కూలీల బతుకులపై మృత్యుఘాతం
Published Sat, Jul 23 2016 8:54 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
రావులపాలెం :
పొట్టకూటి కోసం కూలీపని చేసే శ్రామికుల బతుకులు మృత్యుఘాతానికి బలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యవసాయ కూలీలు మరణించిన సంఘటనలు శనివారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రావులపాలెం మండలంలోని కొమరాజులంక గ్రామానికి చెందిన కాటపరెడ్డి చంద్రరావు(55) వ్యవసాయ కూలీ. అతడికి భార్య సుబ్బలక్ష్మి, ముగ్గురు కుమారులున్నారు. శనివారం మధ్యాహ్నం పని పూర్తిచేసుకుని చంద్రరావు భోజనం కోసం ఇంటికి వచ్చాడు. కాళ్లుచేతులు కడుక్కోవడం కోసం లైటు వేసేందుకు కరెంటు స్విచ్ తాకగా విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే మరణించాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పీఎస్సై జి.సురేంద్ర దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ..
గొల్లప్రోలు : గొల్లప్రోలులో పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మామిడాల కనకారావు(55) శనివారం సాయంత్రం మరణించాడు. పొలంలో గేదెలను మేపుతుండగా, సమీపంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడికి భార్య సూర్యావతి, కుమారుడు రమణ, కుమార్తె బంగారం ఉన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భారతి, వీఆర్‌ఓ గంగాధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement