భువనేశ్వర్: ఒడిాశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిాశా అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే నవీన్‌పట్నాయక్ ఆరోగ్యంపై ఒక కమిటీ వేసి విచారణ జరుపుతామని ప్రకటించారు.
బుధవారం(మే29) ఒడిషా బరిపడలో జరిగిన ఎన్నిల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘కొన్ని సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ సన్నిహితులు నన్నెప్పుడు కలిసినా ఆయన ఆరోగ్యం గురించి తప్పకుండా చర్చించేవాళ్లు.
నవీన్ తనకు తాను సొంతగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేవాళ్లు. నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.
మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నవీన్‌బాబు అనారోగ్యం వెనుక ఎవరున్నారనేదానిపై కమిటీ వేసి విచారణ జరుపుతాం’అని మోదీ హామీ ఇచ్చారు. కాగా, నవీన్ పట్నాయక్ అనుయాయుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా నవీన్ పట్నాయక్ వీకే పాండియన్ చేతిలో బంధీగా మారారని ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment