ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.
ఆర్‌ఎస్‌ఎస్ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.
బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment