాట కమిటీ నాయకులు {పమాదమని తెలిసినా... నిర్మాణం న్యాయమా?: ఓ మహిళ వేడుకోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఎన్విరాన్మెంట్ అప్పిలేట్ సబ్ కమిటీ పాత పరిశీలనల మాదిరిగా చేయొద్దని స్థానికుల వినతి ‘థర్మల్ ప్లాంటువల్ల ప్రమాదం ఉందని తెలిసినా ఇక్కడ నిర్మాణం ఎలా చేపడుతున్నారు... మాకు జీవనోపాధి లేకుండా మా పొట్టలు కొట్టడం ఎంతవరకు సబబు’ అని కారుణ్య రమణమ్మ అనే మత్స్యకార మహిళ వేడుకోలు. ’ఈ ప్లాంటు వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఏటా మా పొలాలు ముంపుబారిన పడతాయి. కాలుష్యంతో ఈ ప్రాంతం సర్వనాశనమవుతుంది. ప్లాంటు రద్దు చేస్తే మేమంతా సంతోషంగా బతుకుతాం’ ఇది పోరాట కమిటీ నాయకుల డిమాండ్ ఇలా అడుగడుగునా ఈస్టుకోస్ట్ థర్మల్ ప్లాంటు యాజమాన్యం తవ్విన కాలువ పరిశీలనకు వచ్చిన జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ సబ్‌కమిటీకి స్థానికులు మొరపెట్టుకున్నారు. సంతబొమ్మాళి : మండలంలోని కాకరాపల్లి పరిసర ప్రాంతాల్లో ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటు యాజమాన్యం తవ్విన కాలువను జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సి.ఆర్.బాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం క్షేత్ర స్థాయిలో శనివారం పరిశీలించింది. తొలుత వడ్డితాండ్ర వద్ద థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కారుణ్య రమణమ్మ అనే మత్స్యకార మహిళ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ థర్మల్ ప్లాంటు వలన ప్రమాదమని తెలిసినప్పటికీ ఇక్కడ నిర్మాణం చేపట్టి జీవనోపాధి లేకుండా పొట్టలను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దశలో ప్లాంటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు థర్మల్ వద్దంటూ నినాదాలు చేశారు. దీనిపై కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ జోక్యం చేసుకుని వారించడంతో నినాదాలను విరమించారు. అక్కడినుంచి కమిటీ థర్మల్ ప్లాంటు మెయిన్ గేటు నుంచి లోపలికి వెళ్లింది. రైతులు, పోరాట కమిటీ నాయకులను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఇది గ్రహించిన కమిటీ సభ్యులు ప్లాంటు నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి కాలువ పొడవునా మూడు గంటల పాటు కాలి నడకనే తిరిగి స్థానికులు, థర్మల్ యాజమాన్యం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. థర్మల్ యాజమాన్యం నిర్మించిన కాలువ నీరు ఎక్కడ సముద్రంలో కలపాలనుకున్నారో మ్యాప్‌లో చూపించాలని కమిటీ చైర్మన్ సి.ఆర్.బాబు ప్రశ్నించడంతో ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అసంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ కాలువ ఎక్కడ అంతం అవుతుందో నీరు ఎలా సముద్రంలో కలుస్తుందో తాను తప్పక చూడాల్సిందేనని పట్టుపట్టారు. గత్యంతరం లేక అన్ని శాఖల అధికారులు ఆయన వెంట వెళ్లారు. కానీ కాలువ ఎక్కడా కలిపినట్లు కనిపించక పోవడం, వెడల్పు కూడా తక్కువగా ఉండడాన్ని కమిటీ గుర్తించింది. వెంటనే కాలువ వెడల్పు చేసి దేశగెడ్డకు కలపాల్సి ఉంటుందని చెర్మైన్ బాబు థర్మల్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు ఆధ్వర్యంలో రైతులు, మత్స్యకారులు పోరాట కమిటీ నాయకులు అప్పిలేట్ థారిటీకి తమ వేదన తెలియజేశారు. తంపర చుట్టూ తవ్విన కాలువ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, ప్లాంటు అవసరాలకే కాలువను తవ్వుకున్నారని వివరించారు. ప్లాంటు చుట్టూ ఎత్తై గట్టు వేయడం, గోడ కట్టడం వల్ల వరదనీరు వెళ్లే దారిలేక ఏటా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. సముద్ర మట్టానికి జీరో లెవల్లో కాలువ ఉండడం వల్ల సముద్రపు నీరు కాలువలోకి వచ్చి పంట పొలాలు ఉప్పు భూములుగా మారే అవకాశముందని అన్నారు. ప్లాంటు నిర్మాణం వల్ల ఏటా సుమారు 30 వేల ఎకరాలు మునిగిపోతున్నాయని చెప్పారు. గత కమిటీల మాదిరిగా వాస్తవాలు బుట్టదాఖలు చేయకుండా న్యాయంచేయాలనికోరారు. పర్యటనలో కమిటీ సభ్యులు డాక్టర్ పి.కె.థార్, పి.డి.స్వాయ్, డి.బి.బామన్, ఎం.రమేష్, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ డీడీ యాకూబ్‌భాషా, తహశీల్దార్ బి.రామారావు, ఇరిగేషన్ అధికారులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరితేజేశ్వరరావు, పోరాట కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
వద్దంటే.. ఎందుకొచ్చారు? వద్దంటే.. ఎందుకొచ్చారు?
పోలాకి: సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ సెగ్ అధికారులకు తగిలింది. థర్మల్ ప్రాజెక్టుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళుతుండటంతో ప్రజలు ప్రత్యక్షంగా తమ వ్యతిరేకతను వెళ్లగక్కేందుకు వెనుదీయడం లేదు. ఫలితంగా ప్లాంట్ ఏర్పాటుకు ప్రాథమిక భూసర్వే చేపట్టిన అధికార బృందానికి చేదు అనుభవం ఎదురైంది. సర్వే ప్రక్రియను స్థానికులు అడ్డుకోవడంతో వారు వెనుదిరగక తప్పలేదు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించిన పోలాకి మండలం తోటాడ పరిసర ప్రాంతాల్లో జెన్కో ఏఈ డి.వి.మధు ఆధ్వర్యంలోని బృందం జీపీఆర్ఎస్ విధానంలో భూములు వివరాలపై ప్రాథమిక సర్వే చేపట్టింది. మొదట తోటాడ వెళ్లిన బృందం సభ్యులు అక్కడి నుంచి చీడివలస గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న చీడివలస, ఓదిపాడు, సన్యాసిరాజుపేట, గవరంపేట గ్రామాలకు చెందిన వందలమంది ప్రజలు ఒక్కసారిగా వారిని అడ్డుకున్నారు. ‘ఎవరిని అడిగి మా పొలాల్లో కొలతలు చేస్తున్నారని’ ప్రశ్నిస్తూ తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మరోసారి మా ప్రాంతాల్లో పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముక్తకంఠంతో హెచ్చరించారు. దాంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా అక్కడున్న విలేకరులతో జెన్కో ఏఈ మధు మాట్లాడుతూ స్థానిక ప్రజల వ్యతిరేకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. స్థానికులు మాట్లాడుతూ ఇప్పటివరకూ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా సర్వేలు నిర్వహించడం ఏమిటని మండిపడ్డారు. జపాన్ కంపెనీ నిర్మించతలపెట్టిన నాలుగు వేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ మెగా థర్మల్ పవర్‌ప్లాంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై సోమవారం మండల కేంద్రానికి ర్యాలీగా వెళ్లి గ్రీవెన్స్‌లో అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంబంధిత పంచాయితీల సమావేశాల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుతామని వివరించారు. -
అమ్మో.. ఇది కష్టాల తీరం!
పోలాకి: థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలపరిశీలన జరుపుతున్న జపాన్ బృందానికి మృతి చెందిన ఆలివ్ రిడ్లే తాబేలు అపశకునం పలికింది. దాన్ని గమనించిన సభ్యులు దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్రిటికల్(ఇది అత్యంత సున్నిత ప్రాంతం) అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లాలో 4వేల మెగావాట్ల ఆల్ట్రామెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి స్ధల పరిశీలన చేస్తున్న జపాన్‌కు చెందిన సుమిటొమొ సంస్థ ప్రతినిధుల బృందం రెండో రోజైన బుధవారం పోలాకి మండలంలో పర్యటించింది. ఈ బృందానికి ఏపీ జెన్కో ఉన్నతాధికారులతో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఇక్కడి భూముల వివరాలు, స్ధితిగతుల గూర్చి వివరించారు. ముందుగా చీడివలస, ఓదిపాడు, గవరంపేట, చెల్లాయివలసల్లోని మెట్టు భూములను పరిశీలించిన బృందం సభ్యులు అనంతరం కొత్తరేవు పంచాయతీలోని కొవిరిపేట సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ నీటి సాంధ్రత, ఉప్పు శాతంతో పాటు ప్రతిపాదిత ప్లాంట్ స్థలానికి గల దూరంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తీరంలో పడి ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు కళేబరాన్ని గమనించి ‘దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్రిటికల్’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక జాతికి చెందిన ఈ తాబేళ్ల మనుగడపై అంతర్జాతీయస్ధాయిలో ఒత్తిడి ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అనంతరం తోటాడ సమీపంలోని సన్యాసిరాజుపేట గుట్టలను పరిశీలించారు. అక్కడి ఉష్ణోగ్రత, సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందన్న సమాచారం సేకరించారు. రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీ, నీటి వసతి బాగున్నాయని రెవెన్యూ, జెన్కో అధికారులు మ్యాప్ ఆధారంగా జపాన్ బృందానికి వివరించారు. అక్కడి నుంచి జోగంపేట తీరానికి వెళ్లారు. అక్కడి సౌకర్యాలు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. వీరి వెంట ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఈఈలు కె.మూర్తి, సీవీ రంగనాగన్, రాజకుమార్, రామక్రిష్ణ, తహశీల్దార్ జె.రామారావు, తదితరులు ఉన్నారు. గట్టి బందోబస్తు జపాన్ బృందం పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు ఆధ్వర్యంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, పోలాకి ఎస్ఐ సత్యనారాయణలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలాకి పోలీస్ సిబ్బందితో పాటు మరో 50 మంది బలగాలను ఈదులవలస జంక్షన్లో మోహరించారు. -
థర్మల్ ప్లాంట్ కోసం పోలాకిలో భూ పరిశీలన
పోలాకి: జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ ప్రతినిధులు జిల్లాలోని పలు ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. పోలాకిలోని తోటాడ గ్రామం వద్ద ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా జెన్కో అధికారులు తోటాడ గ్రామానికి చేరుకుని భూముల వివరాలపై ఆరా తీశారు. ఇక్కడ నుంచి రైల్వేస్టేషన్, సముద్రతీరం, జాతీయ రహదారికి గల దూరాలను అంచనా వేశారు. భూముల పరిశీలనకు వచ్చిన వారిలో ఏపీ జెన్కో సంస్థ ఈఈ కె.సూర్యనారాయణ, కన్సల్టెన్సీ ప్రతినిధి ఎం.మనోహర్, తహశీల్దార్ జె.రామారావు, ఆర్ఐలు అనిల్‌కుమార్, బాలకృష్ణ, మండల సర్వేయర్లు ఉన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో మండల సలహాదారు తమ్మినేని భూషణరావుతో సదరు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెన్కో ఈఈ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలతలను జాపాన్ బృందం పరిశీలించనుందన్నారు. ఇది ప్రాథమిక పరిశీలన మాత్రమేనని, సాంకేతిక నిపుణుల పరిశీలన మేరకు అనుకూలమైతే తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధికారులు గుర్తించిన భూములు వివరాలు ఇవే.. మండలలోని గత వారం రోజులుగా ప్లాంట్ కోసం రెవెన్యూ అధికారులు కసరత్తు చేసి తోటాడ పరిసర గ్రామాల్లో 2227.620 ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో 1050 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలినది అక్కడి రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూములు చీడివలసలో472 ఎకరాలు, యాట్లబసివలస-138, కొండలక్కివలస-407, ఓదిపాడు-605, కుసుమపోలవలస-25, ధీర్ఘాశి-204, తోటాడ-336, చెల్లాయివలస గ్రామ పరిధిలో 338 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. -
ఇచ్ఛాపురంలో థర్మల్ అంటే పోరాటమే
ఈదుపురం (ఇచ్ఛాపురం): ఇచ్ఛాపురం మండలాన్ని థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదిస్తే, అందుకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేయాలని ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన స్వదేశీ మత్స్యకారులు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మండలంలోని ఈదుపురం గ్రామంలో ఆయా సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్ఛాపురంలోనూ థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తే 5 వేల కుటుంబాలకు చెందిన వేలాది మంది స్వదేశీ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడతారని, ప్రజలను నాశనం చేసే ప్లాంటు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాటానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సోంపేట థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే, మళ్లీ మరో థర్మల్ ప్లాంటుకు ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇచ్ఛాపురం, కవిటి, ఈదుపురం ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహించి థర్మల్ వ్యతిరేక పోరాటానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తీర్మానించుకున్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం స్వదేశీ మత్సకారుల సంఘం ప్రతినిధులు మదన్ బెహరా, నవీన్ బెహరా, డైరక్టర్ గుర్నాథ్ బెహరా, మున్సిపల్ కౌన్సిలర్ రవి బెహరా, కిరణ్ కుమార్ బెహరా, ఈదుపురం సంఘం అధ్యక్షుడు తరుణ్ బెహరా, కార్యదర్శి డిల్లేశ్వర బెహరా, పెద్దలు రామచంద్ర బెహరా, రఘునాథ్ బెహరా, భీమ్ సేన్ బెహరా, కవిటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రామచంద్ర బెహరా, కార్యదర్శి ఎం.త్రినాథ బెహరా, ఉపాధ్యక్షుడు ఎ.కమలలోచన బెహరా, డెరైక్టర్ ఎన్.నరోత్తమ్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిపైనే సర్కార్ ఆశలు
ఆ సంస్థ ఏర్పాటు చేయబోయే థర్మల్ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఆశలు తెలంగాణకు అందుబాటులోకి ఏటా 3,855 మిలియన్ యూనిట్లు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం అంచుల్లో ఉన్న రాష్ట్రాన్ని.. సింగరేణి సంస్థ కొంత వరకూ ఆదుకోనుంది. ఆ సంస్థ చేపట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు రాష్ట్రానికి ఊరటగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని నుంచి 2016 చివరినాటికి 3,855 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ వద్ద సింగరేణి రెండు 600 మెగావాట్ల యూనిట్లను నిర్మిస్తోంది. మొదటి యూనిట్‌ను 2015 ఫిబ్రవరిలో, రెండో యూనిట్‌ను జూన్‌లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. పనులు పూర్తికాకపోవటంతో 2016 మార్చిలో మొదటి యూనిట్, 2016 అక్టోబర్‌లో రెండో యూనిట్ అందుబాటులోకి వస్తాయని సింగరేణి అంచనా వేస్తోంది. ఈ మొత్తం 1,200 మెగావాట్లలో 150 మెగావాట్లను తమ సొంత అవసరాలకు వాడుకొని.. మిగతా 1,050 యూనిట్ల విద్యుత్‌ను అమ్ముకోవాలనే ఉద్దేశంతో సింగరేణి ఈ ప్రాజెక్టులను చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నాలుగు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు, పంపిణీ ఒప్పందాలున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇందులో 53.89 శాతం వాటా తెలంగాణకు దక్కుతుంది. అంటే 3,855 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని డిస్కం అంచనా. పనుల్లో జాప్యం..: రూ. 5,700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రం పను లు ఆలస్యమవడంతో... అంచనా వ్యయం ఇప్పటికే రూ. 8,000 కోట్లకు చేరింది. దీనికితోడు బొగ్గు బావుల నుంచి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా చేసే 17 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మా ణం ఇప్పటికీ టెండర్ల దశలోనే ఉంది. దీనికోసం నిధులు కేటాయించినా.. అనుమతులు రాలేదు. ఇక గోదావరి నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ కేంద్రం నిర్మాణం మరింత ఆలస్యం కానున్నాయి. కానీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం దృష్ట్యా పనులు వేగవంతం చేసినట్లు సింగరేణి వర్గాలు వెల్లడించాయి. బొగ్గు సరఫరా పెరిగేనా?: మరోవైపు కొత్త విద్యుత్ కేంద్రాలకు సరిపడే బొగ్గు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎన్టీపీసీతో పాటు తెలంగాణ, ఏపీ జెన్కోల సారథ్యంలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఏటా 8.40 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. వీటికి సింగరేణి నుంచి ఏటా దాదాపు 13 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయగలుగుతోంది. 2012-13లో 11.55 మిలియన్ టన్నులు, గత ఏడాది 13.26 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేశారు. అవసరంతో పోలిస్తే బొగ్గు సరఫరా ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెరగలేదు. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్‌కు ఏటా 1.80 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి అందిస్తోంది. పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ మేరకు రాష్ట్రంలో మరో 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో మొదటి విడతగా 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నిర్మాణానికి.. రామగుండంలో సన్నాహాలు మొదలయ్యాయి. వీటికీ సింగరేణి బొగ్గు సరఫరా చేయాలి. సింగరేణి మొత్తంగా ఏటా 50 మిలియన్ టన్నుల వరకు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నా... ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ సంస్థలకు 77 శాతం బొగ్గును సరఫరా చేస్తోంది. పైగా ఇతర పరిశ్రమలకు కూడా బొగ్గు సరఫరాకు ఒప్పందాలున్నాయి. ఈ తరుణంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచితే తప్ప కొత్త విద్యుత్ కేంద్రాలకు సరిపడేంత అందించడం సాధ్యం కాదు. -
‘థర్మల్’కు రాళ్లెత్తింది కింజరాపు నేతలే !
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారం తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయం చేయాలని చూస్తున్న కింజరాపు నేతలకు తాజా పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో విజయానికి కీలకమైన సంతబొమ్మాళి మండలంలో తిరిగి పట్టు సాధించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు తీవ్ర యత్నాలు కొనసాగిస్తున్నారు. ప్లాంట్ వ్యవహారంతో మాకేం సంబంధం లేదన్నట్లుగా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కింజ రాపు నేతలకు, స్థానికుల నుంచి వస్తున్న వ్య తిరేకతతో తిరిగి వారి తలలకే బొప్పి తగిలేలా పరిస్థితులు మారాయి. తాజా ఎన్నికల్లో కీలకంగా మారనున్న ఈ వ్యవహారంతో తమ రాజ కీయ ఉనికి ప్ర శ్నార్ధకం కానుందనే సిగ్నల్స్ వస్తుండడంతో ఎలాగైనా ఆ బొగ్గు ‘మసి’ వదిలించుకోవాలని బాబాయ్ అబ్బాయ్‌లు చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. టీడీపీ నేతలకుకొమ్ముకాస్తున్న ‘ఈనాడు’ పత్రిక కింజరాపు కుతంత్రాలకు వంతపాడుతూ థర్మల్ మసిని దివంగత మహానేత వైఎస్ఆర్కు అంటించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 2008లో పారిశ్రామికీకరణ భూకేటాయింపులను అడ్డంపెట్టుకుని అంతా నాటి వైఎస్ ప్రభుత్వందే తప్పిదమన్నట్లు ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతున్నారు. దీనికి వంతపాడుతూ ‘ఈనాడు’ ఇష్టానుసారంగా స్థానికుల ప్రమేయం లేకుం డానే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. అయితే దీన్ని థర్మల్ పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ఈనాడు’ వైఖరి పై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారం భం నాటి పరిస్థితులు నేటికీ ఇక్కడి వారికి గుర్తున్నాయి. ప్లాంట్ నిర్మాణ పనుల కోసం సంబంధిత యాజమాన్యం కంటే కింజరాపు నేతలకే ఎక్కువ ఆరాటం ఉండేది. దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు, మాజీ ఎమ్మె ల్యే అచ్చెన్నాయుడులు థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి తమ స్వంత పనిలా భావించి పునాది రాళ్లేశారు. అయితే అప్పట్లో స్థానికంగా తీవ్ర ప్రభావం చూపించగలిగే రాజకీయ, ఆర్థికబలం కింజరాపు నేతల వద్ద ఉండడంతో వారి సంకల్పం కొంతమేర నెరవేరింది. అచ్చెన్న కనుసన్నల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ! ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి 2008 ఏప్రిల్ 23న కాకరాపల్లిలో అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు అంతా తానై వ్యవహరించా రు. జనాలను కట్టడి చేసి, వారికి ఉద్యోవకాశాలొస్తాయని మాయ మాటలు చెప్పి, వారి నోర్లు నొక్కి మరీ థర్మల్‌కు అనుకూలంగా ఈ ప్రాంతాయులున్నారనే నివేదికను పంపిం చారు. థర్మల్ పరిసర గ్రామాల్లోని పలువురు సర్పంచ్‌లకు లేనిపోని ఆశలు చూపించి, ప్లాంట్ నిర్మాణానికి దారి చూపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తన ఏజెంట్ల ద్వారా థర్మల్ యాజ మాన్యం నుంచి భారీగా సొమ్ములు పంపిణీ చేసి తన ‘లక్ష్యం’ ఏంటో తెలియజెప్పారు. అయితే నాటి నుంచే ప్రజావ్యతిరేకత పెరిగి, థర్మల్ ప్లాంట్ రద్దు కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది. 2011 ఫిబ్రవరి 25, 28 పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు బలవ్వం డతో ఈ ఉద్యమం తీవ్రతర మయ్యింది. ఐదేళ్ల క్రితం నుంచి వడ్డితాండ్రలో థర్మల్ రద్దు కోరు తూ ఉద్యమకారులు చేపట్టిన రిలేదీక్షలు నేటికీ కొనసాగిస్తున్నారు. థర్మల్ యుద్ధం తర్వాత ప్రభావిత గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించే ధైర్యం కూడా ఎర్రన్న, అచ్చెన్నలు చేయలేకపోయారు. ఆఖరికి బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు వెంట కూడా వీరు వెళ్లలేకపోయారు. దీంతో ఇక్కడి ప్రజల నుంచి కింజరాపు నేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. థర్మల్ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతు కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి థర్మల్ ఉద్యమానికి పూర్తి మద్దతిచ్చారు. తాను అధికారంలోకి వస్తే థర్మల్ ప్లాంట్ రద్దు ఫైలుపైనే సంతకం చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానికంగా థర్మల్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న టెక్కలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్లాంట్ పరిసరప్రాంతాల్లో పూర్తి మద్దతు సంపాదించడంతో, ఆయన గెలుపు తథ్యమనే సంకేతాలు బయటకొచ్చాయ్. ఇదే విషయం అచ్చెన్న నిర్వహించిన సర్వేలో కూడా తేలడంతో కింజరాపు నేతల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుంటే దగ్గరుండి థర్మల్ ప్లాంట్ కట్టించి తీరుతామని చెప్పినఅచ్చెన్న మాటలు ఇంకా ప్రతి ఉద్యమకారుడికి తెలుసునని, ఇప్పుడు తప్పుడు ఆలోచనలతో వస్తే జనం తరిమికొడతారని ఉద్యమ కారసంఘ నేతలు అనంతు హన్నూరావు, సుగ్గు రామిరెడ్డి, కారుణ్య ఖత్రో, మండపాక న ర్సింగరావు తదిరతులు కింజరాపు నేతలపై ధ్వజమెత్తుతున్నారు. కోరిక తీరదని తెలిసినా విజయం కోసం పాట్లు! నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాజకీయం చేద్దామనుకుంటున్న అచ్చెన్నాయుడు కోరిక తాజా ఎన్నికల్లో కూడా తీరే పరిస్థితులు కన్పించడం లేదు. గతంలో రెండుసార్లు ఓటమి పాలవ్వడంతో, తాజా పరిస్థితులపై పలు సర్వేలు చేయించినప్పటికీ, సంతబొమ్మాళి మండలంలో మెజార్టీయే కీలకమంటూ వచ్చిన నివేదికల ఆధారంగా అచ్చెన్న ‘థర్మల్’ పావులు కదుపుతున్నాడు. ఎలాగైనా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ‘థర్మల్’ మసిని వదిలించుకోవాల్సి ఉంది. అలాగే ఎంపీగా రామ్మోహన్నాయుడుకు కూడా టెక్కలి ఓట్లు అత్యంత కీలకం. దీంతో ఎలాగైనా తనకు ఇబ్బంది లేకుండా పడరాని పాట్లు పడుతున్నారు. ‘ఈనాడు’ సహకారంతో థర్మల్ మసిని వైఎస్‌కు అంటించేలా చేయించి, కథ నాలతో ఊదరగొట్టించి, తాము తప్పించుకునేలా ప్రణాళికలు రచించారు. అయితే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కింకర్తవ్యం అంటూ మిన్నకుండిపోయారు.