
జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్.. ఇసుకను అన్‌లోడ్ చేశాడు.
ఇసుక అన్‌లోడ్ చేసే సమయంలో షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. శనివారం తెల్లవారుజామున జాఫ్రాబాద్ తహసీల్‌లోని పసోడి-చందోల్‌లోని వంతెన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.