
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలస కార్మికులు.