Lift collapsed
-
లిఫ్టు కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలస కార్మికులు. -
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ కూలి 8 మంది కార్మికులు దుర్మరణం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి 8 కార్మికులు దర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 8 మంది కార్మికులను మోస్తున్న లిఫ్ట్ ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ లవీనా సిన్హా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది? -
టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. జారిపడిన లిఫ్ట్..
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం ఓ ప్రమాదానికి కారణమైంది. పట్టణంలోని అర్కాన్ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన స్థానిక నేతలు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఎక్కారు. గరిష్ఠంగా ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్టులో పదిహేను మందికి పైగా ఎక్కడంతో ఒక్కసారిగా పైకి లేచి కిందపడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లిఫ్టు నుంచి అందరికి బయటికి తీశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కూడా లిఫ్టులో వెళదామనుకున్నప్పటికి అప్పటికే లిఫ్టులో ఎక్కువమంది ఉండడంతో మెట్లు ఎక్కి పైకి పైకి వెళ్లారు. ముఖ్యనేతలు తాము అందులో ఎక్కక్కపోవడమే మంచిదైందని అనుకున్నారు. -
ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్
సాక్షి, ముంబై: సైన్-చునాభట్టి ప్రాంతంలో ఉన్న ప్రముఖ సోమయ్య ఆస్పత్రిలో గురువారం సాయంత్రం లిఫ్టు కూలింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగాయి. మరొకరిపై లిఫ్టు పైనున్న ఫ్యాన్ మీదపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. బాధితులందరూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం సాయంత్రం వేళ (విజిటింగ్ అవర్స్) కావడంతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించేందుకు బంధువులు ఆస్పత్రికి వచ్చారు. వారు ఎక్కిన లిఫ్టులో సాంకేతిక లోపంతో మూడో అంతస్తు నుంచి నేరుగా కిందపడింది. కిందున్న స్ప్రింగులను ఢీకొని మళ్లీ అదే వేగంతో ఒకటో అంతస్తు వరకు వెళ్లి మళ్లీ కిందపడింది. ఆ సమయంలో లిఫ్టులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ కుదుపులకు అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో గాయపడ్డారు. ఈ లిఫ్ట్ ఇదివరకే అనేకసార్లు మరమ్మతులకు లోనైనా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. కాగా ఈ లిఫ్టు సామర్ధ్యం 12 మంది మాత్రమే. కాని 25 మంది ఎక్కడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. కాగా, సాంకేతిక లోపంవల్లే ప్రమాదం జరిగిందని, యాజమాన్యం తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. గజినీ సినిమా చిత్రీకరణ పనులు ఈ లిఫ్టులోనే.. ఆమిర్‌ఖాన్ నటించిన సూపర్ డూపర్ హిట్ గజినీ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఈ లిఫ్టులోనే జరిగాయి. జియాఖాన్‌ను గాలించేందుకు ఆమిర్‌ఖాన్ కాలేజీ క్యాంపస్‌లోకి వెళతాడు. అక్కడ జియాఖాన్‌ను ఇదే లిఫ్టులో బంధిస్తాడు. తర్వాత పోలీసులు అతణ్ని అరెస్టుచేసే సన్నివేశం ఈ లిఫ్టులోనే జరిగింది.