న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం వేదాంత రిసోర్సెస్ వచ్చే అయిదేళ్లలో సామాజిక కార్యకలాపాలపై రూ. 5,000 కోట్లు వెచ్చించనుంది. 1,000 గ్రామాల్లో వైద్యసేవల కల్పన కోసం ఉద్దేశించిన ’స్వస్థ్ గావ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ విషయాలు వెల్లడించారు.
రూ. 5,000 కోట్లతో
సామాజిక కార్యకలాపాల్లో భాగంగా పౌష్టికాహారం, మహిళా.. శిశు అభివృద్ధి, హెల్త్‌కేర్, జంతు సంరక్షణ, క్షేత్రస్థాయి క్రీడల అభివృద్ధితో పాటు వివిధ రాష్ట్రాల్లో కరోనా రహిత గ్రామాల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం తదితర అంశాలకు ఈ రూ. 5,000 కోట్లు వినియోగించనున్నట్లు అగర్వాల్ వివరించారు. ఈ భారీ కార్యక్రమాన్ని అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ నిర్వహించనుండగా .. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుంది.
చదవండి : కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు
Comments
Please login to add a commentAdd a comment