Vedanta Group Chairman Anil Agarwal Success Story in Telugu, - Sakshi
Sakshi News home page

Anil Agarwal: 9 వ్యాపారాలు దెబ్బకొడితే.. నేడు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి అధినేత

Published Mon, Jun 26 2023 2:33 PM | Last Updated on Mon, Jun 26 2023 2:55 PM

After 9 failed businesses now owns Rs 148729 crore business Anil Agarwal success story - Sakshi

ఆయనేం బడా వ్యాపార కుటుంబంలో పుట్టలేదు. తొమ్మిది వ్యాపారాలు దెబ్బకొట్టాయి. మానసికంగా కుంగదీశాయి. అయినా నిలబడ్డాడు. కసిగా శ్రమించి వ్యాపారంలో విజయవంతమయ్యారు. నేడాయన రూ. 1.5 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ఆయనే వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్. 

అనిల్ అగర్వాల్‌ ఇటీవల ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందింది. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కలలను ఎలా సాకారం చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు.

 

19 ఏళ్ల వయసులోనే 
పాట్నాలోని మార్వాడీ కుటుంబంలో ఒక చిన్న వ్యాపారికి అనిల్‌ అగర్వాల్ జన్మించారు. చాలా చిన్న వయసులోనే తన తండ్రి వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న ఆయన కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి 19 సంవత్సరాల వయసులోనే ముంబైకి వచ్చేశారు. 1970లో స్క్రాప్ డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

కేంబ్రిడ్జ్‌లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "నేను 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో చాలా కష్టాలు పడ్డాను. విజవంతమైన వ్యక్తులను చూస్తూ  నేను కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి రావాలని కలలు కనేవాడిని. అలా ఎన్నో వ్యాపారాలు చేశారు. 9 వ్యాపారాలు దెబ్బకొట్టాయి. సంవత్సరాల నిరాశ తర్వాత  విజయాన్ని అందుకున్నాను" అన్నారు.

ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది!

ఎప్పుడూ కాలేజీకి వెళ్లని తనను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వానించడం.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం అనేది ఒక కల కంటే తక్కువేమీ కాదు.. అని అనిల్‌ అగర్వాల్ ట్విటర్ తన అనుభవాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అనిల్ అగర్వాల్ నికర సంపద
అనిల్‌ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో విస్తృతమైన ఫాలోవర్లు ఉన్నారు.  స్ఫూర్తిదాయకమైన అంశాలను ఆయన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం ఆయనకు ట్విటర్‌లో 1,63,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అనిల్‌ అగర్వాల్‌ నికర సంపద దాదాపు రూ.16,000 కోట్లు. ఇక ఆయన కుటుంబ నికర సంపద రూ.32000 కోట్లకుపైగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement