cm chamber
-
ఏపీ సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
-
సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు సీఎం చాంబర్ మొదటి బ్లాక్‌ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, వైఎస్సార్ సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చాంబర్ పనులను పరిశీలించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. -
సీఎం చాంబర్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాంబర్లో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అసెంబ్లీలోని నవీన్ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో చాంబర్ లో సీఎం లేరు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఇది చిన్న ప్రమాదమేనని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగినట్టు చెప్పారు. డాక్యుమెంట్లు ఏవీ కాలిపోలేదని.. ఓ టీవీ, కొంచెం ఫర్నీచర్ దెబ్బతిన్నట్టు బీజేడీ ఎమ్మెల్యే దేవాసిస్ నాయక్ చెప్పారు. డీజీపీ కేబీ సింగ్, పోలీస్ కమిషనర్ ఖురానియా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.