8 Labourers Killed In Under Construction Building Crash In Ahmedabad - Sakshi
Sakshi News home page

ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా పడిపోయిన లిఫ్ట్.. 8 మంది కార్మికులు దుర్మరణం

Published Wed, Sep 14 2022 2:35 PM | Last Updated on Wed, Sep 14 2022 4:49 PM

Many Labourers Killed Elevator Crash Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి 8 కార్మికులు దర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్‌ సమీపంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

8 మంది కార్మికులను మోస్తున్న లిఫ్ట్‌ ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ లవీనా సిన్హా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
చదవండి: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement