‘థర్మల్’కు రాళ్లెత్తింది కింజరాపు నేతలే ! | Thermal movement YSRCP Support | Sakshi
Sakshi News home page

‘థర్మల్’కు రాళ్లెత్తింది కింజరాపు నేతలే !

Published Tue, Apr 29 2014 1:50 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

‘థర్మల్’కు రాళ్లెత్తింది కింజరాపు నేతలే ! - Sakshi

‘థర్మల్’కు రాళ్లెత్తింది కింజరాపు నేతలే !

శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారం తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయం చేయాలని చూస్తున్న కింజరాపు నేతలకు తాజా పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో విజయానికి కీలకమైన సంతబొమ్మాళి మండలంలో తిరిగి పట్టు సాధించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన కింజరాపు రామ్మోహన్నాయుడు,  అచ్చెన్నాయుడులు తీవ్ర యత్నాలు కొనసాగిస్తున్నారు. ప్లాంట్ వ్యవహారంతో మాకేం సంబంధం లేదన్నట్లుగా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
 అయితే కింజ రాపు నేతలకు, స్థానికుల నుంచి వస్తున్న వ్య తిరేకతతో తిరిగి వారి తలలకే బొప్పి తగిలేలా పరిస్థితులు మారాయి. తాజా ఎన్నికల్లో కీలకంగా మారనున్న ఈ వ్యవహారంతో తమ రాజ కీయ ఉనికి ప్ర శ్నార్ధకం కానుందనే సిగ్నల్స్ వస్తుండడంతో ఎలాగైనా ఆ బొగ్గు ‘మసి’ వదిలించుకోవాలని బాబాయ్ అబ్బాయ్‌లు చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. టీడీపీ నేతలకుకొమ్ముకాస్తున్న ‘ఈనాడు’ పత్రిక కింజరాపు కుతంత్రాలకు వంతపాడుతూ థర్మల్ మసిని దివంగత మహానేత వైఎస్‌ఆర్‌కు అంటించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 2008లో పారిశ్రామికీకరణ భూకేటాయింపులను అడ్డంపెట్టుకుని అంతా నాటి వైఎస్ ప్రభుత్వందే తప్పిదమన్నట్లు ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతున్నారు.
 
 దీనికి వంతపాడుతూ ‘ఈనాడు’ ఇష్టానుసారంగా స్థానికుల ప్రమేయం లేకుం డానే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. అయితే దీన్ని థర్మల్ పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ఈనాడు’ వైఖరి పై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారం భం నాటి పరిస్థితులు నేటికీ ఇక్కడి వారికి గుర్తున్నాయి. ప్లాంట్ నిర్మాణ పనుల కోసం సంబంధిత యాజమాన్యం కంటే కింజరాపు నేతలకే ఎక్కువ ఆరాటం ఉండేది. దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు, మాజీ ఎమ్మె ల్యే అచ్చెన్నాయుడులు థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి తమ స్వంత పనిలా భావించి పునాది రాళ్లేశారు. అయితే అప్పట్లో స్థానికంగా తీవ్ర ప్రభావం చూపించగలిగే రాజకీయ, ఆర్థికబలం కింజరాపు నేతల వద్ద ఉండడంతో వారి సంకల్పం కొంతమేర నెరవేరింది.
 
 అచ్చెన్న కనుసన్నల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ!
 ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి 2008 ఏప్రిల్ 23న కాకరాపల్లిలో అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు అంతా తానై వ్యవహరించా రు. జనాలను కట్టడి చేసి, వారికి ఉద్యోవకాశాలొస్తాయని మాయ మాటలు చెప్పి, వారి నోర్లు నొక్కి మరీ థర్మల్‌కు అనుకూలంగా ఈ ప్రాంతాయులున్నారనే నివేదికను పంపిం చారు. థర్మల్ పరిసర గ్రామాల్లోని పలువురు సర్పంచ్‌లకు లేనిపోని ఆశలు చూపించి, ప్లాంట్ నిర్మాణానికి దారి చూపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తన ఏజెంట్ల ద్వారా థర్మల్ యాజ మాన్యం నుంచి భారీగా సొమ్ములు పంపిణీ చేసి తన ‘లక్ష్యం’ ఏంటో తెలియజెప్పారు.
 
 అయితే నాటి నుంచే ప్రజావ్యతిరేకత పెరిగి,  థర్మల్ ప్లాంట్ రద్దు కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది. 2011 ఫిబ్రవరి 25, 28 పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు బలవ్వం డతో ఈ ఉద్యమం తీవ్రతర మయ్యింది.  ఐదేళ్ల క్రితం నుంచి వడ్డితాండ్రలో థర్మల్ రద్దు కోరు తూ ఉద్యమకారులు చేపట్టిన రిలేదీక్షలు నేటికీ కొనసాగిస్తున్నారు. థర్మల్ యుద్ధం తర్వాత ప్రభావిత గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించే ధైర్యం కూడా ఎర్రన్న, అచ్చెన్నలు చేయలేకపోయారు. ఆఖరికి బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు వెంట కూడా వీరు వెళ్లలేకపోయారు. దీంతో ఇక్కడి ప్రజల నుంచి కింజరాపు నేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
 
 థర్మల్ ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
 కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి థర్మల్ ఉద్యమానికి పూర్తి మద్దతిచ్చారు. తాను అధికారంలోకి వస్తే థర్మల్ ప్లాంట్ రద్దు ఫైలుపైనే సంతకం చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానికంగా థర్మల్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న టెక్కలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్లాంట్ పరిసరప్రాంతాల్లో పూర్తి మద్దతు సంపాదించడంతో, ఆయన గెలుపు తథ్యమనే సంకేతాలు బయటకొచ్చాయ్. ఇదే విషయం అచ్చెన్న నిర్వహించిన సర్వేలో కూడా తేలడంతో కింజరాపు నేతల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుంటే దగ్గరుండి థర్మల్ ప్లాంట్ కట్టించి తీరుతామని చెప్పినఅచ్చెన్న మాటలు ఇంకా ప్రతి ఉద్యమకారుడికి తెలుసునని, ఇప్పుడు తప్పుడు ఆలోచనలతో వస్తే జనం తరిమికొడతారని ఉద్యమ కారసంఘ నేతలు అనంతు హన్నూరావు, సుగ్గు రామిరెడ్డి, కారుణ్య ఖత్రో, మండపాక న ర్సింగరావు తదిరతులు కింజరాపు నేతలపై ధ్వజమెత్తుతున్నారు.
 
 కోరిక తీరదని తెలిసినా విజయం కోసం పాట్లు!
 నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాజకీయం చేద్దామనుకుంటున్న అచ్చెన్నాయుడు కోరిక తాజా ఎన్నికల్లో కూడా తీరే పరిస్థితులు కన్పించడం లేదు. గతంలో రెండుసార్లు ఓటమి పాలవ్వడంతో, తాజా పరిస్థితులపై పలు సర్వేలు చేయించినప్పటికీ, సంతబొమ్మాళి మండలంలో మెజార్టీయే కీలకమంటూ వచ్చిన నివేదికల ఆధారంగా అచ్చెన్న ‘థర్మల్’ పావులు కదుపుతున్నాడు. ఎలాగైనా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ‘థర్మల్’ మసిని వదిలించుకోవాల్సి ఉంది. అలాగే ఎంపీగా రామ్మోహన్నాయుడుకు కూడా టెక్కలి ఓట్లు అత్యంత కీలకం. దీంతో ఎలాగైనా తనకు ఇబ్బంది లేకుండా పడరాని పాట్లు పడుతున్నారు. ‘ఈనాడు’ సహకారంతో థర్మల్ మసిని వైఎస్‌కు అంటించేలా చేయించి, కథ నాలతో ఊదరగొట్టించి, తాము తప్పించుకునేలా ప్రణాళికలు రచించారు. అయితే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కింకర్తవ్యం అంటూ మిన్నకుండిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement