గనుల తవ్వకానికి సహకరిస్తాం
ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతికి వెంటనే స్పందన
ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం
త్వరలోనే బొగ్గు తవ్వకాలు ప్రారంభం
రాయలీ్టగా ఏటా ఒడిశాకు రూ.600 కోట్లు: భట్టి వెల్లడి
సాక్షి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనిలో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాంజీ స్పష్టం చేశారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు హామీ ఇచ్చారు. దశాబ్దం కిందట ఆ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినా అక్కడ ఒక్క తట్ట బొగ్గు కూడా ఉత్పత్తి చేయ లేదు.
ఇప్పుడు బొగ్గు తవ్వకాలకు అన్ని రకాల అనుమతులు వచి్చన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ప్రభు త్వ సహకారాన్ని కోరేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో మాంజీని కలిసి విజ్ఞప్తి చేశారు. బొగ్గు గని ఆవశ్యకతను తెలంగాణ డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. స్పందించిన ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాంజీ.. భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ సమస్య పరిష్కారమైతే తవ్వకాలు: భట్టి
నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూ టీ సీఎం భట్టి ఈ సందర్భంగా తెలిపారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైన వెంటనే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం ద్వారా 1,200మందికి ఉపాధితో పాటు పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశాకు రాయల్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని మాంజీ దృష్టికి తెచ్చారు.
ప్రతీ ఏటా ఇక్కడ నుంచి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. బొగ్గు గనుల వద్దనే 2 ్ఠ800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తుందని భట్టి ప్రకటించారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment