జూన్‌ 4 తర్వాత నవీన్‌బాబు ఇంటికే: అమిత్‌ షా | Amitsha Comments On Odisha Cm Navin Patnaik | Sakshi
Sakshi News home page

జూన్‌ 4 తర్వాత నవీన్‌బాబు ఇంటికే: అమిత్‌ షా

Published Tue, May 28 2024 3:54 PM | Last Updated on Tue, May 28 2024 4:18 PM

Amitsha Comments On Odisha Cm Navin Patnaik

భద్రక్‌: ఒడిశాలో ఈసారి బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. మంగళవారం(మే28) భద్రక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చాంద్‌బలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా పాల్గొని మట్లాడారు. 

జూన్‌ 4 తర్వాత నవీన్‌బాబు సీఎంగా ఉండరన్నారు . 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన కొత్త వ్యక్తి సీఎంగా రాబోతున్నారన్నారు. 

ప్రస్తుతం తమిళ్‌బాబు(రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీకే పాండియన్‌)  తెర వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువత ఉపాధి కోసం ఇక్కడే పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement