ముంబై: మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ డిసెంబర్ 4 జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రేపే ఢిల్లీకి వెళ్లనున్నారు.
మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దలు చేస్తున్న కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఏకాంతంగా చర్చలు జరిపేందుకు ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీకి పయనమయ్యారు.
కేబినెట్ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్‌నాథ్ షిండే హాజరు కావాల్సి ఉంది. కానీ షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ తమ అధినేత షిండేకు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు. బీజేపీ పెద్దలు మీటింగ్ షెడ్యూల్ ఖరారుపై ఎదురు చూస్తున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం.
Union Finance Minister @nsitharaman and Former Gujarat Chief Minister Vijay Rupani have been appointed as #BJP's Central Observers for Legislature Party meeting to elect leader in #Maharashtra. pic.twitter.com/3wb1DryKVD
— All India Radio News (@airnewsalerts) December 2, 2024
Comments
Please login to add a commentAdd a comment