Vedanta Resources Company
-
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
వేదాంత 250 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్.. తాజాగా బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి తీసుకున్న 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించేసింది. బార్క్లేస్ బ్యాంకుకు 150 మిలియన్ డాలర్లు, స్టాండర్డ్ చార్టర్డ్‌కు 100 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లోనూ జరపాల్సిన చెల్లింపులకు తగినన్ని నిధులు తమ దగ్గర ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మార్చి నాటికి చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ముందుగానే చెల్లించేసినట్లు వివరించింది. 1.75 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. -
పురోగతికి నిధులు కావాల్సిందే
న్యూఢిల్లీ: వృద్ధికి, దేశ నిర్మాణానికి నిధులు తప్పనిసరి అని అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపుల సామర్థ్యం ఆధారంగానే కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. నిర్వహణ పరిమితుల్లోపే రుణాలను కట్టడి చేస్తామని, ఈ విషయంలో ఇన్వెస్టర్ల సమూహాన్ని ఒప్పించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రుణాలను సకాలంలో చెల్లించిన చరిత్రను ప్రస్తావించింది. పూర్తి చెల్లింపులకు తగిన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి తీర్చాల్సిన రుణాలకు ముందే చెల్లింపులు చేసినట్టు వేదాంత రీసోర్సెస్ తెలిపింది. గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకున్నట్టు వివరించింది. 2023 జూన్‌తో ముగిసే త్రైమాసికం వరకు నిధుల అవసరాలను చేరుకోగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సంస్థ చరిత్రలో ఇప్పటి వరకు 35 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా, వాటన్నింటికీ సకాలంలో చెల్లింపులు చేసినట్టు ప్రకటించింది. అధిక నగదు ప్రవాహాలను తెచ్చిపెట్టే బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయంటూ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చేస్తున్న విస్తరణతో సమీప భవిష్యత్తులో ఆదాయం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘వేదంతా కంపెనీలు అన్నీ కూడా టాప్ సీఈవోల ఆధ్వర్యంలో నిపుణులతో నిర్వహిస్తున్నవి. అధిక వృద్ధి అవకాశాలతో, తక్కువ నిర్వహణ వ్యయాలతో వేదాంతా గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. భారత్ ఆర్థిక పురోగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం’’అని లింక్డ్ఇన్ పోస్ట్‌లో వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వేదాంత లిమిటెడ్ ప్రమోటర్ సంస్థకు భారీ రుణాలు ఉండడంతో.. అదానీ తర్వాత వేదాంతా గ్రూపు రుణ సమస్యలు ఎదుర్కోనుందంటూ ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ విడుదల చేయడం గమనార్హం. -
రుణ చెల్లింపులకు రెడీ: వేదాంతా
న్యూఢిల్లీ: రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా రీసోర్సెస్ తాజాగా స్పష్టం చేసింది. మైనింగ్, మెటల్, చమురు, గ్యాస్ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పాదుకొల్పే బాటలో 175 కోట్ల డాలర్ల రుణాలను పొందనున్నట్లు తెలియజేసింది. బ్యాంకుల నుంచి సిండికేట్, బైలేటరల్ రుణాలను అందుకునే సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. 2023 మార్చివరకూ అన్ని రుణాలనూ ముందస్తుగా చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో 11 నెలల్లో 200 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు పేర్కొంది. రాను న్న ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అవసరమైన లిక్విడిటీని సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హిందుస్తాన్ జింక్(హెచ్‌జెడ్‌ఎల్)లో 6.8% వాటా మినహా ఎలాంటి తనఖాలూ లేవని వెల్లడించింది. అంతర్జాతీయ జింక్ ఆస్తుల విక్రయం లేదా 200 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోకుంటే వేదాంతా క్రెడిట్ రేటింగ్స్ ఒత్తిడిలో పడే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఫిబ్రవరి నెల మొదట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంతా తాజా వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
అంబానీ, అదానీలు అలా.. వేదాంత అనిల్ తీరు ఇలా..
దేశంలో బడా పారిశ్రామికవేత్తలు చెరో దిక్కు అన్నట్టుగా పయణిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా నంబర్ వన్ ధనవంతుడి స్థానం కోసం పోటీ పడుతున్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ చేస్తుండగా.. వీరికి భిన్నంగా వేదంతా రిసోర్స్ అనిల్ అగర్వాల్ పాతకాలం పద్దతిలో ముడి చమురు ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. లాభాలు ఎటుంటే అటే వెళ్లే ఈ బడా బిలియనీర్లు ఎందుకిలా విభిన్న మార్గాలు ఎంచుకున్నారు... ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర అనేక కంపెనీల తలరాతను మార్చేస్తోంది. ఇంతకాలం గ్రీన్ ఎనర్జీ మంత్రం జపించిన కంపెనీలు కిమ్మనడం లేదు. మరోవైపు కొత్త కంపెనీలు సోలార్, హైడ్రోజన్ ఎనర్జీ ఊసెత్తకుండా రెగ్యులర్ పంథాలో ముడి చమురు రంగంలో పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. 4 బిలియన్లు ఆయిల్ రంగంరలో ప్రసిద్ధి చెందిన కెయిర్న్కి ఇండియా యూనిట్‌గా ఉన్న వేదాంత కొత్త బిజినెస్‌లైన్ తీసుకుంది. ఆయిల్ రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రాబోయే మూడేళ్లలో ఏకంగా నాలుగు బిలియన్ డాలర్లను చమురు రంగంలో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ నిధులతో దేశంలో వేదాంతకి ఉన్న 51 బ్లాకుల్లో భారీగా చమురుతోడే పనులు మొదలెట్టనుంది. చాలా టైం ఉంది ప్రస్తుతం ఏడాదికి వేదాంత 1.50 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. అతి త్వరలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల బ్యారెళ్లకు పెంచుకోవాలని వేదాంత డిసైడ్ చేసుకుంది. ఈవీ, హైడ్రోజన్ వెహికల్స్‌కి సుస్థిరమైన మార్కెట్ ఏర్పడేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని.. ఈలోగా ఆయిల్‌కి డిమాండ్ తగ్గదనే ఆలోచనలో వేదాంత ఉంది. 2050 నాటికి కర్భన ఉద్ఘారాలు జీరో చేయాలని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. ఇంకా దానికి పాతికేళ్లకు మించి సమయం ఉన్నందున ఈలోగా మంచి బిజినెస్ చేయోచ్చన్నది వేదాంత ప్లాన్. వార్తో మారిన సీన్ ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టి దండయాత్రతో ఒక్కసారిగా పెరిగిన ఆయిల్ ధరలు ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురి చేశాయి. బ్యారెల్ చమురు ధర రికార్డు స్థాయిలో 141 డాలర్ల హైని టచ్ చేసింది. దీన్ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌కి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది. అందుకే వేదాంత యజమాని అనిల్ అగర్వాల్.. సాటి బిలియనీర్ల బాటను వీడి ఆయిల్‌పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అదానీ 20 బిలియన్ డాలర్లు మరోవైపు ఏషియాలోనే బడా బిలియనీర్లుగా రికార్డులెక్కిన అదానీ అంబానీలు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న పదేళ్ల కాలంలో 20 బిలియన్ డాలర్లు అంటే సుమారు లక్షన్నర కోట్ల రూపాయలను గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పటికే వెల్లడించారు. సోలార్, హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తిపై భారీగా ఖర్చు చేయనుంది అదానీ గ్రూపు. గిగా ఫ్యాక్టరీల్లో రిలయన్స్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అయితే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గిగా ఫ్యాక్టరీలనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 450 గిగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా గుజరాత్‌లోని జామ్ నగర్లో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఇక్కడ సోలార్, హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ సెంటర్లు కూడా స్థాపిస్తున్నారు. సోలార్, హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి పెట్టిన ముఖేష్ అంబానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో పని చేస్తున్న కంపెనీలతో వరుసబెట్టి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. గ్రీన్ ఎనర్జీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌదీకి చెందిన ఆయిల్ కంపనీ ఆరామ్కో డీల్ విషయంనూ అంబానీ వెనక్కి తగ్గారు ముకేశ్ అంబానీ. చదవండి: ఛార్జీల పిడుగులు.. డీజిల్, బంగారం, వంటగ్యాస్ -
Vedanta : కరోన రహిత గ్రామాల కోసం...
