జార్ఖండ్‌లో దారణం జరిగింది. విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ధన్‌బాద్ జిల్లాలోని నిచిత్‌పుర్ రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్తంభాన్ని నిలబెడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రైల్వే గేట్ సమీపంలో ఎలక్ట్రిక్ స్తంభం.. 25000 వోల్టుల హై టెన్షన్ వైర్‌పై పడిపోయింది. దాన్ని నిలబెట్టడానికి కూలీలు వెళ్లారు. పనిలో నిమగ్నమైన క్రమంలో అనుకోకుండా హై టెన్షన్ వైర్‌కు తగిలారు. ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు.
ఇదీ చదవండి:Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!
Comments
Please login to add a commentAdd a comment