నవీన్‌ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్‌ | Assam Cm Himanta Sensational Post On Naveen Patnaik | Sakshi
Sakshi News home page

నవీన్‌ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్‌

Published Tue, May 28 2024 6:28 PM | Last Updated on Tue, May 28 2024 6:46 PM

Assam Cm Himanta Sensational Post On  Naveen Patnaik

భువనేశ్వర్‌: ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ హిమంత బిశ్వశర్మ ఎక్స్‌(ట్విటర్‌)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్‌ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు  రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాండియన్‌ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. 

దీన్ని బట్టి పాండియన్‌ చేతిలో నవీన్‌ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్‌ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా,  తాజాగా  ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్‌ పట్నాయక్‌ ఒక పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. 

ఇంతలో నవీన్‌కు మైక్‌ పట్టుకున్న పాండియన్‌ వెంటనే నవీన్‌ పట్నాయక్‌ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్‌(ట్విటర్‌)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement