
ముంబై : మహా సీఎం పదవిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ తరుణంలో తనకు డిప్యూటీ సీఎం పదవి అంటూ వస్తున్న వార్తల్ని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే కొట్టి పారేశారు.
తన కుమారుడు శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ ఏక్‌నాథ్ షిండే మహాయుతి కూటమి పెద్దలతో మంతనాలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని శ్రీకాంత్ షిండే సోమవారం ఖండించారు. తన గురించి నిరాధారమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయని, తాను మహారాష్ట్రలో ఏ మంత్రి పదవికి రేసులో లేనని స్పష్టం చేశారు.
‘మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. కాబట్టే చర్చలు, పుకార్లకు దారి తీసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజులు తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను ఉపముఖ్యమంత్రి అవుతాననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తలు నిరాధారమైనవి’ అని శ్రీకాంత్ షిండే ట్వీట్‌లో పేర్కొన్నారు
महायुतीच्या सरकारचा शपथविधी थोडा लांबल्यामुळे सध्या चर्चा आणि अफवा यांचे पीक फोफावले आहे. काळजीवाहू मुख्यमंत्री मा. श्री एकनाथ शिंदे यांनी प्रकृती अस्वास्थ्यामुळे दोन दिवस गावी जाऊन विश्रांती घेतली. त्यामुळे अफवांना अधिकच बहर आला. मी उपमुख्यमंत्री होणार अशा बातम्या प्रश्नचिन्हे…
— Dr Shrikant Lata Eknath Shinde (@DrSEShinde) December 2, 2024