
filephoto
భువనేశ్వర్: ఎవరో రాసిచ్చిన కాగితం సాయం లేకుండా ఒడిషాలో ఉన్న జిల్లాల పేర్లు వరుసగా చెప్పాలని సీఎం నవీన్‌పట్నాయక్‌కు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. ‘నవీన్‌బాబుకు నేనొక సవాల్ విసురుతున్నాను. ఆయన అన్నేళ్లు సీఎంగా పనిచేశారు కదా ఒడిషాలో జిల్లాల పేర్లు అడగండి.
చూడకుండా చెప్తాడేమో తెలుస్తుంది. పేర్లు చెప్పలేని సీఎంకు మీ బాధ ఎలా తెలుస్తుంది. ఈసారి బీజేపీకి ఛాన్సివ్వండి. ఐదేళ్లలో ఒడిషాను నెంబర్‌వన్‌గా చేయకపోతే అవగండి’అని మోదీ అన్నారు. ఒడిషాలో ఉన్న 147 ఎమ్మెల్యే సీట్లకు 21 ఎంపీ సీట్లకు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది.