ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సోమవారం) గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం పటేల్ ఎనలేని కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
‘గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు. గుజరాత్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్ర యువతకు సాధికారత కల్పించేందుకు ఆయన ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ దాదా భగవాన్ ఆలయాన్ని సందర్శించారు. దీంతో పాటు శివాలయంలో జలాభిషేకం నిర్వహించారు. భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న అహ్మదాబాద్‌లో జన్మించారు. 2022 డిసెంబర్ 12న గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Best wishes to Gujarat CM Shri Bhupendrabhai Patel on his birthday. He’s making commendable efforts to boost Gujarat’s development and empower the state’s youth. Wishing him a long and healthy life in service of the people. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) July 15, 2024
Comments
Please login to add a commentAdd a comment