Assembly election
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
-
ఎన్డీఏ వైపే సర్వేలు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో NDA కూటమిదే పైచేయి
-
కొనసాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
మహారాష్ట్రలో ఉత్కంఠ రేపుతోన్న రాజకీయాలు
-
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవర్తన మీద!మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్)ల ‘మహా వికాస్ ఆఘాడి’ (ఎమ్వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్ పవార్‌ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్‌సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.ఇదివరకటిలా కాకుండా, రాహుల్‌గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ 122 అయితే ‘మహా ఘట్ బందన్’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ ఫరూక్ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్‌కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్ అబూలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల కాంక్లేవ్‌లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్ గెలువగలదు...’ అని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. రాజీవ్‌గాంధీ హత్యలో డీఎమ్‌కేకు భాగముందని కాంగ్రెస్ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్‌ను చీల్చిన శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యమపార్టీ టీఆర్ఎస్తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్‌కు శరణ్యం.2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,‘పీపుల్స్ పల్స్’ డైరెక్టర్ -
జులానాలో విజేత.. వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు రెజ్లర్ వినేశ్ ఫొగాట్(30). జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన ఫొగాట్ దాదాపు 19 ఏళ్ల అనంతరం ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. రెజ్లింగ్‌లో విజయం సాధించలేకపోయిన ఫొగాట్‌ను జులానా ఓటర్లు ఆదరించారు. ఫొగాట్‌కు 65,080 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌కు 59,065 ఓట్లు పడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఫొగాట్ మధ్యలో కాస్త వెనుకబడ్డారు. చివరకు 6,015 ఓట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 12,440 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒలింపియన్ వినేశ్ ఫొగాట్‌ను బరిలోకి దింపి జాట్ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి, సఫలమైంది. మరోవైపు, బీజేపీ యోగేష్ కుమార్‌ను నిలిపి ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచి, విఫలమైంది. -
హర్యానాలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ప్రారంభం..
-
అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం ఎవరికో.. కశ్మీర్లో కదం తొక్కిన ఓటర్లు (ఫొటోలు)
-
Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. బీజేపీని వీడి ఆప్‌లో చేరిన ప్రొఫెసర్ ఛత్రపాల్‌ను బర్వాలా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.తాజాగా ప్రకటించిన జాబితాలో సధైరా నుంచి రీటా బమ్నేయకు టిక్కెట్టు ఇచ్చారు. థానేసర్ నుంచి కృష్ణ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. ముక్త్యార్ సింగ్ బాజిగర్కు రాటియా నుంచి, అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్‌కు అడంపూర్ నుంచి, జవహర్‌లాల్‌కు బవాల్ టిక్కెట్ ఇచ్చారు. ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, తిగావ్ నుంచి అబాష్ చండేలాలను అభ్యర్థులుగా ప్రకటించారు.మరోవైపు గత ఐదు రోజులుగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. పొత్తులో భాగంగా ఆప్ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఆ పార్టీకి మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు లేనట్లేనని తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. -
వినేశ్ రాజకీయం నాకిష్టం లేదు: మహవీర్ ఫోగట్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరిగే హర్యానా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారని సమాచారం. ఇక.. ఈ నేపథ్యంలో వినేశ్ రాజకీయ ప్రవేశంపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ ప్రతికూలంగా స్పందించారు. వినేశ్ ఫోగట్ రాజకీయ రంగ ప్రవేశంపై తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే..‘‘మరో ఒలింపిక్స్(2028)లో వినేశ్ పాల్గొనాలని కోరుకుంటున్నా. ఆ పోటీలో ఆమె బంగారు పతకం గెలవాలి. అందుకోసం ఆమె మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి సారించాలి. ఆమె రాజకీయాల్లో చేరటాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. యువకులైన పిల్లలు వాళ్లు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వారిపైన ఆధారపడి ఉంటుంది. వారికి నచ్చజెప్పటమే నా బాధ్యత.ఈ వయస్సులో వినేశ్ మరో ఒలింపిక్స్‌లో పాల్గొనటమే సరియైంది. ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నా. బ్రిజ్ భూషన్‌పై రెజ్లర్లు అంతా నిరసనలు చేశారు. దాని వల్ల ఏం న్యాయం జరగలేదు. హర్యానాలో ఎన్నికల ప్రకటన వెలువడి.. వినేశ్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక అన్ని చర్చలు మొదలయ్యాయి’’ అని అన్నారు. వినేశ్ రెజ్లింగ్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మహవీర్ ఫోగట్ పునఃపరిశీలించాలని ఇటీవల కోరిన విషయం తెలిసిందే.మరోవైపు.. వినేశ్, భజరంగ్ పూనియాలో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. వినేశ్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే.. భగవంతుడు ఆమెకు పతకం చేజారేలా చేశాడని అన్నారు. -
‘ఆజాద్‌కు అంత సీన్ లేదు.. కశ్మీర్లో విజయం మాదే’
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపు మాది అంటే.. లేదు మాదే అంటున్నారు. ఇక, తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా..‘గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో.. ఈ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే కాదన్న ఆయన.. రాష్ట్రహోదా, అసెంబ్లీ అధికారాల పునరుద్ధరణ కోసమేనని తెలిపారు. అలాగే, సీఎం పదవి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకే దక్కుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎన్నికల వేళ ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు. అయితే, కశ్మీర్లో త్వరలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
J&K: 30 ఏళ్లలో తొలిసారి.. అసెంబ్లీ బరిలో మహిళా కాశ్మీరీ పండిట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపత్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళా కాశ్మీరీ పండింట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయూ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరుపున పుల్వామాలోని రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం ఆమె బరిలోకి దిగుతున్నారు.అయితే జమ్మూకశ్మీర్‌లో మొత్తం తొమ్మిది మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత తమ గొంతుకగా నిలవాలని కోరుకున్నందున తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.‘ఇక్కడి యువకులు నన్ను పోటీ చేయమని బలవంతం చేశారు. వారి వాయిస్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి చేరేలా చూడాలని నన్ను అడిగారు. నేను ఇక్కడ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. ఇక్కడి యువకులను తరుచుగా కలుస్తుంటాను. వారి సమస్యలను విని అర్థం చేసుకున్నాను. ఇక్కడి యువత ఏం తప్పు చేయనప్పటికీ బాధ పడుతున్నారు. 1990వ కాలంలో జమ్మూ కాశ్మీర్లో జన్మించిన యువకులు కేవలం బుల్లెట్లను మాత్రమే చూశారు’ అని పేర్కొన్నారు.కాగా రైనా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2020లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారని రైనాను ప్రశ్నించగా.. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకోలేదని చెప్పారు. అయితే పుల్వామాను చక్కదిద్దగలనని చెప్పి ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని యువకులు తనను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనగర్‌లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండింట్ల విషయంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 25న మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా.. వారిలో ఆరుగురు కాశ్మీరీ పండింట్లు ఉన్నారు.మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
-
ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు ప్రజలను యథేచ్ఛగా మోసం చేస్తున్నారన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్ చట్టంలో సవరణలు
ఢిల్లీ: జమ్ము-కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్ లెఫ్ట్నెట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.అయితే ఈ సవరణల వల్ల జమ్ము కశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఇక నుంచి ఆర్థికశాఖ అనుమంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను చీఫ్ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే.. ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం.. ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. -
దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే రహస్య మీట్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు. మాజీ సీఎంలైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.ఏ విషయంపై మాట్లాడుతకున్నారో తెలియలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.అనంతరం ఉద్ధవ్ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఠక్రే సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు 1965లో విడుదలైన జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుఉకోకకుండా తామిద్దరం కలిసినట్లు చెప్పారు.#maharashtraassembly : Uddhav Thackarey and Devendra Fadnavis in same lift. pic.twitter.com/YzgcZAcoJi— Sonu Kanojia (@NNsonukanojia) June 27, 2024 మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్ చాక్లెట్ బార్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు.కాగా ఈ ప్రభుత్వంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల అధికార కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30, ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకుంది. -
తేడా ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మూడు పార్లమెంటు సెగ్మెంట్లలో విస్తరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోగా, కొత్తగా కాంగ్రెస్ పెద్దపల్లి స్థానంలో పాగా వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కీలకమైన కరీంనగర్ సెగ్మెంట్లో ఓటమిపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డపై మూడోస్థానానికి పరిమితవడాన్ని బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతుండగా, రాష్ట్రమంతా హస్తం హవా వీస్తున్న వేళ.. కరీంనగర్, నిజామాబాద్‌లలో ఆశించిన ఫలితాలు రానందుకు కాంగ్రెస్ పార్టీ మదనపడుతోంది. తేడా ఎక్కడ జరిగిందన్న విషయంపై ఉమ్మడి జిల్లా నేతలు లెక్కలు వేస్తున్నారు.బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి..ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఉమ్మడి కరీంనగర్ పుట్టినిల్లు. అలాంటి కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అది కూడా మూడోస్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని పార్లమెంట్ ఫలితాలే చెబుతున్నాయి.. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూడటం ఇరకాటంలో పడేసింది. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఎదురుదా డిని బీఆర్ఎస్ తిప్పికొట్టలేదన్న విమర్శలున్నాయి.కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్థానికేతరుడంటూ బీజేపీ, కాంగ్రెస్ అటాక్ చేశాయి. ఫలితంగా ఒకప్పుడు 2.05 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు కేవలం 2.80 లక్షల ఓట్లకు పరిమితమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిపిన కారు పార్టీకి ఇక్కడా పరాభవం తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.ఇక, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఆలస్యమే కారణమా?కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్లారు. గత ఎన్నికలతో పోల్చినపుడు 1.80 లక్షల ఓట్లు అదనంగా సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అభ్యర్థిత్వాన్ని మరికాస్త ముందు ప్రకటిస్తే మరింత మెరుగ్గా రాణించి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 4.75 లక్షల ఓట్లతో సత్తా చాటారు. తాత, తండ్రి తర్వాత మూడో తరం కూడా అదే స్థానం నుంచి గెలిచి, రికార్డు దక్కించుకున్నారు.నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓటమిపై పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. 4,83,077 ఓట్లు సాధించినా ఆయన విజయానికి లక్షకు పైగా ఓట్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.బీజేపీలో జోష్..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ జోష్ కనిపించింది. సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్‌లను తిరిగి కైవసం చేసుకుంది. అదే సమయంలో పెద్దపల్లి స్థానంలో గెలిచినంత పని చేసింది. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రదర్శనకు కారణం ఎన్నికల సమయంలో మోదీ జగిత్యాల, వేములవాడ సభలే. కేడర్‌లో జోష్ నింపడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయ్యింది.జీవన్‌రెడ్డి పోటీకి దిగడంతో ఆరంభంలో నిజామాబాద్‌లో ఆందోళన కనిపించినా.. క్రమంగా సెగ్మెంట్‌ను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి విజయం సాధించారు.ఇక, పెద్దపల్లిలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. గోమాసె శ్రీనివాస్ 3.44 లక్షల ఓట్లు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక దశలో గెలుస్తారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్‌కు ప్రతీ రౌండ్లో గట్టి పోటీ ఇచ్చారు.కరీంనగర్లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజారిటీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులిద్దరూ ఓసీలవడం, బీసీల ఓటు బ్యాంకు కలిసి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.బీఆర్ఎస్ ఓట్లు ఎటు పడ్డట్టు?ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు పెరిగి, బీఆర్ఎస్ ఓట్లు అదే స్థాయిలో పడిపోయాయి.బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పక్షం వహించారని, బీసీలు, అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినపుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయం తేటతెల్లమవుతుంది. కారు పార్టీ ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇవి చదవండి: హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు -
పాత మిత్రులపై కూటమిలో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రపక్షాలతో జట్టుకట్టే అంశంపై విపక్షాల ‘ఇండియా’ కూటమి నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మిత్రపక్షాలతో చర్చించకుండా జేడీ(యూ), తెలుగుదేశం పార్టీ వంటి పాత మిత్రులను చేర్చుకునే అంశంపై సొంత నిర్ణయం తీసుకోబోమని తేలి్చచెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాం«దీ, సోనియా గాం«దీలు మంగళవారం పార్టీ కారాల్యయంలో మీడియాతో మాట్లాడారు. సాయంత్ర ఆరు గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసంలో ‘ఇండియా’ కూటమి భేటీకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనియా, రాహుల్, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపయి సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా ఈ భేటీలో పాల్గొననున్నారు. నేడు ఇండియా కూటమి సమావేశం: రాహుల్ ‘‘ విపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశం బుధవారం నిర్వహిస్తాం. మా కూటమి నేతల అభిప్రాయం అడగకుండా మేం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించలేం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా వ్యూహరచన, తీసుకోవాల్సిన నిర్ణయాలపై బుధవారం మా కూటమి పక్షాలు ప్రధానంగా చర్చిస్తాయి. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసి నడుస్తారని ముందే అనుకున్నా. రాజ్యాంగాన్ని కాపాడేందుకు పడిన తొలి అడుగు ఇది.ఈసారి ఎన్నికల్లో పేదలతోపాటు అణగారిన వర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. పేదల అభ్యున్నతికి పాటుపడే కొత్త మార్గదర్శకత్వాన్ని కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అందించనున్నాయి. ఈ ఎన్నికలు, దేశం ఒక్కటే విషయాన్ని చెప్పదల్చుకున్నాయి. మోదీ, అమిత్‌షా పాలనలో దేశం మగ్గిపోవాల్సిన పనిలేదని చాటాయి. కూటమి పారీ్టలన్నీ ఐక్యమత్యంతో పోరాడాయి. కాంగ్రెస్‌కు మద్దతు పలికిన ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నేను వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో గెలిచినా ఏ స్థానాన్ని వదులుకోవాలో ప్రజలతో మాట్లాడి నిర్ణయిస్తా. ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చుతాం’ అని రాహుల్ అన్నారు. మోదీ వ్యతిరేక ప్రజాతీర్పు ఇది: ఖర్గే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు ఇది అని ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఒకే వ్యక్తి పేరుతో బీజేపీ ఓట్లు అడిగింది. ఇది మోదీ రాజకీయ, నైతిక పరాజయం. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలకు ప్రజల మద్దతు లభించింది. మోదీకి మరో అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని ప్రజలు గ్రహించారు. పార్టీని గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు. విజయం కోసం ఐక్యంగా పనిచేసిన ఇండియా కూటమి నేతలకు ధన్యవాదాలు’’ అని ఖర్గే అన్నారు. -
పడిలేచిన కాంగ్రెస్!
కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ కలలను కాంగ్రెస్ చిత్తు చేసింది. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదంతో బరిలో దిగిన బీజేపీని అటు సొంత బలంతో, ఇటు కూటమి పక్షాల సహకారంతో తుత్తునియలు చేసింది. అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ ఆమడదూరంలో ఆగినా పడిలేచిన కెరటంలా సత్తా చాటింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ చేసిన ప్రచారం ఓ వైపు.. ప్రాంతీయ పారీ్టల ఓట్లు చీలకుండా తీసుకున్న జాగ్రత్తలు ఇంకోవైపు.. పార్టీ గుప్పించిన హామీలు మరోవైపు... కలిపి బీజేపీని కలవరపాటుకు గురిచేయడంలో విజయవంతమయ్యాయి... ⇒ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 నాటి కంటే 47 సీట్లు అధికంగా గెలుచుకుంది. ⇒కూటమి పక్షాల భాగస్వామ్యంతో ఈసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ గట్టిగా కృషిచేసింది. విపక్షాల మధ్య ఓట్ల చీలికను నివారించేందుకు తాను పోటీ చేసే స్థానాల సంఖ్యను తగ్గించుకుంది. ⇒ రాజస్తాన్, కర్ణాటక, హరియాణా, పంజాబ్‌ల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ⇒రాజస్తాన్‌లో బీజేపీపై రైతుల్లో ఆగ్రహాన్ని, రాజ్‌పుత్‌ల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. 2019లో 25 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా ఈసారి కాంగ్రెస్ 8 గెలిచింది. హరియాణాలోనూ గత ఎన్నికల్లో బీజేపీ 10కి 10 గెలవగా ఈసారి కాంగ్రెస్ 5 గెలిచింది. ⇒80 స్థానాలున్న కీలకమైన యూపీలో ఓట్ల చీలికకు ఆస్కారమివ్వకుండా సమాజ్‌వాదీ పారీ్టకి 63 సీట్లిచి్చంది. ఇది ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయడంతోపాటు ఓట్ల చీలికను నివారించింది. ఫలితంగా ఎస్పీ ఏకంగా 37 సీట్లు సాధించి బీజేపీని తేరుకోలేని దెబ్బ కొట్టింది. ⇒తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్‌పవార్), కేరళ, బిహార్, యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సీపీఐ(ఎం), ఐయూఎంఎల్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఆర్సీపీలతో ముందస్తు పొత్తులు కూడా కాంగ్రెస్‌కు లాభించాయి. ⇒బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వే షన్లు రద్దవుతాయంటూ కాంగ్రెస్ సహా విపక్షా లన్నీ ప్రచారం చేసిన ప్రచారం బాగానే ఫలించింది. ఆ ఉద్దేశమే లేదని మోదీ, బీజేపీ ఎంత చెప్పినా దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఓస్టీ, ఓబీసీల్లో అనుమానాలు తొలగలేదు. ⇒ఎన్డీఏకు 400 కన్నా ఎక్కువ సీట్లొస్తే రాజ్యాంగాన్ని, పలు చట్టాలను మార్చేస్తారన్న కాంగ్రెస్ ప్రచారమూ ఓటర్లను ప్రభావితం చేసింది. ⇒ఎన్నికల ముంగిట జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కక్ష సాధింపేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విపక్షాలు సఫలీకృతమయ్యాయి. ⇒ బీజేపీ ఓటమే లక్ష్యంగా సీట్ల పంపకంలో పట్టు విడుపులతో వ్యవహరించిన కాంగ్రెస్, ప్రచారం, సమన్వయం, వ్యూహ రచనలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ⇒రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టేలా చేసింది. మిత్రులెవరో, శత్రువులెవరో తేలిపోయింది. ⇒రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆకట్టుకుంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచడమే తమ తొలి ప్రాధాన్య మని ప్రకటించింది. రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. ⇒యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటీస్íÙప్ శిక్షణ కోసం రూ. లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువకుల స్టార్టప్‌ల కు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల తో కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం వంటి హామీలు ఇచ్చింది. ⇒నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష సాయం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వంటి అంశాలు కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్యను పెంచుకొనేందుకు దోహదం చేశాయి. ⇒కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా విపక్షాలను ఒక్కతాటిపైకి తేవడంలో, ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. – సాక్షి, న్యూఢిల్లీ నేటి భేటీలో ప్రధాని అభ్యర్థి ఖరారు: ఉద్ధవ్ ఠాక్రేముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. బుధవారం ఢిల్లీలో సమావేశమై, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఠాక్రే అన్నారు. ప్రస్తుత ఎన్ని కల ఫలితాల సరళిని బట్టి చూస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ 272 మార్కును బీజేపీ పొందే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కూటమిలోని కాంగ్రెస్, ఇతర పక్షాలు టచ్‌లో ఉన్నాయని వివరించారు. వీరిని కూటమిలో చేర్చుకునేందుకు గల అవకాశాలను చర్చిస్తున్నామని చెప్పారు. గతంలో, బీజేపీ కారణంగా ఇబ్బందులు పడిన వీరిద్దరే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారని ఠాక్రే వివరించారు. -
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్‌లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
-
వాయిస్ కాల్స్‌తో ఎలక్షన్ క్యాంపెయిన్..!
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.వాయిస్ మెయిల్ కాల్స్‌తో ప్రచారంరెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్బు క్, ట్విట్టర్‌ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.దీనికి తోడు అభ్యర్థులు ఫేస్బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్నెట్‌పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్‌మెయిల్స్, ఫోన్‌కాల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
టంగుటూరు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ మూడు మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తొలుత ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇప్పటికే టంగుటూరు చేరుకున్నారాయన.టంగుటూరు బొమ్మల సెంటర్లో YSRCP నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన. ఇక సీఎం జగన్ రాక సందర్భంగా ఆప్రాంతంలో సందడి నెలకొంది. కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగునల్లి, పొన్నలూరు మండలాల నుంచి భారీగా జనం చేరుకున్నారు.టంగుటూరు సభ అనంతరం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజక వర్గం పరిధిలోని మైదుకూరు జంక్షన్లో, ఆ తర్వాత సాయంత్రం రాజంపేట పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరి ప్రచార సభల్లో ప్రజల్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు
సియోల్: దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పారీ్టలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు పీపుల్ పవర్ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రిఫరెండమ్ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్ సుక్ ఇయోల్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్వే కూడా అదే అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి.