labourers died
-
విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి.. ఎలక్ట్రిక్ స్తంభం నిలబెడుతూ..
జార్ఖండ్‌లో దారణం జరిగింది. విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ధన్‌బాద్ జిల్లాలోని నిచిత్‌పుర్ రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్తంభాన్ని నిలబెడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే గేట్ సమీపంలో ఎలక్ట్రిక్ స్తంభం.. 25000 వోల్టుల హై టెన్షన్ వైర్‌పై పడిపోయింది. దాన్ని నిలబెట్టడానికి కూలీలు వెళ్లారు. పనిలో నిమగ్నమైన క్రమంలో అనుకోకుండా హై టెన్షన్ వైర్‌కు తగిలారు. ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఇదీ చదవండి:Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
అనంతపురం దుర్ఘటన.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం కరెంట్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలిసిన సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు, సీఎం జగన్ సూచించారు. కాగా, వ్యవసాయ కూలీలున్న ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఘోరం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి&ఎంఎం) డి.వి. చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ ( దర్గా హొన్నూర్) కె బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/ రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం &పి/ అనంతపురం) కె. రమేష్ ల నుంచి వివరణ కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది. -
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ కూలి 8 మంది కార్మికులు దుర్మరణం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి 8 కార్మికులు దర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 8 మంది కార్మికులను మోస్తున్న లిఫ్ట్ ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ లవీనా సిన్హా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది? -
రెండు కుటుంబాల్లో కన్నీళ్లు నింపిన బావి
జయపురం: బావి శుభ్రం చేసే క్రమంలో ఊపిరాడక ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి హటబరండి పంచాయతీ సోనారపార గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సోనారపారకు చెందిన రాజు కెవుట తన బావిని శుభ్రం చేసేందుకు గ్రామానికి చెందిన హేమరాజు హలదను పిలిచాడు. హేమారాజ్ నూతిలో దిగి పని ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత బావిలో నుంచి ఎటువంటి శబ్ధం రాకపోవడంతో హేమరాజ్‌కు ఏమైందో అని ఆందోళనతో అతన్ని కాపాడేందుకు రాజు కెవుట బావిలో దిగాడు. అతడు కూడా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారిని కాపాడేందుకు అనూప్ కెవుట అనే మరో వ్యక్తి బావిలో దిగాడు. బావిలో శ్వాస ఆడక ముగ్గురూ సృహతప్పి పడిపోయారు. స్థానికులు కుందైయ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, రాయిఘర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముగ్గురినీ బయటకు తీశారు. అయితే అప్పటికే హేమరాజ్, అనూప్ మృతి చెందగా, రాజు కెవుట ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడిని వెంటనే హటబరండి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. కుందైయ్ పోలీస్ స్టేషన్ అధికారి ఫకీర్‌మోహన ఖొర కేసు నమోదు చేసి మృతదేహాను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాయిఘర్ అదనపు తహసీల్దార్ జగు పూజారి, కుంధ్ర బీడీఓ దేవేంద్ర ప్రసాద్ ధల్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజు కెవుట ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. చదవండి: కూతురి ప్రేమపెళ్లి.. పరువు కోసం తల్లిదండ్రులు -
కుప్పకూలిపోయారు!
సాక్షి, కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో జరుగుతున్న డబుల్బెడ్రూం నిర్మాణపనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని రాష్ట్రం దాటి వచ్చి పనిచేస్తున్న వీరు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం తోటికూలీలను కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని పేదల కోసం రాంపల్లిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో 52 బ్లాక్‌ల్లో 6,240 డబుల్బెడ్రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. గత ఏడాది అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు రెండువేల మంది కూలీలు షిప్టులవారీగా పనిచేస్తున్నారు. టైరాడ్ సరిగా బిగించకపోవడం వల్లే... రోజూలాగే గురువారం ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు 1,500 నుంచి 2,000 మంది కూలీలు పనిమొదలెట్టారు. సుమారు 11 గంటల సమయంలో 12వ బ్లాక్‌లోని పదో అంతస్తులో ఫ్లాట్‌ఫాంపై నిలబడి ఆరుగురు కూలీలు పనిచేస్తున్నారు. అది ఒక్కసారిగా కుప్పకూలింది. వారు కూడా దాంతోపాటే కిందపడిపోయారు. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన యాష్కుమార్చౌదరి(20), పశ్చిమ బెంగాల్‌వాసులు సుభాల్రాయ్(32,) సైపుల్హాక్(26), అభిజిత్‌రాయ్(22)లు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలొదిలారు. మిలాన్‌షేక్(20) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరు విబ్లవ్‌రాయ్(18) తీవ్రగాయాలతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కోపోద్రిక్తులైన తోటి కూలీలు ఆగ్రహంతో డబుల్బెడ్రూం ఇళ్ల సముదాయంలోని కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఉద్యోగులు, సిబ్బందిపై దాడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు... ఇంతపెద్ద సంఖ్యలో పనిచేసే కూలీలకు అక్కడ ఎలాంటి సౌకర్యాలుగాని, రక్షణ చర్యలుగాని లేవని, పనిచేసే సమయంలో ప్రమాదం జరిగితే కనీసం చికిత్స అందించేందుకు వసతులు కూడా లేవని కూలీలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంబులెన్స్‌కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలతోపాటు గాయపడినవారిని ఆటోట్రాలీలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న చోట కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, ఇటీవల ఓ కూలి బహి ర్భూమికని రాత్రివేళలో సమీపంలోని రైల్వేట్రాక్ దాటి వెళ్లడంతో రైలు ఢీ కొని మృతిచెందాడని చెప్పారు. ఏఈ సస్పెన్షన్.. రాంపల్లి దుర్ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈ ఎస్.నర్సరాజును సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతాచర్యలు చేపట్టడంలో విఫలమైనందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 15 లక్షల చొప్పున పరిహారం రాంపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందడంపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. కానరాని భద్రత... ప్రమాద సమయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. ప్లాట్‌ఫామ్‌కు టైరాడ్ సరిగా బిగించారా...లేదా... భద్రంగా ఉందా లేదా అని పరీక్షించే ఇంజనీరింగ్ విభాగ అధికారులెవరూ అక్కడ లేరు. కూలీలకు కనీసం హెల్మెట్లు, సేఫ్టీ బెల్ట్‌లు కూడా అందించలేదు. కూలీల పనులను పర్యవేక్షించే సూపర్వైజర్లు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ప్రమాదవశాత్తూ కిందపడినా గాయాలబారిన పడకుండా జాలీలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారని సహచర కూలీలు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన డబుల్బెడ్రూమ్ ఇళ్ల సముదాయం ఇదే -
మేడ్చల్‌లో డబుల్ బెడ్రూం పనులు చేస్తుండగా ప్రమాదం
-
విషవాయువు పీల్చి ముగ్గురు కూలీల మృతి
రాంచీ(జార్ఖండ్): విష వాయువు పీల్చి ముగ్గురు కూలీలు మంగళవారం మృతిచెందారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జంతారా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బావిలో క్లీన్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరు దిగి విషవాయువు పీల్చి చనిపోయినట్లు తెలిసింది. మృతులు నౌషద్ అన్సారీ, అబ్దుల్ రజాక్, షరీఫ్ అన్సారీగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం..బావిలో క్లీన్ చేయడానికి నౌషద్ మొదట వెళ్లాడు. ఇతర కూలీలు అరిచినా స్పందించకపోవడంతో ఆ తర్వాత రజాక్ అతని కోసం వెళ్లాడు. అతన కూడా స్పందించకపోవడంతో చివరికి షరీఫ్ వెళ్లాడు. అక్కడ విషవాయువు విడుదల అవుతోందని తెలియక ముగ్గురూ కూడా పీల్చి మృత్యువాత పడ్డారు. చివరికి ముగ్గురినీ నాలుగు గంటల అనంతరం బయటికి తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ముగ్గురూ మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు నడిపి.. ఇద్దరిని చంపేసిన కుర్రాడు!!
వచ్చీరాని డ్రైవింగ్‌తో కారు నడిపిన 14 ఏళ్ల కుర్రాడు.. ఆ కారుతో ఇద్దరిని తొక్కేసి చంపేయగా.. మరో నలుగురిని తీవ్రంగా గాయపరిచాడు. బుధవారం తెల్లవారుజాము సమయంలో వాళ్లంతా అహ్మదబాద్ నగరంలోని ఫుట్‌పాత్ మీద పడుకుని ఉండగా ఆ కుర్రాడు కారుతో వేగంగా వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దానిలిండా ప్రాంతంలోని వాగ్జీభాయ్ చాల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారును అతడు నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు ఇన్స్పెక్టర్ ఎంఎఫ్ షేక్ తెలిపారు. ఈ సంఘటనలో మరణించినవారిని సలీం రషీద్‌ఖాన్ పఠాన్ (40), రషీదా మున్షిఫా షేక్ (40)గా గుర్తించారు. వీరు దానిలిండా ప్రాంతానికి చెందిన కూలీలు. సంఘటన జరిగిన వెంటనే కుర్రాడు అక్కడినుంచి పారిపోయినా, పోలీసులు తర్వాత పట్టుకున్నారు. అతడు హ్యుందయ్ ఐ-20 కారు నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. పిల్లాడి తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు.