భువనేశ్వర్: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు? అని మోదీ చేసిన వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ స్పందించారు.
‘‘ప్రధాని మోదీ గారు.. ఒడిశా గురించి మీకు ఎంతమేరకు గుర్తుంది. ఒడియా ఒక శాస్త్రీయ భాష. దానిని మీరు మర్చిపోయారు. సంస్కృతం కోసం బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించారు.. కానీ, ఒడియాకు కేటాయింపులు శూన్యం. నేను శాస్త్రీయ ఒడిస్సీ సంగీత గుర్తింపు కోసం ప్రతిపాదలు పంపాను.కానీ, వాటిని మీరు రెండు సార్లు తిరస్కరించారు.
ఒడిశాలో అధికంగా లభించే సహజ వనరు బొగ్గు. కేంద్రం బొగ్గును ఒడిశా నుంచి తీసుకుంటోంది. కానీ, గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ రాయల్టీ పెంచలేదు. మోదీకి ఎన్నికల సమయంలో మాత్రమే ఒడిశా గుర్తుకు వస్తుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు(మోదీ) ఇచ్చిన హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ధరలు తగ్గిస్తాం. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గిస్తాం వంటి హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు.
అదే విధంగా ఒడిశాలోని మహానీయులను మోదీ ఎందుకు మర్చిపోయారు. వారికి భారత రత్న వంటి అవార్డులను ఎందుకు ఇవ్వలేకపోయారు. మరో పదేళ్లపాటు బీజేపీ ఒడిశా ప్రజలను మనసులకు గెల్చుకోలేదు’అని సీఎం నవీన్ పట్నాయక్ విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు.
..ఒడిశాలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ సీఎం నవీన్ పట్నాయక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు‘‘ ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్‌లో చూడకూండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా? పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు?’’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment