
భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ బుధవారం(జూన్ 12) సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణస్వీకారానికి హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ను సీఎం మోహన్ చరణ్ ఆహ్వానించారు. బుధవారం ఉదయం స్వయంగా నవీన్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానాన్ని అందించారు.ఆహ్వానాన్ని మన్నించి నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ 78 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజుజనతాదల్ 51 సీట్లతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.

Comments
Please login to add a commentAdd a comment