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం వేదాంత రిసోర్సెస్ వచ్చే అయిదేళ్లలో సామాజిక కార్యకలాపాలపై రూ. 5,000 కోట్లు వెచ్చించనుంది. 1,000 గ్రామాల్లో వైద్యసేవల కల్పన కోసం ఉద్దేశించిన ’స్వస్థ్ గావ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ విషయాలు వెల్లడించారు. రూ. 5,000 కోట్లతో సామాజిక కార్యకలాపాల్లో భాగంగా పౌష్టికాహారం, మహిళా.. శిశు అభివృద్ధి, హెల్త్‌కేర్, జంతు సంరక్షణ, క్షేత్రస్థాయి క్రీడల అభివృద్ధితో పాటు వివిధ రాష్ట్రాల్లో కరోనా రహిత గ్రామాల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం తదితర అంశాలకు ఈ రూ. 5,000 కోట్లు వినియోగించనున్నట్లు అగర్వాల్ వివరించారు. ఈ భారీ కార్యక్రమాన్ని అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ నిర్వహించనుండగా .. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. చదవండి : కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు -
వేదాంత రిసోర్సెస్ లాభంలో 27 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సహజ వనరుల రంగంలో డైవర్సిఫైడ్ కంపెనీ, లండన్ లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ నిర్వహణ లాభం 2017–18 ఆర్థిక సంవత్సరంలో 27 శాతం వృద్ధి చెంది 4.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అధిక ఉత్పత్తి, పెరిగిన ధరలు కలసివచ్చాయి. ఆదాయం సైతం 33 శాతం పెరిగి 15.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గ్రూపు రుణ భారం 3 బిలియన్ డాలర్లు తగ్గి 15.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఫలితాలపై వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ... ఉత్పత్తి, ధరలు పెరగడంతో ఆదాయం 33 శాతం వృద్ధి చెందిందని, ఎబిటా 27 శాతం పెరిగిందని వివరించారు. కమోడిటీ ధరలు పెరగడం, మార్కెట్లు బాగుండటంతో అన్ని విధాలుగా మెరుగైన పనితీరు సాధ్యమైందన్నారు. కొన్ని వ్యాపారాల్లో ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరినట్టు తెలిపారు. భారత్‌లో సహజ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌ను అవకాశంగా మలుచుకునే మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పారు. దేశీయ మార్కెట్లలో లిస్ట్ అయిన వేదాంత లిమిటెడ్‌కు వేదాంత రిసోర్సెస్ పేరెంట్ కంపెనీ. జింక్, వెండి, ఐరన్, కాపర్, బాక్సైట్ తదితర లోహాలతో పాటు, చమురు, గ్యాస్ ఉత్పత్తిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
వేదాంత రిసోర్సెస్‌లో 4,000 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఈ ఏడాది ఇప్పటివరకూ 4,000 ఉద్యోగాలను తొలగించింది. చమురు, గ్యాస్, అల్యూమినియం, ఇనుము, జింక్ రంగాల్లో వేదాంత అల్యూమినియం, బాల్కో, కెయిర్న్ ఇండియా, సెసా గోవ సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 4,000 వరకూ ప్రత్యక్ష. పరోక్ష ఉద్యోగాలను తొలగించింది. వీటిల్లో 2,700 వరకూ ప్రత్యక్ష ఉద్యోగాలున్నాయి. బాల్కో 1,000 ఉద్యోగాలను, వేదాంత అల్యూమినియం 2,000, సెసా గోవ, కెయిర్న్ ఇండియాలు చెరో 450 చొప్పున ఉద్యోగాల్లో కోత విధించాయి. మార్కెట్ మందగమన ధోరణి వల్ల పలు వ్యయ నియంత్రణ పద్ధతులను చేపట్టామని సంస్థ ప్రకటించిన నేపథ్యంలో తాజా తొలగింపులు చోటుచేసుకున్నాయి.