ముంబై: మహరాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. ప్రస్తుత, మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆస్పత్రి పాలయ్యారు.
గతవారం అనారోగ్యం కారణంగా ఏక్‌నాథ్ షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో షిండేని అత్యవసర చికిత్స నిమిత్తం థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించారు.
పలు రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడలేదని నిర్ధారించారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది.
కొద్ది సేపట్లో మహాయుతి కూటమి కీలక సమావేశం
ఓ వైపు ఏక్‌నాథ్ షిండే అనారోగ్య రిత్యా ఆస్పత్రిలో చేరాగా.. మరోవైపు మహాయుతి కూటమి కీలక సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
వేర్వేరు నగరాల్లో మహాయుతి కీలక నేతలు
మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతుంది. మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో కీలక నేతలు వేర్వేరు నగరాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని కీలక నేతలు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టత ఇచ్చారు.
గత వారం ఏక్‌నాథ్ షిండే అనారోగ్యంతో తన స్వగ్రామానికి వెళ్లారు. నాటి నుంచి మహాయుతి కూటమి నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత శనివారం ఏక్‌నాథ్ షిండేని పరీక్షించిన వైద్యులు వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా, మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం కుదుట పడకపోవడంతో థానేలోని జూపిటర్ ఆస్పత్రికి వెళ్లారు.
'Tabiyat agar bhadiya hai' then what exactly is Eknath Shinde doing in the hospital while Maharashtra waits for its Chief Minister?#EknathShinde #MaharashtraCM pic.twitter.com/9eZwOpqe70
— Sneha Mordani (@snehamordani) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment