Electric Works
-
విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి.. ఎలక్ట్రిక్ స్తంభం నిలబెడుతూ..
జార్ఖండ్‌లో దారణం జరిగింది. విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ధన్‌బాద్ జిల్లాలోని నిచిత్‌పుర్ రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్తంభాన్ని నిలబెడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే గేట్ సమీపంలో ఎలక్ట్రిక్ స్తంభం.. 25000 వోల్టుల హై టెన్షన్ వైర్‌పై పడిపోయింది. దాన్ని నిలబెట్టడానికి కూలీలు వెళ్లారు. పనిలో నిమగ్నమైన క్రమంలో అనుకోకుండా హై టెన్షన్ వైర్‌కు తగిలారు. ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఇదీ చదవండి:Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
లోయలోకి వాహనం పల్టీ...
జమ్మూ: విద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేసే కార్మికులతో వెళ్తున్న వాహనం లోయలోకి పల్టీలు కొట్టడంతో ఏడుగురు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిష్ట్వార్ జిల్లాలోని దఛన్ సమీపంలోని దాంగ్‌దూరు విద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర్లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ప్రమాదం జరగడంతో వందలాది మంది కార్మికులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల కుటుంబాలకు కంపెనీనే నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు తక్షణ ఆర్థికసాయం అందించాలని నిరసనకు దిగారు. భారీ వర్షం పడుతుండటంతో డ్రైవర్‌కు సరిగా కనిపించకపోవడంతో కొండ మలుపులో వాహనం అదుపుతప్పింది. దీంతో కొండ నుంచి వందల మీటర్ల లోయలోకి వాహనం పల్టీకొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు జార్ఖండ్ కార్మికులుసహా ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలు పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. -
డిస్క్ంకు ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్ వైర్లు (ఇంటర్నెట్, డిష్)విద్యుత్ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ స్తంభాలు వివిధ రకాల కేబుల్ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభానికి మధ్య మైనస్ (ఎర్త్), ప్లస్ (పవర్ సప్లయ్)తో పాటు త్రీ ఫేజ్ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి. సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. జంక్షన్ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి. స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా బంద్ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్ బాక్సులకు పోల్స్‌పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్‌ను లాగి కరెంట్‌ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాయి. గ్రేటర్లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్‌లాస్ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు విద్యుత్ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్‌పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్‌పైకి కరెంట్ రివర్స్ సప్లయ్ జరిగి కార్మికులు విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు. (చదవండి: 19 డిపోలు లాభాలబాట) -
తీగలే.. మృత్యుపాశాలై..
జీవితాల్లో వెలుగును నింపే విద్యుత్తు.. ప్రాణాలనూ హరిస్తోంది. కూలి పనుల కోసం వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇస్తామంటూ ట్రాన్స్‌కో అధికారులు బాధితులనుఆదుకుంటున్నారు. తూర్పుగోదావరి, శంఖవరం: బతుకుతెరువు కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన ఇద్దరి కూలీల బతుకులు.. విద్యుత్తు షాక్‌తో ముగిసిపోయాయి. వారిలో ఒకరు వివాహితుడు, మరొకరు అవివాహితుడు. మరొకరు షాక్ నుంచి ప్రాణాలను దక్కించుకున్నాడు. పాత వజ్రకూటం పంచాయతీ పరిధి రామన్నపాలెం పొలాల సమీపంలో అలానా కంపెనీకి చెందిన పశువుల కబేళాలో ఆదివారం బోరు తవ్వుతున్నారు. ఈ బోరు తవ్వుతుండగా విద్యుత్తు షాక్‌కు గురై ఇద్దరు యువకులు డేరాంగుల అంకన్న (35), అరిజన రమేష్ (23) మృతి చెందగా, మరో కూలి స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా నుంచి ఐదుగురు యువకులు కూలి పని కోసం వచ్చి కత్తిపూడిలో ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుచోట్ల వారు అనేక బోర్లు తవ్వారు. ఉదయం యథావిధిగా లారీతో కూడిన మెషినరీతో బోరు తవ్వుతుండగా పొలాల మీదుగా వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు మెషీన్‌కు తగిలాయి. దీంతో దానిపై పని చేస్తున్న ఈ ఇద్దరు యువకులు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలంలో ఉన్న కూలీలు రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన అనంతపురానికి చెందిన అంకన్నకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మరో మృతుడు రమేష్.. అనంతపురం జిల్లా కనిగళ్ల మండలం గోపాలపురానికి చెందిన వాడు. ఇదే గ్రామానికి చెందిన హరిజన నాగార్జునుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. రెండు మృతదేహాలను పోలీసులు ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి కూలి పని కోసం వచ్చి మృత్యువాత పడిన మృతుల కుటుంబాలకు అలానా కంపెనీ భారీ నష్ట పరిçహారం చెల్లించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజలకు హాని కలిగే పనులను కంపెనీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్ట çపరిçహారం చెల్లించకుంటే కంపెనీ చేయించే పనుల వద్ద ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. -
విద్యుత్ తీగలపై విన్యాసాలు
-
పొగబండి.. ఇక ఉండదండి!
సాక్షి, హైదరాబాద్: ‘పొగబండి’కి ఇక కాలం చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. రైలు అనగానే గుప్పుగుప్పున పొగ వదులుతూ ఉండే ఇంజిన్ ఇక కనిపించదు. వాటి స్థానంలో అన్నీ కరెంటు ఇంజిన్లే కనిపించబోతున్నాయి. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ను లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే.. అన్ని మార్గాలను విద్యుదీకరించనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వచ్చే రెండుమూడేళ్లలో దీన్ని సాధించేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుదీకరించే పని జరుగుతుండగా, తాజాగా దీన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.178 కోట్లను జోన్ పరిధిలో దీని కోసం ఖర్చు చేయబోతున్నారు. ఒకేసారి అన్ని సెక్షన్లలో పనులు... గతంలో ఏదో ఒక సెక్షన్‌కు నిధులు కేటాయిస్తే దాని పరిధిలో విద్యుదీకరణ పనులు జరిగేవి. కానీ ఇప్పుడు ఒకేసారి అన్ని సెక్షన్లలో పనులు జరుపుతున్నారు. ఒక స్టేషన్లో రైలు వెళ్లిపోగానే, తదుపరి రైలు వచ్చేలోపు కొంత పని చేస్తున్నారు. ఆ తర్వాత తదుపరి రైలు దాటిపోగానే మళ్లీ కొనసాగిస్తున్నారు. ఇలా రైళ్ల ప్రయాణానికి ఆటంకం లేకుండా పనులు జరుపుతున్నారు. ఒకేసారి అన్ని సెక్షన్లలో ఈ తరహాలో ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతుండటంతో వేగంగా లక్ష్యం చేరుకునేందుకు అవకాశం కలిగింది. ఇటీవల నడికుడి–మాచర్ల, పగిడిపల్లి–గుంటూరు, పెద్దపల్లి–లింగంపేట జగిత్యాల మధ్య విద్యుదీకరణ పూర్తి చేశారు. సికింద్రాబాద్–డోన్, మన్నాడ్–బొల్లారం మధ్య ఇప్పటి వరకు ఎక్కడా విద్యుదీకరణ జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ మారిపోనున్నాయి. మొత్తం లైన్లు విద్యుదీకరణ పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజిన్లను కూడా కరెంటుతో నడిచేలా మార్పు చేయనున్నారు. ఆ పరిజ్ఞానం కోసం రైల్వే ప్రయత్నిస్తోంది. జోన్ పరిధిలో ప్రస్తుతం కరెంటు లోకోమోటివ్స్ 700 ఉంటే, డీజిల్ ఇంజిన్లు 600 ఉన్నాయి. ఇక కాజీపేట, మౌలాలి, విజయవాడ, గుత్తి, గుంతకల్‌లో ఉన్న డీజిల్ వర్క్‌షాపులను విద్యుత్ లోకోమోటివ్ వర్క్‌షాపులుగా మార్చే పని మొదలైంది. ఇవీ ఉపయోగాలు... భారీ ఆదా... వంద కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఇంజిన్ రూ.65 వేల ఇంధనాన్ని ఖర్చు చేస్తోంది (వేగాన్ని బట్టి ఈ మొత్తం మారుతుంది). అదే కరెంటు లోకోమోటివ్ రూపంలో ఈ ఖర్చు 45 వేలే అవుతుంది. ఈ రూపంలో రైల్వే భారీగా ప్రజాధనాన్ని పొదుపు చేసే అవకాశం ఉంటుంది. తగ్గనున్న కాలుష్యం... డీజిల్ లోకోమోటివ్స్ నుంచి పొగ విపరీతంగా వస్తుంది. ఇది వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను భారీగా విడుదల చేస్తుంది. దీంతోపాటు డీజిల్ ఇంజిన్ చేసే శబ్దం కూడా ఎక్కువ. కరెంటు ఇంజిన్లతో వాతావరణ కాలుష్యం నామమాత్రం కానుండగా, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇంజిన్ మార్చే సమస్యకు చెల్లు.. కొన్ని మార్గాల్లో కొంతమేర విద్యుదీకరించినందున చాలా రైళ్లకు ఆ మేర విద్యుత్ లోకోమోటివ్, మిగతా ప్రయాణానికి డీజిల్ ఇంజిన్ వాడుతున్నారు. ఏదో ఒకచోట ఇంజిన్లను మార్చాల్సి రావటం ఇబ్బందిగా మారింది. ఇది ప్రయాణికులకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తోంది. దీనికి ఫుల్స్టాప్ పడుతుంది. -
పరిశ్రమలు మళ్లీ మైనస్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్, మైనింగ్ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. గురువారం విడుదలైన గణాంకాల్లో కీలక విభాగాలను చూస్తే... తయారీ రంగం: సూచీలో దాదాపు 60 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ విభాగం 8.2 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆరి్థక సంవత్సరం (ఏప్రిల్ నుంచి)లో అక్టోబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు 5.8% నుంచి 0.5%కి పడింది. విద్యుత్: ఈ విభాగం కూడా 10.8 శాతం వృద్ధి బాట నుంచి (2018 అక్టోబర్‌లో) –12.2 శాతం క్షీణతలోకి జారింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో వృద్ధి 6.8 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. మైనింగ్: ఈ విభాగంలో 7.3 శాతం వృద్ధి రేటు – 8 శాతం క్షీణత (2019 అక్టోబర్)లోకి పడింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ తీసుకున్నా ఈ విభాగం 3.9 శాతం వృద్ధిబాట నుంచి –0.4 శాతం క్షీణతలోకి జారింది. క్యాపిటల్ గూడ్స్: ఇక భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ రంగంలో భారీగా –21.9% క్షీణించింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగం భారీగా 16.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. రసాయనాలు: 31.8% వృద్ధి నమోదయ్యింది. ఏడు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయ్యింది. అదుపు తప్పిన ధరలు ►నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతం ►మూడేళ్ల గరిష్ట స్థాయి ఇది... న్యూఢిల్లీ: రిటైల్ ధరలు అదుపుతప్పాయి. ఈ సూచీ నవంబర్‌లో మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి చేరింది. అంటే 2018 నవంబర్‌తో పోలి్చచూస్తే, 2019 నవంబర్‌లో నిత్యావసరాల వినియోగ వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 5.54 శాతం పెరిగిందన్నమాట. 2016 జూలై (6.07 శాతం) తరువాత ధరల పెరుగుదల తీవ్రత ఇంత స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 2.33 శాతం. అక్టోబర్‌లో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 4.62 శాతం నమోదయ్యింది. -
ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్రయ్!
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈడీ అనుజ్ పొద్దార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. టీవీల కన్నా .. ఏసీలకే ఓటు.. వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో–బేస్ ఎఫెక్ట్ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్ జాయింట్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు. మందగమన ప్రభావాలూ ఉన్నాయి.. జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. రేట్ల కోత ఊతం.. వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్ గాంధీ చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. -
విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, కొత్తపల్లి : ఏళ్లనాటి విద్యుత్ సమస్యలకు ఇప్పుడిప్పుడే మోక్షం లభిస్తోంది. ప్రత్యేక నిధుల్లేక ప్రస్తుతం ఉన్న పనులకే మరమ్మతులు చేస్తుండగా.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యలకు చెక్ పడుతోంది. విద్యుత్ స్తంభాలు కావాలని, విద్యుత్ లైన్లు వేలాడుతున్నాయని, విద్యుత్ స్తంభాలు వంగాయని, లో ఓల్టేజీ వస్తోందని, మీటర్లు అమర్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తరచూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు ‘పవర్ వీక్’ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు సమస్యలపై నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మూడు నెలల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశాలిచ్చారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రామాల్లో ఈ నెల 6 నుంచి చేపట్టన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ సమస్యలనూ అధికారులు గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగుతున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేర విద్యుత్ ప్రమాదాలకు చెక్ పడనుంది. ప్రత్యేక నిధుల్లేక కొత్త పనులకు బ్రేక్.. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కొత్త స్తంభాలు, కొత్త లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ డిమాండ్‌ను బట్టి విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం కొత్త పనుల జోలికి అధికారులు వెళ్లడం లేదు. స్థానికంగా పరిష్కారమయ్యే పనులనే ప్రస్తుతం చేపడుతూ కొంతమేర విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుకానుంది. అనేక గ్రామాల్లో వంగిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లు, మధ్య స్తంభాలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ లేని ట్రాన్స్ఫార్మర్లు, తుప్పు పట్టిన ఇనుప స్తంభాలు తదితర సమస్యలను అధికారులు గుర్తించారు. తుప్పు పట్టిన స్తంభాలను మాత్రమే తొలగించనున్నారు. ఇనుప స్తంభాలు బాగుంటే వాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మెటీరియల్ కొరత.. విద్యుత్ మెటీరియల్ లేక పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. విద్యుత్ స్తంభాల కొరత, కాసారాలు, కండక్టర్లు, హెడ్జ్ ఫ్యూజుల కేబుళ్లు అందుబాటులో లేక పనులు ఆలస్యం అవుతున్నాయి. విద్యుత్ సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం మెటీరియల్‌ను సరఫరా చేస్తే గ్రామాల్లో త్వరలోనే విద్యుత్ సమస్యలు తొలగిపోనున్నాయి. విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దృష్టి పనిలో పనిగా విద్యుత్ బకాయిలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరమ్మతు పనులు చేపడుతూనే.. బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను ఇకపై తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలే విద్యుత్ బకాయిలు చెల్లిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన దరిమిలా విద్యుత్ అధికారులు బకాయిలపై దృష్టి సారించారు. స్థానికంగానే బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ఒత్తిడి తీసుకురానున్నారు. కరీంనగర్ జిల్లాలోని 324 గ్రామ పంచాయతీల్లో రూ.1.66 కోట్ల బకాయి డిమాండ్‌ను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లేనిపక్షంలో సంస్థ మనుగడకే ప్రమాదముందన్న ఆలోచనతో అధికారులు ముందుకు సాగనున్నారు. గ్రామ పంచాయతీలు : 324 విద్యుత్ పనులు పూర్తయిన గ్రామాలు : 30 పనులు ప్రారంభించిన గ్రామాలు : 124 గుర్తించిన లూజ్ వైర్లు : 2,466 కిలోమీటర్లు సరిచేసిన లూజ్ వైర్లు : 1430 కిలోమీటర్లు వంగిన స్తంభాలు : 1228 సరిచేసిన స్తంభాలు : 493 అవసరమైన మధ్య స్తంభాలు : 3899 వేసిన మధ్య స్తంభాలు : 1142 గుర్తించిన ఇనుప స్తంభాలు : 1548 వేసిన ఇనుప స్తంభాలు : 359 ఏబీ కేబుల్ వైర్లు : 307 కిలోమీటర్లు వేసిన కేబుల్ వైర్లు : 55 కిలోమీటర్లు గుర్తించిన థర్డ్ వైరు : 269 కిలోమీటర్లు వేసిన థర్డ్ వైరు : 113 కిలోమీటర్లు గుర్తించిన ఫిఫ్త్ వైరు : 35 కిలోమీటర్లు వేసిన ఫిఫ్త్ వైరు : 3.5 కిలోమీటర్లు -
కరెంట్ 'కట్'కట
సాక్షి, సిటీబ్యూరో: గాలివానకు విద్యుత్ లైన్లు వణికిపోయాయి. టప్‌టప్‌మంటూ ట్రిప్పయ్యాయి. నగరంలో శనివారం సాయంత్రం కురిసిన చిన్నపాటి గాలివానకు చాలాప్రాంతాల్లో 11కేవీ, 33కేవీ ఫీడర్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలు రాత్రంతా అంధకారంలోనే ఉన్నాయి. వర్షం తగ్గిన తర్వాత లైన్లు సరిగా ఉన్నచోట వెనువెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా... విద్యుత్ టవర్లు, స్తంభాలు కూలిన, చెట్లు, కొమ్మలు విరిగిపడి లైన్లు తెగిపడిన సమస్యాత్మక ప్రాంతాల్లో పునరుద్ధరణకు ఆరేడు గంటలకు పైగా సమయం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వరకు గానీ విద్యుత్ రాలేదు. నిరంతర విద్యుత్ సరఫరాతో చాన్నాళ్లుగా నగరంలో జనరేటర్ల వాడకం లేదు. అందులో డీజిల్ ఉందో? లేదో? కూడా చాలా సముదాయాలు పట్టించుకోలేదు. ఇన్వర్టర్ల గురించి కూడా మర్చిపోయారు. రీచార్జ్ లాంతర్లను మూలన పడేశారు. ఒక్కసారిగా శనివారం కురిసిన గాలివానకు నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో అంధకారం నెలకొనడంతో జనరేటర్లు, ఇన్వర్టర్లు, లాంతర్లను బయటకు తీసినా... డీజిల్, చార్జింగ్ అయిపోవడం తదితర కారణాలతో ఒకట్రెండు గంటలే అవి పనిచేశాయి. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో చీకట్లోనే గడపాల్సి వచ్చింది. చల్లగాలులతో ఉక్కపోత బాధ తప్పినప్పటికీ... దోమల బెడదకు నిద్ర కూడా పట్టలేదని పలువురు వాపోయారు. లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఆరేడు గంటలు... గంటకు 60–70 కి.మీ వేగంతో వీచిన ఈదురు గాలులకు కొన్నిచోట్ల చెట్లు కరెంట్ స్తంభాలపై విరిగిపడ్డాయి. అత్యధిక ప్రాంతాల్లో కొమ్మలు తీగలపై పడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓవర్‌హెడ్ లైన్లు కావడంతో గాలులకు తీగలు ఒకదానికొకటి రాసుకొని ట్రిప్పయ్యాయి. ఎక్కువ శాతం చిన్నచిన్న కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. లైన్లను పునరుద్ధరించేందుకు ఎక్కువ సమయం పట్టింది. రాత్రి గాలులు కొంత తగ్గుముఖం పట్టడంతో సీబీడీ బృందాలు రంగంలో దిగి ఒక్కో ప్రాంతంలో కరెంట్‌ను పునరుద్ధరించుకుంటూ వెళ్లాయి. డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాత్రి వేళ కావడం, అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పలు సర్కిళ్లలో మరమ్మతులు పూర్తి చేసి కరెంట్ ఇచ్చేందుకు సగటున ఆరేడు గంటల సమయం పట్టింది. స్పందించని సిబ్బంది... మెట్రో జోన్ పరిధిలో వందకి పైగా ఫీడర్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. తారామతి బారాదరిలో 33కేవీ టవర్ కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచి, ఆయా ఫీడర్ల పరిధిలోని వినియోగదారులకు ఇబ్బందులు తప్పలేదు. గోల్కొండ, తారామతి బారాదరి, బండ్లగూడ, పాతబస్తీ, చార్మినార్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, వికారాబాద్, హబ్సిగూడ పరిధిలో 15 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రాంత్రంతా అంధకారం నెలకొంది. ఆదివారం ఉదయానికి గానీ కరెంట్ ఇవ్వలేకపోయారు. గాలివాన వెలిసి గంటలు గడుస్తున్నా కరెంట్ రాకపోవడంతో... ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు స్థానికులు ఫ్యూజ్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే సరైన స్పందన రాలేదు. ఒకవేళ ఫోన్ ఎత్తినా దురుసుగా మాట్లాడడం, విసురుకోవడం, ముక్తసరిగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఎన్నిసార్లు చేసినా లైన్లు కలవలేదనే ఫిర్యాదులే ఎక్కువగా అందడం గమనార్హం. -
అన్నదాతల ఆందోళన
సాక్షి, చొప్పదండి: వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇరువై రోజులుగా మండలంలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండటంతో పంటలు సాగు చేసిన రైతులకు సమస్యగా మారింది. విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తుండటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు తికమక పడుతున్నారు. వ్యవసాయానికి ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తున్నా, వేసవి సమీపించడంతో అప్రకటిత కోతలు ప్రారంభమయ్యాయి. రబీ సాగుపై ఆశతో బావులపై ఆధారపడి పంటలు వేసిన రైతులకు కరెంటు కోతలు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ కోతలు ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా అమలవుతుండటంతో రైతులు కరెంటు కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. పొట్టదశలో పొలాలు ప్రస్తుతం రైతులు సాగు చేసిన వరి పంటలు పొట్టదశలో ఉన్నాయి. ఈసమయంలో తగినంత నీరు ఉంటేనే రైతులు ఆశించినట్లుగా పంట చేతికి వస్తంది. ఇక మొక్కజొన్న పంట కంకులు పాలుపోసుకొనే దశలో ఉన్నాయి. బావుల్లో నీటి మట్టం తగ్గుతుండటంతో ఒకవైపు రైతుల్లో ఆందోళన పెరుగుతుండగా, కరెంటు కోతలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ కోతలతో బావులలోని నీరు కాలువలు పారకానికే సరిపోతుందని, పగటి పూట తప్పని సరిగా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. కోతల సమయం రైతులకు తెలయక పోవడంతో కరంటు కోసం రైతులు తమ సమయాన్ని వృథా చేసుకొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. చీకట్లో పొలాల గట్ల వెంట పురుగు పూసి ఉంటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించినా కరంటు కోతలపై స్పష్టమైన సమాచారం అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలి రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసమయంలో ముందస్తు ప్రకటన లేకుండా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. కోతలపై ట్రాన్స్‌కో అధికారులు స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. ఇబ్బందులకు గురి చేయడం తగదు. కోతలుంటే ముందస్తు ప్రకటనలు చేయాలి. – జి రాజశేఖర్‌రెడ్డి, రైతు, చొప్పదండి కోతలు లేకుండా చూడాలి ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా ట్రాన్స్‌కో అధికారులు కరెంటు సరఫరా చేయాలి. ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా ప్రకటనలతో పంటలు సాగు చేశాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చెప్పా చెయ్యకుండా విద్యుత్ కోతలు విధించడం సరైన పద్ధతి కాదు. అధికారులు పట్టించుకోవాలి. – ఎం రవీందర్‌రెడ్డి, రైతు, చొప్పదండి సమాచారం మేరకు వ్యవహరిస్తాం పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు నడుచుకుంటాం. అప్రకటిత కోతలు ఎప్పుడు ఉండవు. విద్యుత్ కోతలు అమలులో లేనందున, సమాచారం అందించడం ఏమీ ఉండదు. విద్యుత్ సరఫరాపై వస్తున్న సమాచారంతో వ్యవహరిస్తున్నాం. ఒక్కోరోజు విద్యుత్ సరఫరాలో కోతలు లేకుండా కూడా కరెంట్ సరఫరా చేస్తున్నాం. – రాజు, ఏఈ, ట్రాన్స్‌కో -
పావురాలే కాదు... విద్యుత్ వైర్లకూ తప్పని గండం
సాక్షి, సిటీబ్యూరో: చైనా మాంజా కేవలం పావురాలు, ఇతర పక్షులనే కాదు...విద్యుత్ వైర్లను సైతం వదలడం లేదు. పతంగులు విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ పరిధిలో ఆదివారం ఒక్క రోజే వంద పీడర్ల పరిధిలో ఇదే కారణంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కందికల్‌గేట్ సమీపంలోని విద్యుత్ వైర్లకు ఆదివారం ఉదయం చైనామాంజా చిక్కుకుని, షార్ట్‌సర్క్యూట్ తలెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీల్లో దాదాపు గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో డిస్ట్రిబ్యూషన్ లైన్ల మధ్య పతంగి చిక్కడంతో ఇదే సమస్య తలెత్తింది. మూసీ పరివాహాక ప్రాంతంలోని చాదర్‌ఘాట్, ఇమ్లీబన్ బస్టేషన్, గోల్నాక, అంబర్పేట్, రామంతాపూర్, నాగోల్, నందనవనం, లెనిన్‌నగర్, పద్మారా వున గర్, సికింద్రాబాద్, వారసిగూడ, తార్నాక, నల్లకుంట, చాంద్రాయణగుట్ట, చిలుకలగూడ, లాలాపేట్, ఉప్పల్ తది తర ప్రాంతాల్లో వెలుగు చూసి న విద్యుత్ సరఫరాలకు ఇదే కారణంగా తేలింది. గట్టిగా కిందకు లాగడంతో... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 10 తేదీ నుంచి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవుల్లో పిల్లలు ఇంటిపై నిలబడి పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేయడం అందరికీ తెలిసిందే. పిల్లలు ఆనందంతో ఎగరేసే పతంగుల్లో చాలా వరకు వైర్ల మధ్య చిక్కుకుంటున్నాయి. చైనా మాంజాతో పతంగ్‌లు తయారు చేయడం, వైర్ల మధ్య చిక్కుకున్న పతంగ్‌లను విడిపించుకునేందుకు పిల్లలు వాటిని గట్టిగా కిందికి లాగుతుంటారు. ఇలా లాగే క్రమంలో అప్పటి వరకు దూరంగా ఉన్న వైర్లు ఒకదానికొకటి ఆనుకుని, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగుతున్నాయి. వైర్ల మధ్య రాపిడి కారణంగా హైఓల్టేజ్ సమస్య తలెత్తి..ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సమీపంలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఫీజులు కాలిపోతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. డిమాండ్‌కు తగినంత సరఫరా ఉన్నప్పటికీ...మాంజా వల్ల తరచూ కరెంట్ సరఫరా నిలిచిపోతుండటంతో ఏం చేయాలో తెలియక ఇంజినీర్లు తలపట్టుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలతో పోలిస్తే...ఇరుకైన వీధులు ఎక్కువగా ఉండే మురికివాడలు, ఇతర బస్తీల్లోనే ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోందని బంజారాహిల్స్ ఎస్ఈ ఆనంద్ పేర్కొన్నారు. లైన్ల కింద పతంగులు ఎగరెయొద్దుః విద్యుత్లైన్ల కింద పతంగులు ఎగరేయడం వల్ల మాంజా వైర్లకు చుట్టుకుని పిల్లలు విద్యుత్‌షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. చెట్ల కొమ్మల మధ్య, విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్న వాటిని తీసేందుకు యత్నించడం కంటే..వాటిని అలాగే వదిలేయడం ఉత్తమం. వైర్లకు చుట్టుకుపోయిన చైనామాంజాను గట్టిగా లాగే సమయంలో ఒకదానికొక వైరు ఆనుకుని..మంటలు ఎగిసిపడే అవకాశం ఉంది. లైన్లకింద ఆడుకుంటున్న పిల్లలపై ఈ నిప్పులు కురవడంతో వారు గాయపడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు పిల్లలు లైన్ల కిందకాకుండా ఖాళీగా ఉన్న క్రీడామైదానాల్లో పతంగులు ఎగరేసుకోవాలి. ఎవరికి వారుగా కాకుండా సమూహంగా పతంగులు ఎగరేయడంద్వారా పిల్లల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇం టిపై నిలబడి పతంగులు ఎగరేయడం కన్నా ..ఖాళీ మైదానంలో నిలబడి పతంగ్‌లు ఎగరేయ డం ద్వారా ఎక్కువ ఆనందం ఉంటుంది.–ఏజీ రమణప్రసాద్,ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఆఫ్ తెలంగాణ -
వైర్ల ఎంపికలో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ఇంటి ఎంపికలో ధర, ప్రాంతమే కాదండోయ్.. నిర్మాణ సామగ్రి వినియోగం కూడా ప్రధానమైనదే. మరీ ముఖ్యంగా ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వైర్లు, పవర్ బోర్డులు.. నాసిరకం ఉత్పత్తులను వాడినా లేక ఎంపికలో ఏమరపాటుగా ఉన్నా సరే జరిగే ప్రమాదం ఊహించలేనిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ వైర్ల ఎంపికలో నిపుణుల సలహాలివే.. ►ధర విషయంలో రాజీ పడకుండా నాణ్యతకు సంబంధించి సర్టిఫై చేసిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ►విద్యుత్ షాక్‌లకు ఆస్కారం లేకుండా అవసరమైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ►కన్జ్యూమర్ యూనిట్‌పై ఉండే మెయిన్ స్విచ్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. ►ప్రతి పవర్ బోర్డ్‌లో విడిగా ఫ్యూజ్ లేదా మినీ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ) వంటి ట్రిప్పింగ్ పరికరాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగితే ఇవి వెంటనే యాక్టివేట్ అవుతాయి. ► అవసరమైన దానికంటే ఎక్కువ కనెక్షన్లను ఇవ్వొద్దు. పవర్ సప్లయి కార్డ్‌ను నీళ్లు, వేడి ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. -
కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
శ్రీకాకుళం అర్బన్: కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ తరహాలో రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా శనివారం పలాస మండలం రేగులపాడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విద్యార్హతలు, పనివిధానంపై సంపూర్ణ అధ్యయనం చేసి వారిని క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకతను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారని, అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి పక్కన పెట్టేశారన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. జగన్‌ను కలిసిన వారిలో ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణ, చీఫ్ కో–ఆర్డినేటర్ బి.రమేష్, స్టేట్ కమ్యూనికేటర్ కె.జగదీష్, ప్రతినిధులు ఆర్.ప్రవీణ్‌కుమార్, డి.హేమకుమార్, వి.ప్రేమ్‌కుమార్, ఎం.గణపతి తదితరులు ఉన్నారు. -
ఎదురుచూపులు
రాయచోటి రూరల్(వైఎస్సార్ కడప): నూతనంగా రైతులు వేసుకున్న బోర్లకు విద్యుత్ కనెక్షన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం అన్నదాతలు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే అవసరమైన కనెక్షన్ల కోసం వినియోగదారులు నగదు చెల్లించినప్పటికీ ఏడాది కంటే ఎక్కువ రోజులు గడిచినా ఇంత వరకు నూతన కనెక్షన్లు రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు నీరు లేకపోవడంతో లక్షలకు లక్షలు అప్పులు చేసి పొలాల్లో వేసుకున్న బోరుబావులకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా ఉండిపోయాయని, అరకొర నీరున్నా పంటలు పెట్టుకునే పరస్థితి లేక రైతులు దిగాలు చెందుతున్నారు. 2017 ప్రారం భం నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అవసరాల కోసం 6,245 మంది దరఖాస్తులు చేసుకుంటే , 2,035 మందికి మాత్రమే విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు అందజేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన 4,215 మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో అధికారపార్టీ నాయకుల జోక్యం.. దరఖాస్తులు చేసుకున్న వినియోగదారులకు క్రమపద్ధతిలో విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా, మరో వైపు మాత్రం అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న వారికి మాత్రమే ట్రాన్స్పార్మర్లు వస్తున్నాయని, మరో వర్గానికి ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం లేకుండా పోతోందని కొందరు రైతులు విమర్శిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లకు అవసరమైన నగదు ముందే చెల్లించినప్పటికీ సరఫరా అందించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని , ఇలా అయితే మనుగడ సాధించడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ట్రాన్స్‌కో అధికారులకు ఉంది. అన్నదాతలకు మిగిలిన అప్పులు... వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని పలు ప్రాం తాల్లో రైతులు కనీసం బోరుబావుల్లో వచ్చే అరకొర నీటితో నైనా పంటలు సాగు చేసుకోవాలని ఆశపడుతున్నారు. రూ.2–3లక్షలు అప్పు చేసి ఆశగా బోర్లు వేసుకున్నారు. అందులో నీరున్నా ప్రస్తుతం విద్యుత్ సరఫరా పొందలేకపోతున్నామని, అదనంగా మరి కొంత నగదు విద్యుత్ అధికారులకు చెల్లించినా ట్రాన్స్ఫార్మర్ల మంజూ రు ఆలస్యం అవుతోందని వాపోతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం వ్యవసాయ బోర్‌కు అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం 2017 జూన్ 7వ తేదీన ధరఖాçస్తు చేసుకుని, అదే రోజు రూ.28వేలు అధికారులకు చెల్లించాం.ఇప్పటి వరకు మాకు ట్రాన్స్ఫార్మర్ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఉన్న 7 ఎకరాల పొలాన్ని బీళ్లు పెట్టుకున్నాం.చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాము. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయాలి.– రామకృష్ణ, రైతు, చెంచురెడ్డిగారిపల్లె ఆయిల్ ఇంజిన్‌తోనే నీటి తడులు వేసుకుంటున్నాం విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయిల్ ఇంజిన్‌తోనే నీటి తడులు వేసుకుంటున్నాం. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ కావాలని గత ఏడాది జూన్ 5వ తేదీన రూ.24లు చెల్లించాం. అయినా ఇవ్వలేదు.దీంతో అధిక మొత్తం ఖర్చు చేసి ఆయిల్ ఇంజిన్‌తోనే పొలానికి నీళ్లు వేసుకుంటున్నాము.అధికారులు రైతులను ఆదుకోవాలి. – కృష్ణయ్య, రైతు, చెంచురెడ్డిగారిపల్లె సెప్టెంబర్ నెలాఖరుకు టార్గెట్ పూర్తి చేసేందుకు కృషి జిల్లాలో ఇప్పటి వరకు 2వేల మంది వినియోగదారులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించాము. మరో 4వేల దరఖాస్తులు మా వద్ద ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు టార్గెట్ పూర్తి చేయాలని నిర్ణయించాం. అందరికీ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం. ఇందులో రాజకీయ నాయకుల జోక్యం ఏ మాత్రం లేదు. మాపైన ఎవరి ఒత్తిడీ లేదు. – శివప్రసాద్ రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ, వైయస్సార్ జిల్లా -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ విద్యు త్ శాఖ డీఈ దుర్గారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్ఎస్పీడీసీఎల్లో దుర్గారావు డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భాస్కర్‌రావు అనే కాంట్రాక్టర్ దగ్గర బిల్లుల మం జూరుకై రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో భాస్కర్‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని దుర్గారావు నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుర్గారావును అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. -
విద్యుదాఘాతానికి యువకుడి బలి
గొబ్బూరు (పెద్దారవీడు): గుంపులుగా ఉన్న మేకలను ఇంటికి తోలుతున్న సమయంలో బెదిరి పోవడంతో వాటిని చూసేందుకు విద్యుత్ టవర్ పెద్ద లైన్ స్తంభం ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని గొబ్బూరు తిరుమనాథస్వామి మాన్యంలో శనివారం జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన నలుగురు మేకలు మేపుకునేందుకు వాటిని పొలాల్లోకి తోలుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ఒక్కసారిగా అవి బెదిరిపోయాయి. కొన్ని మేకలు కనిపించలేదు. చెట్ల చాటుకు వెళ్లి ఉంటాయని భావించి మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి తోకపల్లె గ్రామం వైపు వెళ్లే 30 కేవీ లైన్ విద్యుత్ టవర్‌పైకి కుందురు నాగార్జున, కుందురు శ్రీను ఎక్కారు. తీగలను గమనించకుండా పైకి వెళ్తున్న సమయంలో తీగలకు కొద్ది దూరంలో ఉండగానే పవర్ లాక్కోవడంతో కుందురు నాగర్జున (20) అక్కడికక్కడే మృతి చెంది కిందపడ్డాడు. కుందురు శ్రీను టవర్ ఎక్కుతూ సగానికి పోగానే ఇనుపరాడ్‌కు చెయి తగలడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. అక్కడే ఉన్న మరో ఇద్దరు గాయాలైన శ్రీనును వెంటనే మార్కాపురం వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లారు. చేతికంది వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తండ్రి నరసింహాలు, తల్లి అంకమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. -
వానరం.. జర భద్రం!
భద్రాద్రి కొత్తగూడెం : ఏదైనా ప్రమాదం జరిగితే నోరు విప్పి చెప్పుకోలేవు.. ఈ చిత్రాలు చూడండి.. వామ్మో.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే.. ప్రాణాలతో ఉంటాయా..? అసలే వర్షాకాలం.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఎవరి ప్రాణాలైనా అంతే సంగతులు.. కొన్ని వానరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలోని ఓ షెడ్లోకి వచ్చాయి. అక్కడ విద్యుత్ స్విచ్ బాక్స్ శిథిలమై ఉంది.. కానీ దాన్ని గమనించక కోతులు స్తంభంపైకి ఎక్కుతూ కనిపించాయి.. బయటకు వచ్చి ఉన్న తీగలు ప్రమాదకరంగా ఉండడంతో వాటి నుండి తప్పించుకోడానికి నానా తిప్పలు పడ్డాయి. ఈ దృశ్యాలను ‘సాక్షి’కెమెరా క్లిక్ మనిపించింది.. -
దర్జాగా విద్యుత్ చౌర్యం
చర్ల భద్రాచలం : మండలంలోని చింతగుప్ప సమీపంలో బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్ దర్జాగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఆర్ కొత్తగూడెం నుంచి కుర్నపల్లికి వెళ్లే ప్రదాన రహదారి పక్కనే ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ విద్యుత్ శాఖాదికారులుగానీ, సిబ్బందిగానీ పట్టించుకోకపోవడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విద్యుత్ వాడకానికి సంబందించి కాంట్రాక్టర్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నేరుగా చింతగుప్పలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు వైర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వంతెన నిర్మాణ ప్రాంతానికి సుమారు 600 మీటర్ల మేర సర్వీస్ వైరును ఏర్పాటు చేసి విద్యుత్తును చోరీ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఆర్ కొత్తగూడెం– కుర్నపల్లి రహదారిలో చింతగుప్ప వద్దనున్న చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా వెల్డింగ్, కటింగ్, రాడ్ బెండింగ్ వంటి పనులతోపాటు అక్కడ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలకు విద్యుత్ అవసరమవ్వడంతో సంబందింత కాంట్రాక్టర్ విద్యుత్ చౌర్యానికి తెర లేపాడు. చింతగుప్పలో గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన 6.6 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ కటౌట్లకు వైరును తగిలించి 11 కేవీ విద్యుత్ లైన్‌కు స్తంభాల మీదుగా సుమారు 600 మీటర్ల సర్వీస్ వైరును వంతెన నిర్మాణ ప్రాంతం వరకు ఏర్పాటు చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ లైన్‌తో అక్కడ వెల్డింగ్, కటింగ్ వంటి పనులు చేయిస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబందిత శాఖాదికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిరుపేదలు, గిరిజనులు, దళితులు కనీసం కరెంట్‌మీటరుకు గానీ కరెంట్బిల్లు గానీ కట్టలేని పరిస్థితిలో ఉండే వారు ఒకటో రెండో బల్బుల వాడకం కోసం విద్యుత్ సరఫరా తీసుకొని వాడుకుంటే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించే విద్యుత్ శాఖాదికారులు... ఈ బహిరంగ విద్యుత్ చౌర్యంపై మౌనంగా ఉండడం వెనుక ‘ఏదో మతలబు’ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ట్రాన్స్‌కో ఏఈ మోహన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. విద్యుత్ చౌర్యానికి పాల్పడే కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ
జగ్గయ్యపేట: రైలుబండి మీద సెల్ఫీ దిగాలన్న సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తొర్రకుంట పాలేనికి చెందిన పగడాల రామసాయి(15) పట్టణంలోని ఓ స్కూల్లో ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేశాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 9.6 పాయింట్లు సాధించాడు. అయితే బుధవారం మధ్యాహ్నం సమీపంలోని గూడ్సు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఆటలాడిన తర్వాత గూడ్సు రైలెక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో 70 శాతానికి పైగా కాలిపోయి రైలుమీదే కుప్పకూలిపోయాడు. విద్యార్థిని 108 ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
ఎన్నికల తర్వాత ‘విద్యుత్’ వాత!
సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు ముగిశాక ప్రజలపై భారీగా విద్యుత్ చార్జీల భారం పడే ప్రమాదముందని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రూ. 9,970.98 కోట్లకు ఎగబాకిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆదాయ లోటు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించాయి. దీన్ని పూడ్చుకోవడానికి డిస్కం లు ఎన్నికలయ్యాక ‘ట్రూ అప్’పేరుతో చార్జీలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అనుమ తించొద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. గత రెండేళ్లుగా డిస్కంలు కావాలనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదని, దీనివల్ల ఉత్పన్నమైన భారీ ఆదాయ లోటును పూడ్చుకోవడానికి ట్రూ అప్ల పేరుతో చార్జీలు పెంచడానికి డిస్కంలకు అధికారం లేదని స్పష్టం చేశాయి. 2018–19కి సంబం ధించి డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక ఆదా య అవసరాల (ఏఆర్ఆర్) నివేదికపై సోమ వారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణలో వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని తమ అభ్యంతరాలు, సలహాలు, సూచలను తెలియజేశారు. సర్‌చార్జీల వాత పెడితే పెట్టుబడులు కష్టం: ఫ్యాప్సీ క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీల పేరుతో వేస్తున్న కోట్లాది రూపాయల భారాన్ని పరిశ్రమలు భరించలేకపోతున్నా యని, ఇలా అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారుతుందని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ పద్ధతి కింద బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిపే పరిశ్రమలపై యూనిట్‌కు రూ. 2.06 పైసలు చొప్పున అదనపు సర్‌చార్జీలు విధించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి రాక ముందే ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు ఉండేవని, ఇప్పుడు కొత్తగా అదనపు సర్‌చార్జీలను విధించడం సరికాదని ఫ్యాప్సీ ప్రతినిధి టి.సుజాత పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కేటగిరీ సృష్టించి తక్కువ చార్జీలు విధించాలని సూచించారు. ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపై అదనపు సర్‌చార్జీలను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజనీర్ జీవీ మల్లికార్జునరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీలో రైల్వేకు తక్కువ విద్యుత్ చార్జీలున్నాయని, అందువల్ల తెలంగాణలోనూ చార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు విద్యుత్ కొనుగోళ్లు ఎందుకు మిగులు విద్యుత్ ఉందంటూనే మళ్లీ అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్‌రావు ప్రశ్నించారు. రూ. వేల కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంపై డిస్కంలు వివరణ ఇవ్వాలన్నారు. జెన్కోలో విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) 70 శాతానికి తగ్గిందని, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసమే జెన్కోలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా 2,300 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవడం వెనక చీకటి కోణాలున్నాయని..అధికారంలో ఉన్న వారికి, ప్రైవేటు డెవలపర్లకు దోచి పెట్టడానికే ఈ సౌర విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రూ.2.50 నుంచి రూ.3లకు యూనిట్ చొప్పున సౌర విద్యుత్ విక్రయించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నా రాష్ట్రంలో రూ. 6 నుంచి రూ. 6.50 ధరతో కొనుగోళ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీంతో 25 ఏళ్లపాటు ప్రజలు దోపిడీకి గురికానున్నారన్నారు. రైతుల పొలాల్లో బలవంతంగా టవర్లు పరిహారం చెల్లించకుండానే రైతుల పొలాల్లో బలవంతంగా విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులు తెచ్చిన టెలిగ్రాఫ్ చట్టాన్ని సాకుగా చూపి పొలాల్లో భారీ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ తెలిపారు. కలెక్టర్లు పరిహారం ఇప్పించకపోతే రైతులు ఈఆర్సీలో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. -
ఈఆర్సీ ముందుకు నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ముందు నీటి పారుదల శాఖ వాదనలు వినిపించనుంది. విద్యుత్ చార్జీలపై 12న హైదరాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. దీనికి నీటి పారుదల శాఖ తరఫున ముంబైకి చెందిన ఇదామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బల్వంత్ జోషి హాజరు కానున్నారు. సాగునీటి అవసరాలకు వినియోగించే ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.6.40 నుంచి రూ.4.88లకు తగ్గించాలని కోరనున్నారు. రాష్ట్రంలోని 19 ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా 58.78 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,495 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉండనుంది. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి పెరగటంతో.. అలీసాగర్, గుత్ఫా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటికి ప్రస్తుతం 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. యూనిట్‌కు రూ.6.40పైసల మేర చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎత్తిపోతల అవసరాలు పెరిగి ఆర్థిక భారం పడుతుండటం, దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యత పెరిగిన నేపథ్యంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీని కోరాయి. యూనిట్‌కు రూ.1.52పైసల మేర తగ్గింపునకు ఈఆర్సీ సమ్మతిస్తే ఎత్తిపోతల పథకాలపై భారీగా విద్యుత్ భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రతినిధిగా జోషిని ఈఆర్సీ ముందు వాదనలకు పంపనుంది. -
ఉసూరుమన్న ప్రజాభిప్రాయ సేకరణ
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏ.పి.ఇ.ఆర్.సి)గురువారం ఒంగోలులో నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణపై బంధ్ ఎఫెక్ట్ పడింది. స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏ.పి.ఈ.ఆర్.సి చైర్మన్ జస్టిస్ జి.భవాని ప్రసాద్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. మండలి సభ్యులు పి.రామ్మోహనరావు, పి.రఘు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష పార్టీలు బంధ్ నిర్వహించాయి. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రాక వెలవెల బోయింంది. పట్టుమని పది మంది కూడా విద్యుత్ వినియోగదారులు హాజరు కాలేకపోయారు. సమావేశానికి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం.నాయక్, డైరెక్టర్ పి.పుల్లారెడ్డి విజయవాడ సీఈ రాజబాపయ్య, కర్నూల్ సీఈ పీరయ్య, ప్రకాశం ఎస్ఈ ఎన్వీఎస్.సుబ్బరాజు, నెల్లూరు ఎస్ఈ విజయకుమార్ రెడ్డి, కర్నూల్ ఎస్ఈ భార్గవ రాముడు, వినియోగదారుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఏ.జగదీష్ చంద్రరావు, సభ్యులు పాల్ సురేంద్ర కుమార్, ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వరరావు, ఒంగోలు పట్టణ ఏడీఈ పి.వి.వి ప్రసాదుతో పాటు జిల్లాలోని విద్యుత్ డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ చార్జీల్లో మార్పు లేదు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల్లో మార్పు లేదు. 2017–18లో ఉన్న చార్జీలనే అమలు చేస్తున్నాం. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఆవశ్యకతగా రూ. 21,429 కోట్లు నిర్ధారించారు. విద్యుత్ చార్జీలు సంతృప్తి కరంగానే ఉన్నాయి. దేశంలో కల్లా రాష్ట్రంలోనే విద్యుత్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపేదిలేదు. ఆదాయాన్ని, వ్యయాన్ని సమన్వయం చేసుకోవటానికే ఇలాంటి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – జస్టిస్ జి.భవానీ ప్రసాదు, ఏ.పి.ఇ.ఆర్.సి చైర్మన్ రూ. 6,218 కోట్లు సబ్సిడీ రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థలకు రూ. 6,218 కోట్లు సబ్సిడీల రూపంలో రావాల్సి ఉంది. ఈ మేరకు ఏ.పి.ఇ.ఆర్.సి చైర్మన్‌కు ప్రతిపాదనలు అందించాం. పాత విద్యుత్ చార్జీలే యథావిధిగా ఉంటాయి. విద్యుత్ అమ్మకాల ద్వారా ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్‌కు రూ. 14,816 కోట్లు వస్తాయి. అందులో భాగంగా హెచ్.డి సర్వీస్‌ల ద్వారా రూ. 457 కోట్లు, ఎల్టీ సర్వీస్‌ల ద్వారా రూ. 7,370 కోట్లు వస్తాయి. విద్యుత్ కొనుగోళ్ల కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16,850 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఒక్క ట్రాన్స్‌కోకు రూ. 930 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారాలను వెంటనే వాళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలి. – ఎం.ఎం.నాయక్, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ సీఎండీ -
విద్యుత్ తీగలు తెగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం
సాక్షి, మహబూబాబాద్: విద్యుత్ తీగలు తెగిపడడంతో మహబూబాబాద్ మీదుగా సాగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కె.సముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ దగ్గర ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. విద్యుత్ వైర్లు తొలగించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. -
శాంతి సౌధాలు..చారిత్రక సౌరభాలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చారిత్రక చర్చిలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. సికింద్రాబాద్, అబిడ్స్‌లోని ప్రార్థనాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల కోసం సిద్ధమైన అబిడ్స్‌లోని సెయింట్ జార్జి చర్చి.. బ్రిటిషర్ జార్జి యూలే సతీమణి 1865లో అబిడ్స్‌లో ఈ చర్చిని నిర్మించారు. 1867లో అధికారికంగా ప్రారంభించారు. నిజాం ప్రధాన ఇంజినీర్ జార్జి విలియమ్ మర్రెట్ దీనికి రూపకల్పన చేశారు. నిజాం, బ్రిటిష్ రెసిడెన్సీ సిబ్బంది ఇచ్చిన విరాళాలతో ఇది నిర్మితమైంది. ఇలాంటి ఎన్నో చారిత్రక చర్చిలపై ప్రత్యేక కథనం.. గారిసన్ వెస్లీ.. 1853లో తిరుమలగిరిలో గారిసన్ వెస్లీ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1883లో వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబీకులు మాత్రమే ఇక్కడ ప్రార్థనలు చేసేవారు. తొలి రోమన్ క్యాథలిక్ చర్చి.. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ తొలి రోమన్ క్యాథలిక్ చర్చి. ప్రతిష్టాత్మకంగా భావించే ‘బాసలికా’ హోదా కల్గిన పురాతన చర్చి. 2008లో ఈ గుర్తింపు దక్కింది. ఫాదర్ డేనియల్ మర్ఫి 1840లో నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ హైస్కూలు కొనసాగుతోంది. మెథడిస్ట్.. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో సికింద్రాబాద్‌లో మెథడిస్ట్ చర్చిని నిర్మించారు. దీనిని 2001లో పునర్నిర్మించాక మిలీనియమ్ మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చిని గన్‌ఫౌండ్రీలో నిర్మించేందుకు 1870లో పునాది రాయి వేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మాణానికి మార్బల్ బహూకరించారు. 1891లో దీని నిర్మాణం పూర్తయింది. అద్దె రూమ్‌లో ప్రారంభం.. రాంనగర్ డివిజన్\ బాకారంలోని వెస్లీ చర్చి 10 మంది భక్తులతో ప్రారంభమైంది. 1930లో ఇంగ్లండ్‌కు చెందిన రెవరెండ్ ఈబర్ ప్రెస్లీ ఇక్కడ రూమ్ అద్దెకు తీసుకొని ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాడు. 1938లో ఇంగ్లండ్‌కు చెందిన మెగ్నిల్ అదే ప్రాంతంలో చిన్న ఇళ్లులా నిర్మించారు. 1961లో పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వెయ్యికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేసుకునే వీలుంది. సేవా విస్తరణ.. గాంధీనగర్‌లోని బాలాజీ ఇంద్రప్రస్థాన్ సమీపంలో 1969లో సెయింట్ గ్రెగోరియన్ చర్చిని నిర్మించారు. కేరళకు చెందిన పరుమళ కొచిర్ తిరుమనేని రెవరెండ్ జీనన్ దీనిని స్థాపించారు. ఇందులో గ్రెగోరియన్ ఆర్థటిక్స్ స్కూల్‌నూ ఏర్పాటు చేశారు. నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరో నాలుగు చర్చిలు నిర్మించారు. పంజాబీ నిర్మించిన హెబ్రోన్ క్రైస్తవ బోధకుడిగా మారిన పంజాబీ భక్తసింగ్ 1954లో నగరానికి వచ్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులో హెబ్రోన్ చర్చిని ఏర్పాటు చేశాడు. తర్వాత దేశవ్యాప్తంగా హెబ్రోన్ చర్చిలు వెలిశాయి. భక్తసింగ్, అగస్టిన్, బెంజుమన్లు ఇందుకు కీలకంగా పనిచేశారు. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారు. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సుమారు 5వేల మంది పాల్గొంటారు. వెస్లీ చర్చి.. సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ దగ్గర బ్రిటిష్ మిషనరీస్ రెవరెండ్ విలియం బర్గెస్, రెవరెండ్ బెంజిమిన్ ప్రాట్ల ఆధ్వర్యంలో 1916లో వెస్లీ చర్చిని నిర్మించారు. సీఎస్ఐ అనుబంధంగా కొనసాగుతోంది. అతి పురాతనం.. సెయింట్ బాప్టిస్టు జంటనగరాల్లోనే అతి పురాతన చర్చి సికింద్రాబాద్‌లోని సెయింట్ బాప్టిస్టు. 1813లో దీనిని నిర్మించారు. 1998లో హెరిటేజ్ అవార్డు దక్కించుకుంది. దీనికి అనుబంధంగా స్కూల్, కాలేజీ కొనసాగుతున్నాయి. చర్చి అధీనంలో సుమారు 100 ఎకరాలు ఉండేది. కాలక్రమేణా చాలా వరకు స్థలం అన్యాక్రాంతమైంది. ఆర్మీ స్పెషల్.. ఆల్ సెయింట్స్ ఆర్మీ అధికారుల కోసం ప్రత్యేకంగా తిరుమలగిరిలో 1860లో చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో ఆల్ సెయింట్స్ చర్చిని నిర్మించారు. స్వాతంత్య్రానంతరం సీఎస్ఐ (చర్చి ఆఫ్ సౌతిండియా) పరిధిలోకి వచ్చింది. తిరుమలగిరిలో ఏర్పాటైన తొలి శాశ్వత కట్టడం ఇదే కావడం గమనార్హం. సెయింట్ జాన్స్ సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ చర్చికి 200ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో దీనిని నిర్మించారు. ఇది 1998లో హెరిటేజ్ అవార్డు దక్కించుకుంది. సెంటినరీ బాప్టిస్టు బాప్టిస్ట్ చర్చిగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్టు చర్చిని రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో నిర్మించారు. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో జంటనగరాల్లో 35 చర్చిలు కొనసాగుతున్నాయి. వందేళ్ల చరిత్ర.. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులో ఉన్న ఎంబీ చర్చికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1898లో మిషనరీస్ ఆధ్వర్యంలో ఈబర్ట్ దంపతులు మలక్‌పేట్‌లో చర్చి ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మలక్‌పేట్ ఏరియా పోలీస్ ఆసుపత్రిగా కొనసాగుతోంది. తర్వాత నగరంలో విద్యా, వైద్య సేవలు విస్తరించాలని రెవరెండ్ ఫాంక్రాట్స్ ఆధ్వర్యంలో 1904లో ఇక్కడి గాంధీనగర్‌లో చర్చి, గోల్కొండ చౌరస్తాలో స్కూల్‌ను ప్రారంభించారు. అయితే 1952లో చర్చిని కూడా గోల్కొండ చౌరస్తాకు తరలించారు. లూథరన్ చర్చి 1990లో రెవరెండ్ సి.ఏసుపాదం లక్డీకాపూల్‌లో కొండపై లూథరన్ చర్చికి పునాది వేశారు. ఆంధ్రా ఇవాంజలికల్ లూథరన్ చర్చి (గుంటూరు) కేంద్రంగా ఇది కొనసాగుతోంది. ఒకేసారి 2వేల మంది ప్రార్థనలు చేసుకునే విధంగా విశాల ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ 5వేల మంది భక్తులు సభ్యత్వం తీసుకున్నారు. -
పెరిగిన ‘విద్యుత్’ వ్యయం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయం ఏటికేటికి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది (2018–19) రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం రూ.35,714 కోట్లు అవసరమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా నివేదించాయి. ఇందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. శుక్రవారం 2018–19కి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్)ను డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వచ్చేఏడాది రాష్ట్రంలో అమలు చేసే విద్యుత్ చార్జీల పట్టిక లేకుండా ఈ ప్రతిపాదనలు సమర్పించడంతో 2018–19లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా లేక యథాతథంగా ఉంటాయా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాదిలాగే చార్జీల వివరాలను మరికొన్ని రోజుల తర్వాత ఈఆర్సీకి డిస్కంలు ప్రత్యేకంగా ప్రతిపాదించను న్నాయి. అప్పుడే చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. 2019లో జరిగే ఎన్నికల నేపథ్యం లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కేసీఆర్ డిస్కంలను ఆదేశించినా.. డిస్కంలు చార్జీల అంశాన్ని సస్పెన్స్‌లో పెట్టడం గమనార్హం. యూనిట్‌కు రూ.6.42 వ్యయం.. డిస్కంలు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సగటున యూనిట్‌కు రూ.6.42 వ్యయం కానుంది. 2018–19 కోసం డిస్కంలు 67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఒప్పందాల రూపంలో ముందస్తుగా సమీకరించి పెట్టుకోగా.. వాస్తవ విద్యుత్ డిమాండ్ 64,291 మిలియన్ యూనిట్లే ఉండనుంది. -
కుటీర పరిశ్రమ కుదేలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు అంతరించిపోతున్నాయా? ఏటా తగ్గిపోతున్న కుటీర పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఇందు కు అవుననే సమాధానమిస్తోంది. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 2014–15లో 16,377 కనెక్షన్లు ఉండగా 2015–16లో ఆ సంఖ్య 10,995కు పడిపోయింది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ విడుదల చేసిన వార్షిక గణాంకాల పుస్తకం–2017 దీన్ని బహిర్గతం చేసింది. 2014–15తో పోల్చితే 2015–16లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని కేటగిరీల కింద విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగ్గా, కుటీర పరిశ్రమల కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. కుటీర పరిశ్రమలు గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఏటా మూతబడుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఏటా రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కుల వృత్తులు, చేతి వృత్తులు చతికిలబడిపోతున్నాయి. కుటీర పరిశ్రమల స్థితిగతులపై రాష్ట్ర పరిశ్రమల శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదని, దీన్ని ధ్రువీకరించలేమని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థితిగతుల సమాచారమే ఆ శాఖ వద్ద ఉంది. కుటీర పరిశ్రమల నమోదుకు యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. బడా పరిశ్రమలతో పోటీ: ధోబీ ఘాట్లు, పవర్ లూమ్స్, వడ్రంగి, కుమ్మరి, కంచారి, స్వర్ణకార, శిల్పి, కమ్మరి, ఫినాయిల్, అగర్బత్తి, కోవత్తి, అప్పడాలు, చెప్పులు, సబ్బుల తయారీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉత్పత్తులు, ఫల కాలు, కొయ్యలతో బొమ్మల తయారీ, పచ్చళ్లు, మ్యాంగో జెల్లీ, విస్తరాకుల తయారీ పరిశ్రమలను రాష్ట్ర విద్యుత్ సంస్థలు కుటీర పరిశ్రమలుగా పరిగణించి యూనిట్‌కు రూ.3.75 చొప్పు న చార్జీలు వసూలు చేస్తున్నాయి. 10 హెచ్‌పీల విద్యుత్ లోడ్లోపు వినియోగిస్తే కుటీర పరిశ్రమలుగా గుర్తిస్తున్నాయి. విద్యుత్ లోడ్ 10 హెచ్పీలకు మించితే ఈ పరిశ్రమలను ఎల్టీ–పరిశ్రమల కేటగిరీ కింద చేర్చి రూ.6.70 చార్జీలు విధిస్తున్నాయి. చెరుకు క్రషింగ్, రొయ్యలు, చేపల పెంపకం పరిశ్రమలను ఎల్టీ–3 పరిశ్రమల కేటగిరీ నుంచి కుటీర పరిశ్రమల కేటగిరీలోకి మార్చాలన్న డిస్కంల ప్రతిపాదనలను 2016– 17 విద్యుత్ టారిఫ్ ఉత్తర్వుల్లో ఈఆర్సీ తిరస్కరించింది. నిరంతర విద్యుత్ ఇస్తున్నా, చార్జీలు పెంచకున్నా కుటీర పరిశ్రమల సంఖ్య తగ్గిపోవడం వెనక బడా పరిశ్రమలతో ఎదురవుతున్న పోటీయే కారణమని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తులు, సేవలను భారీ పరిశ్రమలు తక్కువకే అందిస్తుండటంతో కుటీర పరిశ్రమలు నిలదొక్కుకోలేకపోతున్నాయని ఆ శాఖ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సమస్య కాదు: టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కుటీర పరిశ్రమల నుంచి తొలగించి కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కేటగిరీ కింద చేర్చడంతోపాటు వాటి విద్యుత్ చార్జీలను తగ్గించామని దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. 5 హెచ్‌పీ విద్యుత్ లోడ్ లోపు విద్యుత్ వినియోగించే పరిశ్రమలు కుటీర పరిశ్రమల కేటగిరీ కింద వస్తాయన్నారు. కొన్ని పరిశ్రమలు వినియోగించే విద్యుత్ లోడ్ 5 హెచ్‌పీకి మించిపోతే సాధారణ పరిశ్రమల కేటగిరీలో చేరుతాయన్నారు. దీంతో కుటీర పరిశ్రమల కేటగిరీ విద్యుత్ కనె క్షన్లు తగ్గి ఉంటాయని అన్నారు. విద్యుత్ కారణంతో కుటీర పరిశ్రమలు మూతబడేందుకు అవకాశామే లేదని కొట్టిపారేశారు. -
హైటెన్షన్.. ఒంటి స్తంభంపై
హైదరాబాద్ మహా నగరంలో ఏటేటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. గతేడాది వేసవిలో గరిష్ట డిమాండ్ 2,800 మెగావాట్లకు చేరింది. ఏటా 250–300 మెగావాట్ల మేర డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు నగరానికి 4,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయాలి. కానీ వీటికి స్థలం ఎక్కువగా అవసరం. భూగర్భ విద్యుత్ కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్నా.. వ్యయం చాలా ఎక్కువ. భూగర్భంలో 400 కేవీ విద్యుత్ లైన్ వేసేందుకు ఒక్కో కిలోమీటర్‌కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఒంటి స్తంభాల (మోనో పోల్స్)పై ఈహెచ్‌టీ (ఎక్స్ట్రా హైటెన్షన్) లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) నిర్ణయించింది. అయితే నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనో పోల్స్‌తో వేసే లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం అవుతుంది. కానీ భూసేకరణ ఖర్చు బాగా తగ్గిపోయే నేపథ్యంలో మొత్తం ఖర్చు తగ్గుతుంది. – సాక్షి, హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో స్థలం లభించక.. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్ 400 కేవీ లైన్ ఏర్పాటు కోసం నార్సింగ్ చౌరస్తా వరకు సాంప్రదాయ పద్ధతిలో లాటిస్ టవర్ల ఏర్పాటుకు స్థలాల లభ్యత ఉంది. అక్కడి నుంచి రాయదుర్గ్ వరకు స్థలం సేకరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భూముల ధరలు చాలా ఎక్కువ. దీంతో నార్సింగ్ చౌరస్తా నుంచి రాయదుర్గ్ వరకు 15 కిలోమీటర్ల మేర భూగర్భంలో 400 కేవీ లైన్ వేయాలని ట్రాన్స్‌కో తొలుత భావించింది. కానీ భూగర్భ లైన్‌కు కిలోమీటర్‌కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుందని తేలడంతో పునరాలోచనలో పడింది. దీనికి తోడు భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు ఏకంగా 8 మీటర్ల వెడల్పున రహదారులను తవ్వి.. అనంతరం వాటిని పునర్నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోనో పోల్స్‌తో లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. నాలుగు స్తంభాల టవర్లకు 10 నుంచి 13 చదరపు మీటర్ల స్థలం అవసరంకాగా.. మోనోపోల్కు కేవలం 1.5 నుంచి 3 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. వ్యయం కూడా కిలోమీటర్ నిడివికి కేవలం రూ.3.5 కోట్ల వరకు మాత్రమే అవుతుందని తేల్చారు. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్ వరకు 400 కేవీ లైన్ ఏర్పాటుకు మొత్తం రూ.1,600 కోట్ల వ్యయం కానుండగా.. అందులో నార్సింగ్ చౌరస్తా నుంచి రాయదుర్గ్ వరకు మోనోపోల్స్‌తో లైన్‌కు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. భూగర్భలైన్లకు బదులుగా మోనోపోల్స్‌తో 400 కేవీ లైన్ నిర్మిస్తే.. రూ.500 కోట్లు ఆదా అవుతున్నాయని ట్రాన్స్‌కో డైరెక్టర్ (ట్రాన్స్మిషన్) టి.జగత్‌రెడ్డి తెలిపారు. ఒకే భారీ స్తంభం ఆధారంగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్మించిన 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ, 765 కేవీ ఈహెచ్‌టీ విద్యుత్ లైన్లన్నింటినీ.. లాటిస్ (చతురస్త్రాకారంలో ఉండే నాలుగు స్తంభాల అల్లిక) టవర్లపై ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోనో పోల్స్‌తో రెండు ఈహెచ్‌టీ లైన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేతిరెడ్డిపల్లి నుంచి రాయదుర్గ్ వరకు 45 కిలోమీటర్ల పొడవున 400 కేవీ సామర్థ్యంతో.. నర్సాపూర్ నుంచి భౌరంపేట్ వరకు 220 కేవీ సామర్థ్యంతో లైన్ల ఏర్పాటుకు ట్రాన్స్‌కో చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు లైన్లలో స్థల సేకరణ సమస్యలున్న చోట మోనో పోల్స్‌తో నిర్మించాలని నిర్ణయించింది. భౌరంపేట లైన్లోనూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి మేడ్చల్ జిల్లా భౌరంపేట వరకు 220 కేవీ లైన్‌ను ట్రాన్స్‌కో నిర్మించనుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆరు కిలోమీటర్ల మేర భూసేకరణ సమస్యగా మారింది. తొలుత భూగర్భంలో లైన్లు వేయాలని భావించగా.. ఈ 6 కిలోమీటర్లకు రూ.85 కోట్ల మేర వ్యయమవుతుందని తేలింది. దీంతో పునరాలోచన చేసిన ట్రాన్స్‌కో.. కిలోమీటర్ వరకు భూగర్భంలో లైన్ వేసి, మిగతా 5 కిలోమీటర్ల మేర మోనోపోల్స్‌తో ఏర్పాటుకు అవకాశమున్నట్లు గుర్తించింది. మొత్తంగా రూ.38 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే..? గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల మీదుగా నాలుగు స్తంభాల టవర్లతో కూడిన లైన్లు వేస్తుండడంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి 10–15 చదరపు మీటర్ల స్థలం పోతుండగా.. రైతులకు తగిన పరిహారం అందడం లేదన్న ఆరోపణలున్నాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మోనో పోల్స్‌తో లైన్లు వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనోపోల్స్‌తో లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో స్థలానికి పెద్దగా ఖర్చు ఉండకపోవడం నేపథ్యంలో.. ఈ అంశాన్ని పరిశీలించడం లేదని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. -
గుంటూరు మీదుగా ఎలక్ట్రిక్ రైలు
త్వరలో గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తి గుంటూరు రైల్వే డివిజన్‌ను పరిశీలించిన రైల్వే జీఎం వినోద్ సాక్షి, లక్ష్మీపురం (గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే డివిజన్ పరిధిలోని మంగళగిరి, గుంటూరు, నల్లపాడు రైల్వేస్టేషన్లను పరిశీలించానని తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో వెయిటింగ్ హాల్ పనులు, ప్లాట్ ఫాం నెం–1 ఎక్స్టెన్షన్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ను 1వ నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి 8వ నెంబర్ ప్లాట్‌ఫాం వరకు 2018–19లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా గుంటూరు–గుంతకల్ విద్యుత్ లైను పనులు పూర్తి గుంటూరు నుంచి గుంతకల్ వరకు రైల్వే విద్యుత్ లైన్ పనులు ఈ ఏడాది డిసెంబర్ 17లోగా పూర్తి కానున్నాయని రైల్వే జీఎం తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి గుంటూరు డివిజన్ మీదుగా ఎలక్ట్రిక్ రైలు రానుందని చెప్పారు. గుంటూరు – గుంతకల్ రైల్వే డబ్లింగ్ లైన్ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. రెండు గ్రామాల్లో భూసేకరణ సమస్య వల్ల గుంటూరు–తెనాలి మధ్య రైల్వే డబ్లింగ్ లైన్ పనులు పూర్తి కాలేదని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు రైల్వే డీఆర్ఎం వి.జి.భూమా, ఏడీఆర్ఎం రంగనాథ్, సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు, డివిజన్ పరిధిలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మృత్యు తీగ
శ్రీకాకుళం ,పాతపట్నం : పొలంకు ఎరువు వేసేందుకు వెళ్లిన ఓ రైతును మృతువు విద్యుత్ తీగ రూపంలో బలితీసుకుంది. భార్యతో కలిసి పొలంకు వెళ్లిన అతడు కొంతసమయానికే విగతజీవిగా మారాడు. తెగిన విద్యుత్ తీగ పొలంలో పడివుండడాన్ని గమనించని ఆయన దానిని తాకి ప్రాణాలు కోలోయాడు. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో ఈ హృదయవి« దారకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కా గువాడ గ్రామంలో గాజులవీధికి చెందిన కౌలు రైతు గణపతి తవుడు(70) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహేంద్రతనయా నది అవతల ఉన్న వరి పంటపొలంకు ఎరువు వేసేందుకు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో భార్య చిన్నమ్మితో కలిసి తవుడు ఇంటివద్ద బయల్దేరాడు. ఎరువు పట్టుకొని నదిలో పడవపై అవతలివైపు వున్న పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే విద్యుత్ వైరు తెగి పొలంలో పడి వుంది. దీనిని గమనించని తవుడు ఎరువుతో పొలంలోకి దిగాడు. వైరును తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరై విలపించింది. వెంటనే గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు తెలియజేసింది. గ్రా మస్తులు విద్యుత్‌ను నిలిపివేసి పొలం వద్దకు వెళ్లారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే విద్యుత్ శాఖ ఏడీ ఎన్. మోహనరావు, ఏఈ డి.వి.ఎల్.కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని ఏడీ తెలిపారు. స్థానిక పోలీసులు పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం చేస్తామని మృతుడు బంధువులకు తెలిపారు. తవుడుకు రెండు ఎకరాల పొలంతో పాటు ఇతరులకు చెంది న రెండు ఎకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య
భార్యతో గొడవపడి మనస్తాపం మొయినాబాద్ (చేవెళ్ల): భార్యతో గొడవపడి ఓ వ్యక్తి విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన పొడుగు మహేశ్(26), సుజాత దంపతులు. రెండు రోజుల క్రితం సుజాత మొయినాబాద్ మండలం మేడిపల్లిలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి మహేశ్ కూడా అక్కడి వచ్చాడు. రాత్రి భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు. ఇంతలో మహేశ్ ఆత్మహత్య చేసుకుంటానంటూ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నాడు. స్తంభంపై నుంచే తన తల్లికి ఫోన్ చేసి కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. మేడిపల్లి నుంచి గోపులారం వెళ్తున్న మహేశ్ తల్లి వెంటనే తిరిగి మేడిపల్లికి వచ్చింది. విద్యుత్ స్తంభంపై నుంచి కిందకు దిగాలని బతిమాలింది. అయినా వినకుండా మహేశ్ విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్ తగిలి కిందపడి మృతి చెందాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం: మహేశ్ స్తంభంపైనే ఉండడంతో గ్రామస్తులు విద్యుత్ ఏఈకి ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కోరగా లైన్‌మన్‌కు ఫోన్ చేయాలని సూచించారు. లైన్‌మన్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వెంటనే విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేయగా లైన్‌మన్‌గాని, పైఅధికారులుగాని చెబితేనే సరఫరా నిలిపివేస్తామని సబ్‌స్టేషన్ సిబ్బం ది సమాధానమిచ్చారు. ఇంతలో మహేశ్ విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ అధికారులు స్పందించి ఉంటే మహేశ్ ప్రాణాలు పోయేవి కావని, వారి నిర్లక్ష్యం వల్లే అతడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ఐఐఐటీ-బి విద్యార్థి ఆత్మహత్య
బొమ్మనహళ్లి: ఐఐఐటీ-బీలో ఎంటెక్ 4వ సెమిస్టర్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కళాశాల భవనం 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఎలక్ట్రానిక్ సిటీలో చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్ నగరానికి చెందిన సాయి శరత్ (22) ఎలక్ట్రానిక్ సిటీ మొదటి ఫేజ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ-బీ)లో బెంగళూరు సంస్థలో ఎంటెక్ 4వ సెమిస్టర్ చదువుతూ క్యాంపస్‌లోని వసతి గృహంలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో సాయిశరత్ క్యాంపస్ 7వ అంతస్తుకు చేరుకొని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో నెమలి మృతి
సి.బెళగల్ : సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జాతీయపక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతిచెందింది. అడవి నుంచి వచ్చిన నెమలి తీగలపై వాలే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కింద పడింది. స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. నెమలి కళేబరాన్ని స్థానిక పోలీసులకు అప్పగించగా వారు ఖననం చేశారు. -
విద్యుత్ అధికారుల మెరుపు దాడులు
- 16 గ్రామాల్లో తనిఖీలు - 161 చౌర్యం కేసులు గుర్తింపు - రూ. 2.42 లక్షల జరిమానా అవుకు: పల్లెల్లో విద్యుత్ చౌర్యానికి సంబంధించి ఆ శాఖకు చెందిన 56 మంది అధికారులు 28 బృందాలుగా ఏర్పడి మంగళవారం 16 గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించి విద్యుత్ శాఖ ఏఈ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో 1788 సర్వీసులను తనిఖీ చేయగా 161 సర్వీసుల్లో చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదుచేయడంతోపాటు రూ.2.42 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. దాడుల్లో ఆపరేషన్ డీఈ ఓబుళకొండారెడ్డి, ఏడీఈలు శివరాం, నాగరాజు, సుబ్రహ్మణ్యం 23 మంది ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈపీఎఫ్ లేకుంటే అనర్హులే!
- విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిబంధనలు - మార్గదర్శకాలను ఆమోదించిన విద్యుత్ సంస్థల బోర్డులు - ఈపీఎఫ్ నిబంధనతో అన్యాయం జరుగుతుందంటున్న కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఔట్‌సోర్సిం గ్ కార్మికులకు ఈపీఎఫ్ లేకుంటే క్రమబద్ధీకరణకు అనర్హులు కానున్నారు. అంతేగాకుండా జీవిత భాగస్వామి ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలకు చెందినవారైతే కూడా క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకా లను ఆమోదించాయి. ఈ దరఖాస్తుల పరిశీ లన కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ మైన జూన్ 2న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయా లని భావించినా.. దరఖాస్తుల పరిశీలనతో మరింత జాప్యం జరగనుంది. ఒక్కో సంస్థలో రెండు కమిటీలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీ సీఎల్)లు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి క్రమబద్ధీకరణ ఉమ్మడి మార్గద ర్శకాలను ఆమోదించాయి. క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 23,667 మంది విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని... వారిలో అర్హులను గుర్తించేం దుకు ప్రతి విద్యుత్ సంస్థలో రెండు కమిటీల ను వేయాలని నిర్ణయించారు. ఒక్కో కమిటీ లో ఐదుగురేసి అధికారులు ఉంటారు. వారికి మినహాయింపు.. మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా ఉన్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనానికి (అబ్జార్ప్షన్) అర్హులు కానున్నారు. అయితే 2016 డిసెంబర్ 4వ తేదీ నాటికి విద్యుత్ సంస్థల యాజమాన్యాల ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. గతంలో విద్యుత్ సంస్థలు ప్రముఖుల సిఫారసుల ఆధారంగా చాలా మందిని నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. అలాంటివారు ఈపీఎఫ్ లేకున్నా క్రమబద్ధీకరణకు అర్హులవుతారు. ఇక ఈపీఎఫ్ ఉన్నా ప్రస్తుతం పనిచేయనివారు క్రమబద్ధీకరణకు అనర్హులు. కాగా.. విద్యుత్ సంస్థల యజమాన్యాలు ఈపీఎఫ్ సదుపాయం కల్పించకపోవడంతో మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ క్యాషియర్లు, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వర్కర్లు తదితర కేటగిరీల ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారని విద్యుత్ కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. మూడు కేటగిరీలుగా విభజన విద్యార్హతల ఆధారంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్, డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్స్ అర్హతలున్న వారిని అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగులుగా పరిగణిస్తారు. పదో తరగతితో పాటు ఐటీఐ చేసినవారు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి తెలుగు/ఉర్దూలో రాయడం, చదవడం తెలిసిన వారిని నైపుణ్యం గల ఉద్యోగులుగా... ఎలాంటి విద్యార్హతలు లేనివారిని నైపుణ్యం లేని ఉద్యోగులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని మార్గదర్శకాలివీ.. ► 18 ఏళ్ల నుంచి 58 ఏళ్లలోపు వయసున్న వారిని క్రమబద్ధీకరిస్తారు. ►తెలంగాణ స్థానికత కలిగి ఇతర రాష్ట్రాల్లో చదవినా అర్హులే. తహసీల్దార్ జారీ చేసిన స్థానికత ధ్రువీకరణ పత్రం ఉంటే స్థానికులుగా పరిగణించనున్నారు. ► జీవిత భాగస్వామి ఏపీ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారు. ► భూములు కోల్పోయి సబ్స్టేషన్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉండదు. విద్యార్హతలు లేని వారికీ అవకాశం ఎలాంటి విద్యార్హతలు లేని వారిని వాచ్‌మన్ లాంటి కాంటింజెన్సీ పోస్టుల్లో భర్తీ చేస్తాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ముందు భావించాం. కానీ ఆలస్యమవు తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేసుకు న్నా.. వారికి వెంటనే జీతభత్యాలు పెరగవు. అప్పటినుంచి వారికి లభించా ల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర సదుపాయాలు లభిస్తాయి. – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు -
23,667 మంది విలీనం
► విద్యుత్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విలీనానికి మార్గదర్శకాలు సిద్ధం ► నేడు జరగనున్న ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల బోర్డు సమావేశాల్లో ఆమోదం ► రాష్ట్రావిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉత్తర్వులు ► కటాఫ్ తేదీ 2016 డిసెంబర్ 4.. 23,667 మంది అర్హులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త! రాష్ట్రంలోని విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం (అబ్జార‡్ష్పన్) చేసుకోవడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా 23,667 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఒకేసారి విలీనం చేసుకోవడానికి ఉత్తర్వుల జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియ విధివిధానాలు, మార్గదర్శకాలకు తెలంగాణ ట్రాన్స్‌కో యాజమాన్యాలు సోమవారం తుది మెరుగులు దిద్దాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో), రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) యాజమాన్యాలు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను ఆమోదించనున్నాయి. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 2016 డిసెంబర్ 4ను విలీనానికి కటాఫ్ తేదీగా నిర్ణయించిన విద్యుత్ సంస్థలు.. ఆ తేదీనాటికి విద్యుత్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న 23,667 మందిని విలీనం చేసుకోనున్నాయి. మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. విలీనం తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రాన్స్‌కోలో 4,577 మంది.. జెన్కోలో 4,394 మంది.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బయోడేటాలను విద్యుత్ సంస్థలు స్వీకరించాయి. ట్రాన్స్‌కోలో 4,577 మంది, జెన్కోలో 4,394 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 10,268 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,428 మంది సహా మొత్తం 23,667 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారని సంస్థలు తేల్చాయి. విద్యార్హతల ఆధారంగా ఒకేసారి వీరిని విలీనం చేసుకునే అంశంపై మంగళవారం జరిగే బోర్డు సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సంస్థలు భావిస్తున్నాయని అధికారులు తెలిపారు. న్యాయ చిక్కులను అధిగమించేందుకే.. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపర చిక్కులను అధిగమించేందుకు ‘క్రమబద్ధీకరణ’పదం స్థానంలో వ్యూహాత్మకంగా ‘విలీనం’అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. తాజా మార్గదర్శకాల్లోనూ క్రమబద్ధీకరణ కాకుండా విలీనం ప్రక్రియగా పేర్కొన్నట్లు సమాచారం. 1996 ఏప్రిల్ 10 తర్వాత తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఇక క్రమబద్ధీకరించరాదని రమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయొద్దని గత ఏప్రిల్ 26న హైకోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో తీర్పు ప్రభావం క్రమబద్ధీకరణపై పడకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్రమబద్ధీకరణకు బదులు విలీన ప్రక్రియను చేపట్టాయి. గతంలో కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం తాత్కాలిక ఉద్యోగలను విలీనం చేశారని, ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్హతల వారీగా రాష్ట్ర విద్యుత్సంస్థల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు.. సంస్థ మొత్తం ఉద్యోగులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ పదో తరగతి విద్యార్హత లేనివారు ట్రాన్స్‌కో 4,577 84 169 266 680 986 1,811 581 జెన్కో 4,394 72 57 205 85 1,404 2,312 259 టీఎస్ఎస్పీడీసీఎల్ 10,268 228 134 1,221 100 5,306 2,579 700 టీఎస్ఎన్పీడీసీఎల్ 4,428 164 11 513 76 2,784 248 632 మొత్తం 23,667 548 371 2,205 941 10,480 6,950 2,172 -
విద్యుత్ తీగలు కారు మీదపడి..
-
విద్యుత్ తీగలు కారు మీదపడి..
యాచారం(ఇబ్రహీంపట్నం): కారు దగ్ధమైన సంఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే కారులోనే సజీవదహనమైంది. ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద జరిగింది. కృష్ణా జిల్లా విసన్నపేట మండలం కలగర గ్రామానికి చెందిన చిలకాని జితేందర్‌కుమార్, అతని భార్య చంద్రకళ(40), కుమారుడు వృధీన్, చంద్రకళ అమ్మ ఆరేపల్లి పద్మావతి, పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంనకు చెందిన అక్క కలకొండ శ్రీ విద్య, మరో బంధువు కలకొండ సూర్యవిహర్‌లు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కూకట్పల్లి నిజాంపేట్ నుంచి కారులో యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్ఆర్ హజరీస్‌లోని తమ బంధువుల వద్దకు వస్తున్నారు. నాగార్జునసాగర్- హైదరాబాద్ రహదారిపై యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న ఓ లారీకి రోడ్డుకు అడ్డంగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి తెగాయి. లారీ వెనకాలే జితేందర్‌కుమార్ నడుపుతున్న కారు వెళ్లడంతో దానిపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన చంద్రకళ సడన్‌గా కారు డోర్ తీసి కాలు కింద పెట్టగానే ఆమెకు మంటలు అంటుకొని అక్కడికక్కడే కాలిపోయింది. అదే సమయంలో ఆర్టీసీ బస్సులో మాల్‌వైపునకు వెళ్తున్న మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జగన్ ప్రాణాలకు తెగించి తన వద్ద ఉన్న దుస్తులతో కారు డోర్లు తీశాడు. దీంతో జితేందర్‌కుమార్, అతని కొడుకు వృధీన్, అమ్మ పద్మావతి, అక్క శ్రీ విద్య, మరో బంధువు సూర్యవిహర్ ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని నిమిషాల్లో బంధువుల దగ్గరకు వెళ్తుండగా... కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జితేందర్‌కుమార్, వారి కుటుంబ సభ్యులు వేసవి సెలవుల్లో యాచారం మండలం నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్ఆర్ హాచరీస్‌లో ఉద్యోగం చేస్తున్న తమ బంధువు వద్దకు కారులో వెళ్తున్నారు. అప్పటి వరకు చంద్రకళ తమ బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ కొద్ది సేపట్లోనే మీ వద్దకు వస్తున్నామని చెబుతుండగానే విద్యుత్ తీగల రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. రోడ్డు మధ్యలోనే కారు దగ్ధం కావడంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చంద్రకళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఆర్ హచరీస్ మేనేజన్ మనోహర్‌రెడ్డి ద్వారా ప్రమాదానికి గురైన కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి డోర్లు తీసి ఐదుగురి ప్రాణాలను కాపాడిన జగన్‌ను ఏసీపీ అభినందించారు. -
లోకేశ్ ప్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్
-
ఐదు కొత్త జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు!
♦ కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు ♦ ఒక్కో పాలిటెక్నిక్‌కు రూ.12.3 కోట్లు ♦ 2018–19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. సబ్మిషన్ స్కీం ఆఫ్ పాలిటెక్నిక్స్ కింద కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక్కో పాలిటెక్నిక్ ఏర్పా టుకు రూ. 12.3 కోట్ల చొప్పున మంజూరు చేయ నుంది. ఇందులో పాలిటెక్నిక్‌ల భవన నిర్మాణాలకు రూ. 8 కోట్ల చొప్పున, పరికరాలు, వసతుల కల్పనకు రూ. 4.3 కోట్ల చొప్పున నిధులను ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 5 జిల్లాల్లో పాలిటెక్నిక్‌లు లేవు. మహబూబాబాద్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త పాలిటెక్నిక్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాద నలు సిద్ధం చేస్తోంది. అవి పూర్తి కాగానే కేంద్రానికి అందజేయనుంది. కేంద్రం నుంచి ఆమోదం లభించ గానే 2018–19 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేనుంది. కొత్తగా ఏర్పాటు చేసే పాలి టెక్నిక్‌లకు అవసరమైన భూమి, వాటిల్లో నియమించే అధ్యాపకుల జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిం చాల్సి ఉంటుంది. కొత్తగా రానున్న 5 పాలిటెక్నిక్‌లలో 3 చొప్పున (సివిల్, ఎలక్ట్రికల్, మరొకటి) కోర్సులను ప్రవేశపెట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే హుస్నాబాద్ పాలిటెక్నిక్‌లో తరగతులు హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2017–18 విద్యా సంవత్సరం నుం చే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22న నిర్వహించనున్న పాలీసెట్–2017 ద్వారా ఆ కాలేజీలో సివిల్‌లో 60 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 60 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హుస్నా బాద్ పాలిటెక్నిక్‌కు ఏఐసీటీఈ ఆమోదం తెలి పింది. ఈ విద్యా సంవత్సరంలో హుస్నాబాద్‌తో పాటు సికింద్రాబాద్ పాలిటెక్నిక్‌లో తరగతుల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపింది. సికింద్రాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు సొంత భవనం లేకపోవడంతో 2017–18లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు. -
విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు ఆవు మృతి
పెద్దపల్లి (జగిత్యాల జిల్లా): మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు, ఆవు మృతిచెందాయి. సీగిరి సుందరయ్య రైతుకు చెందిన పశువులపై విద్యుత్ తీగ తెగిపడటంతో ఈ సంఘటన జరిగింది. -
విద్యుదాఘాతాలకు 814 మంది బలి
⇒ రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం ఆందోళన ⇒ చార్జీల పెంపుపై టీఎస్ఈఆర్సీ సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటేటా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతు న్నాయని రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం (ఎస్ఏసీ) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలతో 2015– 16లో 522 మంది, 2016–17 తొలి అర్ధ వార్షికంలో 292 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నిర్వహణ లోపాలతోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయ పడింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కార్యాలయంలో మంగళ వారం ఎస్ఏసీ మూడో సమావేశం జరిగింది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీని వాస రావు, ఎస్ఏసీ సభ్యుడు, ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నెం అనిల్‌రెడ్డి, ప్రయాస్ ఎనర్జీ ç సభ్యుడు ఎన్.శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ కోసం ఈఆర్సీ ఈ సమావేశం నిర్వహించినప్పటికీ విద్యుదాఘాత మరణాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మానవ తప్పిదాలు, శాఖాపర లోపాలతో అత్యధిక విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఎన్.శ్రీకుమార్‌తో పాటు పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంలు ఇంకా టారీఫ్ ప్రతిపాదనలు సమర్పించని నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించడం లేదా ఫుల్ కాస్ట్ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయడం అంశాలపై సుమోటోగా నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు.రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్ చార్జీల పెంపు హేతబద్ధంగా ఉండాలని ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్‌రెడ్డి కోరారు. -
ఇందిర ‘జలభ్రమ’
ఐదేళ్లుగా నత్తనడకన పనులు వేసిన బోర్లు 873.. పని చేస్తున్నవి వందలోపే.. విద్యుత్ కనెక్షన్లు, మోటర్ల బిగింపు అంతంతే.. అమలుకు అడ్డంకిగా..విద్యుత్‌శాఖ తీరు, నిధుల మంజూరు ఆదిలాబాద్ అర్బన్ : బీడు భూముల్లోనూ రతనాలు పండించవచ్చని ఆశించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. దళితులు, గిరిజనులను సాగుదారులుగా చేయడంతో పాటు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఉపాధి హామీ, నాబార్డు నిధులతో చేపట్టే ఈ కార్యక్రమం ఐదేళ్లు గడచినా నత్తనడకన పనులతో ముందుకు సాగని పరిస్థితి. పలుమార్లు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించినా పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా ఉన్న భూములను కొన్ని బ్లాకులుగా విభజించారు. వీటి ద్వారా ఇందిర జలప్రభ కింద వ్యవసాయ భూముల్లో బోర్లు వేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 18 మండలాల్లో ఈ పథ కం కింద వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకాలు జరిపారు. అధికారులు వేసిన బోర్లలో మొత్తం 873 బోర్ల విజయవంతమై పుష్కలంగా నీళ్లు పడ్డాయి. వీటన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి మోటర్లు బిగించి వ్యవసాయ భూముల్లో సాగు నీరు పారియాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 873 బోర్ల విజయవంతమైతే అందులోంచి 730 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులు విద్యుత్ శాఖకు నివేదించారు. సంబంధిత అధికారులు కేవలం 587 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగతా 143 బోర్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అధికారుల వద్ద ఉన్న లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన 398 బోర్లకు మాత్రమే మోటర్లు బిగించారు. ఇందులోనూ వందలోపే ప్రస్తుతం పని చేస్తున్నాయని అధికారుల వద్ద సమచారం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.12.75 కోట్లకుపైగా ఖర్చు చేసి దాదాపు 50వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ విద్యుత్ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో జాప్యంతో సాగుదారులుగా మారనున్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కూడా ఈ పథకానికి సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో మరింత వెనుకబడింది. పథకం పూర్తికి ఇంకెంత కాలం పడుతుందని, బీడు భూముల్లో వ్యవసాయం చేసుకునేదెప్పుడోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాగుదారులుగా మారేదెప్పుడో.. దళిత, గిరిజన రైతులు సాగుదారులుగా మారే పరిస్థితి ఇప్పట్లో కన్పించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకే సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బోర్లు వేసినా.. వాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ కనెక్షన్లు, మోటర్లు బిగించకపోవడంతో పథకం సత్ఫలితాలు కన్పించడం లేదు. సాగునీరందక వ్యవసాయ భూములు సైతం బీడుగా మారి నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ పథకంపై పలుసార్లు చర్చించారు. ముందుగా వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, మోటర్లు బిగించడం వంటి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులు పూర్తయ్యే వరకు కొత్తగా బోర్లు వేయరాదని జిల్లా మంత్రులు గతంలో అధికారులకు సూచించడంతో అప్పటి నుంచి కొత్త బోర్ల తవ్వకాలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ పనులు పూర్తయితేనే మిగతా బోర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు భావించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పథకం ‘ఇందిరా జలభ్రమ’గా మారిందని పలువురు పేర్కొనడం గమనార్హం. -
పంచాయతీలకు ’పవర్’ కట్
బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ నోటీసులు చీకట్లో మగ్గుతున్న పల్లెలు చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని పల్లెలు చీకట్లో మగ్గాల్సిన దుస్ధితి తలెత్తింది. గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే రుద్దుతోంది. అసలే నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు విద్యుత్ బిల్లులు తలబొప్పి కట్టిస్తున్నాయి. బకాయిలు ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్న ఘటనలు 10 రోజులుగా జిల్లాలో పెరుగుతున్నాయి. బకాయిలు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీలకు, జిల్లా పంచాయతీ అధికారికి నోటీసులు పంపించామని, సరైన స్పందన రాకపోవడంతో గత్యంతరం లేక విద్యుత్ నిలిపివేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. గతంలో 13వ ఆర్థిక సంవత్సరం నిధులు పంచాయతీల విద్యుత్ బిల్లులకు కొంత సొమ్ము జమ చేశారు. అయినా.. బకాయిలు తీరలేదు. మేజర్ పంచాయతీల మాటెలా ఉన్నా మైనర్ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా ఉంది. మైనర్ పంచాయతీలకు ఆదాయ వనరులు లేకపోవడంతో విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. దీంతో ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలు కట్టకపోతే గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు సైతం విద్యుత్ నిలిపివేయక తప్పదని విద్యుత్ శాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్‌ను పునరుద్ధరించేది లేదని భీష్మిస్తున్నారు. పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని చాలాకాలంగా సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. బకాయిలు రూ.170 కోట్లు జిల్లాలో చాలా పంచాయతీలకు ఇప్పటికే ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వీటిలో కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనధికారికంగా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ చాలా పంచాయతీలు నేటికీ చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలో 906 పంచాయతీలు ఉండగా, రూ.170 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్ పంచాయతీల విషయానికి వస్తే వీధిలైట్లు, పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి రూ.22.94 కోట్లు బకాయిలు ఉండగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.57.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీలు వీధిలైట్లు, కార్యాలయాల విద్యుత్‌కు సంబంధించి రూ.22.23 కోట్లు బకాయి పడగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.67.22 కోట్లను బకాయిపడ్డాయి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నాయని విద్యుత్ శాఖ చెబుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాత బకాయిలు చెల్లించి , ఆ తరువాత మూడు నెలల నుంచి ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ పంచాయతీల వద్ద నిధుల లేకపోవడంతో ప్రతినెలా బిల్లులు పెండింగ్ పడుతున్నాయి. ప్రభుత్వమే చెల్లించాలి గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటికి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోవడం లేదు. దీనికి తోడు తాగునీటి సరఫరా, పారిశుధ్యానికి నిధులు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో పాత బకాయిలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి విద్యుత్ బకాయిలను రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వమే ఆ మొత్తాలను చెల్లించాలి. మారిశెట్టి జగదీశ్వరరావు, సర్పంచ్, చింతలపూడి సరఫరా నిలిపివేస్తున్నాం విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీల్లో సరఫరా నిలిపివేస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పాత బకాయిలు వీటినుంచి కట్టించుకున్నా, ఆ తరువాత వరుసగా మూడు నెలల నుంచి పంచాయతీలు బిల్లులు చెల్లించడం లేదు. ఏ నెల బిల్లు ఆ నెల కట్టాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా పంచాయతీలు చెల్లించడం లేదు. దీంతో బకాయిపడిన పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం. ఈ విషయంలో మేం చేయగలిగిందేమీ లేదు సీహెచ్ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఏపీ ఈపీడీసీఎల్ -
విద్యుత్ తీగలు తగిలి కౌలురైతు మృతి
నలుగురిపై కేసు నమోదు లింగంపర్తి (ఏలేశ్వరం) : వన్యప్రాణుల కోసం పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మండల పరిధిలోని లింగంపర్తి శివారు నారాపట్నంలో సోమవారం రాత్రి కౌలు రైతు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... లింగంపర్తి గ్రామానికి చెందిన అవివాహితుడు వరుపుల చింతయ్య (28) తాను కౌలుకు తీసుకున్న పొలంలో వరి పంటకు నీరు పెట్టేందుకు సోమవారం పొలానికి వెళ్లాడు. అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. మరుసటి రోజు తెలవారుజామున చనిపోయి కనిపించాడు. అతడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జి.సత్యనారాయణ, ఎస్ఐ వై.రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కాడ్ రప్పించి విచారణ చేపట్టగా సమీపంలోని రైతు అశపు భీమరాజు పొలంలో అతడు మృతి చెందినట్టు గుర్తించారు. కొంతకాలంగా భీమరాజు పొలాన్ని దాడి రాము అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. అతడు విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడి, వాటి మాంసంతో వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాముతో పాటు గొర్లె వెంకన్న, ముత్తా దొరబాబు, చెన్నాడ సత్తిబాబు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతుడు చింతయ్య తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
మానేపల్లి (పి.గన్నవరం) : విద్యుదాఘాతానికి గురైన సంఘటనలో శుక్రవారం రాత్రి మానేపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి పితాని నర్సింహరావు కుమారుడు తేజ(22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహరావు తన భార్య, కుమార్తెతో కలిసి జగ్గన్నపేట సెంటర్‌కు షాపింగ్ కోసం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తేజ స్నానం చేసేందుకు వేడినీళ్ల కోసం బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు. కొంత సేపటికి నీళ్లు బాగా మరిగి, పొంగిపోయాయి. అదే సమయంలో బాత్రూంలోకి వెళ్లిన నీళ్లపై అడుగు పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత నర్సింహరావు బంధువు ఇంటికి వచ్చాడు. తలుపులు తీసి ఉన్నా.. ఎవ్వరూ కనిపించక పోవడంతో, లోనికి వెళ్లిచూగా.. బాత్రూంలో పడిఉన్న తేజ కనిపించాడు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి స్థానికులకు, తేజ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తేజను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తేజ మృతితో తల్లిదండ్రులు నర్సింహరావు, చంద్రకళ, సోదరి అంబికాదేవి విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అందరితో కలివిడిగా ఉండే తేజ మరణించడంతో మానేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తేజ సేవా కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తనతో పాటు స్నేహితులతో కలిసి ప్రాణాపాయంలో ఉన్న అనేకమందికి రక్తదానం చేయించాడు. పుత్రవియోగంతో ఉన్న నర్సింహరావును వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కుడుపూడి సూర్యనారాయణరావు తదితరులు పరామర్శించారు. -
ఉసురు తీసిన ఉచ్చు
కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆటోకు విద్యుదాఘాతం వాహనం నుంచి ఎగిరిపడి వ్యక్తి మృతి ఎ.మల్లవరం (రౌతులపూడి) : అడవి పందులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ ఉచ్చు కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని ఎ.మల్లవరం శివారు కొండపాలెం సమీపంలోని పామాయిల్‌తోటలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఎ.మల్లవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాకిరెడ్డి ఎంకినాయుడు తనయుడు నాకిరెడ్డి శ్రీనివాసరావు (బుజ్జి) (38) తన పొలంలోని పట్టుపురుగుల పెంపకానికి నిర్మించ తలపెట్టిన రేకులషెడ్డు కోసం అదేగ్రామానికి చెందిన తన కుటుంబీకుడైన నాకిరెడ్డి శివ ఆటోలో సిమెంట్‌బస్తాలు తీసుకెళ్లాడు. సిమెంటు బస్తాలు తనపొలంలో దింపి వచ్చేటపుడు వెళ్లిన మార్గం బురద, గోతులమయంగావుండటంతో తిరిగి పక్కనేవున్న పామాయిల్ తోటలోంచి ఆటోలో వస్తున్నారు. ఆ తోటలో అడవిపందుల కోసం ఎవరో అమర్చిన విద్యుత్ తీగలకు ఆటో ముందుభాగం తగిలి వాహనానికి విద్యుత్ సరఫరా అయ్యి ఆటో డ్రైవర్ శివ పక్కకు తూలిపడగా, బుజ్జి కూడా ఆటోలోంచి తూలిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అపస్మారక స్థితి నుంచి ఆటో డ్రైవర్ తేరుకుని అనంతరం గ్రామానికి వెళ్లి బుజ్జి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో భార్య నాగమణి, కుమార్తె జ్యోతి, కుమారుడు శివతో పాటు కుటుంభసభ్యులంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
మచిలీపట్నం టౌన్ : జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎలక్ట్రికల్ ఎస్ఈ ఎం.విజయకుమార్ తెలిపారు. ఆయన మంగళవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు త్వరలో జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను, చిన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి వీటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామన్నారు. లైన్ లాస్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మెరుగైన విద్యుత్‌ను అందించేందుకు విద్యుత్ లైన్లను మార్చనున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.160 కోట్లతో దీనదయాళ్ గ్రామీణ ఉపాధ్యాయ యోజన పథకం ద్వారా ఎల్టీ లైన్లను హెచ్‌టీ లైన్లుగా మార్చే పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.23 కోట్లతో ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు తెలిపారు. బందరులో కలెక్టర్ బంగళా వెనుక 33/11 కేవీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఇండోర్ సబ్‌స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. వాడపాలెంలో పది రోజుల్లో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లాలోని మంగోలు, వరాహపట్నం, చీపురుగూడెం, ప్రొద్దుటూరు, కొత్త మాజేరు ప్రాంతాల్లో కూడా సబ్ స్టేషన్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలు కూడా విద్యుత్ బిల్లులను చెల్లించాలన్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే విధానం ఉండేదని, గత నెల నుంచి ప్రతి నెలా విద్యుత్ బిల్లుల చెలింపు విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. బిల్లులు చెల్లించని పంచాయితీలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తే 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ మచిలీపట్నం డీఈ ఎ.శ్రీనివాసబాబు, మచిలీపట్నం, పెడన ఏడీఈలు గోవిందరాజులు, భాస్కర్ పాల్గొన్నారు. -
ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..?
►రెండు సబ్స్టేషన్లకు ఒకే లైన్మెన్ ఒకే అసిస్టెంట్ ►విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం బేల : మండల విద్యుత్ శాఖ సెక్షన్ పరిధిలోని సబ్స్టేషన్ల తాలుకు పీఢర్ల పరిధిలో క్షేత్రస్థారుులో పనిచేసే సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా మండలంలోని రెండు సబ్స్టేషన్లకు ఒక లైన్మెన్, ఒక అసిస్టెంట్ లైన్మెన్ మాత్రమే ఉన్నారు. దీంతో విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఏళ్ల నుంచి బేల, జైనథ్ మండలాలకు అనుసంధానంగా విద్యుత్ శాఖలో ఒకే సెక్షన్ ఉండగా, ఎప్రిల్ నెలలో ఆ శాఖ చేపట్టిన పునర్ వ్యవస్థీకరణలో బేల మండలాన్ని ప్రత్యేక సెక్షన్‌గా ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ఏఈ పోస్టు కేటారుుంచగా ఈ పోస్టు భర్తీ అరుుంది. మిగతా పోస్టులు కాలిగానే ఉనారుు. మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా కోసం మండల కేంద్రంతో పాటు చప్రాల గ్రామ శివారులో ఒక్కొక్క సబ్స్టేషన్లు ఉన్నారుు. దీంతో పాటు మండలంలోని తోయగూడ, సైద్పూర్, సాంగ్వి(జి) గ్రామ పంచాయతీల పరిధిలోని 20గ్రామాలకు సైద్పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. నియామకం ఇలా ఒక్కొక్క పీఢర్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిశీలన, బిల్లుల వసూలు కోసం ఒక లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్లను నియమిస్తారు. దీంతో పాటు విస్తీర్ణం అధికంగా ఉన్నట్లైతే అదనంగా మరో అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ పోస్టులలో ఎదైనా ఒక పోస్టు ఉంటుంది. పీఢర్ల సరఫరా ఇలా.. మండలంలోని అన్ని గ్రామాలకు ఏడు పీఢర్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఇందులో మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో బేల టౌన్, సిర్సన్న, దహెగాం ఫీడర్ల పరిధిలో 25గ్రామాలు ఉన్నారుు. దీంతో పాటు చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలో చప్రాల టౌన్, పాటన్, మాంగ్రుడ్ పీఢర్ల పరిధిలో 32గ్రామాలు ఉన్నారుు. ఇంతేకాకుండా మరోక సైద్పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా 20గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఖాళీల వివరాలు మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలోని బేల టౌన్ పీఢర్కు జూనియర్ లైన్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పాటు దహెగాం, సిర్సన్న పీఢర్లలో ఒక లైన్‌మెన్‌తో పాటు అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలోని చప్రాల టౌన్, పాటన్, మాంగ్రుడ్ పీఢర్లతో పాటు మరోక సైద్పూర్ పీఢర్కు ’బేల లైన్మెన్’యే ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీడర్ల పరిధిలో అన్ని పోస్టులు ఖాళీగా ఉంటే, ఉన్న లైన్ ఇన్సపెక్టర్ ఇంఛార్జీగా కొనసాగుతారు. ఈ లైన్ ఇన్సపెక్టర్ స్థానికంగా ఉండకపోవడంతో, విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యుత్ సేవలో డ్రోన్స్
సాక్షి, చెన్నై: విద్యుత్ శాఖ సేవకు డ్రోన్స (మానవ రహిత విమానాలు) రంగంలోకి దిగనున్నాయి. తొలి విడతగా చెన్నైలో మూడు లేదా నాలుగు విమానాల కొనుగోలుకు కసరత్తులు సాగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు పదమూడు వేల మెగావాట్ల మేరకు విద్యుత్ వినియోగం సాగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి, కేంద్ర గ్రిడ్ల నుంచి వచ్చే విద్యుత్ సబ్స్టేషన్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా అవుతున్నది. ఇందుకుగాను భారీ విద్యుత్ లైన్లు ఆయా సబ్ స్టేషన్లను అనుసంధానించే విధంగా ఏర్పాట్లు చేశారు. అరుుతే, తరచూ ఈ భారీ విద్యుల్ లైన్లలో ఏర్పడే సమస్యలతో , మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు తప్పడం లేదు. ఇలాంటి ప్రభావాలతో శుక్రవారం ఎనిమిది జిల్లాలు అంధకారంలో మునగాల్సిన పరిస్థితి. అంతకు ముందు దక్షిణ చెన్నైలో ఇలాంటి సమస్యను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య బయలు దేరిందో గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సమయం వృథా, పని భారం ఎక్కువే. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు వర్గాలు ఎక్కడెక్కడ అయితే, సమస్యలు బయలు దేరుతాయో , తక్కువ సమయంలో వాటిని పరిశీలించి, ఆ ఫొటోలను కంట్రోల్ రూంకు చేరే వేసే విధంగా, సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా మానవ రహిత విమానాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సేవలో డ్రోన్స: తొలి విడతగా చెన్నైలో మానవ రహిత విమానాలను రంగంలోకి దించేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరు నుంచి తరమణి, మనలి నుంచి మైలాపూర్ , ఉత్తర చెన్నై నుంచి మరలి, మైలాపుర్ నుంచి బేషిన్ బ్రిడ్జి వైపుగా సాగే భారీ విద్యుత్ లైన్లను పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ మానవ రహిత విమానాలు రంగంలోకి దించనున్నారు. ముందుగా ఆ లైన్ల వెంబడి మానవ రహిత విమానాల్లోని కెమెరాల ఆధారంగా వీడియో చిత్రీకరణ సాగుతుంది. ఆ లైన్లలో ఎక్కడైనా సాంకేతిక పరంగా, హై ఓల్టేజీ కారణంగా, ఇతర కారణాలతో ఏదేని మరమ్మతులు చోటు చేసుకున్నా, సమస్య బయలు దేరినా తక్షణం ఆ ప్రదేశాన్ని గుర్తించేందుకు వీలుగా మానవ రహిత విమానాలను పంపిస్తారు. ఆవిమానాలు ఆ ప్రదేశాన్ని గుర్తించి కంట్రోల్ రూంకు ఫొటోలను పంపుతుంది. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని సకాలంలో సమస్యను అధిగమించేందుకు వీలు ఉండడం వల్లే, ఈ మానవ రహిత విమానాల మీద దృష్టి పెట్టినట్టు విద్యుత్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలివిడతగా చెన్నైలో మూడు లేదా, నాలుగు విమానాలను కొనుగోలు చేయనున్నామని ప్రకటించారు. టెండర్ల ద్వారా మానవ రహిత విమానాల కొనుగోలు ఉంటుందని, ఈ ప్రయత్నం సత్ఫలితాల్ని ఇచ్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రధాన నగరాల్లో మానవ రహిత విమానాల సేవల్ని విస్తరింప చేస్తామన్నారు. -
విషాదం మిగిల్చిన విందు
-
7 నెలలెందుకు.. తక్షణమే ఇవ్వండి
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ 7 నెలల్లోగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. రైతులను మోసం చేయడమేనని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కనెక్షన్ల కోసం డీడీలు కట్టి నెలల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతులంతా విద్యుత్ కనెక్షన్ల కోసం ఐదేళ్లుగా వేచి చూస్తున్నారని, మళ్లీ 7 నెలలు ఆగాలనడం సరికాదని అన్నారు. 2004కు ముందు రైతులపై అక్రమ కేసులు పెట్టి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్‌ను అమలు చేసి వ్యవసాయాన్ని పండుగలా చేశామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించండి: మల్లు రవి రాష్ట్రంలో తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించని పక్షంలో వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు. రైతు సమస్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమిస్తుంటే...ఆయనను అవమానించేలా మాట్లాడటం టీఆర్ఎస్కు సరికాదని అన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వేముల : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వైఎస్సార్ జిల్లా మండలంలోని గొందిపల్లె పంచాయతీ పరిధిలో రంగోరిపల్లె గ్రామంలో బుధవారం రాత్రి 6.30గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. తోట వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కళ్లమల్ల రామకృష్ణారెడ్డి(32) మృతిచెందారు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. రామకృష్ణారెడ్డి రాత్రి సమయంలో పంటలకు నీటి తడులు పెట్టేందుకు వెళ్లాడు. తోట వద్ద పైపులు సరిచేసుకుంటుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్‌వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. తోట వద్దకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తోట వద్దకు వెళ్లి వెతికారు. అపస్మారక స్థితి పడి ఉన్న రామకృష్ణారెడ్డిని చూసి వెంటనే చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. -
హాస్పి‘డల్స్’
-
విద్యుత్ తీగ తెగిపడి మహిళ మృతి
గుర్రంపోడు : విద్యుత్ తీగలు తెగి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వద్దిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం.. నిడుమనూరు మండలం నేతాపురానికి చెందిన బసిరెడ్డి చెన్నారెడ్డి, పుష్పలత (40) దంపతులు పదేళ్ల క్రితం మండలంలోని వద్దిరెడ్డిగూడేనికి వలస వచ్చారు. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పుష్పలత ఉన్న ఇంటికి ప్రహరీ లేక ఫెన్సింగ్ మాత్రమే ఉంది. ఇంటిపై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో ఫెన్సింగ్ వెంట పుష్పలత ఊడుస్తూ తీగను గమనించకుండా కాలు తాగడంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమెకు భర్త, కుమారుడు ఉన్నారు. భర్త చెన్నారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి వెంకట కిశోర్ తెలిపారు. మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన పుష్పలత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని నల్లగొండ– దేవరకొండ ప్రధాన రహదారిపై మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదాలకు కారణమవుతున్న సమస్యలపై విద్యుత్ శాఖ సక్రమంగా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం, తదితర సౌకర్యాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్ ఏఈ ప్రభాకర్ రెడ్డి విద్యుత్ శాఖ నుంచి నాలుగు లక్షల పరిహారం అందుతుందని హామీ ఇవ్వడంతో పాటు తక్షణ సాయం కింద తాను స్వంతంగా రూ.10 వేలు అందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలచినసత్తయ్య యాదవ్, సీపీఎం మండల కార్యదర్శి వన మాల కామేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
సర్కస్ బృందంలో విషాదం వై.కొత్తపల్లి (పి.గన్నవరం) : విద్యుదాఘాతానికి గురై సర్కస్ కళాకారులు మరణించిన ఉదంతమిది. మండలంలోని వై.కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన సర్కస్ బృందం కొన్ని రోజులుగా కోనసీమలో సర్కస్ ప్రదర్శనలు ఇస్తోంది. గురువారం రాత్రి వై.కొత్తపల్లి గ్రామంలో సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రాత్రివేళ లైటింగ్ కోసం కర్రను పాతి, దానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆ బృందంలోని అవేట గోవింద్(18) ఆ కర్రను తొలగిస్తుండగా, దానికున్న తీగ 11 కేవీ విద్యుత్ లైన్‌ను తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై గోవింద్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై పి.వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘సినిమాకి తీసుకువెళ్తా.. లేవరా నాన్నా..’ ‘అన్నం తినిపిస్తా.. సినిమాకు తీసుకువెళ్తా.. లేవరా నాన్నా.. అంటూ కొడుకు మృతదేహం వద్ద గోవింద్ తల్లి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సర్కస్ బృందంలో గోవింద్ ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. అతడి మృతితో జీవనాధారం కోల్పోయామని గోవింద్ తండ్రి ప్రసాద్, తల్లి శారద, సోదరుడు యోగి, సోదరి భవానీ విలపించారు. -
విద్యుత్‌శాఖ క్రీడల్లో జిల్లా హవా
* టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ కైవసం * బాస్కెట్ బాల్లో ఘన విజయం గుంటూరు స్పోర్ట్స్: విద్యుత్‌శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలలో జిల్లా జట్లు హవా కొనసాగించి బాస్కెట్ బాల్, టెన్నిస్ విభాగాలలో విజేతలుగా నిలిచాయి. బుధవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో జరిగిన టెన్నిస్ టీం ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కె.వి.ఎల్.ఎన్.మూర్తి, కె.మహేష్(గుంటూరు) జంట 7–3 స్కోర్‌తో పి.సుందరబాబు, ఎన్.ఎస్.ఆర్.కె ప్రసాద్ (విశాఖ) జంటపై విజయం సాధించి విజేతగా నిలిచింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్స్‌లో కె.వి.ఎల్.ఎన్.మూర్తి(గుంటూరు) 7–6 స్కోర్‌తో గుంటూరుకే చెందిన కె.మహేష్‌పై విజయం సాధించి టైటిల్ సాధించారు. బాస్కెట్ బాల్ ఫైనల్స్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు 34–32 స్కోర్‌తో రాయలసీమ «థర్మల్ పవర్ ప్లాంట్ జట్టుపై విజయం సాధించింది. విజేతలకు ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ కె.నాగరాజు స్వామి బహుమతులు ప్రదానం చేశారు. -
విద్యుత్ శాఖ క్రీడల్లో జిల్లా జట్ల ముందంజ
గుంటూరు స్పోర్ట్స్: విద్యుత్ శాఖ రాష్ట్ర స్థాయి టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రీడాపోటీలు ఫైనల్స్‌కు చేరాయి. గుంటూరు జిల్లా టెన్నిస్, బాస్కెట్ బాల్ జట్లు ప్రతిభ కనబరుస్తున్నాయి. మంగళవారం ఎన్టీఆర్ స్డేడియంలో టెన్నిస్ టీమ్ విభాగంలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టు 2–0 స్కోర్‌తో నెల్లూరు జిల్లా జట్టుపై, రెండో సెమీ ఫైనల్లో విశాఖపట్నం టీఎల్ అండ్ ఎస్ఎస్ జట్టు 2–0 స్కోర్‌తో హైదరాబాద్ విద్యుత్ సౌధా జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాయి. బుధవారం జరిగే టెన్నిస్ టీమ్ ఈవెంట్ ఫైనల్స్‌లో గుంటూరు, విశాఖపట్నం జట్లు తలపడతాయి. బాస్కెట్ బాల్ విభాగం తొలి సెమీఫైనల్స్‌లో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ జట్టు 33–13 స్కోర్‌తో వైఎస్సార్ కడప జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్స్‌లో గుంటూరు జిల్లా జట్టు 39–30 స్కోర్‌తో విజయవాడ జట్టుపై గెలుపొందింది. బుధవారం ఉదయం గుంటూరు, రామగుండం జట్లు ఫైనల్స్‌లో తలపడతాయి. మధ్యాహ్నం స్థానిక కుందుల రోడ్డులోని గొంది సీతారామయ్య కల్యాణ మండపంలో క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్ఈ జయభారతరావు వెల్లడించారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దఅడిశర్లపల్లి : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధి హుజూర్‌వారిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూర్‌వారిగూడెంలో రాబోతు అంజయ్య కుమారుడు నరేష్ (32) వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజూ వారి మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫీజుకున్న ఏబీ స్విచ్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరా రిటర్న్ అయ్యి ఒక్కసారిగా నరేష్ విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నరేష్ మృతిచెందాడని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహించారు. మృతదేహాన్ని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద నున్న విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఏఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకున్న గుడిపల్లి ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, బంధువులతో మాట్లాడి నరేష్ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడు నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
విద్యుత్ కార్మికుల దీక్షలు
నెల్లూరు (అర్బన్) : దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న షిప్ట్ ఆపరేటర్లు, మీటరు రీడర్లు యూనైటెడ్ ఎలక్టిస్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్‌భవన్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. యూనైటెడ్ ఎలక్టిస్రిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు మాట్లాడుతూ షిప్ట్ ఆపరేటర్లకు 4 నెలల నుంచి, మీటరు రీడర్లకు 7 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. జీతాలు లేకుండా కార్మికులు నెలలు, నెలలు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. అతి తక్కువ వేతనాలతో ప్రాణాలు ఫణంగా పెట్టి విద్యుత్ సంస్థ అభివృద్ధికి కాంట్రాక్ట్ కార్మికులు కృషి చేస్తున్నాప్పటికీ అధికారులు చిన్నచూపు చూడటం దారుణమన్నారు. కార్మికులకు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకపోతే అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. జీతాలు అమలు చేయలేని సీఎండీ ఉత్తర్వులు దేనికని ఎద్దేవా చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగుల కన్వర్షన్లు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతుందన్నారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సుధాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ కమిటీ అధ్యక్షుడు ఖాజావలి, జిల్లా నాయకులు నాగయ్య, పెంచలప్రసాద్, జీఎస్ బాబు, రామయ్య, పి.కృష్ణ, హజరత్ వలి, నాని, బాలకృష్ణ పాల్గొన్నారు. -
తిరువేంకటాద్రి వేడుకకు తిరునగరి ముస్తాబు
-
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మోత్కూరు: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారృం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని జమ్మిచెట్టు కాలనీలో నివాసముంటున్న గీత కార్మికుడు గుండు నర్సయ్య(58) ఇంట్లోని నీటిసంపులో వరదనీరు చేరింది. ఉదయం నల్లాసంపులో చిన్నమోటారు సహాయంతో బురదనీరు తొలగించేందుకు నర్సయ్య ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జి.దశరథ సందర్శించారు. ఆయన వెంట వీఆర్వోలు శంకర్, సోమయ్యలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆధుకోవాలని ఎంపీటీసీ సభ్యురాలు ఎలుగు పార్వతమ్మయాదయ్య కోరుతున్నారు. ఏఎస్ఐ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పొదలు కాదు.. విద్యుత్తు స్తంభాలు
సదాశివపేట: పట్టణ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు చెట్ల పొదలు అల్లుకున్నాయి. చెట్ల తీగలు స్తంభంపై వరకు అల్లుకోవడంతో వీటి వద్ద ప్రమాదం పొంచి ఉంది. మరమ్మతు కోసం స్తంభాలు ఎక్కే పరిస్థితి లేకుండా పోతోంది. పట్టణంలోని వికారాబాద్ రోడ్ సబ్‌రిజిష్టార్ కార్యాలయం వద్ద, పట్టణ మండలానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్ ఆవరణలోగల స్తంభాలకు తీగలు పెద్ద ఎత్తున అల్లుకున్నాయి. దీంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతాయం కలుగుతోంది. నిత్యం విద్యుత్ అధికారులు సిబ్బంది చూస్తున్నారే తప్ప తొలగించడం లేదు. స్తంభాలు, తీగలను చెట్ల పొదలు అల్లుకోవడంతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కొన్నేళ్లుగా ఇదే సమస్యతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులుపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ శ్రీహరిని సంప్రదించగా స్తంభాలకు తీగలు అల్లుకున్న చెట్ల పొదలను తొలగిస్తామన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి స్తంభాలు ఉన్నాయో గుర్తించి చెట్ల పొదలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. -
వినాయక కోవెల.. వెలుగుల విరియగా..
-
విద్యుత్ స్తంభం విరిగిపడి ఇద్దరు మృతి
దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
శ్రీనివాస్‌నగర్(మిర్యాలగూడ రూరల్) : విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ పంచాయతీ శివారు శ్రీనివాస్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ వి. సర్దార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం తోపుచర్ల పంచాయతీ శివారు సీత్యాతండాకు చెందిన ధనావత్ శంకర్ నాయక్(40) కొంతకాలంగా కుటుంబంతో కలిసి శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్నాడు. తుంగపహాడ్ గ్రామానికి చెందిన రైతులు గుబ్బల శ్రీనివాస్, మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిరుమామిళ్ల కోటేశ్వర్రావు వద్ద ఐదు ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గుబ్బల శ్రీనివాస్, ధనావత్ శంకర్ నాయక్‌ను పొలం పని కోసం కూలీకి పిలిచాడు. పొలంలో పని ముగించుకొని వెళ్తుండగా పొలం గట్టుపై ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్లు ఉన్న టెలిఫోన్ స్తంభం ఉంది. ఆసరా కోసం పొలం నుంచి బయటకు వస్తుండగా శంకర్ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్థంభానికి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన శంకర్ నాయక్‌ను కౌలు రైతు గమనించాడు . అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించామని, మృతుని భార్య చున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అన్నదాతకు హై ‘టెన్షన్’
రైతుల పంట భూముల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు - నష్ట పరిహారం ఇవ్వకుండా తిప్పుకుంటున్న కంపెనీలు - కంపెనీలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు - భూమి కోల్పోయినా పరిహారం రాకపోవడంతో ఆందోళన షాద్‌నగర్: ఎండనకా వాననకా ఆరుగాలం కష్టపడుతూ.. దుక్కి దున్ని పంట పండించుకునే రైతన్నకు కరెంట్ టవర్ షాక్ కొడుతోంది. కంపెనీలు పంట పొలాల్లోనే హైటెన్షన్ (400 కేవీ) విద్యుత్ టవర్లు వేయిస్తుండటంతో.. రైతు లు వేలాది ఎకరాల భూములు కోల్పోతున్నారు. పరిహారం కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా అన్నదాతను ఆదుకునే నాథుడే కరువయ్యాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేసినట్లు అంచనా.. దీంతో ఒక కిలోమీటర్ లైన్ వేసేందుకు రైతులు 12 ఎకరాల భూముల్ని కోల్పోతున్నారు. ఈ లెక్కన 96 వేల ఎకరాల పొలాల్లో నుంచి ఈ హైటెన్షన్ విద్యుత్ టవర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేసినా.. రైతులు 2,400 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తుంది. ఒక టవర్ 700 మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు పొలాన్ని ఆక్రమించే ప్రదేశం 150 అడుగుల వెడల్పు ఉంటుంది. టవర్ వైర్లు వెళ్లిన స్థలం శాశ్వతంగా విలువ కోల్పోతుంది. దీంతో ఈ భూమి యజమానులకు సదరు కంపెనీలు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చిన దాఖ లాలు ఎక్కడా కనిపించడం లేదు. విద్యుత్ టవర్ల నిర్మాణానికి రైతుల అంగీకారం తీసుకోవాల్సిన కంపెనీ వారు నిబంధనలేవీ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇష్టానుసారంగా టవర్ల నిర్మాణం.. విద్యుత్ చట్టం 2007 ప్రకారం పవర్‌గ్రిడ్, ట్రాన్స్‌కో వారు పొలాల్లో టవర్లను వేసేటపుడు సదరు రైతుకు నోటీసులు జారీ చేయాలి. వారి భూమిలో టవర్‌ను వేయడానికి ముందుగానే మార్కెట్ విలువ ప్రకారం రైతుకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పం దం చేసుకోవాలి. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశానుసారం మార్కెట్ విలువను అంచనా వేసి రైతుకు పరిహారం అందజేయాలి. కానీ, కంపెనీలు ఇవేమీ పాటించకుండానే రైతుల పొలాల్లో టవర్ల నిర్మాణం చేపడుతున్నాయి. కేరళలో భూములు కోల్పోయిన రైతులు కోర్టుకు వెళ్లగా వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేస్తున్నారు. నష్టపరిహారం అంతంత మాత్రమే.. టవర్లు వేయడానికి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలోని పలు గ్రామాల్లోని రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడానికి కంపెనీ వారు ఒప్పందం చేసుకున్నారు. వారికి నష్టపరిహారమివ్వకుండా పొలాల్లో టవర్లను మాత్రం నిర్మించారు. రైతులు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకోగా కంపెనీ వారు నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు. పరిహారం రాలేదు గ్రామంలో ఉన్న రెండు ఎకరాల పొలంలో హై టెన్షన్ టవర్లు నిర్మించారు. ఇంకా విద్యుత్ వైర్లు లాగలేదు. మాకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఎకరా పొలం రూ.15 లక్షలు పలుకుతోంది. ఇలా రెండు ఎకరాలకు రూ. 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. కార్యాలయాలు, కంపెనీల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. టవర్ బాధిత రైతులందరినీ కలుపుకొని కేసు వేస్తాను. - రవీందర్‌రెడ్డి, చిల్కమర్రి సగమే ఇచ్చారు విద్యుత్ టవర్ కోసం నాకున్న అర ఎకరం పొలా న్ని రెండేళ్ల క్రితం తీసుకున్నారు. పరిహారం ఇవ్వమని కోరితే సంవత్సరంపాటు తిప్పారు. చివరకు కలెక్టర్ వద్దకు వెళితే రూ. 1 లక్షా 5 వేలు ఇచ్చారు. మరో రూ. లక్ష రావాల్సి ఉంది. టవర్ ఉన్న ప్రాంతంలో ఎకరా పొలం రూ.7 లక్షలు పలుకుతోంది. ఆ ప్రకారంగా లెక్కగట్టి మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి. - రాములు, రంగంపల్లి -
దింపు కార్మికుడి దుర్మరణం
అమలాపురం రూరల్ : కొబ్బరిచెట్టు ఎక్కి దింపు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై దింపు కార్మికుడు దుర్మరణం పాలైన సంఘటన భట్నవిల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. అనాతవరం బాలయోగి కాలనీకి చెందిన పరమట నాగేశ్వరరావు(50) భట్నవిల్లి గ్రామంలోని రైతు పొలంలో దింపు తీస్తుండగా, 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై చెట్టుపైనే మరణించాడు. స్థానికులు అతడిని కిందకు దించేటప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హెచ్‌సీ అచ్చిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి
వేట్లపాలెం(సామర్లకోట): పొలంలో పనిచేస్తున్న ఓ కౌలురైతు విద్యుదాఘాతానికి గురై శుక్రవారం మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేట్లపాలెం శివారు దోమాడపాకలులోని పొలానికి శుక్రవారం ఉదయం కౌలురైతు కరోటి దుర్గాప్రసాద్ (35) వెళ్లాడు. పొలానికి నీరు పట్టేందుకు బోరు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి హెచ్‌సీ వి. నాగేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుద్యోగులకు లంచాల షాక్
విద్యుత్ శాఖలో వెలుగు చూసిన బాగోతం న్యాయం కోసం బాధితుల ఆందోళన నెల్లిపాక: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లంచాలు దండుకుని మోసం చేసిన సంఘటన విద్యుత్ శాఖలో వెలుగు చూసింది. బాధిత యువకులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లిపాక విద్యుత్ శాఖ కార్యాలయం ముందు గురువారం ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎటపాక మండలంలోని విద్యుత్ శాఖలో 14 నెలలుగా ఆరుగురు ఐటీఐ పూర్తి చేసిన యువకులు డైలీవేజ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే వీరికి నేటికి కూడా విద్యుత్ శాఖలోని సంబంధిత కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వలేదు. అవుట్సోర్సింగ్ విధానంలో ఫ్రాంచైజింగ్ స్టాఫ్ ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పి వీరందరి వద్ద ఒకొక్కరి నుంచి రూ. 60 వేలు లంచాల రూపంలో వసూలు చేశారు. విద్యుత్‌శాఖ ఏడీఈ మధుసూదనరావు, కాంట్రాక్టర్ తిరుపతిరావుకు ఈమొత్తం ముట్టజెప్పినట్టు బాధితులు చెపుతున్నారు. ఎటపాక మండలంలో ఎనిమిది మందిని ఇప్పటికే ఫ్రాంచైజింగ్ స్టాఫ్ ఉద్యోగులుగా నియమించగా వీరిలో కేవలం మండలానికి చెందిన ఒక్కరికే ఉద్యోగం లభించింది. వేరే మండలాలకు చెందిన గిరిజనులను మిగిలిన పోస్టుల్లో నియమించారు. వారు విధుల్లో చేరేందుకు నెల్లిపాక ఏఈ కార్యాలయానికి రాగాలంచాలు ఇచ్చి మోసపోయిన యువకులు వారిని అడ్డుకున్నారు. ఏఈ మురళీకృష్ణను కార్యాలయంలో ఉంచి గది తలుపులు వేసి బాధితులు ఆందోళన నిర్వహించారు. మండలంలోని వారికే ఉద్యోగ అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లంచాలు తీసుకుని తమను ఏడీఈ, కాంట్రాక్టర్ మోసం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఎంపీపీ శ్యామలత, పలు పార్టీల నాయకులు బాధితులకు న్యాయం చేయాలంటూ వారి ఆందోళనకు మద్దతు పలికారు. -
అటకెక్కిన ఇందిర జలప్రభ
జల‘ప్రభా’వం ఏదీ? దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామంలో ఆర్ఐడీఎఫ్ –17ద్వారా ఐదు పథకాలు మంజూరయ్యాయి. 50 ఎకరాలకుపైగా బీడుభూములను సాగులోకి తేవడమే లక్ష్యంగా ఉంది. ఇందుకోసం సుమారు 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పథకాలు పూర్తి కావాలంటే సుమారు రూ. 10 లక్షలకుపైగా నిధులు విడుదల కావాలి. కానీ ఈ వ్యవహారం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉంది. అసలు నిధులు వస్తాయో... రావో...? తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఇందిర జలప్రభ లబ్ధిదారు పుట్ట శంకరయ్య, అతని కుమారుడు రాజులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఏడాదిన్నర కిందట బోరు ఏసిండ్రు... ఇప్పటి వరకు కూడా ఇంకా కరెంటు కనెక్ష ఇవ్వలేదు. ఎదురు చూసుడే అయితుందే తప్ప ఒస్తదో... రాదో తెల్వకుండాపోయింది. గిట్లయితే ఎట్ల’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పథకానికి మంగళం! హా నిధుల కొరతతో చతికిల హా అసమగ్రంగా పనులు... హా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల్లో నిరాశ హా మహానేత వైఎస్ ఆశయాలపై నీళ్లు హాప్రత్యేక రాష్ట్రంలోనూ మారని దుస్థితి హా జిల్లాలో పరిస్థితి దయనీయం గజ్వేల్:బీడుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రవేశపెట్టిన ‘ఇందిర జల ప్రభ’ పథకం నిధుల కొరతతో చతికిల పడింది. పథకానికి ప్రభుత్వం మంగళం పాడబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై...ఆ మహానేత మరణం తర్వాత నీలినీడలు కమ్ముకున్నాయి. ఏళ్ల కిందట మంజూరైన పథకాలకు ఇంకా బోర్ మోటారిస్తే.. కరెంట్ ఇవ్వలేదు.. కరెంటిస్తే బోర్ మోటార్ ఇవ్వలేదు.. ఫలితంగా ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా.. లేదా..? అనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొన్నది. నామమాత్రంగా భూపంపిణీ చేపడుతూ.. దళితుల బీడు భూముల అభివృద్ధి పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీడుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల భూములను సస్యశ్యామలం చేసి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి 2004, నవంబరులో ‘ఇందిర ప్రభ’ పేరిట అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధానంగా అసై భూములు లేదా దళితుల పట్టా భూములను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తారు. సుమారు 10 నుంచి 20 ఎకరాలను యూనిట్‌గా తీసుకొని 10 మందికిపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గ్రూపుగా మార్చి.. వారి భూముల్లో బోరుబావులు వేయించి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ పథకం 2009 వరకు బాగానే నడిచింది. వైఎస్ మరణం తర్వాత 2011లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ‘ఇందిర జల ప్రభ’గా మార్చారు. కానీ పథకం నిర్వహణ తీరు అధ్వానంగానే సాగింది. గత ప్రభుత్వం చివరి దశలో ఆర్డీఎఫ్ (రూరల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫండ్) –14 కింద జిల్లాలోని ఆందోల్, గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, నర్సాపూర్, రామాయంపేట, సిద్దిపేట, జహీరాబాద్ క్లస్టర్ల పరిధిలో 54,105 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు 5,082 బోరుబావులను తవ్వించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.58.27కోట్లకుపైగా వెచ్చించాలని నిర్ణయించారు. కానీ ఇందులో ఇప్పటి వరకు 3,333 బోరు బావులు మాత్రమే వేశారు. దీని ద్వారా 35,496 ఎకరాలను మాత్రమే సాగులోకి తీసుకురాగలిగారు. మరో 10,214 ఎకరాల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా భూముల్లో 973కు పైగా బోరుబావులు ఇంకా వేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే పనులు పూర్తి చేసినట్లు చెబుతున్న వాటిల్లోనూ ఇప్పటి వరకు 30శాతానికి పైగా బోరుబావుల్లో బోరుమోటార్లను బిగిస్తే... కరెంటు సరఫరా ఇవ్వలేదు. కరెంటు సరఫరా ఇస్తే బోరుబావుల్లో మోటార్లను బిగించలేదు. ఇందిర జలప్రభ పథకం తాజా నివేదికల ప్రకారం ఆయా క్లస్టర్ల పరిధిలో ఇంకా 360 బోరుబావులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉన్నాయి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారంలో కదలిక లేదు. ఎస్సీలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తున్నామంటూ గొప్పగా ప్రకటిస్తూ.. అక్కడక్కడ నామమాత్రంగా చేపడుతూ చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం దళితుల బీడుభూములకు ఉద్దేశించిన ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దఅడిశర్లపల్లి : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేటకు చెందిన రైతు నీలం వెంకటయ్య (50) వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజూ వారీ మాదిరిగానే శుక్రవారం తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే వెంకటయ్య పొలం మీదుగా 33/11 కేవీ విద్యుత్ వైర్లు కిందికి వేలాడబడి ఉన్నాయి. ఇది గమనించని వెంకటయ్య విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన సమీప రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలిద్దామని అనుకుంటుండగా అప్పటికే వెంకటయ్య మృతి చెందాడు. కాగా తన పొలం మీదుగా విద్యుత్ వైర్లు కిందికి వేలాడి ప్రమాదకరంగా ఉండటంతో వెంకటయ్య గతంలో పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని.. వారి నిర్లక్ష్యం కారణంగానే తాము కుటుంబ పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మృతి చెందిన వెంకటయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె వివాహం చేయగా ఇద్దరు కుమార్తెలకు వివాహానికి ఉన్నారు. -
పచ్చదనం మాటున ప్రమాదం
పచ్చదనం మాటున ప్రమాదం దాగి ఉంది. పై చిత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ఈ దృశ్యాలు చెన్నూర్ మండలంలోని సుద్దాల, బావురావుపేటలో కనిపించినవి. ఇలాంటి పరిస్థితులు మండలంలోని కిష్టంపేట, బావురావుపేట, లింగంపల్లి, దుగ్నెపల్లి, సుద్దాల, కమ్మరిపల్లి తదితర గ్రామాల్లో అనేకం ఉన్నాయి. పంట పొలాల్లో, ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఎటువంటి రక్షణ కంచెలు లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం వాటి చుట్టూ పిచ్చి మొక్కలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఎటువంటి ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు పట్టించుకొని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. – చెన్నూర్‌రూరల్ -
విద్యుత్ ఉచ్చులో చుక్కల జింక మృతి
రాజవొమ్మంగి : గ్రామ శివారు రక్షిత అటవీప్రాంతంలో స్థానిక రైతు ఎర్రమ్మ జీడిమామిడితోటలో వేటగాళ్లు పన్నిన విద్యుత్ ఉచ్చులో పడి ఆడ చుక్కల జింక (వయస్సు సుమారు 3 సంవత్సరాలు) మరణించింది. సమాచారం తెలిసి ఆ ప్రాంతంలో కాపు కాసిన అటవీఅధికారులకు శుక్రవారం రాత్రి మానేపల్లి వీరభద్రరావు, మిరియాల రాంబాబు, మిరియాల దుర్గాప్రసాద్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారు హైటెన్షన్ విద్యుత్‌లైన్ నుంచి విద్యుత్కంచెను తొలగిస్తుండగా తమ సిబ్బంది పట్టుకున్నారని స్థానిక రేంజ్ అధికారి మానాప్రగడ శివకుమార్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో కేసు నమోదు చేశామన్నారు. వీరిని సోమవారం కోర్టుకు తరలిస్తామన్నారు. మరణించిన జింకను ఐస్‌బాక్స్‌లో భద్రపరచామని, కోర్టు ఎదుట పెడతామని వివరించారు. నిందితుల నుంచి కత్తి, మాంసం తయారు చేసేందుకు అవసరమైన సరంజామా, విద్యుత్కంచెకు ఉపయోగించిన వైర్లు స్వాధీనపరచుకున్నామన్నారు. అటవీ అధికారుల అదుపులో ముగ్గురు -
కూలీల బతుకులపై మృత్యుఘాతం
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి రావులపాలెం : పొట్టకూటి కోసం కూలీపని చేసే శ్రామికుల బతుకులు మృత్యుఘాతానికి బలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యవసాయ కూలీలు మరణించిన సంఘటనలు శనివారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రావులపాలెం మండలంలోని కొమరాజులంక గ్రామానికి చెందిన కాటపరెడ్డి చంద్రరావు(55) వ్యవసాయ కూలీ. అతడికి భార్య సుబ్బలక్ష్మి, ముగ్గురు కుమారులున్నారు. శనివారం మధ్యాహ్నం పని పూర్తిచేసుకుని చంద్రరావు భోజనం కోసం ఇంటికి వచ్చాడు. కాళ్లుచేతులు కడుక్కోవడం కోసం లైటు వేసేందుకు కరెంటు స్విచ్ తాకగా విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే మరణించాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పీఎస్సై జి.సురేంద్ర దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ.. గొల్లప్రోలు : గొల్లప్రోలులో పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మామిడాల కనకారావు(55) శనివారం సాయంత్రం మరణించాడు. పొలంలో గేదెలను మేపుతుండగా, సమీపంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడికి భార్య సూర్యావతి, కుమారుడు రమణ, కుమార్తె బంగారం ఉన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి, వీఆర్ఓ గంగాధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టిప్పర్ల దూకుడు..
ధ్వంసమవుతున్న విద్యుత్ స్తంభాలు తెగిపోతున్న తీగలు, కరెంట్ బంద్ అన్నదాతల బెంబేలు తరచూ ఇలాంటి ఘటనలే.. వర్గల్: టిప్పర్ల దూకుడుతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ విద్యుత్ స్తంభం నేలకూలుతుందోనని ఆందోళన చెందుతుందన్నారు. రోడ్డుకు ఓవైపు నుంచి రెండో వైపు వెల్తున్న కరెంట్ తీగలను (క్రాస్ లైన్) పట్టించుకోకుండా టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తీగలు తెగి, స్తంభాలు విరిగిపోతున్నాయి. వర్గల్ మండలంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. కొంత కాలం నుంచి ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో మజీద్‌పల్లి–శాకారం రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మీద కంకర మిక్స్, మట్టి, మెటల్ తదితర సామగ్రి సరఫరా కోసం నిత్యం పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నాయి. ఈ రోడ్డు మార్గంలో అనేక చోట్ల విద్యుత్ లైన్ క్రాస్ అవుతుంది. అభివృద్ధి పనుల కారణంగా రోడ్డు ఎత్తు క్రమంగా పెరుగుతున్నది. దీంతో కరెంట్ తీగల ఎత్తు తగ్గుతున్నది. టిప్పర్లు, జేసీబీలు కానీ హెడ్రాలిక్తో ట్రాలీని పైకి లేపకుండా జాగ్రత్తగా వెలితే కరెంట్ తీగలు వాహనానికి తగిలే పరిస్థితి ఉండదు. 15 రోజుల క్రితం గిర్మాపూర్ సమీపంలో టిప్పర్ ఇలాంటి పరిస్థితిలోనే విద్యుత్ తీగలను తాకింది. తీగలు తెగిపోవడంతోపాటు ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. ఈ ఘటన వల్ల ట్రాన్స్‌కోకు అనవసర నష్టం వాటిల్లడంతోపాటు, రెండు రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుల బాధ పడలేక ట్రాన్స్‌కో అధికారులు యుద్ధప్రాతిపదికన స్తంభాలు పాతించారు. కరెంట్ తీగలు బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘటన మరవక ముందే తాజాగా బుధవారం ఉదయం మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మాదారం సమీపంలో వాహనం తాకిడికి కరెంట్ తీగలు తెగిపోగా, 11 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. మాదారం, గిర్మాపూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాట్లు ఆగిపోయాయి.. టిప్పర్ల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోతున్నాయి. బుధవారం విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంట్ పోయింది. గురువారం దాకా రాదని అధికారులు చెబుతున్నారు. కరెంట్ లేకపోతె నీళ్లు రావు. దీంతో నాట్లు ఆగిపోయాయి. – అంకని స్వామి, మాదారం, రైతు నిర్లక్ష్యంగా నడపడం వల్లే.. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఎత్తులో తేడాలు వస్తాయి. రోడ్డు ఎత్తు పెరగడం వల్ల క్రాసింగ్ విద్యుత్ లైన్లు కిందికి దిగుతాయి. టిప్పర్లు, జేసీబీలు మామూలుగా వెళ్తే కరెంట్ తీగలు తగలవు. హైడ్రాలిక్‌తో ట్రాలీని పైకి లేపి ముందుకెళ్లిన సందర్భాల్లో తీగలు తాకి, స్తంభాలు విరిగిపోతాయి. పక్షం రోజుల్లో రెండుసార్లు 19 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. తీగలు చూసుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఇలా జరుగుతుంది. – రామ్‌నర్సయ్య, ట్రాన్స్‌కో, లైన్ఇన్స్పెక్టర్ -
ఈ ఏడాది 94 వేల విద్యుత్ కనెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: నూతన ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది (2016-17) 94,735 కొత్త వ్యవసాయ కనెక్షన్లు జారీ చేసేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ అనుమతి రాగానే కనెక్షన్లు ఇవ్వనున్నారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏప్రిల్ నాటికి 93,043 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. తాజాగా ఈ సంఖ్యకు లక్షకు మించి పోయి ఉంటుందని అంచనా. అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 64,730 కనెక్షన్లు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలో 30,005 కనెక్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. గతేడాది రాష్ట్రంలో 1,01,020 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 93,299 కనెక్షన్లు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 21లక్షలకు చేరింది. అవినీతి నిర్మూలనకు చర్యలు కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీలో క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బంది మామూళ్లు వసూలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఇటీవల ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణల్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంతర్గత విజిలెన్స్ విచారణ జరిపించిన డిస్కంలు.. కొత్త కనెక్షన్ల జారీలో అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని గుర్తించాయి. ముందు వచ్చిన వారికి ముందు (ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లేదా ఫిఫో) విధానం అమల్లో ఉన్నా ఎక్కడా పాటించడం లేదని.. డబ్బులిచ్చిన వారికి తొలుత కనెక్షన్లు ఇస్తున్నారని తేల్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించాయి. కొత్త మార్గదర్శకాలు ≈ కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తును వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లోనూ స్వీకరించాలి. దరఖాస్తుదారులకు కామన్ సీనియారిటీ ఆర్డర్లో రిజిస్ట్రేషన్ నంబర్లను జారీ చేయాలి. ≈ గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేసి డిస్కంల వెబ్‌సైట్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించాలి. ప్రతి నెలా ఈ జాబితాలను నవీకరించాలి. ముందు వచ్చిన వారికి ముందు జారీ చేసే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. మంజూరు చేసిన కనెక్షన్ల జాబితాను ప్రతి నెలా నవీకరించాలి. ≈ వర్క్ ఆర్డర్ జారీ, మెటీరియల్ సమీకరణ, కనెక్షన్ తదితర చర్యలను సైతం సీనియారిటీ ప్రకారం చేపట్టాలి. పురోగతి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ≈ అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించినప్పుడు అదనంగా రుసుము వసూలు చేయాలి. ఇలాంటి కేసులను సూపరింటెండింగ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఆమోదించాలి. ≈ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వస్తే డిస్కంల ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. -
మృత్యుపాశం
♦ చిన్నారిని బలితీసుకున్న 11కేవీ విద్యుత్ తీగ ♦ ఇంటిడాబాపై బంతిని తీసుకుంటుండగా ♦ విద్యుదాఘాతంతో ఘోరం బూడిదంపాడులో దుర్ఘటన ఖమ్మం అర్బన్: బంతితో ఆడుకుంటుండగా..పక్కింటి డాబాపై అది పడిపోవడంతో తీసుకొచ్చేందుకు ఎక్కిన బాలుడిని కరెంట్ తీగ రూపంలో మృత్యువు మింగేసింది. సెలవుల కోసం చుట్టాలింటికొచ్చిన పిల్లోడు మద్దినేని దీత్రిక్చౌదరి(8) విద్యుదాఘాతానికి గిలగిలా కొట్టుకొని ఊపిరొదిలిన ఘటన బుధవారం రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో చోటు చేసుకుంది. అంతసేపు అక్కడే ఆనందంగా ఆడుకున్న బాలుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయ్యో..చిన్నా..అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సెలవుల్లో బంధువులింటికొచ్చి.. కొణిజర్లకు చెందిన మద్దినేని నరసింహారావు, నాగమణి ఖమ్మం వీడీఓస్ కాలనీలో ఉంటూ..రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కొడుకు దీత్రిక్, కూతురు ఉషశ్రీని చదివించుకుంటున్నారు. పాఠశాలకు రంజాన్ పండుగ సెలవులు ఇవ్వడంతో రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడులో తన సోదరి రమ ఇంటికి మంగళవారం తండ్రి పంపాడు. మేనత్త పిల్లలతో కలిసి బుధవారం ఇంటి ఎదుట బంతితో ఆడుకుంటుండగా..ఎగిరి పక్కింటి డాబాపై పడింది. బంతికోసం స్లాబ్‌పైకి దీత్రిక్ ఎక్కి.. దానిని చేతిలోకి తీసుకునేందుకు కిందికి వంగిన క్రమంలో డాబాను ఆనుకునేలా తక్కువ ఎత్తులో ఉన్న 33/11కేవీ విద్యుత్ సరఫరా లైన్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి చేతులు, శరీరం కమిలినట్లు నల్లగా మారింది. బంతి కోసం వెళ్లి ఎంతకూ రాలేదని తోటి పిల్లలు డాబా ఎక్కి చూడగా అక్కడ పడిపోయి ఉండడాన్ని గమనించి పెద్దలకు చెప్పారు. వాళ్లు వచ్చి చూసి అప్పటికే చనిపోయినట్లు గుర్తించి బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం కొణిజర్లకు తీసుకెళ్లారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పైపు చుట్టినా..గోడ కట్టినా..ఘోరం ఆగలే డాబాపై ఓ పక్క నుంచి విద్యుత్ హైటెన్షన్ వైర్లు వెళ్లడంతో ముందు జాగ్రత్త చర్యగా అటువైపు ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుగా చిన్న గోడకూడా కట్టారు. విద్యుత్ వైర్లకు కొద్దిమేర ప్లాస్టిక్ పైపు కూడా తొడిగించారు. అయితే..చిన్నారి బాల్ కోసం పిట్టగోడపై నుంచి లోపలికి వెళ్లగా, ప్లాస్టిక్ పైపులైన్ లేని చోట తగిలి విద్యుత్ షాక్‌కు గురై బలయ్యాడు. తన ఇంటిపై ఈ ఘోరం జరగడం చలించివేసిందని ఇంటి యజమాని వల్లభనేని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు విద్యుత్ లైన్ రూట్ మార్చాలని కోరారు. -
గ్రేటర్‌కు ‘విద్యుత్ షాక్’
సిటీబ్యూరో: గ్రేటర్ వాసులకు డిస్కం షాక్ ఇచ్చింది. వంద యూనిట్ల కంటే ఎక్కువ వాడే సామాన్య మధ్య, ఆపై తరగతులే లక్ష్యంగా చార్జీలు పెంచింది. ఈ చార్జీలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 41 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 35.5 లక్షల గృహ విద్యుత్, 4.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు 40 వేల దాకా ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ప్రతి నెలా 38 లక్షల కనెక్షన్లకు మాత్రమే బిల్లింగ్ వసూలు అవుతోంది. వీరిలో 100 లోపు యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు సుమారు 20 లక్షల మంది ఉండగా, ఆపై యూనిట్లు వాడేవారు మరో 18 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా పెంచిన చార్జీల వల్ల 18 లక్షల కనెక్షన్లపై భారం పడే అవకాశం ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ వాసులపై రూ.680 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వీధి దీపాలకు యూనిట్ చార్జి రూ. 6.70గా ఉండగా, ఇది కొత్త ధరలతో రూ. 7.10కి పెరిగింది. ప్రస్తుత చార్జీల ప్రకారం జీహెచ్ఎంసీ విద్యుత్ చార్జీల కింద నెలకు రూ.14.50 కోట్లు చెల్లిస్తుండగా,పెరిగిన ధరలతో రూ.86 లక్షల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. -
విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడం ఆత్మవంచనే: గౌతు శివాజీ విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ వద్ద ధర్నా సోంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతరా యం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చె ప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమేనని ప లాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అన్నా రు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో విద్యు త్ సరఫరాలో సమస్య పరిష్కరిచాలంటూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి బుధవారం సోంపేట సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. సోంపేట మండలంలో మే నెల 15 నుంచి జూన్ 3 వరకు 20 రోజుల్లో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా ఆపారో తెలపాలని ఎమ్మెల్యే శివాజీ సబ్‌స్టేషన్ ఏడీఈ అప్పారావుకు 20 రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. బారువలోని ఓ కార్యక్రమానికి వచ్చిన వీరు ఆందోళన కు దిగడంతో సిబ్బంది కాస్త టెన్షన్ పడ్డారు. ఏఈ లక్ష్మణరావు, ఏడీఈ అప్పారావులను సమస్యలపై ప్రశ్నలు అడగ్గా... సమాధానాలు సరిగ్గా రాలేదు. ఈ ధర్నాపై కలెక్టర్ లక్ష్మీనృసింహం, జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ శరత్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సీఎం పేషీ అధికారులకు శివాజీ సమాచారం అందించారు. అలాగే 11 గంటల సమయంలో బరంపురం గ్రిడ్ మేనేజర్ అనిల్ కుమార్‌కు ఫోన్ చేసి విద్యుత్ అంతరాయానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త ర్వాత సీఎం పేషీ అధికారి రాజ్‌గోపాల్‌తోనూ మాట్లాడారు. విశాఖ ట్రాన్స్‌కో సీఎండీ ముత్యాలరాజుతో కూడా ఫోన్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నిరంతర విద్యుత్ లేదు... గ్రామాల్లోకి వెళ్లి నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. కలెక్టర్ ట్రాన్స్‌కో ఎస్ఈని వెనకేసుకు వస్తున్నారని ఆ రోపించారు. చివరకు టెక్కలి డీఈ జీఎన్ ప్రసాద్ వచ్చి అంతరాయానికి క్షమాపణలు చెప్పినా ఆం దోళన విరమించలేదు. ఆఖరకు ట్రాన్స్‌కో సీఎండీ విజయేందర్ హైదరాబాద్ నుంచి శివాజీతో ఫో న్లో మాట్లాడారు. సీఎండీ రాజు సమక్షంలో స మావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని చె ప్పడంతో ఆందోళన విరమించారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ అందడం లేదని సీఎంకు చెప్పడానికే ఈ ఆందోళన చేసినట్లు శివాజీ తెలిపారు. ధర్నా చేస్తున్నామని కలెక్టర్, మంత్రికి చెప్పినా స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులు జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, మద్దిలి నాగేశ్వరరావు, గోపీ, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శివాజీ ఇచ్ఛాపురం ఎ మ్మెల్యే అశోక్‌తో మాట్లాడుతూ ‘ధర్నాతో నాకు ఎలాంటి సంబంధం లేదని సీఎంతో అనవద్దు’ అంటూ చలోక్తి విసిరారు. అనంతరం ఎస్ఈ జీఎ న్ ప్రసాద్ సోంపేట చేరుకుని విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో ఇలా జరుగుతందన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను కోరారు.