Mohan Charan Majhi
-
నైనీ గనులకు ఒడిశా సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనిలో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాంజీ స్పష్టం చేశారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు హామీ ఇచ్చారు. దశాబ్దం కిందట ఆ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినా అక్కడ ఒక్క తట్ట బొగ్గు కూడా ఉత్పత్తి చేయ లేదు.ఇప్పుడు బొగ్గు తవ్వకాలకు అన్ని రకాల అనుమతులు వచి్చన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ప్రభు త్వ సహకారాన్ని కోరేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో మాంజీని కలిసి విజ్ఞప్తి చేశారు. బొగ్గు గని ఆవశ్యకతను తెలంగాణ డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. స్పందించిన ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాంజీ.. భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ సమస్య పరిష్కారమైతే తవ్వకాలు: భట్టి నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూ టీ సీఎం భట్టి ఈ సందర్భంగా తెలిపారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైన వెంటనే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం ద్వారా 1,200మందికి ఉపాధితో పాటు పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశాకు రాయల్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని మాంజీ దృష్టికి తెచ్చారు.ప్రతీ ఏటా ఇక్కడ నుంచి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. బొగ్గు గనుల వద్దనే 2 ్ఠ800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తుందని భట్టి ప్రకటించారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
ఒడిశా సీఎంను కలిసిన వేదాంత గ్రూప్ ఛైర్మన్
వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు. వీరిద్దరూ సమావేశమై రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్.. వేదాంత గ్రూప్ తిరుగులేని నిబద్ధతను గురించి ప్రశంసించారు.ఒడిశా పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయగల కొత్త సహకార రంగాలను గుర్తించడంపై వీరిరువురు చర్చించుకున్నారు. కొత్త ప్రభుత్వ దార్శనికత, నాయకత్వంపై అగర్వాల్ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా అద్భుతమైన అభివృద్ధి ప్రజల సంపూర్ణ కృషి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.వేదాంత విజయానికి రాష్ట్రం కీలకం, దాని స్థిరమైన అభివృద్ధికి మేము అంకితభావంతో ఉన్నాము అని అగర్వాల్ అన్నారు. వేదాంత గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని సమాచారం. దీంతో రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే.. రాష్ట్ర అభివృద్ధి మరింత పెరుగుతుందని తెలుస్తోంది. -
ఒడిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన పీఎం మోదీ
-
ఒడిశా సీఎంగా ‘మాఝీ’ ప్రమాణస్వీకారం
భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ బుధవారం(జూన్ 12) సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణస్వీకారానికి హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ను సీఎం మోహన్ చరణ్ ఆహ్వానించారు. బుధవారం ఉదయం స్వయంగా నవీన్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానాన్ని అందించారు.ఆహ్వానాన్ని మన్నించి నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ 78 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజుజనతాదల్ 51 సీట్లతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది. -
ఒడిశాలో బీజేపీ సంచలన నిర్ణయం
-
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీకి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.