న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్.. తాజాగా బార్‌క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి తీసుకున్న 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించేసింది. బార్‌క్లేస్ బ్యాంకుకు 150 మిలియన్ డాలర్లు, స్టాండర్డ్ చార్టర్డ్‌కు 100 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది.
సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లోనూ జరపాల్సిన చెల్లింపులకు తగినన్ని నిధులు తమ దగ్గర ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మార్చి నాటికి చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ముందుగానే చెల్లించేసినట్లు వివరించింది. 1.75 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు వేదాంత రిసోర్సెస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment