సీఎం పదవిపై నాకు ఆశలేదు: ఏక్‌నాథ్‌ షిండే | Eknath Shinde Comments Over Chief Minister Of Maharashtra | Sakshi
Sakshi News home page

ఎన్నో ఒడిదుడుకులు చూశా.. సీఎం పదవిపై నాకు ఆశలేదు: ఏక్‌నాథ్‌ షిండే

Published Wed, Nov 27 2024 4:05 PM | Last Updated on Wed, Nov 27 2024 4:50 PM

Eknath Shinde Comments Over Chief Minister Of Maharashtra

ముంబై :  మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని, బాల్‌ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారాయన. బుధవారం థానేలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 

‘మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారు.  అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. సీఎం పదవిపై నాకు ఆశ లేదు. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌. అంతిమంగా.. మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం’’ అని అన్నారాయన.

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ విజయాన్ని అందించిన  ఓటర్లకు నా కృతజ్ఞతలు. కూటమికి మద్దతు పలికిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. బాల్‌ ఠాక్రే ఆశయాలతో ముందుకెళ్తా. మహయుతి కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. నా జీవితంలో నేను సీఎం అవుతానని అనుకోలేదు. ఎన్నో ఒడిదుడుకులు చూశాను. పేదల కష్టాలు, బాధలు చూశాను. మహాయుతి కూటమిలో ఓ కార్యకర్తగా పనిచేశా. ప్రధాని మోదీ మద్దతు నాకు ఉంది అని అన్నారు.

ఇక కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరు? అనేది బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని చేసినా తనకు అభ్యంతరం లేదని ప్రధాని మోదీకి చెప్పాను. పీఎం మోదీ మాటకు కట్టుబడి ఉంటాను’ అని ఉత్కంఠకు తెర దించారు ఏక్‌నాథ్‌ షిండే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement