ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
147 స్థానాలకుగాను 78 స్థానాల్లో గెలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి.
సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్
2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.
పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం
ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్‌లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది.
Comments
Please login to add a commentAdd a comment