సీఎం చాంబర్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాంబర్లో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అసెంబ్లీలోని నవీన్ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో చాంబర్ లో సీఎం లేరు.
ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఇది చిన్న ప్రమాదమేనని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగినట్టు చెప్పారు. డాక్యుమెంట్లు ఏవీ కాలిపోలేదని.. ఓ టీవీ, కొంచెం ఫర్నీచర్ దెబ్బతిన్నట్టు బీజేడీ ఎమ్మెల్యే దేవాసిస్ నాయక్ చెప్పారు. డీజీపీ కేబీ సింగ్, పోలీస్ కమిషనర్ ఖురానియా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.