
న్యూఢిల్లీ: స్టార్ధప్‌లకు(కొత్త కంపెనీల ఏర్పాటు) సాయంగా నిధి ఏర్పాటు చేయడానికిన ఎల్ఐసీ, ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఆసక్తి చూపించాయి. స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నట్టు పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి అనిల్ అగర్వాల్ తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు పేర్కొన్నారు.
దేశంలో స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పలు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ రంగానికి సంబంధించి 16 కార్యక్రమాలను గుర్తించినట్టు తెలిపారు. "భారతదేశంలో కేవలం 6,000 మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉండగా, అమెరికాకు మూడు లక్షల మంది ఉన్నారు. వ్యవస్థను మరింత దృఢంగా నిర్మించడానికి చూస్తున్నట్లు" అని అగర్వాల్ తెలిపారు. జాతీయ స్థాయి మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సాఫ్ట్ బ్యాంకుకు చెందిన మనోజ్ కోహ్లి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)
Comments
Please login to add a commentAdd a comment